Academy Ban On Will Smith For 10 Years: ఆస్కార్ అవార్డు గ్రహిత, హాలీవుడ్ స్టార్ హీరో విల్ స్మిత్‌పై నిషేధం వేటు పడింది. మోషన్ పిక్చర్ అకాడమీ విల్ స్మిత్‌పై చర్యలు తీసుకుంటూ అతడిపై 10 ఏళ్ల పాటు నిషేధం విధించినట్లు శుక్రవారం వెల్లడించింది. ఇది ఒక్క ఆస్కార్ అవార్డులకు మత్రమే కాదు మోషన్ పిక్చర్ నిర్వహించే ఇతర వేడుకలకు కూడా వర్తిస్తుందని స్పష్టం చేసింది. శుక్రవారం ఏప్రిల్ 8న సమావేశమైన అకాడమీ గవర్నర్ల బోర్డు ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. విల్ స్మిత్‌పై నిషేధం విధిస్తున్నట్లు అకాడమీ ప్రకటించిన అనంతరం విల్ స్మిత్ సోషల్ మీడియా వేదికగా స్పందించాడు.తాను అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లుగా పేర్కొన్నాడు.
చదవండి: వరుణ్ తేజ్ గని మూవీపై మంచు విష్ణు కామెంట్స్, ట్వీట్ వైరల్
ఇదిలా ఉంటే స్మిత్ ఇప్పటికే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్‌కు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా గత నెల నిర్వహించిన 94వ ఆస్కార్ అవార్డు వేడుకలో వ్యాఖ్యాతగా వ్యవహరించిన కమెడియన్ క్రిస్ రాక్‌ను విల్ స్మిత్ చెంప దెబ్బ కొట్టాడు. స్మిత్ భార్య జాడా పింకెట్‌కు ఉన్న వ్యాధిని ఉద్దేశించి అతడు జోక్ చేశాడు. దీంతో అగ్రహానికి లోనైన స్మిత్ స్టేజ్‌పైకి వెళ్లి క్రిస్ రాక్ చెంప చెల్లుమనిపించిన ఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment