Oscar Winners 2022: 94th Academy Awards Winners And Nominees List, Full Details In Telugu - Sakshi
Sakshi News home page

Oscar Winners 2022: ఆస్కార్‌ విజేతలు వీళ్లే, భారత డాక్యుమెంటరీకి నిరాశ

Published Mon, Mar 28 2022 9:19 AM | Last Updated on Tue, Mar 29 2022 9:05 AM

Oscars Winners 2022: Complete Winners List For The 94th Academy Awards - Sakshi

Oscars 2022 Complete Winners List: ఆనందం, ఆగ్రహం, ఆవేదన... ఇవి వ్యక్తపరచడానికి మాటలే అక్కర్లేదు. సైగలు చాలు.. ఆ సైగలే మనసుకి హత్తుకుంటాయి. అలా ఆస్కార్‌ అవార్డ్‌ కమిటీని ‘మూగ మనసులు’  మెప్పించాయి. అందుకే ‘కోడా’ని ఉత్తమ చిత్రంగా ప్రకటించింది. ఈ సినిమాలో ఒక్క పాత్రధారి తప్ప మిగతా అన్ని పాత్రలనూ ‘డిఫరెంట్లీ ఏబుల్డ్‌’ యాక్టర్స్‌ చేయడం విశేషం. ఈసారి కూడా బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డును లేడీ డైరెక్టర్‌ అందుకోవడం మరో విశేషం. అలనాటి ‘క్యాబరే’ మూవీ ఫేమ్‌ లిజా మిన్నెలీ ఎంట్రీకి స్టాండింగ్‌ ఒవేషన్‌ దక్కడం ఇంకో విశేషం. ఇలా ఎన్నో ఆనందాల మధ్య చిన్న చేదు అనుభవంలా క్రిస్‌ రాక్‌ చెంపను విల్‌ స్మిత్‌ చెళ్లుమనిపించడం గమనార్హం. భారతీయ కాలమానం ప్రకారం సోమవారం (మార్చి 28) 94వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో జరిగింది. ఆ విశేషాలు తెలుసుకుందాం. 


కోవిడ్‌ కారణంగా రెండేళ్లుగా (2020, 2021) పెద్దగా సందడి లేకుండా జరిగిన ఆస్కార్‌ అవార్డుల వేడుక ఈసారి కోలాహలంగా జరిగింది. ఉత్తమ చిత్రంగా ‘కోడా’ అవార్డును గెలుచుకోగా, ఉత్తమ నటుడిగా ‘కింగ్‌ రిచర్డ్స్‌’ సినిమాకి విల్‌ స్మిత్‌ , ఉత్తమ దర్శకురాలిగా ‘ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’కి జెయిన్‌ కాంపియన్‌ ఆస్కార్‌ను అందుకున్నారు. నామినేట్‌ అయిన మూడు విభాగాల్లోనూ (బెస్ట్‌ పిక్చర్, బెస్ట్‌ అడాపె్టడ్‌ స్క్రీన్‌ ప్లే, బెస్ట్‌ సపోరి్టంగ్‌ యాక్టర్‌) ‘కోడా’ చిత్రం అవార్డులను దక్కించుకోవడం విశేషం.

ఇక 12 ఆస్కార్‌ నామినేషన్స్‌ను దక్కించుకున్న ‘ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’ కేవలం ఒకే ఒక్క (బెస్ట్‌ డైరెక్టర్‌ కేటగిరీ) అవార్డుతో సరిపెట్టుకుంది. పది నామినేషన్లు దక్కించుకున్న ‘డ్యూన్‌’ చిత్రం ఆరు ఆస్కార్‌ అవార్డులను చేజిక్కించు కుంది. మరోవైపు బెస్ట్‌ ఫారిన్‌ ఫిల్మ్‌గా జపాన్‌ ఫిల్మ్‌ ‘డ్రైవ్‌ మై కార్‌’ నిలిచింది. కాగా ‘బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫీచర్‌ ఫిల్మ్‌’ విభాగంలో మన దేశం నుంచి రింటూ థామస్‌ దర్శకత్వం వహించిన ‘రైటింగ్‌ విత్‌ ఫైర్‌’ నామినేషన్‌ దక్కించుకున్నా ఆస్కార్‌ తేలేక పోయింది. ఈ విభాగంలో ‘సమ్మర్‌ ఆఫ్‌ సోల్‌’ అవార్డు దక్కించుకుంది. అవార్డు వేడుక నిడివి తగ్గించే క్రమంలో ముందు ప్రకటించినట్లుగానే ఎనిమిది విభాగా (మానిమేటెడ్‌ షార్ట్‌ ఫిల్మ్, డాక్యుమెంటరీ షార్ట్‌ సబ్జెక్ట్, ఫిల్మ్‌ ఎడిటింగ్, లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిల్మ్, మేకప్‌ అండ్‌ హెయిర్‌ స్టయిల్, ఒరిజినల్‌ స్కోర్, ప్రొడక్షన్‌ డిజైన్‌ అండ్‌ సౌండ్‌)లకు చెందిన అవార్డులను ముందే అందజేసి, లైవ్‌ టెలికాస్ట్‌లో చూపించారు. ఇక ఎప్పటిలానే ఎర్ర తివాచీపై అందాల భామలు క్యాట్‌ వాక్‌ చేసి ఆకట్టుకున్నారు.   

 వీల్‌ చైర్‌లో స్టార్‌ డాన్సర్‌ 
‘క్యాబరే’ మూవీ ఫేమ్‌ లిజా మిన్నెలీ ఉత్తమ చిత్రం అవార్డును నటి, గాయని లేడీ గాగాతో కలసి ప్రకటించారు. 50 ఏళ్ల క్రితం ‘క్యాబరే’ మూవీకి ఉత్తమ నటిగా ఆస్కార్‌ అందుకున్నారు లిజా. ప్రస్తుతం వీల్‌ చైర్‌లో ఉన్న ఆమెను వేదిక మీదకు తీసుకొచ్చారు లేడీ గాగ. ‘‘క్యాబరే’ 50 ఏళ్ల వార్షికోత్సవం జరుపుకుంటోంది. లెజెండ్స్‌తో కలసి పని చేయడం నాకెంత ఇష్టమో మీకు తెలుసా?’’ అంటూ లిజా భుజం మీద గాగ చేయి వేయగా, ‘ఓ బేబీ..’ అన్నారు లిజా. ఇద్దరూ కలిసి ఉత్తమ చిత్రంగా ‘కోడా’ని ప్రకటించారు. వేడుక ప్రాంగణంలో ఉన్న అందరూ లిజాకు మర్యాదపూర్వకంగా నిలబడి చప్పట్లు కొట్టారు. కాగా ఒకప్పుడు తన నటనతో అలరించిన లిజా అనారోగ్య సమస్య వల్ల కొన్నేళ్లుగా వీల్‌ చెయిర్‌కే పరిమితమయ్యారు.

 ఈసారీ మహిళా దర్శకురాలే... 
 ‘ది హార్ట్‌ లాకర్‌’ సినిమాకు గాను 2010లో దర్శకత్వ విభాగంలో తొలిసారి అవార్డు అందుకున్న డైరెక్టర్‌గా క్యాథరిన్‌ బిగెలో రికార్డ్‌లో ఉన్నారు. గత ఏడాది (2021) దర్శకత్వ విభాగంలో ‘నొమాడ్‌ ల్యాండ్‌’ చిత్రానికిగాను దర్శకురాలు క్లోవ్‌ జావో అవార్డును అందుకోగా ఈసారి కూడా ఈ విభాగంలో మహిళకే అవార్డు దక్కడం విశేషం. ఈ ఏడాది ఉత్తమ దర్శకురాలిగా జెయిన్‌ కాంపియన్‌ ‘ది పవర్‌ ఆఫ్‌ ది డాగ్‌’ చిత్రానికిగాను ఆస్కార్‌ను సొంతం చేసుకున్నారు. ఆస్కార్‌ అందుకున్న మూడో లైడీ డైరెక్టర్‌ జెయిన్‌.  అయితే జెయిన్‌కు ఇది తొలి ఆస్కార్‌ కాదు. 1994లో వచి్చన ‘ది పియానో’ సినిమాకు బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ ప్లే విభాగంలో ఆమె తొలిసారి ఆస్కార్‌ అవార్డును అందుకున్నారు. అప్పుడు ఇదే సినిమాకు జెయిన్‌ కాంపియన్‌ ఉత్తమ దర్శకురాలిగా నామినేట్‌ అయినప్పటికీ ఆ ఏడాది ‘ష్లిండర్స్‌ లిస్ట్‌’ సినిమాకు  స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ ఆస్కార్‌ అవార్డును దక్కించుకున్నారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

ఆస్కార్‌ అవార్డును కైవం చేసుకుంది వీళ్లే..

► ఉత్తమ చిత్రం చైల్డ్‌ ఆఫ్‌ డెఫ్‌ అడల్ట్స్‌(CODA)
► ఉత్తమ నటుడు - విల్‌ స్మిత్‌ (కింగ్‌ రిచర్డ్‌)
► ఉత్తమ నటి -  జెస్సికా చస్టేన్‌ (ద ఐస్‌ ఆఫ్‌ టామీ ఫే)
► ఉత్తమ దర్శకురాలు - జేన్‌ కాంపియన్‌ (ది పవర్‌ ఆఫ్‌ ద డాగ్‌)
► ఉత్తమ సహాయ నటి - అరియానా దిబోస్‌ (వెస్ట్‌ సైడ్‌ స్టోరీ)
► ఉత్తమ సహాయ నటుడు - ట్రాయ్‌ కోట్సర్‌ (CODA)
► ఉత్తమ సినిమాటోగ్రఫీ - గ్రెగ్‌ ఫ్రెజర్‌ (డ్యూన్‌)
► బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ - నో టైమ్‌ టు డై
► బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫియేచర్‌ - సమ్మర్‌ ఆఫ్‌ సోల్‌
► బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే-  CODA (షాన్‌ హెడర్‌)
► బెస్ట్‌ ఒరిజినల్‌ స్క్రీన్‌ప్లే - బెల్‌ఫాస్ట్‌ (కెన్నత్‌ బ్రానా)

► బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైన్‌ - జెన్నీ బీవన్‌ (క్రూయెల్లా)
► బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫియేచర్‌ - డ్రైవ్‌ మై కార్‌ (జపాన్‌)
► బెస్ట్‌ యానిమేటెడ్‌ ఫియేచర్‌ - ఎన్‌కాంటో
► బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ - హన్స్‌ జిమ్మర్‌ (డ్యూన్‌)
► బెస్ట్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ - డ్యూన్‌ (పాల్‌ లాంబర్ట్‌, ట్రిస్టన్‌ మైల్స్‌, బ్రియన్‌ కానర్‌, గెర్డ్‌ నెఫ్‌జర్‌)
► బెస్ట్‌ ఫిలిం ఎడిటింగ్‌ - జో వాకర్‌ (డ్యూన్‌)


► బెస్ట్‌ సౌండ్‌ - డ్యూన్‌ (మాక్‌ రుత్‌, మార్క్‌ మాంగిని, థియో గ్రీన్‌, డగ్‌ హెంఫిల్‌, రాన్‌ బార్ట్‌లెట్‌)
► బెస్ట్‌ ప్రొడక్షన్‌ డిజైన్‌ - డ్యూన్‌ (ప్రొడక్షన్‌ డిజైన్‌- పాట్రైస్‌ వెర్మట్‌, సెట్‌ డెకరేషన్‌- జుజానా సిపోస్‌)
► బెస్ట్‌ మేకప్‌ అండ్‌ హెయిర్‌స్టైలింగ్‌ - ద ఐస్‌ ఆఫ్‌ ది టామీ ఫే (లిండా డౌడ్స్‌, స్టెఫనీ ఇన్‌గ్రామ్‌, జస్టిన్‌ రాలే)
► బెస్ట్‌ లైవ్‌ యాక్షన్‌ షార్ట్‌ ఫిలిం: ది లాంగ్‌ గుడ్‌బై
► బెస్ట్‌ యానిమేటెడ్‌ షార్ట్‌ ఫిలిం: ది విండ్‌షీల్డ్‌ పైపర్‌
► బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిలిం: ద క్వీన్‌ ఆఫ్‌ బాస్కెట్‌బాల్‌

చదవండి: Oscars 2022: ఆస్కార్‌.. వచ్చినా ఏం లాభం?

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement