Oscar Awards 2022
-
చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్‌పై 10 ఏళ్లు నిషేధం, స్పందించిన హీరో
Academy Ban On Will Smith For 10 Years: ఆస్కార్ అవార్డు గ్రహిత, హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్‌పై నిషేధం వేటు పడింది. మోషన్ పిక్చర్ అకాడమీ విల్ స్మిత్‌పై చర్యలు తీసుకుంటూ అతడిపై 10 ఏళ్ల పాటు నిషేధం విధించినట్లు శుక్రవారం వెల్లడించింది. ఇది ఒక్క ఆస్కార్ అవార్డులకు మత్రమే కాదు మోషన్ పిక్చర్ నిర్వహించే ఇతర వేడుకలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. శుక్రవారం ఏప్రిల్ 8న సమావేశమైన అకాడమీ గవర్నర్ల బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విల్ స్మిత్‌పై నిషేధం విధిస్తున్నట్లు అకాడమీ ప్రకటించిన అనంతరం విల్ స్మిత్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.తాను అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లుగా పేర్కొన్నాడు. చదవండి: వరుణ్ తేజ్ గని మూవీపై మంచు విష్ణు కామెంట్స్, ట్వీట్ వైరల్ ఇదిలా ఉంటే స్మిత్ ఇప్పటికే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా గత నెల నిర్వహించిన 94వ ఆస్కార్ అవార్డు వేడుకలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన కమెడియన్ క్రిస్ రాక్‌ను విల్ స్మిత్ చెంప దెబ్బ కొట్టాడు. స్మిత్ భార్య జాడా పింకెట్‌కు ఉన్న వ్యాధిని ఉద్దేశించి అతడు జోక్ చేశాడు. దీంతో అగ్రహానికి లోనైన స్మిత్ స్టేజ్‌పైకి వెళ్లి క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. -
చెంపదెబ్బ ఎఫెక్ట్.. ఆగిపోయిన విల్ స్మిత్ సినిమాలు !
Will Smith Fast And Loose On Hold After Slapping Chris Rock Oscars 2022: ఆస్కార్ వేదికగా చెంపదెబ్బ కొట్టిన హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్‌కు టైం సరిగా లేనట్లే ఉంది. తన భార్య జాడా పింకెట్ అనారోగ్యంపై ప్రముఖ అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ జోక్ వేశాడన్న కారణంతో విల్ అతని చెంపచెల్లుమనించిన సంగతి తెలిసిందే. ఆస్కార్ అందుకంటూ ఈ సంఘటనపై అకాడమీ నిర్వాహకులకు, నామినీలకు క్షమాపణలు కూడా చెప్పాడు విల్ స్మిత్. అనంతరం సోషల్ మీడియా వేదికగా క్రిస్ రాక్‌ను కూడా క్షమించమని కోరాడు. దీంతో ఈ వివాదం సద్దుమణగకుండా విల్ స్మిత్ రాజీనామా చేసేదాకా వెళ్లింది. హాలీవుడ్ ఫిల్మ్ అకాడమీకి విల్ స్మిత్ రాజీనామా చేస్తూ బోర్డు తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధమే అని కూడా తెలిపాడు. చదవండి: చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్ రాజీనామా.. ఇదిలా ఉంటే ఈ చెంపదెబ్బ వ్యవహారం విల్ స్మిత్ క్రమశిక్షణ చర్యల పరంగా కాకుండా తన సినీ కెరీర్‌పై కూడా ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. విల్ హీరోగా రాబోయే చిత్రం 'ఫాస్ట్ అండ్ లూజ్'. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ ప్రస్తుతం ఆ మూవీని హోల్డ్‌లో ఉంచినట్లు సమాచారం. ఈ ఆస్కార్ సంఘటనకు కొన్ని వారాల ముందు డైరెక్టర్ డేవిడ్ లీచ్ రియాన్ గోస్లింగ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆయన ఈ చిత్రాన్ని వదిలి 'ఫాల్ గాయ్' సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని వినికిడి. ఇక ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ కూడా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవాలని చూస్తోందట. దీనంతటికి కారణం క్రిస్‌రాక్‌పై విల్ చేయిచేసుకోవడమే అని హాలీవుడ్లో ప్రచారం జరుగుతోంది. చదవండి: వీడియోతో దొరికిపోయిన విల్ స్మిత్.. ఇప్పుడేం అంటాడో మరి? అయితే 'ఫాస్ట్ అండ్ లూజ్' హోల్డ్‌లో ఉన్నప్పటికీ విల్ స్మిత్ చేతిలో ఎమాన్సిపేషన్, యాపిల్ టీవీ ప్లస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అలాగే 'బ్యాడ్ బాయ్స్ 4' కోసం చర్చలు జరుపుతున్నప్పటికీ, ఆస్కార్ వ్యవహారంతో ఈ ప్రాజెక్ట్‌ను కూడా సోనీ హోల్డ్‌లో ఉంచినట్లు సమాచారం. చదవండి: ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ భార్యకు ఉన్న వ్యాధి లక్షణాలు ఇవే.. -
వీడియోతో దొరికిపోయిన విల్ స్మిత్.. ఇప్పుడేం అంటాడో మరి?
Will Smith Old Video: సోమవారం ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఫలానా సినిమాకి అవార్డు రావాల్సిందనో, ఫలానా స్టార్‌కి ఆస్కార్ రాకపోవడం అన్యాయమనో, ఫంక్షన్ బాగా జరిగిందనో... ఇలాంటి చర్చలు జరుగుతాయి. కానీ అలోపేసియా వ్యాధి కారణంగా జుత్తు కోల్పోయిన విల్ స్మిత్ భార్య జడా పింకెట్‌ను ఉద్దేశించి వ్యాఖ్యాత క్రిస్ రాక్ వేసిన జోక్ గురించి, విల్ స్మిత్ అతడి చెంప చెళ్లుమనిపించిన ఘటన గురించీ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 30 ఏళ్ల క్రితం అలోపేసియాతో బాధపడుతున్న జాన్ విల్లియమ్స్ బట్టతలపై ‘ది అర్సెనియా హాల్ షో’లో విల్ స్మిత్ వేసిన జోక్‌కి సంబంధించిన వీడియో అది. ‘అతనికో రూల్ ఉంది. అదేంటంటే అతను ప్రతి రోజూ తన తలను వ్యాక్స్ (కవర్ చేయాలనేది ఉద్దేశం) చేయాల్సిందే. అదే రూల్’ అంటూ జోక్ చేసి, ‘ఇది జస్ట్ జోక్’ అని కూడా అన్నాడు విల్ స్మిత్. ఆ వీడియోను ఇప్పుడు ఎవరో బయటపెట్టారు. మరి.. ఇప్పుడు క్రిస్ చేసింది కూడా జోక్‌లో భాగమే కదా అంటున్నారు నెటిజన్లు. ‘క్రిస్ చేస్తే తప్పు... నువ్వు చేస్తే ఒప్పా?’ అంటూ విల్ స్మిత్‌ని విమర్శిస్తున్నారు. 15 రోజుల్లోపు విల్ వివరణ ఇవ్వాలి క్రిస్‌పై విల్ దాడి పట్ల ఆస్కార్ కమిటీ చాలా ఆగ్రహంగా ఉంది. అదే వేదిక సాక్షిగా కమిటీకి, వీక్షకులకు క్షమాపణలు చెప్పాడు విల్. అయితే క్రిస్‌కి చెప్పలేదు. కానీ మరుసటి రోజు ఇన్స్టాగ్రామ్ వేదికగా క్రిస్‌కి క్షమాపణలు చెప్పాడు విల్. తన భార్యపై జోకులు వేయడంతో ఆగ్రహం పట్టలేకే అలా చేశానని కూడా అన్నాడు. ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకల్లో విల్ ఇలా దాడి చేయడంపై ఆస్కార్ కమిటీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనుకుంటోంది. ఈ విషయంపై చర్చించడానికి కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు కూడా. క్రిస్ పై దాడి చేశాక విల్ స్మిత్‌ని వేడుక నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరినా అతను వెళ్లకపోవడంపై కూడా కమిటీ తీవ్ర ఆగ్రహంగా ఉందట. అందుకే తన ప్రవర్తనపై విల్ 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించిందట. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఏప్రిల్ 18న కమిటీ మరోసారి సమావేశం కానుందని సమాచారం. “He gotta wax his head every morning.” Now this is a video of Will Smith saying a joke about someone with Alopecia. One reason I love the internet, it never forgets. pic.twitter.com/4OGlgSrcjA — Peter O.K.H (@Peter_OKH) March 28, 2022 -
ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ భార్యకు ఉన్న వ్యాధి లక్షణాలు ఇవే..
Why Did Will Smith Slapping Chris Rock In Oscar Awards Reason Is Here: ఆస్కార్ అవార్డ్స్ 2022 వేడుకలో హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్ చర్య ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. 92వ అకాడమీ అవార్డుల వేదికపై విల్ స్మిత్, అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనతో హాలీవుడ్ సినీ లోకం షాక్‌కు గురైంది. పలువురు సెలబ్రిటీలు కూడా తమదైన శైలిలో స్పందిస్తున్నారు. వారి ఇరువురి స్థానాల్లో వారు ఉంటే ఏం చేశారో చెప్పుకొస్తున్నారు. అలాగే ఈ ఘటనపై ఆస్కార్ అకాడమీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది. విల్ స్మిత్‌పై త్వరలోనే తగిన చర్యలు తీసుకునే అవకాశాలు సైతం లేకపోలేదు. ఇదిలా ఉంటే అసలు విల్ స్మిత్.. క్రిస్ రాక్‌ను కొట్టడానికి గల కారణం ఏమైంటుంది ? విల్ భార్య జాడా పింకెట్‌కు ఏమైంది ? ఎందుకు ఆమె గుండుతో కనిపించింది ? చదవండి: హీరో విల్ స్మిత్ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ? ఇటీవల జరిగిన ఆస్కార్ అవార్డ్స్ 2022 వేడుకకు అమెరికాకు చెందిన ప్రముఖ కమెడియన్ క్రిస్ రాక్ హోస్ట్‌గా వ్యవహరించాడు. ఆయన ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ప్రకటించాడనికి ముందు వీక్షకుల్ని నవ్వించేందుకు ఓ చిన్న కామెడీ ట్రాక్ చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే విల్ స్మిత్ సతీమణి జాడా పింకెట్ ప్రస్తావన తీసుకొచ్చాడు. ఆమె జుట్టు పూర్తిగా తొలగించుకొని గుండుతో ఆస్కార్ వేడుకకు హాజరయ్యారు. ఆమెను చూసిన క్రిస్ 'జీఐ జేన్' సినిమాలో 'డెమి మూర్' యాక్ట్ చేసిన పాత్రతో పోల్చాడు. ఎందుకంటే ఆ సినిమాలో 'డెమి మూర్' పూర్తి గుండుతో కనిపిస్తుంది. 'జీఐ జేన్' సీక్వెల్లో కనిపించబోతున్నారా ? అని క్రిస్ రాక్ నవ్వించే ప్రయత్నం చేశాడు. చదవండి: 63 ఏళ్ల వయసులో ఎనిమిదోసారి తండ్రి కాబోతున్న నటుడు ఈ మాటలతోనే ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ కోపోద్రిక్తుడయ్యాడు. నిజానికి జాడా పింకెట్ 'అలోపిసియా' అనే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య ఉన్న వారిలో జుట్టు ఊడిపోతు ఉంటుంది. అయితే తన భార్య అనారోగ్యంపై జోకులు వేయడాన్ని సహించలేకపోయాడు విల్ స్మిత్. ఆగ్రహంతో నేరుగా వేదికపైకి వెళ్లి క్రిస్ దవడ పగలకొట్టి వెనుదిరిగాడు విల్ స్మిత్. తర్వాత తన కుర్చీలో కూర్చుని క్రిస్‌పై విరుచుకుపడ్డాడు. 'నా భార్య పేరు నీ నోటి నుంచి రావొద్దు' అంటూ గట్టిగా అరుస్తూ క్రిస్ రాక్‌ను హెచ్చరించాడు విల్. ఈ ఘటనతో ప్రేక్షకులు, అకాడమీ నిర్వాహకులు ఒక్కసారిగా కంగుతిన్నారు. చదవండి: ఆమెకు ముద్దు పెట్టారా?.. పిల్లాడి ప్రశ్నకు తడబడ్డ స్టార్ హీరో, వీడియో వైరల్ ఈ ఇన్సిడెంట్ తర్వాత 'కింగ్ రిచర్డ్' సినిమాకు గాను ఉత్తమ నటుడిగా ఆస్కార్ అందుకునేందుకు విల్ స్మిత్ వేదికపైకి వచ్చాడు. ఘటనపై స్పందిస్తూ అకాడమీ, సహచర నామినీలకు క్షమాపణలు తెలిపాడు. తర్వాత తన ఇన్స్టాగ్రామ్ వేదికగా మరోసారి క్షమాపణలు కోరాడు. ఈ ప్రపంచంలో హింసకు చోటులేదని, తన ప్రవర్తన ఆమోదయోగ్యం కానిదని పేర్కొంటూ.. తనను క్షమించమని క్రిస్ రాక్‌ను కోరాడు విల్ స్మిత్. 'అలోపిసియా' లక్షణాలు: వయోజన మహిళల్లో ఎక్కువగా వస్తుంది 50% శాతం వరకు జుట్టు రాలిపోతుంది చర్మం రాలిపోతూ ఉంటుంది మానసిక ఒత్తిడి విటమిన్లు, మైక్రో ఎలిమెంట్లు ఉన్న పరిమిత ఆహారం తీసుకోవాలి ధీర్ఘకాలిక చికిత్స చదవండి: అతనిలా నేను కూడా చెంపచెల్లుమనిపిస్తా.. కంగనా షాకింగ్ కామెంట్స్ -
ఆస్కార్ వేడుకల్లో కమెడియన్‌పై చెంపదెబ్బ.. విల్ స్మిత్‌పై చర్యలు !
Academy Will Take Action Against Will Smith Slap In Oscars: 92వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) ప్రదానోత్సవంలో జరిగిన చెంపదెబ్బ ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయం చెబుతున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్‌గా చర్చనీయాంశమైంది. అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్‌పై ఆస్కార్ విన్నర్, స్టార్ హీరో విల్ స్మిత్ చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో విల్ స్మిత్‌పై ఆస్కార్ అకాడమీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే విల్ స్మిత్‌పై చర్యలు తీసుకునే అవాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: హీరో విల్ స్మిత్ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ? అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఏఎమ్పీఏఎస్) అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ అకాడమీ సభ్యులకు తాజాగా ఓ లేఖ పంపారు. విల్ చేయి చేసుకోవడంపై అకాడమీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు అందులో తెలిపారు. 2021 సినీ రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన అనేక మంది వ్యక్తులను సత్కరించేందుకుగానూ ఆదివారం 94వ ఆస్కార్ వేడుకలు నిర్వహించాం. కానీ ఇలాంటి వేదికపై ఓ నామినీ ఆమోదయోగ్యం కానీ, హానికరమైన ప్రవర్తనతో మేము కలత చెందాం. విల్ స్మిత్ చేయి చేసుకోవడాన్ని మేము ఖండిస్తున్నాం. విల్ హద్దు మీరి ప్రవర్తించారు. నియమనింబంధనల్లో భాగంగా అకాడమీ గవర్నర్ల బోర్డు విల్ స్మిత్‌పై తగిన చర్యలు తీసుకోవాలి. అని అధ్యక్షుడు డేవిడ్ ఆ లేఖలో పేర్కొన్నారు. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 చదవండి: ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్ -
అతనిలా నేను కూడా చెంపచెల్లుమనిపిస్తా.. కంగనా షాకింగ్ కామెంట్స్
Kangana Ranaut Reaction On Will Smith Slapping Chris Rock: బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్, బ్యూటీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన వ్యాఖ్యలతో అందరి దృష్టిని ఎప్పుడూ ఆకర్షిస్తుంది. ఏ అంశంపైనైనా ఆమె చేసే కామెంట్స్ సూటిగా సుత్తి లేకుండా ఉంటాయి. ఈ వ్యాఖ్యలతో వివాదాలు ఎదుర్కొన్న ఈ బ్యూటీకు అభిమానులు కూడా ఎక్కువే. హిందీ పాపులర్ హీరోయిన్లలో ఒకరైనా కంగనా రనౌత్ తాజాగా హాలీవుడ్ స్టార్ హీరో, ఆస్కార్ అవార్డు గ్రహిత విల్ స్మిత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అతను తన లాకప్‌కు వస్తాడని ఆశిస్తున్నట్లు షాకింగ్ కామెంట్స్ చేసింది. కంగనా అలా అనడానికి కారణం ఆస్కార్ 2022 అవార్డు ఫంక్షన్లో విల్‌స్మిత్ చేసిన పనే. ఆస్కార్ అవార్డు వేదికపై అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించాడు. చదవండి: ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్ ఈ సంఘటనపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ ద్వారా స్పందించింది కంగనా. 'కొంతమంది మూర్ఖులను నవ్వించడానికి మా అమ్మ లేదా సోదరిల అనారోగ్యాన్ని ఉపయోగించినట్లయితే నేను కూడా విల్ స్మిత్‌లానే చెంప పగులకొడతాను. ఇలాంటి ప్రవర్తన కనబర్చిన (బ్యాడ్ యాస్ మూవ్) విల్ స్మిత్ తప్పకుండా నా లాకప్‌కు వస్తాడని ఆశిస్తున్నాను.' అని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది కంగనా రనౌత్. కాంట్రవర్సీ రియాలిటీ షో 'లాకప్'కు కంగనా హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ముఖంపై పిడిగుద్దు ఘటన.. విల్ స్మిత్ ఆస్కార్ వెనక్కి తీసేసుకుంటారా? ఇదిలా ఉంటే ఆస్కార్ 2022 అవార్డుల ప్రదానం సందర్భంగా బెస్ట్ డ్యాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇచ్చేందుకు అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ స్టేజ్‌పైకి ఎక్కాడు. అప్పుడు ఏదో మాట్లాడుతూ అనారోగ్యంతో గుండు చేయించుకున్న విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్‌పై క్రిస్ జోక్ వేశాడు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్ స్మిత్ ఆగ్రహంతో క్రిస్ రాక్ దవడ పగలకొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 -
Oscars 2022: ఆస్కార్ గెలిచిన ‘కోడా’ మూవీ కథేంటంటే..
కోడా కథ... స్టార్ ఇమేజ్, భారీ బడ్జెట్, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్.. వీటికన్నా ఈసారి ఆస్కార్ కమిటీ కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చిందనడానికి నిదర్శనం ‘కోడా’ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడం. ఫ్రెంచ్ చిత్రం ‘లా ఫామిల్లె బెలియర్’ ఆధారంగా దర్శకురాలు సియాన్ హెడెర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంగీతంలో రాణించాలన్న రూబీ అనే యువతి, ఆమె కుటుంబం చుట్టూ ఈ సినిమా ఉంటుంది. రూబీకి తప్ప మిగతా కుటుంబ సభ్యులకు వినికిడి లోపం ఉంటుంది. కుటుంబ పోషణకు తల్లిదండ్రులకు చేపల వేటలో సాయం చేస్తూనే గాయకురాలిగా తన కలను నిజం చేసుకోవడానికి రూబీ పడే మానసిక వేదనే ఈ సినిమా. బలమైన భావోద్వేగాలతో పాటు సునిశితమైన కామెడీ కూడా ఈ సినిమాకు బలంగా నిలిచింది. ఈ మూవీలో రూబీ పాత్రధారి మినహా ఇందులో నటించిన నటీనటుల్లో ఎక్కువ శాతం మంది నిజంగానే వినికిడి లోపం ఉన్నవారే. ‘ఉత్తమ చిత్రం’గానే కాదు ఉత్తమ అడాపె్టడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో సియాన్ హెడెర్, ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఈ చిత్రానికిగాను ట్రాయ్ కోట్సర్ ఆస్కార్ అందుకున్నారు. సైన్ లాంగ్వేజ్‌తో ప్రసంగం నటి మార్లీ మాట్లిన్ తర్వాత డిఫరెంట్లీ ఎబుల్డ్ పీపుల్‌లో ఆస్కార్ అందుకున్న రెండో వ్యక్తి ట్రాయ్ కోట్సర్. అంతకుముందు ‘చిల్డ్రన్ ఆఫ్ ఎ లెస్సర్ గాడ్’ (1987)కి గాను మార్లీ మాట్లిన్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. తాజా చిత్రం ‘కోడా’లో ఆమె ట్రాయ్ భార్యగా నటించారు. కాగా, అవార్డు అందుకున్న తర్వాత సైన్ లాంగ్వేజ్‌తో తమ భావాలను వ్యక్తపరిచారు. ట్రాన్స్‌లేటర్ ఆ లాంగ్వేజ్‌ని ట్రాన్స్‌లేట్ చేసి, వినిపించారు. -
ఆస్కార్ అవార్డు కమిటీపై ఇండియన్ ఫ్యాన్స్ ఫైర్, కారణం ఇదే
ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డులు 2022 ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా ముగిసింది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సీనీ ప్రముఖులు పాల్గొన్నారు. క్రిస్ రాక్ చెంపను విల్ స్మిత్ పగలగొట్టడం లాంటి చిన్న చిన్న వివాదాలు మినహా.. కార్యక్రమం అంతా అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఆస్కార్ అవార్డు కమిటీపై ఇండియన్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దానికి కారణంగా.. ఆస్కార్ అవార్డ్స్ ‘ఇన్ మెమోరియమ్’ విభాగంలో దివంగత ప్రముఖ గాయని లతా మంగేష్కర్, దివంగత ప్రముఖ నటుడు దిలీప్ కుమార్ పేర్లను ప్రస్తావించకపోవడమే. 93వ ఆస్కార్ అవార్డ్స్ (2021) సమయంలో రిషీ కపూర్, ఇర్ఫాన్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్ పుత్‌లకు ఆస్కార్ ‘ఇన్ మెమోరియమ్’లో స్థానం కల్పించిన నేపథ్యంలో ఈ ఏడాది లతా మంగేష్కర్, దిలీప్ కుమార్‌లను విస్మరించడంతో ఆస్కార్ కమిటీ మెమరీ (జ్ఞాపక శక్తి) లో వీళ్లిద్దరూ లేరా? అనే చర్చ మొదలైంది. ఈ సంగతి ఇలా ఉంచితే.. గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకూ వచ్చిన చిత్రాలకు ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉంది. ‘ఇన్ మెమోరియమ్’ని కూడా ఆ ప్రాతిపదికన తీసుకుంటే... లతా మంగేష్కర్ ఈ ఏడాది ఫిబ్రవరిలో కన్ను మూశారు కాబట్టి ఆమె పేరుని ప్రస్తావించలేదని ఆస్కార్ వివరణ ఇచ్చుకోవడానికి లేదు. ఎందుకంటే గత ఏడాది జూలైలో మరణించిన దిలీప్ కుమార్‌ని అయినా ప్రస్తావించాలి కదా.. సో.. ఆస్కార్ చేసినది ముమ్మాటికీ తప్పిదమే అన్నది నెటిజన్ల మాట. -
ఆస్కార్‌ను జయించింది
స్వీటీ... ఆర్ట్స్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తరువాత ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్వహిస్తోన్న ‘ఉమెన్స్ ఫిల్మ్ యూనిట్’లో కొన్నేళ్లపాటు పాటు పనిచేసింది. లైంగిక దాడిపై కథను రాసి ‘ఆఫ్టర్ అవర్స్’ సినిమాను తీసింది. ఒకపక్క సినిమాలు తీస్తూనే టెలివిజన్ రంగంలో అడుగుపెట్టింది. డ్యాన్సింగ్ డేజ్ అనే షో, ఎపిసోడ్ డైరెక్టర్‌గానూ, ఇతర షోల సీరీస్‌లను విజయవంతంగా నడిపించింది. జెయిన్ సినిమాల్లో మహిళ కేంద్రబింధువుగా ఉంటుంది. 1989లో తొలిసారి ‘స్వీటీ’ అనే ఫీచర్ ఫిల్మ్ తీసింది. ఈ సినిమా ఆద్యంతం మంచి కామెడీతో సాగడంతో ప్రేక్షకాదరణ పొంది అనేక అవార్డులను గెలుచుకుంది. బాల్యంలో దాదాపు చిన్నారులంతా అమ్మమ్మ, బామ్మ, తాతయ్యల దగ్గర కథలు వింటూ పెరుగుతారు. వయసు పెరిగే కొద్దీ చదువులు, ఆటల్లో పడిపోయి విన్న కథలను మర్చిపోతారు. పెద్దయ్యాక కెరీర్‌ను అందంగా మలుచుకోవడంలో మునిగిపోయి పూర్తిగా కథలను వదిలేస్తారు. అందరిలా చిన్నారి జెయిన్ చిన్నప్పుడు విన్న కథలను వదల్లేదు. అందరికంటే భిన్నంగా ఆలోచించే జెయిన్ తను విన్న కథలు, చదివిన కథలను మరింత లోతుగా ఊహించుకుంటూ పెరిగింది. పెద్దయ్యాక ఆ కథలకు తన ఊహా శక్తిని జోడించి ఏకంగా అవార్డు తెచ్చిపెట్టే సినిమాలు తీసి మంచి దర్శకురాలిగా ఎదిగింది. జెయిన్ మరెవరో కాదు.. రెండు సార్లు ఆస్కార్‌కు బెస్ట్ డైరెక్టర్‌గా నామినేట్ అయ్యి.. ఆదివారం జరిగిన ఆస్కార్ వేడుకల్లో బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకున్న మూడో మహిళా దర్శకురాలే 67 ఏళ్ల జెయిన్ క్యాంపియన్. న్యూజిలాండ్‌లోని వెల్లింగ్టన్లో 1954 ఏప్రిల్ 30న రిచర్డ్ క్యాంపియన్, ఎడిత్ ఆర్మ్‌స్ట్రాంగ్ దంపతులకు జెయిన్ క్యాంపియన్ జన్మించింది. రిచర్డ్ థియేటర్ డైరెక్టర్, ఎడిత్ నటి. వీరికి ముగ్గురు సంతానం. రెండో కూమార్తె జెయిన్ క్యాంపియన్ పూర్తిపేరు ఎలిజిబెత్ జెయిన్ క్యాంపియన్. చిన్నప్పుడు అందరిలా కథలు వింటూ పెరిగింది జెయిన్. స్కూల్లో ఉండగా అనేక కథల పుస్తకాలను చదివేది. ఇంట్లో సినిమా, నటనా వాతావరణం ఉండడంతో సహజంగానే నటన వైపు ఆకర్షితురాలైంది జెయిన్. కానీ నటనను కెరీర్‌గా ఎంచుకోలేదు. విక్టోరియా యూనివర్సిటీలో స్ట్రక్చరల్ ఆంథ్రోపాలజీలో డిగ్రీ పూర్తిచేసిన తరువాత పెయింటింగ్ ప్రధాన సబ్జెక్టుగా మరో డిగ్రీ చేసింది. డిగ్రీ చేసిన తరువాత తన ఆసక్తి దర్శకత్వంవైపు మళ్లింది. దీంతో వెనిస్ వెళ్లి ఆర్ట్స్‌లో కోర్సు చేసింది. తర్వాత లండన్‌లోని డాక్యుమెంటరీలు, కమర్షియల్ సినిమాలు తీసే ఓ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్‌గా చేరింది. అసిస్టెంట్‌గా పనిచేస్తూనే చెల్సియా స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌లో చదివింది. తరువాత సిడ్నీ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్‌లో డిప్లొమా చేసింది. ఈ డిప్లొమా అయ్యాక సినిమా రంగంలో అడుగు పెట్టింది. 1980లో తొలిసారి ‘టిష్యూస్’ పేరిట ఓ లఘు చిత్రం తీసింది. ఈ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో మరుసటి ఏడాది ఆస్ట్రేలియన్ ఫిల్మ్ టెలివిజన్, రేడియో స్కూల్లో చేరి రచయిత, దర్శకురాలు, ఎడిటర్‌గా అన్నీ తానై తండ్రి కొడుకుపై చూపించే క్రమశిక్షణ, బాధ్యతల్లో ఇద్దరు పడే సంఘర్షణను ‘పీల్’(1982) పేరిట సినిమా తీసింది. దీని తరువాత అమ్మాయిల ఫ్యాషన్‌పై రెండో సినిమా, అన్నా చెల్లెళ్ల బంధంపై మూడో సినిమాను నిర్మించింది. పీల్ సినిమాకు 1986లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ‘పామ్ డి ఓర్’ అవార్డు వచ్చింది. తొలిఆస్కార్ నామినేషన్ 1993లో ‘ద పియానో’ సినిమా తీసింది జెయిన్. ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ఫెస్టివల్ల్లో ‘పామ్ డీఓర్’ అవార్డు గెలుచుకుంది. ఈ అవార్డు గెలుచుకున్న తొలి మహిళగా జెయిన్ నిలిచింది. ఈ అవార్డుతోపాటు ‘బెస్ట్ యాక్టర్, బెస్ట్ సహాయ నటి’ అకాడమీ అవార్డులను ఈ సినిమా గెలుచుకోవడం విశేషం. ఈ సినిమాకు జెయిన్ ఆస్కార్ బెస్ట్ డైరెక్టర్ అవార్డుకి నామినేట్ అయినప్పటికీ, స్పీల్బర్గ్ బెస్ట్ డైరెక్టర్‌గా నిలవడంతో జెయిన్కు అవార్డు రాలేదు. కానీ బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డు దక్కించుకుంది జెయిన్. జెయిన్ దర్శకత్వం వహించిన టాప్ ఫైవ్ సినిమాలలో.. ద పియానో, యాన్ ఏంజిల్ ఎట్ మై టేబుల్, బ్రైట్ స్టార్, స్వీటీ, ద పోర్టరేట్ ఆఫ్ ఏ లేడీలు ఉన్నాయి. ప్రస్తుతం రెండోసారి 94వ ఆస్కార్ అవార్డులకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు నామినేట్ అయ్యి ‘ద పవర్ ఆఫ్ ది డాగ్’ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు గెలుచుకుంది. తొలిసారి 2010లో క్యాథరిన్ బిగెలో ‘హర్ట్ లాకర్’ సినిమాకు బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకుని తొలి మహిళా డైరెక్టర్‌గా రికార్డు సృష్టించింది. గతేడాది ‘నోమాడ్ ల్యాండ్’ సినిమాకు గాను క్లో జావో ఆస్కార్ బెస్ట్ డైరెక్టర్ అవార్డు అందుకోని రెండో మహిళగా నిలిచింది. ఇప్పుడు జెయిన్ మూడో బెస్ట్ డైరెక్టర్‌గా నిలిచారు. -
ఆస్కార్ గెలిచిన ‘డూన్’.. అవార్డు రావడంలో మనోడిదే కీలక పాత్ర
ప్రతియేటా ప్రపంచవ్యాప్తంగా చలనచిత్ర రంగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన దర్శకులకు, నటీనటులకు, రచయితలకు, ఇతర సాంకేతిక నిపుణులకు ఇచ్చే ప్రతిష్ఠాత్మక అవార్డు ఆస్కార్. 94 వ అకాడమీ అవార్డ్స్ వేడుక అట్టహాసంగా కొనసాగింది. ఇక ఈ వేడుకల్లో భారత్‌కు ఎలాంటి అవార్డులు దక్కలేదు. కానీ భారత్‌కు చెందిన వీఎఫ్ఎక్స్ ఇంజనీర్ ప్రతిభతో ప్రముఖ హాలీవుడ్ చిత్రం డూన్ (Dune) బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు వరించింది. ఈ సినిమాకు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చేలా తన ప్రతిభతో మెప్పించిన ఇండియన్ గురించి తెలుసుకుందాం.. నమిత్ మల్హోత్రా.. భారత్‌కు చెందిన గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ (VFX) ఇంజనీర్ నమిత్ మల్హోత్రా మార్చి 28 సోమవారం జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకల్లో బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో 2022 ఆస్కార్ అవార్డును ఎపిక్ సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్ డూన్ గెలుచుకున్న తర్వాత అందరి దృష్టిని ఆకర్షించాడు. నమిత్ మల్హోత్రా విజయంపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ కూడా ట్వీట్ చేశారు. డూన్ సినిమాకు డబుల్ నెగటివ్(DNEG) అద్భుతమైన వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్‌ను రూపొందించింది. ఈ సంస్థకు సీఈవోగా నమిత్ మల్హోత్రా వ్యవహారిస్తున్నారు. బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఆస్కార్ అవార్డు వచ్చేందుకు ఎంతగానో కృషి చేశారు. డైలీ సీరియల్స్ నుంచి ఆస్కార్ అవార్డు వరకు.. నమిత్ మల్హోత్రా బాలీవుడ్ దర్శకుడు,నిర్మాత నరేష్ మల్హోత్రా పెద్ద కుమారుడు. ఆయన పూర్తిగా ముంబైలో పెరిగారు. హెచ్ఆర్ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ ఎకనామిక్స్ నుంచి కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు.కంప్యూటర్ గ్రాఫిక్స్ నేర్చుకొని,జీ ఎంటర్టైన్మెంట్, స్టార్ ప్లస్ వంటి ఛానెల్స్‌లో సీరియల్స్ కోసం పని చేస్తూ...ఎడిటింగ్ స్టూడియో వీడియో వర్క్‌షాప్‌ను నమిత్ మల్హోత్రా ప్రారంభించారు. ఈ సంస్థను వీడియో వర్క్స్‌తో విలీనం చేయగా తరువాత ప్రైమ్ ఫోకస్ అనే వీఎఫ్ఎక్స్ సంస్థను స్థాపించారు.ఈ సంస్థ 16 నగరాల్లో 8,000 మంది నిపుణులతో గ్లోబల్ (ప్రైమ్ ఫోకస్ వరల్డ్)గా మారింది. 2డీ చిత్రాలను 3డీ చిత్రాలుగా మార్చడంలో అద్బుత విజయం సాధించింది. 2014లో ప్రైమ్ ఫోకస్ వరల్డ్‌ను బ్రిటన్‌కు చెందిన డబుల్ నెగటివ్ సంస్థలో వీలినం చేశారు. ఎన్నో చిత్రాలకు..! నమిత్ మల్హోత్రా నేతృత్వంలోని డబుల్ నెగటివ్ అనేక ప్రతిష్టాత్మక చిత్రాలను రూపొందించింది. డబుల్ నెగటివ్ ఇంత ఘన విజయం సాధించడం ఇదే మొదటిసారి కాదు. ఇటీవలి కాలంలో విడుదలైన టెనెట్, బ్లేడ్ రన్నర్ 2049, ఫస్ట్ మ్యాన్, ఎక్స్ మెషినా, ఇంటర్స్టెల్లార్ ,ఇన్సెప్షన్ చిత్రాలకు ఆస్కార్ అవార్డులు లభించాయి. ఇక ఈ సంస్థ హ్యారీ పాటర్ అండ్ ది డెత్లీ హాలోస్ (రెండు భాగాలు), ష్రెక్ 2 , వ్రాత్ ఆఫ్ ది టైటాన్స్, కొన్ని స్టార్ వార్స్ చిత్రాలకు వీఎఫ్ఎక్స్ను అందించారు. అంతేకాకుండా ఇటీవల రిలీజైన జేమ్స్ బాండ్ చిత్రం నో టైమ్ టు డై చిత్రానికి కూడా వీఎఫ్ఎక్స్ను రూపొందించింది. చదవండి: అత్యంత సరసమైన ధరలో లగ్జరీ బైక్..! ట్రయంఫ్ నుంచి..! -
అండ్ ది ఆస్కార్ గోస్ టూ
-
విల్ స్మిత్ ఆస్కార్ వెనక్కి తీసేసుకుంటారా?
ఆస్కార్స్ 2022 ఈవెంట్ వేదికగా జరిగిన షాకింగ్ ఈవెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నటుడు విల్ స్మిత్, మరో నటుడు క్రిస్ రాక్‌ను స్టేజ్‌పైనే ముఖం పగల కొట్టిన ఘటన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విల్ స్మిత్‌కు దక్కిన బెస్ట్ యాక్టర్ అవార్డును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. విల్ స్మిత్.. క్రిస్ రాక్ చెంప పగలకొట్టిన ఘటన వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ ఇన్సిడెంట్ ఈవెంట్ లైవ్‌లో టెలికాస్ట్ కాలేదు. పైగా ఈ ఘటన తర్వాత ఆస్కార్స్ 2022 ఈవెంట్‌ను కాసేపు నిలిపేసినట్లు సమాచారం. అయితే కాసేపటికే ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో.. లేక నిజంగా జరిగిందో అర్థంకానీ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ ఈవెంట్ వేదికగానే విల్ స్మిత్ బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ ట్రోఫీ అందుకున్నారు.. ఆపై జరిగిన ఘటనకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే అకాడమీ రూల్స్ ప్రకారం.. విల్ స్మిత్ ఆస్కార్‌ను వెనక్కి తీసుకోవాల్సిందేనని కొందరు గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకాడమీ స్పందించింది. ‘‘హింస ఏ రూపంలో ఉన్నా అకాడమీ సహించదు. ఈ రాత్రి మా 94వ అకాడమీ అవార్డుల వేడుకలు జరగడం, విజేతల గుర్తింపు దక్కడంపై మేం సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సహచరులు, సినీ ప్రేమికుల నుండి ఈ క్షణానికి గుర్తింపు పొందారు (sic)’’ అంటూ ట్వీట్ చేసింది అకాడమీ. The Academy does not condone violence of any form. Tonight we are delighted to celebrate our 94th Academy Awards winners, who deserve this moment of recognition from their peers and movie lovers around the world. — The Academy (@TheAcademy) March 28, 2022 ఇక ఇలాంటి సందర్భాల్లో అకాడమీ గట్టి చర్యలు తీసుకోవాలని, సరైన మార్గదర్శకాలు రిలీజ్ చేయాలని, అసలు ఈ ఉదంతాన్ని ఒక దాడిగా పరిగణించి విల్ స్మిత్ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే అకాడమీ మాత్రం అవార్డు వెనక్కి తీసుకునే వ్యవహారంపై ఇంతవరకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయలేదు. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 అకాడమీ రూల్స్ ఏం చెబుతోందంటే.. 2017లో విడుదల చేసిన అకాడమీ కండక్ట్ కోడ్.. అకాడమీ విలువలను పరిరక్షించడంతో పాటు అవతలి వాళ్ల గౌరవానికి భంగం కలిగించకూడదు. అంతేకాదు.. అకాడమీ వాతావరణంలో అనైతికంగా వ్యవహరించకూడదు కూడా. అయితే విల్ స్మిత్ దాడి విషయంలో.. స్టేజ్ మీద ఉన్న క్రిస్ రాక్.. విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్ మీద జోక్ పేల్చాడు. ఆమె చూడడానికి జీఐ జేన్ 2(సినిమా.. అందులో లీడ్ రోల్) లాగా ఉందంటూ కామెంట్ చేశాడు. కానీ, జాడా అలోపెషియాతో బాధపడుతోంది. ఆ అనారోగ్యం వల్లే ఆమె జుట్టు రాలిపోగా.. అలా గుండు లుక్‌తో దర్శనమిచ్చింది. అందుకే భార్య మీద వేసిన జోక్‌కు విల్ స్మిత్‌కు మండిపోయి గూబ పగలకొట్టి ఉంటాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. విల్ స్మిత్, జాడా పింకెట్లు 1997లో వివాహం చేసుకున్నారు. 2018లో జాడా తనకు ఉన్న అలోపెసియా గురించి ఓపెన్ అయ్యింది. తద్వారా గొంతు సమస్యలు, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. -
తారల ఆనందమానందమాయె.. ఆస్కార్‌ను ముద్దాడిన వేళ.. (ఆస్కార్ 2022 ఫొటోలు)
-
ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్
Shocking Video In Oscars 2022: నటుడు విల్ స్మిత్(53)కు ఎట్టకేలకు ఆస్కార్ దక్కింది. 94వ ఆస్కార్ వేడుకల్లో ‘కింగ్ రిచర్డ్’ సినిమాకుగానూ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడాయన. అయితే.. ఈవెంట్ సందర్భంగా జరిగిన ఓ ఘటన సినీ అభిమానులను షాక్‌కు గురి చేసింది. ఆస్కార్స్ 2022 అవార్డుల ప్రదానం సందర్భంగా.. నటుడు విల్ స్మిత్, స్టేజ్‌పై మాట్లాడుతున్న అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించాడు. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్‌కు అవార్డు ఇవ్వడానికి స్టేజ్ ఎక్కిన క్రిస్.. ఏదో మాట్లాడుతూ విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్ మీద జోక్ పేల్చాడు. అనారోగ్యంతో ఆమె గుండు చేయించుకుని ఉండగా.. ఆమె లుక్ మీద క్రిస్ జోక్ వేశాడు. దీంతో అప్పటిదాకా నవ్వుతూ కనిపించిన విల్ స్మిత్ ఒక్కసారిగా ఉగ్రుడయ్యాడు. స్టేజ్ మీదకు సీరియస్‌గా నడ్చుకుంటూ వెళ్లిన స్మిత్.. క్రిస్ దవడ పగలకొట్టాడు. ఆ మరుక్షణమే కిందికి దిగి కుర్చీలో కూర్చున్నాడు. క్రిస్ వెకిలిగా ఏదో వివరణ ఇవ్వబోతుండగా.. అభ్యంతరకరమైన పదంతో నోరు మూయమంటూ క్రిస్‌కు సూచించాడు విల్ స్మిత్. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 ఆపై క్షమాపణలు ఇదంతా లైవ్ రికార్డులో ప్లే కాలేదు. కానీ, ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతుంది. అదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో.. లేక నిజంగా జరిగిందో స్పష్టత లేదు. కానీ, క్రిస్ వ్యక్తిగతంగా కలిసి ఆ కుటుంబానికి క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది.] అంతేకాదు నిర్వాహకులు విల్ స్మిత్‌ను పక్కకు తీసుకెళ్లి సర్దిచెప్పినట్లుగా ఒక ఫొటో వైరల్ అవుతోంది. ఇక ఉత్తమ నటుడి అవార్డు తీసుకున్న టైంలో భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకున్న విల్ స్మిత్.. క్రిస్ పట్ల వ్యవహరించిన తీరుకు క్షమాపణలు తెలియజేశాడు కూడా. Here's Will Smith's tearful acceptance speech at the #Oscars. https://t.co/ulvT7fsB57 pic.twitter.com/Uq2krBbBld — Variety (@Variety) March 28, 2022 మూడుసార్లు నామినేట్! అమెరికన్ నటుడు అయిన విల్ స్మిత్(విలియర్డ్ కారోల్ స్మిత్ 2).. మెన్ ఇన్ బ్లాక్, ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, హ్యాంకాక్, ఐ యామ్ లెజెండ్ లాంటి సినిమాలతో విల్ స్మిత్ ఇండియన్ ఆడియొన్స్‌కు సుపరిచితుడే. ఇప్పటిదాకా ‘అలీ’, ‘ది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్’, ‘కింగ్ రిచర్డ్’కు గానూ మూడుసార్లు ఉత్తర నటుడి కేటగిరీలో నామినేట్ అయ్యారు ఆయన. అయితే ది ఫ్రెష్ ప్రిన్స్‌గా పేరున్న విల్ స్మిత్‌కు ఆస్కార్ 2022లో అవార్డు ముచ్చట తీరింది. కింగ్ రిచర్డ్‌లో వీనస్, సెరీనా విలియమ్స్ తండ్రి పాతర రిచర్డ్ విలియమ్స్ రోల్లో ఆయన కనబర్చిన అద్భుతమైన నటనకు ఆస్కార్ దక్కించుకున్నాడు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: Oscars 2022.. విజేతల పూర్తి లిస్ట్ ఇదే -
Oscars Winners 2022: ఆస్కార్ విజేతలు వీళ్లే
Oscars 2022 Complete Winners List: ఆనందం, ఆగ్రహం, ఆవేదన... ఇవి వ్యక్తపరచడానికి మాటలే అక్కర్లేదు. సైగలు చాలు.. ఆ సైగలే మనసుకి హత్తుకుంటాయి. అలా ఆస్కార్ అవార్డ్ కమిటీని ‘మూగ మనసులు’ మెప్పించాయి. అందుకే ‘కోడా’ని ఉత్తమ చిత్రంగా ప్రకటించింది. ఈ సినిమాలో ఒక్క పాత్రధారి తప్ప మిగతా అన్ని పాత్రలనూ ‘డిఫరెంట్లీ ఏబుల్డ్’ యాక్టర్స్ చేయడం విశేషం. ఈసారి కూడా బెస్ట్ డైరెక్టర్ అవార్డును లేడీ డైరెక్టర్ అందుకోవడం మరో విశేషం. అలనాటి ‘క్యాబరే’ మూవీ ఫేమ్ లిజా మిన్నెలీ ఎంట్రీకి స్టాండింగ్ ఒవేషన్ దక్కడం ఇంకో విశేషం. ఇలా ఎన్నో ఆనందాల మధ్య చిన్న చేదు అనుభవంలా క్రిస్ రాక్ చెంపను విల్ స్మిత్ చెళ్లుమనిపించడం గమనార్హం. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 28) 94వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగింది. ఆ విశేషాలు తెలుసుకుందాం. కోవిడ్ కారణంగా రెండేళ్లుగా (2020, 2021) పెద్దగా సందడి లేకుండా జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుక ఈసారి కోలాహలంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా ‘కోడా’ అవార్డును గెలుచుకోగా, ఉత్తమ నటుడిగా ‘కింగ్ రిచర్డ్స్’ సినిమాకి విల్ స్మిత్ , ఉత్తమ దర్శకురాలిగా ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’కి జెయిన్ కాంపియన్ ఆస్కార్‌ను అందుకున్నారు. నామినేట్ అయిన మూడు విభాగాల్లోనూ (బెస్ట్ పిక్చర్, బెస్ట్ అడాపె్టడ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ సపోరి్టంగ్ యాక్టర్) ‘కోడా’ చిత్రం అవార్డులను దక్కించుకోవడం విశేషం. ఇక 12 ఆస్కార్ నామినేషన్స్‌ను దక్కించుకున్న ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ కేవలం ఒకే ఒక్క (బెస్ట్ డైరెక్టర్ కేటగిరీ) అవార్డుతో సరిపెట్టుకుంది. పది నామినేషన్లు దక్కించుకున్న ‘డ్యూన్’ చిత్రం ఆరు ఆస్కార్ అవార్డులను చేజిక్కించు కుంది. మరోవైపు బెస్ట్ ఫారిన్ ఫిల్మ్‌గా జపాన్ ఫిల్మ్ ‘డ్రైవ్ మై కార్’ నిలిచింది. కాగా ‘బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్’ విభాగంలో మన దేశం నుంచి రింటూ థామస్ దర్శకత్వం వహించిన ‘రైటింగ్ విత్ ఫైర్’ నామినేషన్ దక్కించుకున్నా ఆస్కార్ తేలేక పోయింది. ఈ విభాగంలో ‘సమ్మర్ ఆఫ్ సోల్’ అవార్డు దక్కించుకుంది. అవార్డు వేడుక నిడివి తగ్గించే క్రమంలో ముందు ప్రకటించినట్లుగానే ఎనిమిది విభాగా (మానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్, ఫిల్మ్ ఎడిటింగ్, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్, మేకప్ అండ్ హెయిర్ స్టయిల్, ఒరిజినల్ స్కోర్, ప్రొడక్షన్ డిజైన్ అండ్ సౌండ్)లకు చెందిన అవార్డులను ముందే అందజేసి, లైవ్ టెలికాస్ట్‌లో చూపించారు. ఇక ఎప్పటిలానే ఎర్ర తివాచీపై అందాల భామలు క్యాట్ వాక్ చేసి ఆకట్టుకున్నారు. వీల్ చైర్లో స్టార్ డాన్సర్ ‘క్యాబరే’ మూవీ ఫేమ్ లిజా మిన్నెలీ ఉత్తమ చిత్రం అవార్డును నటి, గాయని లేడీ గాగాతో కలసి ప్రకటించారు. 50 ఏళ్ల క్రితం ‘క్యాబరే’ మూవీకి ఉత్తమ నటిగా ఆస్కార్ అందుకున్నారు లిజా. ప్రస్తుతం వీల్ చైర్లో ఉన్న ఆమెను వేదిక మీదకు తీసుకొచ్చారు లేడీ గాగ. ‘‘క్యాబరే’ 50 ఏళ్ల వార్షికోత్సవం జరుపుకుంటోంది. లెజెండ్స్‌తో కలసి పని చేయడం నాకెంత ఇష్టమో మీకు తెలుసా?’’ అంటూ లిజా భుజం మీద గాగ చేయి వేయగా, ‘ఓ బేబీ..’ అన్నారు లిజా. ఇద్దరూ కలిసి ఉత్తమ చిత్రంగా ‘కోడా’ని ప్రకటించారు. వేడుక ప్రాంగణంలో ఉన్న అందరూ లిజాకు మర్యాదపూర్వకంగా నిలబడి చప్పట్లు కొట్టారు. కాగా ఒకప్పుడు తన నటనతో అలరించిన లిజా అనారోగ్య సమస్య వల్ల కొన్నేళ్లుగా వీల్ చెయిర్‌కే పరిమితమయ్యారు. ఈసారీ మహిళా దర్శకురాలే... ‘ది హార్ట్ లాకర్’ సినిమాకు గాను 2010లో దర్శకత్వ విభాగంలో తొలిసారి అవార్డు అందుకున్న డైరెక్టర్‌గా క్యాథరిన్ బిగెలో రికార్డ్‌లో ఉన్నారు. గత ఏడాది (2021) దర్శకత్వ విభాగంలో ‘నొమాడ్ ల్యాండ్’ చిత్రానికిగాను దర్శకురాలు క్లోవ్ జావో అవార్డును అందుకోగా ఈసారి కూడా ఈ విభాగంలో మహిళకే అవార్డు దక్కడం విశేషం. ఈ ఏడాది ఉత్తమ దర్శకురాలిగా జెయిన్ కాంపియన్ ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ చిత్రానికిగాను ఆస్కార్‌ను సొంతం చేసుకున్నారు. ఆస్కార్ అందుకున్న మూడో లైడీ డైరెక్టర్ జెయిన్. అయితే జెయిన్కు ఇది తొలి ఆస్కార్ కాదు. 1994లో వచి్చన ‘ది పియానో’ సినిమాకు బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో ఆమె తొలిసారి ఆస్కార్ అవార్డును అందుకున్నారు. అప్పుడు ఇదే సినిమాకు జెయిన్ కాంపియన్ ఉత్తమ దర్శకురాలిగా నామినేట్ అయినప్పటికీ ఆ ఏడాది ‘ష్లిండర్స్ లిస్ట్’ సినిమాకు స్టీవెన్ స్పీల్బర్గ్ ఆస్కార్ అవార్డును దక్కించుకున్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) ఆస్కార్ అవార్డును కైవం చేసుకుంది వీళ్లే.. ► ఉత్తమ చిత్రం - చైల్డ్ ఆఫ్ డెఫ్ అడల్ట్స్(CODA) ► ఉత్తమ నటుడు - విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్) ► ఉత్తమ నటి - జెస్సికా చస్టేన్ (ద ఐస్ ఆఫ్ టామీ ఫే) ► ఉత్తమ దర్శకురాలు - జేన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ద డాగ్) ► ఉత్తమ సహాయ నటి - అరియానా దిబోస్ (వెస్ట్ సైడ్ స్టోరీ) ► ఉత్తమ సహాయ నటుడు - ట్రాయ్ కోట్సర్ (CODA) ► ఉత్తమ సినిమాటోగ్రఫీ - గ్రెగ్ ఫ్రెజర్ (డ్యూన్) ► బెస్ట్ ఒరిజినల్ సాంగ్ - నో టైమ్ టు డై ► బెస్ట్ డాక్యుమెంటరీ ఫియేచర్ - సమ్మర్ ఆఫ్ సోల్ ► బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే- CODA (షాన్ హెడర్) ► బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే - బెల్ఫాస్ట్ (కెన్నత్ బ్రానా) ► బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్ - జెన్నీ బీవన్ (క్రూయెల్లా) ► బెస్ట్ ఇంటర్నేషనల్ ఫియేచర్ - డ్రైవ్ మై కార్ (జపాన్) ► బెస్ట్ యానిమేటెడ్ ఫియేచర్ - ఎన్కాంటో ► బెస్ట్ ఒరిజినల్ స్కోర్ - హన్స్ జిమ్మర్ (డ్యూన్) ► బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ - డ్యూన్ (పాల్ లాంబర్ట్, ట్రిస్టన్ మైల్స్, బ్రియన్ కానర్, గెర్డ్ నెఫ్జర్) ► బెస్ట్ ఫిలిం ఎడిటింగ్ - జో వాకర్ (డ్యూన్) ► బెస్ట్ సౌండ్ - డ్యూన్ (మాక్ రుత్, మార్క్ మాంగిని, థియో గ్రీన్, డగ్ హెంఫిల్, రాన్ బార్ట్లెట్) ► బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - డ్యూన్ (ప్రొడక్షన్ డిజైన్- పాట్రైస్ వెర్మట్, సెట్ డెకరేషన్- జుజానా సిపోస్) ► బెస్ట్ మేకప్ అండ్ హెయిర్‌స్టైలింగ్ - ద ఐస్ ఆఫ్ ది టామీ ఫే (లిండా డౌడ్స్, స్టెఫనీ ఇన్‌గ్రామ్, జస్టిన్ రాలే) ► బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ది లాంగ్ గుడ్‌బై ► బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ది విండ్‌షీల్డ్ పైపర్ ► బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ద క్వీన్ ఆఫ్ బాస్కెట్‌బాల్ చదవండి: Oscars 2022: ఆస్కార్.. వచ్చినా ఏం లాభం? -
Oscars 2022: రిజ్ అహ్మద్.. ఆస్కార్ పట్టేశాడు
Oscars 2022: కిందటి ఏడాది మిస్ అయితే ఏంటి.. ఈ ఏడాది ఆస్కార్‌ను పట్టేశాడు రిజ్ అహ్మద్. పాక్-బ్రిటన్ సంతతికి చెందిన 39 ఏళ్ల రిజ్ అహ్మద్ ‘ది లాంగ్ గుడ్‌బై’ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌కుగానూ (Best Live Action Short Film) కేటగిరీలో ఆస్కార్ అందుకున్నాడు. దర్శకుడు అనెయిల్ కారియాతో ఈ అవార్డును స్వీకరించాడు రిజ్ అహ్మద్. 94వ అకాడమీ అవార్డుల వేడుక ఈ ఉదయం(సోమవారం) అట్టహాసంగా మొదలయ్యింది. ఈ ఈవెంట్లో తన తొలి ఆస్కార్‌ను అందుకున్నాడు రిజ్ అహ్మద్. మల్టీ టాలెంటెడ్‌గా పేరున్న రిజ్.. కిందటి ఏడాది ‘సౌండ్ ఆఫ్ మెటల్’ సినిమాకుగానూ బెస్ట్ యాక్టర్ కేటగిరీలో ఆస్కార్‌కు నామినేట్ అయ్యాడు కూడా. కానీ, సీనియర్ నటుడు ఆంటోనీ హోప్కిన్స్కు అవార్డు దక్కింది. విశేషం ఏంటంటే.. ది లాంగ్ గుడ్‌బైలో అనెయిల్ కారియాతో పాటు రిజ్ అహ్మద్ సహకారం ఉంది. రిజ్ కో క్రియేటర్. ఇక తన అవార్డు విన్నింగ్ స్పీచ్‌లో ఉక్రెయిన్ సంక్షోభంపై రిజ్ అహ్మద్ ప్రసంగించాడు. ఇది విభజిత కాలం. ఇందులో ‘మనం’, ‘వాళ్లు’ లేరని గుర్తు చేయడమే కథ పాత్ర అని నమ్ముతాం. అక్కడ ‘మనం’ మాత్రమే ఉంది. కానీ, ఇది తమకు చెందినది కాదని భావించే ప్రతి ఒక్కరి కోసం. అలాగే శాంతి కోసం అంటూ ప్రసంగించాడు రిజ్ అహ్మద్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Oscars 2022: ఆస్కార్.. వచ్చినా ఏం లాభం?
Oscar Trophy Birth And Intresting Facts: సినీ జగత్‌కు పెద్ద పండుగ ‘ఆస్కార్’ కౌంట్ డౌన్‌కి మరొక రోజే మిగిలి ఉంది. ఫైనల్ నామినేషన్ల లిస్ట్ బయటకు వచ్చినప్పటి నుంచి విజేతల గురించి మూవీ లవర్స్ జోరుగా చర్చించుకుంటున్నారు. కరోనా జోరు తగ్గడంతో ఈసారి కాస్త హడావిడిగానే ఈవెంట్‌ను జరపాలని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెన్స్(ఎఎంపీఏఎస్) నిర్ణయించుకుంది. ఇంతకీ ఆస్కార్ వస్తే ఏం లాభం? నటులకు, టెక్నిషీయన్లకు అంతగా ఏం ఒరుగుతుంది?.. ఆస్కార్ అవార్డులకు ప్రామాణికం.. వేడుకల్లో అందించే ట్రోఫీ. ఈ ట్రోఫీకి చాలా చరిత్రే ఉంది. ఈ గోల్డెన్ స్టాచ్యూ ట్రోఫీని ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’ అంటారు. ఫ్రాన్స్‌కి చెందిన డెకో స్టయిలో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అమెరికా డిజైనర్ కెడ్రిక్ గిబ్సన్ ఈ ట్రోఫీ డిజైన్‌ను స్కెచ్ చేయగా, ఐరిష్ ఆర్ట్ డైరెక్టర్ జార్జ్ స్టాన్లీ ఆస్కార్ ట్రోఫీ బొమ్మను తయారు చేశాడు. ఈ బొమ్మను కంచుతో తయారు చేస్తారు. పైన బంగారు పూత పూస్తారు. ఒక్కో విగ్రహం తయారీకి ఐదు నుంచి 900ల డాలర్ల ఖర్చు అవుతుంది. యాభై విగ్రహాల తయారీకి మూడు నెలల టైం పడుతుంది. ట్రోఫీ పొడవు 34 సెంటిమీటర్లు, బరువు మూడున్నర కేజీలు ఉంటుంది. 1929 నుంచి ఇప్పటిదాకా 3,160 ట్రోఫీలను ఇచ్చింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. కానీ, సినిమావాళ్లు గొప్పగా భావించే ఈ ట్రోఫీని.. ఒకవేళ అమ్మితే వచ్చేది మాత్రం కేవలం ఒక్క డాలర్!. 2021 ఆస్కార్ విజేతలు కోర్టుకెక్కి మరీ 1950కి ముందుదాకా.. అవార్డు గెల్చుకున్నవాళ్లకే ట్రోఫీపై అన్ని హక్కులు ఉండేవి. ఆ తర్వాత అకాడమీ తన రూల్స్ సవరించింది. విజేతలు ఎవరైనా సరే ఆస్కార్ ట్రోఫీని.. వేరే వాళ్లకు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అమ్మాలంటే.. అకాడమీకే అమ్మాలని ముందుగానే కాంట్రాక్ట్ మీద విజేతలతో సైన్ చేయించుకుంటారు. అలా అమ్మేయగా ఒక్కటంటే ఒక్క డాలర్ మాత్రమే ఇస్తారు. ఒప్పందాన్ని కాదని వేరేవాళ్లకు అమ్మితే.. కోర్టుకు ఇడుస్తుంది అకాడమీ. అయినప్పటికీ కొందరు ట్రోఫీలను అమ్మడం విశేషం. ‘ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్’(1956) బెస్ట్ మూవీగా ఆస్కార్ ట్రోఫీ గెల్చుకుంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ మైకేల్ టాడ్స్. ఈయన మనవడు 1989లో ట్రోఫీని వేలం వేయాలని ప్రయత్నించాడు. కోర్టులో కేసు వేసి ఆ వేలంపాటను అకాడమీ అడ్డుకుంది. 1992లో ‘బెస్ట్ సపోర్ట్ యాక్టర్’ ట్రోఫీ గెల్చుకున్న హరోల్డ్ రస్సెస్.. తన భార్య ఆరోగ్యం కోసం అరవై వేల డాలర్లకు ఆస్కార్ ట్రోఫీని అమ్మేశాడు. ఈ విషయంలో అకాడమీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే తన భార్య ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని పోరాడి మరీ కేసు గెలిచాడు హరోల్డ్. హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘సిటిజన్ కేన్’(1941) ఒరిజినల్ స్క్రీన్‌ప్లే కేటగిరీలో ఆస్కార్ గెల్చుకుంది. స్క్రీన్‌ప్లే రైటర్ ఓర్సన్ వెల్స్ వారసులు ఆ ట్రోఫీని వేలం అమ్మేయాలని ప్రయత్నించారు. ఈ కేసు కోర్టులో నడిచినప్పటికీ.. వెల్స్ వారసులే కేసు నెగ్గారు. ఆ టైంలో అకాడమీ కాంట్రాక్ట్‌లో వెల్స్ సైన్ చేయకపోవడం ఆ వారసులకు కలిసొచ్చింది. కోర్టు తీర్పు తర్వాత 2011లో ఆ ట్రోఫీని వేలం వేయగా.. ఎనిమిదిన్నర లక్షల డాలర్లు వచ్చింది. ఇంత సమస్యలున్నప్పుడు.. అసలు ఆస్కార్ ట్రోఫీ గెలవడం వల్ల లాభం ఏంటంటారా?. ఆర్టిస్టులు, ఇతర టెక్నిషియలు తమ రెమ్యునరేషన్ పెంచుకోవడం కోసం, తమ బ్రాండ్లను మార్కెటింగ్ చేసుకోవడం కోసమే పనికొస్తుంది. అన్నింటికి మించి సినీ ప్రపంచంలో ఇదొక ఔనత్యమైన అవార్డు అనే గుర్తింపు దక్కుతుంది కదా!. ఆస్కార్‌పై కథలు 1939 వరకు అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ అనే ట్రోఫీని పిలిచేవాళ్లు. ఆ తర్వాత అఫీషియల్‌గా ‘ఆస్కార్’ అనే ముద్దుపేరుతో పిలుస్తున్నారు. ఆ పేరు అసలు ఎలా వచ్చిందనే దానిపై రకరకాల కథలు వినిపిస్తుంటాయి. అమెరికన్ నటి బెట్టె డేవిస్ అప్పట్లో అకాడమీ ఆర్గనైజేషన్‌కి ప్రెసిడెంట్ పని చేసింది. తన మొదటి భర్త పేరు హర్మన్ ఆస్కార్ నెల్సన్. ఆయన పేరు మీదుగా ఆమె ట్రోఫీలకు ఆ పేరు పెట్టిందని చెప్తారు. మరో వెర్షన్ ఏంటంటే.. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్, ఆ బొమ్మ రూపం తన అంకుల్ ఆస్కార్‌ని పోలి ఉండడంతో ఆమె ఆ పేరు పెట్టించిందని చెప్తారు. అమెరికన్ కాలమిస్ట్ సిడ్నీ స్కోలిస్కై మాత్రం తన కాలమ్‌లో ‘అకాడమీ ఎంప్లాయిస్ ముద్దుగా ఆ పేరు పెట్టుకున్నార’ని రాశాడు. అయితే 1934లో ట్రోఫీ అందుకున్న తర్వాత ప్రముఖ ప్రొడ్యూసర్ వాల్టర్ ఎలియాస్ డిస్నీ(వాల్ట్ డిస్నీ) ఫస్ట్ టైం ‘ఆస్కార్’ అనే పదాన్ని స్టేజ్ మీద ఉపయోగించడం కొసమెరుపు. అకాడమీ మోషన్ పిక్చర్స్ అవార్డులకు ‘ఆస్కార్’ అనే ట్రేడ్ మార్క్ ఉంది. అయితే ఇటలీలో ఏ రంగంలో అవార్డులు ఇచ్చినా ఆస్కార్ అనే పిలుస్తుంటారు. 2020.. వరస్ట్! 1930లో ఆస్కార్ వేడుకల ఈవెంట్‌ను రేడియోలో బ్రాడ్కాస్ట్ చేశారు. 1953 నుంచి టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఆర్కీవ్స్ మాత్రం 1949 నుంచి భద్రపరుస్తున్నారు. రీల్, వీడియో, డిజిటల్ కాపీలుగా వాటిని భద్రపరిచారు. వేదికలు.. మారుతూ వస్తున్నాయి. కొడాక్ థియేటర్.. డాల్బీ థియేట్లో జరుగుతున్నాయి. అయితే 2018లో ఈవెంట్‌ను టెలికాస్ట్ చేయలేదు. కొన్ని ఆస్కార్ వేడుకల్లో.. బ్రేక్ టైంలో అవార్డులూ ఇచ్చారు. కొత్తగా కొన్ని కేటగిరీలను కలిపారు. రాను రాను కొన్ని కేటగిరీలను ఎత్తేశారు. వీటిపై విమర్శలు వచ్చాయి. అయినా అకాడమీ తగ్గడం లేదు. 1998 ఆస్కార్ విజేతలు అంతకు ముందు ఆస్కార్ అవార్డుల నామినేషన్ల ఫలితాల్ని ఫిబ్రవరి మొదటి వారంలో అనౌన్స్ చేసేవాళ్లు. 2004 నుంచి అకాడమీ అవార్డుల నామినేషన్ ఫలితాల్ని జనవరి మధ్యలోనే ప్రకటిస్తున్నారు. ఆస్కార్ వేడుకల టెలికాస్టింగ్‌కు సంబంధించి.. 1980 నుంచి టీఆర్పీని లెక్కిస్తున్నారు. హయ్యెస్ట్ టీఆర్పీ 1998లో వచ్చింది. 57 టీఆర్పీతో అస్కార్ చరిత్రలోనే రికార్డ్ నెలకొల్పింది. మరి లోయెస్ట్ టీఆర్ఫీ అంటారా? అది.. 2020లోనే రికార్డయ్యింది. ఫస్ట్ .. రీసెంట్ ప్రపంచంలోనే చాలాకాలం నుంచి జరుగుతున్న ఎంటర్టైన్మెంట్ అవార్డుల ఈవెంట్.. ఈ ‘అకాడమీ’(ఆస్కార్) అవార్డులు. మొదటి వేడుక ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జరిగింది. 1929, మే 16న లాస్ ఏంజెలెస్‌లోని హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్లో ప్రైవేట్ డిన్నర్ ఫంక్షన్ ఏర్పాటు చేసి అవార్డులను ఇచ్చారు. ఈ ఈవెంట్‌కు 270 మంది హాజరయ్యారు. అమెరికన్ యాక్టర్ డగ్లస్ ఫెయిర్‌బ్యాంక్ ఈ వేడుకలకు హోస్ట్‌గా వ్యవహరించాడు. 1927–28 మధ్య రిలీజ్ అయిన సినిమాలకు ఈ అవార్డులు దక్కాయి. అయితే ఈవెంట్‌ను కేవలం పదిహేను నిమిషాల్లోనే ముగించారు. మొత్తం పదిహేను ట్రోఫీలను ఇచ్చారు. మొదటి ఈవెంట్లో గెలిచినవాళ్ల పేర్లను మూడు నెలల ముందే మీడియాకు రిలీజ్ చేయడం విశేషం. ఈ రూల్‌ను రెండో ఆస్కార్ వేడుకలకు(1930) మార్చేశారు. అకాడమీ అవార్డుల మొదటి వేడుక అవార్డులిచ్చే రాత్రి విన్నర్ల పేర్ల లిస్ట్‌ను పేపర్ హౌజ్‌లకు పంపించేవాళ్లు. 1940 వరకు ఇదే జరిగింది. అయితే లాస్ఏంజెలెస్ టైమ్స్ వాళ్లు సరిగ్గా అవార్డు వేడుక జరిగే ముందే పేర్లను అనౌన్స్ చేసేది. ఇది చూసి అకాడమీ వాళ్లు సీల్డ్ కవలర్‌లో విన్నర్స్‌ను అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు జరగబోయే అవార్డుల వేడుక 94వది. మార్చి 27న 2022న కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో జరుగనుంది. భారత కాలమానం ప్రకారం.. మార్చి 28 సోమవారం ఉదయం ఐదుగంటలకు ఈ ఈవెంట్ మొదలవుతుంది. Disney+Hotstar App ద్వారా మన దేశంలో ఆస్కార్ వేడుకల్ని లైవ్‌గా వీక్షించొచ్చు. :::సాక్షి వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
ఆస్కార్... ఆశ్చర్యం
కోవిడ్ కారణంగా గత రెండు అస్కార్ అవార్డుల ప్రదానోత్సవాల్లో ఊహించినంత ఉత్సాహం కనబడలేదు. పైగా ఆస్కార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ రేటింగ్ కూడా పడిపోయింది. వీటికి తోడు ఈసారి ఆస్కార్ అవార్డుల్లోని 8 విభాగాలకు ముందుగానే అవార్డులు ఇచ్చి, ఆ ఫుటేజీని లైవ్ టెలికాస్ట్ రోజు ప్రదర్శించాలని ఆస్కార్ నిర్వాహకులు ఇటీవల ఓ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై మిశ్రమ స్పందన వస్తోంది. రేటింగ్‌ను పెంచడం, విమర్శలను తగ్గించుకోవడం కోసం ఆస్కార్ నిర్వాహకులు కొన్ని సర్ప్రైజ్లను ప్లాన్ చేశారట. ఇందులో భాగంగా క్లాసిక్ చిత్రాలను సెలబ్రేట్ చేయాలని నిర్ణయించుకున్నారు. ‘జేమ్స్‌బాండ్’ సిరీస్‌లోని తొలి సినిమా ‘డాక్టర్ నో’ (1962) విడుదలై 60 సంవత్సరాలు కావస్తోంది. అలాగే మరో హాలీవుడ్ సూపర్ డూపర్ హిట్ మూవీ ‘గాడ్ ఫాదర్’ (1972) చిత్రం యాభై సంవత్సరాలను పూర్తి చేసుకుంది. ఈ 94వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఈ రెండు చిత్రాలను సెలబ్రేట్ చేసే విధంగా ప్రత్యేకంగా ప్లాన్ చేసినట్లు ఆస్కార్ నిర్వాహకుల్లో ఒకరైన విల్ పాకర్ పేర్కొన్నారు. ఈ సర్ప్రైజెస్ ఏంటి? అనేవి మరో రెండు రోజుల్లో తెలుస్తుంది. ఈ నెల 27న లాస్ ఏంజిల్స్‌లో ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. -
Oscar 2022: ఆస్కార్స్ నుంచి జై భీం ఔట్!
-
జై భీమ్‌కు నిరాశ.. ఈ ఏడాది బరిలో ఉన్న చిత్రాలివే!
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 94వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ ఫిబ్రవరి 8 (మంగళవారం) వెల్లడయ్యాయి. ట్రెసీ ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ ఆస్కార్ నామినేషన్స్ ప్రకటనకు హోస్ట్స్‌గా వ్యవహరించారు. ఈ నామినేషన్స్‌లో ‘ద పవర్ ఆఫ్ ది డాగ్’ చిత్రం ఏకంగా 12 నామినేషన్లు దక్కించుకోగా, ‘డ్యూన్’ చిత్రం 10, ‘వెస్ట్ సైడ్ స్టోరీ’, ‘బెల్ఫాస్ట్’ చిత్రాలకు ఏడేసి చొప్పున నామినేషన్లు లభించాయి. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న ఈ నాలుగు చిత్రాలూ ఉత్తమ చిత్రం విభాగంలో ఉండటం విశేషం. అలా ఉత్తమ చిత్రం అవార్డు కోసం మొత్తం పది చిత్రాలు పోటీ పడుతున్నాయి. అయితే నామినేషన్స్ దక్కించుకున్న వారిలో ఫైనల్‌గా ఎవరు ఆస్కార్ ప్రతిమను సొంతం చేసుకుంటారో చూడాలంటే ఈ ఏడాది మార్చి వరకూ ఆగాల్సిందే. మార్చి 27న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. మన దేశం నుంచి ఢిల్లీకి చెందిన ఫిల్మ్‌మేకర్స్ రిటు థామస్, సుస్మిత్ ఘోష్ తీసిన ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకుంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. ఇప్పటికే పదిహేనుకు పైగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు సాధించిన ఈ డాక్యుమెంటరీ ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకుంటే బాగుంటుందన్నది భారత సినీ ప్రేమికుల అభిలాష. దర్శకురాలు జేన్ కాంపియన్ రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేటయ్యారు. ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ సినిమాకు సంబంధించి ఉత్తమ దర్శకురాలు, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నారు. ఈ ఫీట్ సాధించిన తొలి మహిళ కాంపియనే కావడం విశేషం. ∙డేమ్ జూడీ డెంచ్ (87) ‘బెల్ ఫాస్ట్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా నామినేషన్ దక్కించుకున్నారు. ఆస్కార్ చరిత్రలో నామినేషన్ దక్కించుకున్న అత్యధిక వయసు ఉన్న నటిగా జ్యూడీ డెంచ్ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు తన కెరీర్లో ఏడు భిన్నమైన విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుని రికార్డు సృష్టించారు కెన్నెత్ బ్రానాగ్. ఇంతకుముందు డైరెక్టర్, యాక్టర్, సపోర్టింగ్ యాక్టర్, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్నారు కెన్నెత్. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ‘బెల్ఫాస్ట్’కి బెస్ట్ పిక్చర్, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో చోటు దక్కింది. దీంతో కెన్నెత్ బ్రానాగ్ ఏడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మొత్తం 23 విభాగాలకు సంబంధించిన నామినేషన్లను అవార్డు కమిటీ ప్రకటించింది. వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, నటి, నటీమణి నామినేషన్లు ఈ విధంగా... ఉత్తమ చిత్రం: బెల్ ఫాస్ట్, కోడా, డోన్ట్ లాకప్, డ్రైవ్ మై కార్, డ్యూన్, కింగ్ రిచర్డ్, లికోరైస్ పిజా, నైట్మేర్ అల్లీ. ది పవర్ ఆఫ్ ది డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ ఉత్తమ దర్శకుడు: జాన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్), పాల్ థామస్ ఆండ్రూసన్ (లికోరైస్ పిజ్జా), స్టీవెన్ స్పీల్బర్గ్ (వెస్ట్ సైడ్ స్టోరీ), ర్యూసుకీ హమగుచి (డ్రైవ్ మై కార్), కెన్నెత్ బ్రానాగ్ (బెల్ఫాస్ట్) ఉత్తమ నటుడు: ఆండ్రూ గార్ఫీల్డ్ (టిక్, టిక్ ... బూమ్), విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ (ది పవర్ ఆఫ్ ది డాగ్), డెంజిల్ వాషింగ్టన్ (ది ట్రాజెడీ ఆఫ్ మెక్బెత్), జేవియర్ బార్డెమ్ (బీయింగ్ ది రికార్డోస్) ఉత్తమ నటి: నికోల్ కిడ్‌మెన్ (బీయింగ్ ది రికార్డోస్), ఓలీవియా కోల్మన్ (ది లాస్ట్ డాటర్), క్రిస్టెన్ స్టీవర్ట్ (స్పెన్సర్), జెస్సికా కాస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయీ), పెనెలోప్ క్రజ్ (సమాంతర తల్లులు) మళ్లీ నిరాశ బెస్ట్ ‘ఫీచర్ ఫిల్మ్స్ ఇన్ కన్సిడరేషన్ ఫర్ 94 ఆస్కార్ అవార్డ్స్’ అంటూ కొన్ని రోజుల క్రితం నామినేషన్ ఎంట్రీ పోటీలో ఆస్కార్ ఆకాడమీ ప్రకటించిన 276 చిత్రాల్లో తమిళ ‘ౖజై భీమ్’, మలయాళ ‘మరక్కర్: అరబికడలింటే సింహమ్’ చిత్రాలు చోటు దక్కించుకోగలిగాయి. కానీ ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో మాత్రం ఈ చిత్రాలకు నిరాశ తప్పలేదు. కానీ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ ప్రకటించడానికి ముందు సోషల్ మీడియా, నెట్టింట్లో కాస్త డ్రామా నడిచింది. ‘ఆస్కార్ నామినేషన్స్ ఎవరికి దక్కుతాయి’ అనే చర్చలో భాగంగా అమెరికాకు చెందిన ఓ వెబ్సైట్ ఎడిటర్ జాక్వెలిన్ కోలే చేసిన ట్వీట్ వైరల్ అయింది. ‘జై భీమ్’ చిత్రానికి నామినేషన్ దక్కుతుంది. నన్ను నమ్మండి’ అంటూ జాక్వెలిన్ ట్వీట్ చేశారు. దీంతో ‘జై భీమ్’కు ఆస్కార్ నామినేషన్ దక్కుతుందా? అనే చర్చ జోరుగా నెట్టింట్లో సాగింది. -
ఆస్కార్‌కు నామినేట్ అయిన జై భీమ్, మరక్కార్ చిత్రాలు
Suriya Jai Bhim And Mohanlal Marakkar Nominated For Oscars 2022: ప్రతిష్టాత్మకమైన 94వ ఆస్కార్ అవార్డుల రేసులో రెండు భారతీయ చిత్రాలు నామినేట్ అయ్యాయి. అందులో ఒకటి సూర్య నటించిన 'జై భీమ్' చిత్రం కాగా, మరోకటి మోహన్ లాల్ నటించిన 'మరక్కార్' చిత్రం. ఆస్కార్ రేసులో మొత్తం 276 సినిమాలు షార్ట్ లిస్ట్ అవగా అందులో రెండు ఇండియన్ సినిమాలు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ రెండూ సౌత్ ఇండస్ట్రీకి చెందినవే కావడం విశేషం. గతేడాది అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన జై భీమ్ 'జై భీమ్' చిత్రానికి విమర్శకుల ప్రశంసలు దక్కాయి. జస్టిస్ చంద్రు జీవిత కథతో పాటు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందిన ఈ చిత్రానికి టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వం వహించారు. ఇక మలయాళ స్టార్ మోహన్‌లాల్ నటించిన మరక్కార్ చిత్రానికి ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు. చారిత్రక కథాంశంతో ఈ చిత్రం రూపొందింది.ఇక ఆయా కేటగిరీలకు చెందిన ఫైనల్ నామినేషన్లను ఆస్కార్ కమిటీ ఫిబ్రవరి 8న ప్రకటించనుంది. అవార్డుల వేడుక మార్చి27న అమెరికాలో జరగనుంది. -
ఆస్కార్ బరిలో జేమ్స్ బాండ్.. 4 విభాగాలకు నామినేట్
No Time To Die Movie In Oscar 2022 With 4 Categories: హాలీవుడ్ యాక్షన్ చిత్రాలకు సంబంధించి అత్యంత ఆదరణ పొందిన చిత్రాల్లో ముందుగా ఉండేది జేమ్స్ బాండ్ సినిమాలు. బాండ్.. జేమ్స్ బాండ్.. అనే ఈ ఒక్క డైలాగ్ చాలు బాండ్ అభిమానులను విజిల్స్ వేయించడానికి. ఈ మూవీ ఫ్రాంచైజీకి వరల్డ్ వైడ్‌గా కోట్లలో అభిమానులు ఉన్నారు. అంతలా ఈ మూవీ సిరీస్ తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ను క్రియేట్ చేసుకుంది. అందులో బాండ్ చేసే యాక్షన్ సీన్స్, ఉపయోగించే గ్యాడ్జెట్స్ ప్రేక్షకులను, అభిమానులను అబ్బురపరుస్తాయి. అంతేకాదు ఈ ఐకానిక్ స్పై థ్రిల్లర్ ఫ్రాంచైజీలో నటించేందుకు ప్రముఖ హాలీవుడ్ హీరోలు సైతం ఆసక్తి చూపుతారు. ఇప్పటి వరకూ ఈ సిరీస్‌లో మొత్తం 25 సినిమాలు రాగా ఏడుగురు హీరోలు బాండ్‌గా అలరించారు. అయితే రీసెంట్గా వచ్చిన జేమ్స్ బాండ్ చిత్రం 'నో టైమ్ టూ డై'లో హీరోగా చేసిన డేనియల్ క్రేగ్‌కి బాండ్‌గా చివరి సినిమా. ప్రపంచవ్యాప్తంగా 30 సెప్టెంబర్ 2021న విడుదలైన ఈ సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టింది. ఇదిలా ఉంటే ఇటీవల 94వ ఆస్కార్ అవార్డుల విభాగాలను కుదించి 10కి నిర్ణయించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఇందులో నాలుగు విభాగాల్లో 'నో టైమ్ టు డై' చిత్రం నామినేట్ అయింది. ఆస్కార్ బరిలో నిలిచిన 10 కేటగిరీల్లో నాలుగింటికి ఒకే సినిమా ఎంపిక కావడం విశేషం. ఆ నాలుగు విభాగాలు 1. మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ 2. మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) 3. మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్-చిత్రం టైటిల్ సాంగ్) 4. సౌండ్. అయితే ఈ నాలుగింటిలో 'నో టైమ్ టు డై' సినిమా ఎన్ని ఆస్కార్లు కొల్లగొడుతుందో చూడాలి. సినిమా ప్రత్యేకతలు: తొలిసారిగా ఈ చిత్రం కోసం ఒక అమెరికన్ డైరెక్టర్ దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారు. బీస్ట్ ఆప్ నో నేషన్తో హాలీవుడ్ చిత్ర పరిశ్రమను ఆకర్షించిన కారీ జోజి ఈ సినిమాకు డైరెక్టర్. అలాగే ఈ సినిమా సంగీత దర్శకుడు హన్స్ జిమ్మర్ కూడా బాండ్ చిత్రాలకు తొలిసారిగా పనిచేశారు. ఈయన 'ఇన్సెప్షన్', 'ది డార్క్ నైట్', 'గ్లాడియేటర్', 'లయన్ కింగ్' వంటి చిత్రాలకు నేపథ్య సంగీతం అందించారు. బాండ్ చిత్రాల్లో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అంశం టైటిల్ సాంగ్. ఈ సాంగ్‌పై ప్రతీ బాండ్ చిత్రానికి భారీ అంచనాలుంటాయి. వాటికి ఎక్కడా తగ్కకుండా 'నో టైమ్ టు డై' ఒరిజినల్ సాంగ్ అదరగొట్టింది. ఈ పాటను 18 ఏళ్ల యువ సంగీత సంచలనం బిల్లీ ఐలిష్ పాడటం విశేషం. బాండ్ సినిమాకు టైటిల్ సాంగ్ పాడిన అతిపిన్న వయస్కురాలిగా బిల్లీ రికార్డు సృష్టించింది. అలాగే 'స్పెక్టర్' సినిమాకు సామ్ స్మిత్ పాడిన 'రైటింగ్ ఆన్ ది వాల్' సాంగ్‌కి మంచి ఆదరణ లభించింది. హాలీవుడ్ ప్రేమకథా చిత్రం 'లాలా ల్యాండ్'తో ఆస్కార్ గెలుచుకున్న ప్రముఖ సినిమాటోగ్రాఫర్ 'లైనస్ సాండ్‌గ్రెన్' ఈ సినిమాకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. Presenting the 94th #Oscars shortlists in 10 award categories: https://t.co/BjKbvWtXgg pic.twitter.com/YtjQzf9Ufx — The Academy (@TheAcademy) December 21, 2021 ఇదీ చదవండి: తనకు తానే పోటీ.. ఆస్కార్ బరిలో ఏకంగా 4 మార్వెల్ చిత్రాలు -
తనకు తానే పోటీ.. ఆస్కార్ బరిలో ఏకంగా 4 మార్వెల్ చిత్రాలు
4 MCU Movies In Oscar Shortlist Under Visual Effects Category: మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (MCU) హాలీవుడల్ చిత్రాల నిర్మాణ సంస్థ అంటే అంతగా అందరికి తెలియకపోవచ్చు. కానీ ఐరన్ మ్యాన్ సిరీస్, కెప్టెన్ అమెరికా, ది అవెంజర్స్, ఎండ్ గేమ్ చిత్రాలంటే మాత్రం తెలియని వారుండరు. ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందాయి ఈ సినిమాలు. అయితే ఈ సినిమాలన్నింటిన్నీ నిర్మించిందే మార్వెల్ సంస్థ. హై బడ్జెట్లో విజువల్ వండర్స్‌తో అద్భుతాలు సృష్టించడంలో ఎక్కడా రాజీ పడలేదు ఈ సంస్థ. తాజాగా ఈ సంస్థ నిర్మించిన సూపర్ హీరో మూవీ 'స్పైడర్ మ్యాన్: నో వే హోమ్' డిసెంబర్ 16 (ఇండియాలో)న విడుదలై కలెక్షెన్లతో దూసుకుపోతోంది. ఇదిలా ఉంటే ఇటీవల 94వ ఆస్కార్ అవార్డుల విభాగాలను కుదించి 10కి నిర్ణయించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఆ జాబితాలో విజువల్ ఎఫెక్ట్స్ ఒకటి. ఈ జాబితా ప్రకారం మార్వెల్ చరిత్ర సృష్టించే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఈ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలో ఉన్న 4 సినిమాలు మార్వెల్ సంస్థ నిర్మించినవే. ఈ కేటగిరీలో మొత్తంగా షార్ట్ లిస్ట్ చేసిన 10 చిత్రాల్లో ఏకంగా 4 సినిమాలు మార్వెల్ సంస్థకు సంబంధించినవి ఉండటం విశేషం. అవి 1. బ్లాక్ విడో 2. ఎటర్నల్స్ 3. షాంగ్ చి అండ్ ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ 4. స్పైడర్ మ్యాన్: నో వే హోమ్. అంటే విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో తనకు తానే పోటీ పడనుంది మార్వెల్ సంస్థ. Presenting the 94th #Oscars shortlists in 10 award categories: https://t.co/BjKbvWtXgg pic.twitter.com/YtjQzf9Ufx — The Academy (@TheAcademy) December 21, 2021 అయితే ఇప్పటివరకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి ఆస్కార్ పొందిన చిత్రం 'బ్లాక్ పాంథర్' ఒక్కటే. 2018లో వచ్చిన ఈ సినిమా మూడు ఆస్కార్లను గెలుచుకుంది. రేన్ కూగ్లర్ తెరకెక్కించిన ఈ సినిమా బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్, బెస్ట్ ఒరిజినల్ స్కోర్, బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ విభాగాల్లో ఆస్కార్‌ను చేజిక్కిచ్చుకుంది. సాంకేతిక విభాగంలో 2010 సంవత్సరానికి గాను ఐరన్ మ్యాన్ 2, 2012కు గాను ది అవేంజర్స్ సినిమాలు అకాడమీ అవార్డ్స్‌కు నామినేట్ అయ్యాయి. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో 2014కు సంవత్సరానికి గాను ఎంసీయూ చిత్రం 'గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ', 'కెప్టెన్ అమెరికా: ది వింటర్ సోల్జర్' సినిమాలు చివరిసారిగా నామినేట్ అయ్యాయి. మరీ ఈసారి విజువల్ ఎఫెక్ట్స్‌కు నామినేట్ అయిన మార్వెల్ 4 చిత్రాలు ఆస్కార్‌ను సాధిస్తాయో చూడాలంటే ఫిబ్రవరి వరకు ఆగాల్సిందే. ఇదీ చదవండి: ఆస్కార్ అవార్డ్స్: తుది జాబితాలో నిలిచిన 10 విభాగాలు ఇవే.. -
Oscar Nomination 2022: ఆస్కార్ బరిలో దళిత మహిళా జర్నలిస్టులు
‘రైటింగ్ విత్ ఫైర్’.... ఆస్కార్ 2022 బరిలోమన దేశం నుంచి షార్ట్ లిస్ట్ అయిన బెస్ట్ డాక్యుమెంటరీ మూవీ. అందరూ దళిత మహిళా జర్నలిస్టులు నడుపుతున్న ‘ఖబర్ లెహరియా’ న్యూస్‌పేపర్ (వీక్లీ) గురించి, దాని డిజిటల్ వార్తల గురించి తయారు చేసిన డాక్యుమెంటరీ ఇది. 25 మంది దళిత మహిళా జర్నలిస్టులు ఉత్తర ప్రదేశ్, బుందేల్‌ఖండ్, మధ్యప్రదేశ్‌లలో గ్రామీణ వార్తలను స్త్రీ దృక్కోణంలో అందించడమే ఇక్కడున్న విశేషం. ఆస్కార్ సాధించే సత్తా ఈ డాక్యుమెంటరీకి ఉంది అని భావిస్తున్నారు. ‘మా ప్రాంతంలో దళిత మహిళలు జర్నలిజం గురించి ఆలోచించడం చాలా పెద్ద విషయం. అసలు ఆ పని తాము కూడా చేయొచ్చని వాళ్లు అనుకోరు. కాని ఈ ఇరవై ఏళ్లలో వారిలోని ఆ న్యూనతను చాలా వరకు తీసేశాం’ అంటారు ‘ఖబర్ లహరియా’ మహిళా జర్నలిస్టులు. 2002లో ‘ఖబర్ లహరియా’ వారపత్రిక చిత్రకూట్ (బుందేల్ ఖండ్)లో మొదలైంది. అప్పుడు 6 మంది దళిత మహిళా జర్నలిస్టులు పని చేయడం మొదలెట్టారు. ఇవాళ 25 మంది పని చేస్తున్నారు. ఆ ఆరు మంది ఈ 25 మందిగా ఎలా మారారో... హిందీ, భోజ్‌పురి, బుందేలి, అవధి భాషల్లో వారపత్రికను ఎలా నడిపారో, ఆ తర్వాత సెల్ఫోన్లను కెమెరాలుగా వాడుతూ డిజిటల్ మీడియాలోకి తమ వార్తలను ఎలా అందించసాగారో ఇదంతా అద్భుతంగా చెప్పిన డాక్యుమెంటరీ ‘రైటింగ్ విత్ ఫైర్’. దర్శకురాలు రింతు థామస్ మరో దర్శకుడు సుస్మిత్ ఘోష్‌తో కలిసి ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించింది. వచ్చే మార్చి 27న లాస్ ఏంజలిస్‌లో జరిగే ఆస్కార్ వేడుకలో పోటీకి నిలవడానికి ఈ డాక్యుమెంటరీ అడుగు దూరంలో ఉంది. 2022 సంవత్సరానికి ఆస్కార్ కమిటీ అధికారికంగా ప్రకటించిన డాక్యుమెంటరీల షార్ట్‌లిస్ట్‌లోని 15 చిత్రాలలో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఒకటిగా ఎంపికైంది. ఈ షార్ట్‌లిస్ట్ కోసం ప్రపంచ దేశాల నుంచి 138 డాక్యుమెంటరీలు పోటీ పడ్డాయి. వాటి నుంచి 15 షార్ట్‌లిస్ట్‌లోకి వచ్చాయి. ఈ 15 నుంచి మూడో నాలుగో అంతిమ నామినేషన్స్‌గా నిలవడానికి జనవరి 27 నుంచి ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న అంతిమ నామినేషన్స్ ప్రకటిస్తారు. ఆ నామినేషన్స్‌లో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఉంటే ఆస్కార్ వేడుకలో అదృష్టం పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ‘లగాన్’, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రాల తర్వాత ఆస్కార్ వేడుకలో భారతీయుల పేర్లు వినిపించలేదు. ఈసారి ఫైనల్ నామినేషన్స్‌కు వెళుతుందని భావించిన తమిళ చిత్రం, భారతదేశ అఫీషియల్ ఎంట్రీ ‘కూడంగళ్’ షార్ట్‌లిస్ట్‌లో నిలువలేదు. కాని ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ విభాగంలో నిలిచి ఆశలు రేపుతోంది. ఈ డాక్యుమెంటరీ దేని గురించి? ఢిల్లీలో ఉన్న ‘నిరంతర్‘ అనే ఎన్జిఓ ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్ నుంచి ప్రయోగాత్మకంగా మొదలెట్టిన వారపత్రిక ‘ఖబర్ లహరియా’. పెద్దగా చదువు రాకపోయినా, జర్నలిజం తెలియకపోయినా దళిత మహిళలు తమ ప్రాంత వార్తలను ఎలా చూస్తారో, వాళ్లు చూసిన పద్ధతిలో అచ్చు వేసి పాఠకుల వద్దకు తీసుకువెళ్లడం ఈ పత్రిక ఉద్దేశం. అంతే కాదు... జర్నలిజంకు దూరంగా ఉన్న దళిత మహిళలు కూడా సమర్థంగా వార్తా పత్రికలను నడపగలరని చూపడమూ ఉద్దేశమే. ‘మాలో చాలామంది ఎలిమెంటరీ స్థాయి చదువు కూడా చదువుకోలేదు. ఇంగ్లిష్ అసలు రాదు. అయినా సరే పత్రికలో పని చేయడానికి రంగంలో దిగాం’ అంటుంది మీరా. ఈమె చీఫ్ రిపోర్టర్. ఈమె దృష్టికోణం నుంచే ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ ఉంటుంది. బుందేలి, అవధి వంటి స్థానిక భాషలలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్... ఈ మూడు రాష్ట్రాలలో ఈ పత్రికను అందేలా ఈ దళిత మహిళలు కార్యాచరణ చేశారు. ఈ పత్రిక అచ్చు పని, డిస్ట్రిబ్యూషన్, సర్క్యులేషన్ అంతా మహిళల బాధ్యతే. సవాళ్లు ఎన్నో... దళిత మహిళలు రిపోర్టర్లుగా మారడం ఒక విశేషం అయితే అంటరానితనం ఉన్న ప్రాంతాలలో కూడా వీరు దూసుకుపోవాల్సి రావడం మరో విశేషం. ‘చాలాచోట్ల మొదటగా కులం అడుగుతారు. నేను ఆ ప్రశ్న వేసిన వారి కులం అడుగుతాను. వారు ఏ కులం చెప్తే నేను కూడా ఆ కులమే అంటాను. పని జరగాలి కదా’ అని నవ్వుతుంది ఒక రిపోర్టర్. ‘ఖబర్ లహరియా’ ఎంత జనంలోకి వెళ్లిందంటే చీఫ్ రిపోర్టర్ మీరా భర్త ఒకరోజు ఇంటికి వచ్చి ఆమె మీద ఇంతెత్తున ఎగిరాడు. ‘నువ్వు బతకనిచ్చేలా లేవు’ అన్నాడు. దానికి కారణం ఆమె ఊళ్లోని గూండాల గురించి పత్రికలో రాయడమే. ‘ఇంకో సందర్భంలో అయితే స్త్రీలు పని మానేస్తారు. కాని నా వెనుక పత్రిక ఉందన్న ధైర్యం ఉంది. అందుకే నా భర్తతో నేనేం తప్పు చేయలేదు అని గట్టిగా వాదించాను’ అంటుంది మీరా. ఈ పత్రికకు పని చేస్తున్న దళిత మహిళా రిపోర్టర్లు ముఖ్యంగా పోలీసుల జులుం పైనా, దళితులపైన జరిగే దాష్టికాల పైనా, స్త్రీలపై పురుషుల పీడన పైన వార్తలు రాస్తుంటారు. ‘భయం వేయదా’ అని అడిగితే ‘భయంగానే ఉంటుంది. కాని అంతలోనే ధైర్యం చేస్తాం’ అంటారు వాళ్లు. సెల్ఫోన్లే కెమెరాలుగా పదిహేనేళ్ల పాటు ప్రింట్ ఎడిషన్‌ని నడిపిన ఈ మహిళలు మారిన కాలానికి తగినట్టుగా తాము మారాలని నిశ్చయించుకున్నారు. వార్తలను విజువల్ మీడియాగా జనానికి చూపాలనుకున్నారు. ‘మా అందరికీ ఫోన్లు ఎలా వాడాలో తెలియదు. కాని మారిన పరిస్థితులకు తగినట్టుగా మనం మారకపోతే ఆగిపోతాం’ అంటారు వాళ్లు. అందుకే సెల్‌ఫోన్‌ను కెమెరాగా ఎలా వాడాలో తెలుసుకున్నారు. వార్తలను ఫోన్లో బంధించి యూ ట్యూబ్‌లో బులెటిన్గా విడుదల చేయసాగారు. వారి యూ ట్యూబ్ చానల్‌కు ఐదున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ‘రైటింగ్ విత్ ఫైర్’కు ఆస్కార్ వస్తే ఈ దళిత మహిళలు ప్రపంచం అంతా చుట్టడం గ్యారంటీ. డాక్యుమెంటరీలోని ఓ దృశ్యం -
ఆస్కార్ అవార్డ్స్: తుది జాబితాలో నిలిచిన 10 విభాగాలు ఇవే..
94th Oscar Awards Announced Shortlists Of 10 Categories: సినిమాల్లో నటీనటులకు మంచి గుర్తింపు వచ్చేది వారి యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయినప్పుడు. లేదా సినిమాలు భారీగా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు. వీటితోపాటు నటీనటులను పలు అవార్డులు వరించినప్పుడు. అలా సినిమా అవార్డుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది 'ఆస్కార్'. ప్రతీ నటుడు, నటికి ఈ అవార్డు ఒక కలగా ఉంటుంది. అలాంటి ఆస్కార్ అవార్డుల మహోత్సవం త్వరలో జరగనుంది. ఈసారి నిర్వహించే 94వ అకాడమీ అవార్డులను ఫిబ్రవరి 1, 2022న ప్రకటించనున్నారు. అయితే ఈ అవార్డుల కోసం 10 విభాగాల వరకు కుదించారు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన తుది జాబితాను ప్రకటించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఈ తుది జాబితా ఎంపికైన చిత్రాలకు జనవరి 27, 2022 గురువారం నుంచి ఫిబ్రవరి 1, 2022 మంగళవారం వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. 1. ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) 94వ అకాడమీ అవార్డుల కోసం ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో 15 సినిమాలు తుది జాబితాలో ఉన్నాయి. ఈ కేటగిరీలో 138 సినిమాలు అర్హత సాధించాయి. ఈ షార్ట్ లిస్ట్, నామినీలను డాక్యుమెంటరీకి సంబంధించిన బ్రాంచ్ సభ్యులు నిర్ణయిస్తారు. 2. ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) ఈ కేటగిరీలో మొత్తం 82 సినిమాలు అర్హత సాధించగా.. 15 చిత్రాలు తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 3. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఈ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 92 దేశాలకు చెందిన సినిమాలు అర్హత సాధించాయి. అందులో భారతదేశం నుంచి ఎంపికైన హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ కలిసి నిర్మించిన కూళాంగల్ (అంతర్జాతీయంగా సినిమా పేరు 'పెబుల్స్') ఒకటి. తుదిజాబితాకు 15 సినిమాలు వెళ్లగా.. అందులో కూళాంగల్కు స్థానం దక్కలేదు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన సినిమాలు చూశాక ఓటింగ్ నిర్వహిస్తారు. 4. మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ఈ విభాగంలో 10 సినిమాలు తుదిజాబితాలో స్థానం సంపాదించాయి. అకాడమీ మేకప్ ఆర్టిస్ట్స్, హెయిర్ స్టైలిస్ట్‌ల బ్రాంచ్‌లోని సభ్యులందరూ జనవరి 30, 2022 ఆదివారం షార్ట్ లిస్ట్ చేసిన ప్రతి సినిమాను వీక్షించి నిర్ణయం తీసుకుంటారు. తర్వాత చివరి ఐదు చిత్రాలను నామినేట్ చేయడానికి బ్రాంచ్ సభ్యులు ఓటు వేస్తారు. 5. మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) ఇందులో 136 ఒరిజినల్ స్కోర్లు అర్హత సాధిచగా 15 షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఈ విభాగంలో కూడా బ్రాంచ్ సభ్యులు ఓటు వేస్తారు. 6. మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్) ఇందులో 84 పాటలు అర్హత సాధించగా 15 పాటలు తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 7. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ ఈ కేటగిరీలో 82 సినిమాలకు 15 చిత్రాలు తుది జాబితాకు వెళ్లాయి. 8. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్ ఈ ఉత్త లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్ విభాగంలో 145 సినిమాలు అర్హత సాధించగా.. 15 చిత్రాలు షార్ట్ లిస్ట్‌లోకి వెళ్లాయి. షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ యానిమేషన్ సభ్యులు, దర్శకులు, నిర్మాతలు, రచయితల శాఖల సభ్యులు షార్ట్‌లిస్ట్, నామినీలను నిర్ణయించడానికి ఓటు వేస్తారు. 9. సౌండ్ ఈ విభాగంలో 94వ అకాడమీ అవార్డుల కోసం 10 సినిమాలు ఫైనల్ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ జాబితాలోని చిత్రాలను బ్రాంచ్ సభ్యులు జనవరి 28, 2022 శుక్రవారం వీక్షించి చివరిగా 5 సినిమాలను నామినేట్ చేసేందుకు ఓటు వేస్తారు. 10. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ఈ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో 10 చిత్రాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్ బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ షార్ట్‌లిస్ట్‌ను నిర్ణయించింది. విజువల్ ఎఫెక్ట్స్ బ్రాంచ్‌లోని సభ్యులందరూ జనవరి 29, 2022 శనివారం నాడు షార్ట్‌లిస్ట్ చేయబడిన ప్రతి సినిమా నుంచి 10 నిమిషాల సారాంశాన్ని వీక్షిస్తారు. అనంతరం ఆస్కార్ నామినేషన్‌కు 5 సినిమాలను ఎంపిక చేసేందుకు ఓటు వేస్తారు.