Academy Will Take Action Against Will Smith Slap in Oscars - Sakshi
Sakshi News home page

Oscars 2022: ఆస్కార్‌ వేడుకల్లో కమెడియన్‌పై చెంపదెబ్బ.. విల్‌ స్మిత్‌పై చర్యలు !

Published Thu, Mar 31 2022 7:51 AM | Last Updated on Thu, Mar 31 2022 9:07 AM

Academy Will Take Action Against Will Smith Slap In Oscars - Sakshi

Academy Will Take Action Against Will Smith Slap In Oscars: 92వ అకాడమీ అవార్డుల (ఆస్కార్‌) ప్రదానోత్సవంలో జరిగిన చెంపదెబ్బ ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయం చెబుతున్నారు. ఇప్పుడు ఈ టాపిక్‌ హాట్‌ టాపిక్‌గా చర్చనీయాంశమైంది. అమెరికన్‌ కమెడియన్‌ క్రిస్‌ రాక్‌పై ఆస్కార్‌ విన్నర్‌, స్టార్‌ హీరో విల్‌ స్మిత్‌ చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో విల్‌ స్మిత్‌పై ఆస్కార్‌ అకాడమీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే విల్‌ స్మిత్‌పై చర్యలు తీసుకునే అవాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చదవండి: హీరో విల్‌ స్మిత్‌ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ?



అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్‌ ఆర్ట్స్‌ అండ్ సైన్సెస్‌ (ఏఎమ్‌పీఏఎస్‌) అధ్యక్షుడు డేవిడ్‌ రూబిన్‌ అకాడమీ సభ్యులకు తాజాగా ఓ లేఖ పంపారు. విల్‌ చేయి చేసుకోవడంపై అకాడమీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు అందులో తెలిపారు. 2021 సినీ రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన అనేక మంది వ్యక్తులను సత్కరించేందుకుగానూ ఆదివారం 94వ ఆస్కార్‌ వేడుకలు నిర్వహించాం. కానీ ఇలాంటి వేదికపై ఓ నామినీ ఆమోదయోగ్యం కానీ, హానికరమైన ప్రవర్తనతో మేము కలత చెందాం. విల్‌ స్మిత్‌ చేయి చేసుకోవడాన్ని మేము ఖండిస్తున్నాం. విల్‌ హద్దు మీరి ప్రవర్తించారు. నియమనింబంధనల్లో భాగంగా అకాడమీ గవర్నర్ల బోర్డు విల్‌ స్మిత్‌పై తగిన చర్యలు తీసుకోవాలి. అని అధ్యక్షుడు డేవిడ్‌ ఆ లేఖలో పేర్కొన్నారు. 
 


చదవండి: ఆస్కార్‌ వేడుకల్లో షాకింగ్‌ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement