academy awards
-
‘ఆహా గోదారి’కి నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డు
సాక్షి,హైదరాబాద్: ముంబై వేదికగా నిర్వహించిన నెక్సా స్ట్రీమింగ్ అకాడమీ అవార్డ్స్‌లో భాగంగా గేబో నెట్వర్క్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వరంలో నిర్మించిన ‘ఆహా గోదారి’ ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రంగా అవార్డు పొందింది. సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ అవార్డులను అందించారు. ఈ వేదికపై ఆహా ఏకంగా 13 అవార్డులను గెలుచుకుని దాని ప్రశస్తిని చాటుకుంది. హిందీతో పాటు ప్రాంతీయ భాషల్లో 48 విభాగాల్లో ఈ అవార్డుల వేడుక ఘనంగా జరిగింది. ‘అన్‌స్టాపబుల్ సీజన్–2’తో ఉత్తమ నాన్–ఫిక్షన్ ఒరిజినల్ స్పెషల్ షోగానే కాకుండా ‘ఆహా’ ఉత్తమ ప్రాంతీయ వేదికగా టైటిల్‌ను పొందింది. వ్యక్తిగత విభాగంలో ‘అన్యాస్ ట్యుటోరియల్’ చిత్రానికి గాను విజయ్ కె.చక్రవర్తి ఉత్తమ సినిమాటోగ్రాఫర్ (సిరీస్) అవార్డును, ‘ఆహా గోదారి’కి గోపవాఝల దివాకర్ ఉత్తమ డాక్యుమెంటరీ ఒరిజినల్‌గా, ‘న్యూసెన్స్’లో కిరణ్ మామెడి ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ (సిరీస్)గా, ‘భామకలాపం–1’లో ప్రియమణి రాజ్ ఉత్తమ నటిగా, ఇదే చిత్రానికి అభిమన్యు తడిమేటి ఉత్తమ కథా పురస్కారాన్ని, అన్యస్ ట్యుటోరియల్, భామాకలాపం–1 చిత్రాలకు నివేదిత సతీ‹Ù, శరణ్య ప్రదీప్‌లు ఉత్తమ సహాయ నటులుగా తదితర అవార్డులను ఆహా గెలుచుకుంది. బెస్ట్ రీజినల్ ప్లాట్ఫామ్గానూ ఆహా సీఈఓ రవికాంత్ సబ్నవిస్–2 అవార్డులను పొందారు. -
రాజమౌళి దంపతులకు ఆస్కార్ నుంచి ఆహ్వానం..
ఆస్కార్.. ఎంతోమంది కలలు గనే ఈ అవార్డు గతేడాది ఇండియన్ సినిమాను వరించింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలో నాటు నాటు పాటకు ఉత్తమ ఒరిజినల్ విభాగంలో అకాడమీ పురస్కారం లభించింది. అంతేగాక ఈ సినిమా టీమ్ సభ్యులైన జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి, చంద్రబోస్, సెంథిల్, సాబు శిరిల్ గతేడాది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఏమ్పీఏఎస్) లో సభ్యత్వం సాధించారు.ఇప్పుడు ఆ జాబితాలో రాజమౌళి దంపతులు చేరారు. దర్శకత్వ కేటగిరీలో జక్కన్న, కాస్ట్యూమ్ డిజైనర్ లిస్టులో ఆయన భార్య రమా రాజమౌళి అకాడమీలో చేరేందుకు ఆహ్వానం అందుకున్నారు. ఈ ఏడాది అకాడమీ.. 57 దేశాల నుంచి 487 మంది సభ్యులకు ఆహ్వానం పంపింది. వీరిలో భారత్ నుంచి రాజమౌళి దంపతులతో పాటు కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, బాలీవుడ్ నటి షబానా అజ్మీ, సినిమాటోగ్రాఫర్ రవి వర్మ, దర్శకనిర్మాత రీమా దాస్, నిర్మాత రితేశ్ సిద్వానీ తదితరులు ఉన్నారు. సినిమాల విషయానికొస్తే.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్‌బాబుతో ఓ సినిమా(#SSMB29) చేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే షూటింగ్ ప్రారంభించనున్నారు. View this post on Instagram A post shared by The Academy (@theacademy) చదవండి: ప్రియుడితో పెళ్లి.. ట్రోలర్స్‌కు కౌంటరిచ్చిన హీరోయిన్! -
ఇండియన్ లేడీ సినిమాటోగ్రాఫర్.. ఆస్కార్ రేంజ్ వరకు
గత కొన్నేళ్లుగా ఆస్కార్‌కి ఇండియన్ సినిమాలు ఆమడ దూరంలో ఉండేవి. కానీ 'ఆర్ఆర్ఆర్' మూవీ దీన్ని బ్రేక్ చేసింది. నాటు నాటు పాటతో అవార్డు గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అనంతరం పలు సినిమాలు కూడా ఆస్కార్ నామినేషన్స్ వరకు వెళ్లొస్తున్నాయి. వీటి సంగతి పక్కనబెడితే బెంగళూరుకు చెందిన లేడీ సినిమాటోగ్రాఫర్ ఇప్పుడు ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి ఎంపికైంది.(ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీల ఇంతలా మారిపోయిందేంటి?)బెంగళూరుకి చెందిన నేత్ర గురురాజ్.. ప్రస్తుతం లాజ్ ఏంజెల్స్‌లో ఉంటోంది. స్వతహాగా రైటర్, డ్యాన్సింగ్, డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ ఇలా చాలా విభాగాల్లో ప్రావీణ్యురాలైన నేత్ర.. కొన్నాళ్ల ముందు సినిమాటోగ్రఫీలో మాస్టర్స్ చేసేందుకు లాస్ ఏంజెల్స్ వెళ్లింది. రీసెంట్గా ఈమె తీసిన 'జాస్మిన్ ఫ్లవర్స్' షార్ట్ ఫిల్మ్.. పలు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో అవార్డులు గెలుచుకుంది.ఈ క్రమంలోనే నేత్ర.. ఇప్పుడు ఆస్కార్ అకాడమీ గోల్డ్ రైజింగ్ ప్రోగ్రామ్‌కి ఎంపికైంది. ప్రపంచం నలుమూల నుంచి ఈ ప్రోగ్రామ్‌కి సెలెక్ట్ అయిన యువ సినిమాటోగ్రాఫర్స్.. రెండు నెలల పాటు అకాడమీ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్స్ దగ్గర నుంచి మెలకువలు నేర్చుకుంటారు. ఇలాంటి దాని కోసం మన దేశానికి చెందిన అమ్మాయి ఎంపిక కావడం విశేషం.(ఇదీ చదవండి: డైరెక్టర్‌తో ప్రేమలో ఉన్న యంగ్ హీరోయిన్.. వీడియో వైరల్) -
ఆస్కార్ వేదికపై మరోసారి ఆర్ఆర్ఆర్.. అట్లుంది మరి మనతోని!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమా ఆర్ఆర్ఆర్. జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ మూవీ గతేడాది ఎన్నో రికార్డులను తిరగరాసింది. కలెక్షన్సే కాదు అంతకుమించి అన్నట్లు ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. నాటు నాటు పాట అయితే ఏకంగా హాలీవుడ్ గడ్డపై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను వశం చేసుకుంది. తాజాగా జరిగిన 96వ ఆస్కార్ వేడుకల్లోనూ మరోసారి ఆర్ఆర్ఆర్ పేరు మార్మోగిపోతోంది. నాటు నాటు విజువల్స్.. అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో సోమవారం (మార్చి 11) నాడు అకాడమీ అవార్డులను ప్రకటించారు. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు ప్రకటించే సమయానికి నాటు నాటు పాట విజువల్స్‌ను బ్యాగ్రౌండ్లో ప్లే చేశారు. ఓపక్క ఆ పాట ప్లే అవుతుండగా అరియానా గ్రాండే, సింతియా ఎరివో స్టేజీపైకి వచ్చి విజేతలను ప్రకటించారు. బార్బీ సినిమాలోని వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్? అనే పాటకుగానూ బిల్లీ ఈలిష్, ఫిన్నియాస్ ఓకోనల్ పురస్కారం అందుకోవాలని పిలిచారు. యాక్షన్ సీన్ కూడా.. ఇందుకు సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ ఎక్స్(ట్విటర్) వేదికగా షేర్ చేసింది. ఆస్కార్ గడ్డపై మరోసారి ఆర్ఆర్ఆర్ అంటూ క్యాప్షన్ జోడించింది. అక్కడ నాటు నాటు పాట మాత్రమే కాకుండా సదరు మూవీలోని ఓ యాక్షన్ సీన్ కూడా ప్లే చేశారు. జీవితాన్ని రిస్క్ చేసే స్టంట్స్ మాస్టర్లకు సలాం కొడుతూ గొప్ప స్టంట్స్ సన్నివేశాల వీడియోను ఆస్కార్ వేదికపై ప్రదర్శించారు. అందులో హాలీవుడ్ చిత్రాలతో పాటు నాటు నాటులోని క్లైమాక్స్ సీన్ కూడా చోటు దక్కించుకుంది. ఇది చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఆర్ఆర్ఆర్ హవా ఇప్పటికీ ఏమాత్రం తగ్గలేదని, జక్కన్న సినిమా అంటే అట్లుంటదని కామెంట్లు చేస్తున్నారు. On the #Oscars stage again!! ❤️🔥❤️🔥❤️🔥 #RRRMovie pic.twitter.com/cbNgFzMt72 — RRR Movie (@RRRMovie) March 11, 2024 And again, a sweet surprise for us… 🔥🌊 Glad that @TheAcademy included #RRRMovie action sequences as part of their tribute to the world’s greatest stunt sequences in cinema. pic.twitter.com/TGkycNtF2I — RRR Movie (@RRRMovie) March 11, 2024 చదవండి: ఈసారి ఆ మూవీకే ఎక్కువ అవార్డ్స్.. పూర్తి లిస్ట్ ఇదే! -
అత్యధిక సంఖ్యలో ఆస్కార్లు గెలుచుకున్న టాప్ 10 నటులు
-
అంబారీ ఎక్కి ఆస్కార్ వచ్చింది.. తొలిసారి భారత డాక్యుమెంటరీకి..
‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ నిడివి 39 నిమిషాలు. రెండు ఏనుగు పిల్లలు, నీలగరి అడవుల్లో ఉండే ‘కట్టు నాయకర్’ అనే తెగకు చెందిన ఆదివాసీ భార్యాభర్తలు ఈ డాక్యుమెంటరీలో కనిపిస్తారు. ఆ భార్యాభర్తల పేర్లు బొమ్మన్, బెల్లి. ఏనుగు పిల్లల్లో ఒకదాని పేరు రఘు, మరోదాని పేరు అమ్ము. కరెంటు తీగలు తగిలి తల్లి ఏనుగులు మరణించడంతో బొమ్మన్, బెల్లిలు రఘుని, అమ్ముని సాకుతారు. అయితే డాక్యుమెంటరీలో ఎక్కువ భాగం రఘతో బొమ్మన్, బెల్లిలకు ఉండే అనుబంధం చూపుతుంది. అయితే నేపథ్యంలో అందమైన అడవులు, వాగులు, ఆదివాసీల క్రతువులు ఇవన్నీ దర్శకురాలు కార్తికి చూపడంతో డాక్యుమెంటరీకి ఒక సంపూర్ణత్వం వచ్చింది. బొమ్మన్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి. ఇప్పుడు రఘు, అమ్ములను అటవీ శాఖ వారు ‘ముడుమలై టైగర్ రిజర్వ్’కు మార్చారు. దాంతో రఘుతో ఆ దంపతుల బంధం తెగింది. విఘ్నాలు తొలగిపోయాయి. పూర్తిగా ఇండియాలో నిర్మితమైన డాక్యుమెంటరీకి తొలి ఆస్కార్ అందింది. ఇది స్త్రీల ద్వారా జరిగింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు దర్శకత్వం వహించింది కార్తికి గోంజాల్వేజ్. నిర్మించింది గునీత్ మోంగా. వీరికి ఈ అవార్డు రావడానికి కారణం రఘు అనే అనాథ ఏనుగు పిల్ల. ఆ ఏనుగు పిల్లను సాకిన ఆదివాసి దంపతులు. మనుషులకు అడవి జంతువులకు మధ్య ఉండే అనుబంధం ఈ డాక్యుమెంటరీలో ఎంతో అద్భుతంగా వ్యక్తమైంది. అందుకే అంబారీ ఎక్కి వచ్చినట్టుగా మనకు ఆస్కార్ ఘనంగా దక్కింది. ఏనుగులు– మావటీలు మన దేశంలో ఎప్పటి నుంచో ఉన్నారు. కాని వారి మధ్య ఉన్నది ఒక రకమైన ప్రొఫెషనల్ స్నేహం. కాని కొన్ని సందర్భాలలో అనాథలైన ఏనుగు పిల్లలను కాపాడే పని ఆదివాసీలు తీసుకుంటారు. వారిది పెంచిన మమకారం. ఆ మమకారమే ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ కథాంశం. దర్శకురాలు కార్తికీది ఊటి. అక్కడే పుట్టి పెరిగింది. ఊటీకి అరగంట ప్రయాణ దూరంలో ‘తెప్పకాడు ఎలిఫెంట్ క్యాంప్’ ఉంది. అక్కడ ఏనుగులను సంరక్షిస్తుంటారు. కార్తికి గోంజాల్వేజ్ చిన్నప్పటి నుంచి ఆ క్యాంప్‌కు వెళ్లి ఏనుగులను చూసేది. ఆ తర్వాత ఆమె పెరిగి పెద్దదయ్యి ఫొటోగ్రాఫర్‌గా మారినా, కెమెరా ఉమన్‌గా తనకున్న వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీ మీద ఇష్టం వల్ల యానిమల్ ప్లానెట్, డిస్కవరీ చానల్స్‌లో పని చేసినా ఎప్పుడూ తన ప్రాంత ఏనుగుల మీద ఏదైనా ఫిల్మ్ చేయాలని అనిపించలేదు. కాని 2017లో అందుకు బీజం పడింది. అతడు – ఆ ఏనుగు పిల్ల కార్తికి గోంజాల్వేజ్ 2017లో బెంగళూరు నుంచి కారులో ఊటీకి వెళుతోంది. ఊటీ చేరుకుంటూ ఉండగా ఒక మనిషి చిన్న ఏనుగు పిల్లను నడిపించుకుంటూ వెళుతూ ఆమె కంట పడ్డాడు. కార్తికి వెంటనే కారు ఆపి ఈ మనిషి ఈ ఏనుగు పిల్లను ఎక్కడకు తీసుకువెళుతున్నాడు అని వెంబడించింది. వారిద్దరూ దగ్గరిలోని ఏటికి వెళ్లారు. ఆ మనిషి ఆ ఏనుగు పిల్లకు చంటిపిల్లలకు మల్లే స్నానం చేయించాడు. దానితో ఎన్నో కబుర్లు చెప్పాడు. ‘అరె.. ఈ బంధం భలే ఉందే’ అనిపించింది కార్తికికి. అతణ్ణి పలకరించింది. పేరు బొమ్మన్. ఆ ఏనుగు పిల్ల పేరు రఘు. ఆ ఏనుగు పిల్ల ఇటీవలే అనాథ అయ్యింది. పంటలను కాపాడుకోవడానికి పెట్టిన కరెంటు తీగల బారిన పడి రఘు తల్లి మరణించింది. అనాథ అయిన రఘు తల్లి వియోగంతో కృశించి చావుకు దగ్గరగా ఉండగా బొమ్మన్‌కు కనిపించాడు. దానిని ఇంటికి తీసుకెళ్లాడు. బొమ్మన్ భార్య బెల్లి రఘుకు తల్లిలా మారింది. ఆ ముగ్గురు ఒక కుటుంబం అయ్యారు. ఇలాంటి అనుబంధాలు చూపితే మనిషి, జంతువు కలిసి మెలిసి మనుగడ సాగించాల్సిన అవసరాన్ని చూపినట్టు అవుతుందని కార్తికి అనుకుంది. వెంటనే డాక్యుమెంటరీ నిర్మించడానికి నెట్‌ఫ్లిక్స్‌ను సంప్రదించింది. నెట్‌ఫ్లిక్స్ తన కో ప్రొడ్యూసర్‌గా నిర్మాత మోంగాను సంప్రదించింది. అలా ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ డాక్యుమెంటరీ నిర్మాణం మొదలైంది. ఢిల్లీకి చెందిన గునీత్ దాదాపు పదేళ్లుగా అంతర్జాతీయ దృష్టి పడే సినిమాల నిర్మాణంలో భాగస్వామి అవుతోంది. ఆమె నిర్మాణ భాగస్వామి అయిన ‘కవి’ (2010) బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్‌లో ఆస్కార్ నామినేషన్ పొందగా, ‘పిరియడ్: ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ (2018) బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్‌గా ఆస్కార్ అవార్డ్ పొందింది. అయితే ‘పిరియడ్’కు పని చేసిన సాంకేతిక నిపుణులు భారతీయులు కారు. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ను తీయాలనుకుంటున్న కార్తికితో పని చేయడం వల్ల ఈసారి పూర్తి భారతీయ నిర్మాణంతో ప్రపంచం దృష్టిని ఆకర్షించవచ్చని గునీత్ భావించింది. అలా వీరిద్దరు కలిసి పూర్తి చేసిన ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 8, 2022న విడుదలైంది. ఇది డాక్యుమెంటరీ వేవ్ ‘ఇప్పుడు ఇండియాలో నడుస్తున్నది డాక్యుమెంటరీ వేవ్. ఫీచర్ ఫిల్మ్స్‌లో కన్నా డాక్యుమెంటరీలో భారతీయ దర్శక నిర్మాతలు వినూత్నమైన కథాంశాలను చెబుతున్నారు’ అంటుంది గునీత్. కార్తికి మాట్లాడుతూ– ‘ఏనుగులు ఎంత తెలివైనవో ఎంత భావోద్వేగంతో బంధంతో ఉంటాయో నా డాక్యుమెంటరీలో చూపించాను. ఇక మీదటైనా అవి వేరు మనం వేరు అనుకోకపోతే చాలు’ అంది. ‘నేను తీసే ఫిల్మ్స్ ఇకపై కూడా ఇలాంటి కథాంశాలతో ఉంటాయి’ అన్నారు. చదవండి: ఊర నాటు.. ఆస్కార్ హిట్టు.. దేశం మురిసిన వేళ.. తెలుగు స్క్రీన్ ఆనందించిన వేళ -
Natu Natu: 17 రోజుల కష్టం.. రూ.15 కోట్ల బడ్జెట్.. ఆస్కార్ ఊరికే రాలేదు..
‘నాటు నాటు’ పాటను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భవన ప్రాంగణంలో ఈ పాటను షూట్ చేశారు. పక్కనే పార్లమెంట్ భవనం కూడా ఉంది. అయితే ఇలాంటి ప్రదేశంలో ఓ సినిమా షూటింగ్ అంటే చాలా అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ జెలెన్స్కీ ఒకప్పుడు టెలివిజన్ యాక్టర్ అట. సో.. ఆర్ట్ గురించి ఆయనకు అవగాహన ఉండటంతో పాటను చిత్రీకరించేందుకు అనుమతి ఇచ్చారు. ‘నాటు నాటు..’ పాటను 17 రోజుల పాటు షూట్ చేశారు. సెట్స్‌లో ప్రతి రోజూ 150మంది డ్యాన్సర్లు పాల్గొన్నారు. 200మంది సాంకేతిక నిపుణులు ఈ పాట కోసం లొకేషన్లో హాజరయ్యారు. ఇక ఈ పాటలో ప్రత్యేకించి చెప్పుకోవాల్సింది ‘హుక్ స్టెప్’ గురించి. దాదాపు 80 రకాల స్టెప్స్‌ను కంపోజ్ చేశాక ఈ పాట కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ అండ్ టీమ్ ఆ స్టెప్‌ను ఫైనలైజ్ చేశారు. ఈ స్టెప్ కూడా ఊరికే పూర్తి కాలేదు. డ్యాన్స్‌లో మంచి ప్రావీణ్యం ఉన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు 18 టేక్స్ తీసుకున్నారు. ఎన్టీఆర్, చరణ్‌ల మధ్య సింక్ రావడానికి ఎక్కువ సమయం పట్టిందట. ఇలా వీరందరి కష్టం ఇప్పడు ఆస్కార్ అవార్డు రూపంలో ఫలించింది. అలాగే ఈ పాట కోసం దాదాపు రూ. 15 కోట్లు అయింది. నిజానికి ఈ పాటను ముందుగా ఇండియాలోనే షూట్ చేయాలనుకున్నారు. ఢిల్లీలోని ఎర్రకోట లొకేషన్‌ను అనుకున్నారు. కానీ ఆ సమయానికి వర్షాకాలం కావడంతో ఇతర దేశాల్లో తీయాలనుకున్నారు రాజమౌళి. సెట్ అయితే సహజంగా ఉండదని భావించారు. ఆ సమయంలోనే జెలెన్స్కీ భవనం లొకేషన్ రాజమౌళి కంట పడింది. అక్కడే పాటను చిత్రీకరించాలని అనుకున్నారు. కానీ అనుమతులు దొరకవని అనుకున్నారు. అయితే ఉక్రెయిన్ టీమ్ వల్ల అది సాధ్యమైంది. అలాగే పాట సమయంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లతో పాటు సైడ్ డ్యాన్సర్స్‌కు కూడా రెండు, మూడు కాస్ట్యూమ్స్‌ను రెడీగా ఉంచారు. ఎందుకంటే సాంగ్‌ను దుమ్ములో తీశారు. కాస్ట్యూమ్స్ పాడైతే షూటింగ్ లేట్ అవుతుందని. ఈ సినిమాకు రాజమౌళి భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వర్క్ చేశారు. భారతదేశం చాలా బలమైన సాంస్కృతిక నేపథ్యం ఉన్న వైవిధ్యమైన దేశం. ‘ఆర్ఆర్ఆర్’లో మీరు చూసింది అదే. ప్రపంచానికి చెప్పాల్సిన కథలు ఇండియాలో చాలా ఉన్నాయి. చాలా తీవ్రమైన, బలమైన, భావోద్వేగ, నాటకీయ యాక్షన్ తో కూడిన సినిమాలు ఇండియా నుంచి వస్తాయి. ఇప్పుడు భారతీయులకు పూర్తి నమ్మకం కలిగింది. – ఎన్టీఆర్ మనం గెలిచాం. మన ఇండియా సినిమా గెలిచింది. యావత్ దేశమే గెలిచింది. ఆస్కార్‌ను ఇంటికి తెచ్చేస్తున్నాం. మా జీవితాల్లోనే కాకుండా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ‘ఆర్ఆర్ఆర్’ ఎంతో ప్రత్యేకమైనది. ఆస్కార్ అవార్డు సొంతమయ్యేలా చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్. నేనింకా కలలోనే ఉన్నట్లు అనిపిస్తోంది. రాజమౌళి, కీరవాణిగార్లు భారత చలనచిత్రపరిశ్రమలో అత్యంత విలువైన రత్నాలు. ఈ అద్భుత కళాఖండంలో నన్ను భాగం చేసినందుకు కృతజ్ఞతలు. ప్రపంచవ్యాప్తంగా ‘నాటు నాటు..’ అనేది ఒక భావోద్వేగం. ఆ భావోద్వేగానికి రూపమిచ్చిన చంద్రబోస్, రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ, ప్రేమ్‌రక్షిత్‌లకు థ్యాంక్స్. నా బ్రదర్ ఎన్టీఆర్, కో స్టార్ ఆలియాభట్‌కు «థ్యాంక్స్. తారక్.. కుదిరితే నీతో మళ్లీ డ్యాన్స్ చేసి రికార్డులు సృష్టించాలనుంది. ఈ అవార్డు భారతీయ నటీనటులు, సాంకేతిక నిపుణులందరి సొంతం. నా భార్య (ఉపాసన)కు ఆరో నెల. మా బేబీయే మాకీ అదృష్టాన్ని తెచ్చిందనుకుంటున్నాను. – రామ్‌చరణ్ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..? -
Oscars 2023: కోరిక తీరింది.. పాటతో మనసులో మాట చెప్పిన ఎంఎం కీరవాణి!
లాస్ ఏంజెల్స్: ప్రపంచ వేదికపై ఓ తెలుగు సినిమా ప్రతిష్టాత్మకమైన ఆస్కార్‌ను కైవసం చేసుకుని మన సత్తా చాటింది. భారతీయ చిత్రం ఆర్ఆర్ఆర్లోని ‘నాటు నాటు’ పాట బెస్ట్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో అవార్డ్‌ను సొంతం చేసుకుని చరిత్రను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు చిత్రానికి గుర్తింపును తెచ్చిపెట్టింది. లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్ వేదికగా ఈ కార్యక్రమం జరిగింది. ఆస్కార్ అవార్డ్‌ను ఈ చిత్ర సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందుకున్నారు. అనంతరం ఆయన పాట రూపంలో తన ఆనందాన్ని వ్యక్త పరిచారు. అందులో.. ‘నా మదిలో ఒకే ఒక కోరిక ఉండేది. అదే ఆర్ఆర్ఆర్ ఆస్కార్ కైవసం చేసుకోవాలని’ అన్నారు. ఈ సినిమా భారతీయులను గర్వపడేలా చేసిందన్నారు. ఆర్ఆర్ఆర్… తనను ప్రపంచ శిఖరాగ్రాన నిలబెట్టిందని, థ్యాంక్యూ కార్తికేయ అని కీరవాణి పేర్కొన్నారు. చివరిలో రచయిత చంద్రబోస్ నమస్తే అంటూ తెలుగులో ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. ఇక భారతీయ సినీ ప్రేక్షకులు ఎన్నో రోజులుగా కంటున్న కలలను నిజం చేస్తూ రెండు ఆస్కార్లను మన చిత్రాలు దక్కించుకున్నాయి. దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’లోని ‘నాటు నాటు’ బెస్ట్ ఒరిజనల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్‌ను సొంతం చేసుకోగా.. మరో భారతీయ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్‌ను దక్కించుకుంది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) #NaatuNaatu wins the #Oscar for best Original Song 😭#SSRajamouli & team has done it🫡🇮🇳 Indian Cinema on the Rise 🔥 !! #RRRMovie | #AcademyAwards | pic.twitter.com/VG7zXFhnJe — Abhi (@abhi_is_online) March 13, 2023 -
Oscars 2023: ప్చ్.. ఆస్కార్ మిస్ చేసుకున్న భారతీయ చిత్రం ఇదే!
లాస్ ఏంజెల్స్: ఈ ఏడాది ఆస్కార్ బరిలో నిలిచిన భారత డాక్యుమెంటరీ చిత్రానికి నిరాశ ఎదురైంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలిం కేటగిరిలో నామినేట్ అయిన ‘ఆల్ దట్ బ్రీత్స్’ (All That Breathes) అస్కార్‌ను దక్కించుకోలేకపోయింది. ఈ విభాగంలో అమెరికాకి చెందిన ‘నావాల్నీ’ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిలింను అవార్డ్ వరించింది. ఆల్ దట్ బ్రీత్స్ని షానక్ సేన్ దర్శకత్వం వహించారు. ఈ కేటగిరిలో ఇతర నామినీల విషయానికొస్తే.. ఆల్ ది బ్యూటీ అండ్ ది బ్లడ్‌షెడ్, ఫైర్ ఆఫ్ లవ్, ఎ హౌస్ మేడ్ ఆఫ్ స్ప్లింటర్స్ చిత్రాలు ఉన్నాయి. ‘ఆల్ దట్ బ్రీత్’స్ ఈ విభాగంలో నామినేట్ చేసిన రెండవ భారతీయ చిత్రం. గత సంవత్సరం రింటు థామస్, సుష్మిత్ ఘోష్ రాసిన రైటింగ్ విత్ ఫైర్, ఆస్కార్స్‌లో ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్‌గా ఎంపికైంది. ఆల్ దట్ బ్రీత్స్.. ఢిల్లీలో బర్డ్ క్లినిక్ నడుపుతున్న సౌద్, నదీమ్ అనే ఇద్దరు సోదరుల కథ ఇది. ఈ డాక్యుమెంటరీ ఫిలిం ఫెస్టివల్ సర్క్యూట్లో సన్డాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌తో పాటు అనేక అవార్డులను గెలుచుకుంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ డాక్యుమెంటరీ చిత్రాన్ని ప్రదర్శించారు. -
Oscar 2023: వావ్.. భారత్‌కు ‘ఆస్కార్’.. ఏ చిత్రమో తెలుసా?
లాస్ ఏంజెల్స్: లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో వేదికగా జరుగుతున్న 95వ ఆస్కార్ వేడుకలో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. బెస్ట్ షార్ట్ ఫిలిం కేటగిరిలో ’ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ గెలుచుకుంది. కార్తికి గోన్సాల్వెస్ ’ది ఎలిఫెండ్ విస్పరర్స్’కు దర్శకత్వం వహించింది. డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో భారత్ ఈ ఆస్కార్‌ను దక్కించుకుంది. ఈ అవార్డ్‌ను కార్తికి గోన్సాల్వెస్ అందుకున్నారు. ఇక ఈ షార్ట్ ఫిలిం విషయానికొస్తే.. తప్పిపోయిన ఓ ఏనుగును గిరిజన దంపతులు ఏ విధంగా పెంచి పోషించారు? ఈ క్రమంలో వారికి ఆ ఏనుగుతో ఎలాంటి అనుబంధం ఏర్పడింది? అనే అంశాల నేపథ్యంలో భారతీయ దర్శకురాలు కార్తికి గోన్సాల్వేస్ రూందించిన డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’. -
ఆస్కార్ వేదికపై నల్ల గౌనులో మెరిసిన దీపిక.. ట్విస్ట్ ఏంటంటే..?
వాషింగ్టన్: బాలీవుడ్ స్టార్ దిపికా పదుకొణె ఆస్కార్ వేదికపై సందడి చేశారు. 95వ అకాడెమీ అవార్డుల ప్రధానోత్సవానికి తొలిసారి ప్రెజెంటర్‌గా వెళ్లిన ఆమె రెడ్‌కార్పెట్‌పై నల్ల గౌనులో మెరిశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేయగా.. సామాజిక మాధ్యమాల్లో అవి వైరల్‌గా మారాయి. నల్ల రంగు గౌను, వెల్వెట్ గ్లౌస్, డైమండ్ నెక్లెస్‌తో హాలీవుడ్ గ్లామర్ భామలను తలదన్నేలా దీపిక తన అందంతో అందరినీ ఆకట్టుకుంది. అయితే దిపికా పదుకొణెకు అంతర్జాతీయంగా మంచి గుర్తింపు ఉన్నా.. హాలీవుడ్ మీడియా సంస్థ ఏఎఫ్‌పీతో పాటు గెట్టీ, వోగ్ మెగజీన్ను ఆమెను గుర్తుపట్టలేకపోయాయి. దిపికాను బ్రెజిల్ మోడల్, డిజైనర్ క్యామిలా అనుకొని పొరపడ్డాయి. దీపికా గతంలో కేన్స్ జ్యూరీ, ఫిఫా వరల్డ్ కప్ వేడుకల్లో కూడా సందడి చేశారు. అయినా ఆమెకు, క్యామిలాకు మధ్య వ్యత్యాసాన్ని హాలీవుడ్ సంస్థలు పసిగట్టలేకపోయాయి. View this post on Instagram A post shared by Deepika Padukone (@deepikapadukone) View this post on Instagram A post shared by Camila Alves McConaughey (@camilamcconaughey) -
Oscars 2023: మొదలైన ఆస్కార్ సందడి.. ఈ చిత్రానికే తొలి అవార్డ్!
లాస్ ఏంజెల్స్: ఆస్కార్ 2023 వేడుక అమెరికా లాస్ ఏంజెల్స్‌లోని డాల్బీ థియేటర్లో అట్టహాసంగా ప్రారంభమైంది. సంబరంగా జరిగే ఈ కార్యక్రమానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులతో పాటు ఈ ఏడాది నామినేషన్లలో ఉన్న సినిమాల నటీనటులు, సాంకేతిక సిబ్బంది హాజరయ్యారు. విభాగాల వారీగా అవార్డ్లకు ప్రధానోత్సవం జరుగుతోంది. ఇక భారత్ నుంచి ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ ‘నాటునాటు’ పాట బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. సినీ ప్రపంచంలో ప్రతిష్టాత్మకంగా ఆస్కార్ (అకాడమీ అవార్డ్స్) భావిస్తారు. అందుకే తారలు తమ జీవితంలో ఒక్క సారైన ఈ అవార్డ్‌ను ముద్దాడాలని కోరుతుంటారు. 2023 గాను మొదటి ఆస్కార్ ఉత్తమ యానిమేటెడ్ సినిమా కేటగిరి దక్కించుకుంది. ఉత్తమ యానిమేటెడ్ సినిమాగా గిల్లెర్మో డెల్ టోరో నిర్మించిన 'పినోచియో' చిత్రం నిలిచింది. ఈ ఏడాది మొదటి ఆస్కార్‌ను కైవసం చేసుకున్న రికార్డు సొంతం చేసుకుంది. ఇందులో మరో విషయం ఏంటంటే.. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్‌ను గెలుచుకుని గిల్లెర్మో డెల్ టోరో ఆస్కార్ చరిత్రలో మొదటి వ్యక్తిగా నిలిచారు. చదవండి: Natu Natu Song: ‘నాటు నాటు’కు ఆస్కార్ వస్తుందా? రాదా? కోట్లలో బెట్టింగ్ -
ఆస్కార్.. ఈ పేరు, బొమ్మ వెనుక ఉన్న కహానీ తెలుసా?
యావత్ సినీప్రపంచానికి ఆస్కార్ అంటే అమృతకలశం వంటిది. దాన్ని ఒక్కసారి తాకినా చాలనుకునే సెలబ్రిటీలు చాలామంది. అలాంటిది ఏకంగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంటే జన్మ ధన్యమైపోయినట్లే ఫీలవుతారు. అందరినీ ఇంతలా ఆకర్షిస్తున్న ఆస్కార్ అవార్డుకు ఆ పేరెలా వచ్చింది? ఆ బొమ్మ తయారు చేసింది ఎవరో ఓసారి తెలుసుకుందాం. ప్రతి పేరు వెనక ఓ కథ ఉంటుంది. అలాగే ఆస్కార్ పేరు వెనుక కూడా ఓ కహానీ ఉంది. గతంలో అకాడమీ అవార్డ్ అని మాత్రమే పిలిచేవారు. అయితే ఆస్కార్ ప్రతిమను చూసి అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్ అది తన మామయ్య ఆస్కార్‌లా ఉందని పేర్కొన్నారట. అప్పటి నుంచి ఆ ప్రతిమను ఆస్కార్ అని అక్కడి ఉద్యోగులు పిలవడం ప్రారంభించారు. ఆ పేరు షార్ట్ అండ్ స్వీట్‌గా ఉండటంతో చివరికి ఆ పేరే స్థిరపడిపోయింది. 1929లో ఆస్కార్ అవార్డుల ప్రదానం మొదలవగా ఆస్కార్ అనే పేరు స్థిరపడింది మాత్రం 1939లో! చదవండి: Oscar Ceremony Facts: గెలిచినవాళ్లకే కాదు అందరికీ డమ్మీ ఆస్కార్ ఇస్తారు! ఆస్కార్ బొమ్మ విషయానికి వస్తే.. 1927లో అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అవార్డ్స్ అండ్ సెన్సెస్ అనే సంస్థ ప్రారంభించి సినిమారంగంలోని ప్రతిభావంతులకు అవార్డులు ఇవ్వాలనుకుందో కమిటీ. ఆ అవార్డు ప్రతిమ డిజైన్‌ను కళాదర్శకుడు సిడ్రిక్ గిబ్బన్స్ రూపొందించారు. నటీనటులు, రచయితలు, దర్శక, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు.. ఇలా చిత్రనిర్మాణంలో పాలు పంచుకునే ప్రధాన ఐదు శాఖలను దృష్టిలో పెట్టుకుని ఐదు స్పోక్స్ ఉన్న ఒక ఫిలిం రీల్‌పై ఓ వీరుడు కత్తి పట్టుకుని నిలబడినట్లుగా ప్రతిమ డిజైన్ చేశారు. అది అందరికీ నచ్చడంతే ఆ ఆస్కార్ బొమ్మే ఇప్పటికీ కొనసాగుతోంది. చదవండి: ఆస్కార్ వేదికపై నాటు నాటు స్టెప్పులేయనుంది ఎవరో తెలుసా? Oscar Awards 2023: వామ్మో.. ఆస్కార్ వేడుక ఖర్చు అన్ని వందల కోట్లా?.. ఈసారి స్పెషల్ ఏంటంటే.. -
ఆరుగురు తెలుగువారికి జాతీయ అవార్డులు
సాక్షి, న్యూఢిల్లీ: భారతీయ సంగీతం సముద్రమంత విశాలమైనదని, మన నాటకాలు అజరామరమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. సంగీత, నాటకాల ద్వారా భారత సంస్కృతిని కాపాడేందుకు కృషి చేస్తున్న కళాకారుల జీవితాలు ధన్యమన్నారు. గురువారం కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో జాతీయ సంగీత, నాటక అకాడెమీ అవార్డుల ప్రదాన కార్యక్రమం ఢిల్లీలో ఘనంగా జరిగింది. కరోనా కారణంగా 2019, 2020, 2021 సంవత్సరాలకు అందించని జాతీయ సంగీత, నాటక అకాడెమీ అవార్డులను గురువారం ముర్ము, కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి విజేతలకు అందించారు. మొత్తం 128 మంది కళాకారులకు అవార్డులు ఇవ్వగా, ఇందులో 50 మంది మహిళలే ఉండటం ఈ రంగాల్లో స్త్రీశక్తి చేస్తున్న సేవకు నిదర్శనమని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో కళా, సంగీత సేవ చేస్తున్న ఆరుగురికి అవార్డులు దక్కాయి. హరికథ కళాకారిణి డి. ఉమామహేశ్వరి(హరికథ), కథక్ నృత్యకారులు రాఘవరాజ్ భట్, మంగళభట్(సంయుక్తంగా) 2019 సంవత్సరానికిగాను ఈ అవార్డులు అందుకున్నారు. 2020 సంవత్సరానికి కర్ణాటక సంగీత విద్వాంసుడు గరిమెళ్ల బాలకృష్ణప్రసాద్, ప్రఖ్యాత గాయని ప్రేమరామ్మూర్తి, కూచిపూడి నృత్యకళాకారులు పసుమర్తి విఠల్, పసుమర్తి భారతి దంపతులు(సంయుక్తంగా) అవార్డులు అందుకున్నారు. 2021 సంవత్సరానికిగాను తెలుగులో నాటకరంగాన్ని కాపాడుకునేందుకు కృషి చేస్తున్న శ్రీ వినాయక నాట్యమండలి (సురభి) నిర్వాహకులు ఆర్.వేణుగోపాల్ రావు సంగీత, నాటక అకాడెమీ అవార్డును అందుకున్నారు. -
ఆర్ఆర్ఆర్ ఖాతాలో మరో అరుదైన అవార్డు
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య నిర్మించిన ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు సాధించిన విషయం తెలిసిందే. తాజాగా 46వ జపాన్ అకాడమీ ఫిల్మ్ ప్రైజ్‌కు సంబంధించి ‘అవుట్ స్టాండింగ్ ఫారిన్ ఫిల్మ్’ విభాగంలో ‘ఆర్ఆర్ఆర్’ అవార్డు సాధించింది. ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’, ‘టాప్‌గన్: మ్యావరిక్’ వంటి హాలీవుడ్ చిత్రాలను దాటి ‘ఆర్ఆర్ఆర్’ ఈ జపాన్ అవార్డును సాధించడం విశేషం. గత ఏడాది జపాన్‌లో విడుదలైన ‘ఆర్ఆర్ఆర్’ అక్కడి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతున్న సంగతి తెలిసిందే. ఇక 95వ ఆస్కార్ అవార్డ్స్‌కు బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ‘నాటు నాటు’ పాట (మరికొన్ని విభాగాల్లో ‘ఆర్ఆర్ఆర్’ నామినేషన్ పోటీలో ఉంది), ‘బెస్ట్ ఫారిన్ ఫిల్మ్’ విభాగంలో గుజరాతీ ఫిల్మ్ ‘ఛెల్లో షో’, డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో ‘ఆల్ దట్ బ్రీత్స్’, డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ ‘ఎలిఫెంట్ విష్పర్స్’ ఆస్కార్స్ షార్ట్ లిస్ట్ జాబితాలో ఉన్నాయి. ‘ఆర్ఆర్ఆర్’, ‘ఛెల్లో షో’లతో కలిపి పది ఇండియన్ చిత్రాలు ఆస్కార్ రిమైండర్ లిస్ట్‌లో ఉన్నాయి. కాగా నేడు ఆస్కార్ నామినేషన్స్ వెల్లడి కానున్నాయి. మరి.. ఎన్ని ఇండియన్ చిత్రాలు నామినేషన్స్ దక్కించుకుంటాయో చూడాలి.. -
చెంపదెబ్బ ఎఫెక్ట్.. విల్ స్మిత్ రాజీనామా..
Will Smith Resigns: హాలీవుడ్ స్టార్ హీరో, ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (అకాడమీ అవార్డ్స్)కు రాజీనామా చేశాడు. ప్రముఖ అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్‌పై చేయి చేసుకోవడంపై విల్ స్మిత్ శుక్రవారం (ఏప్రిల్ 1) ఈ విధంగా తెలిపాడు. క్రిస్ రాక్‌ను చెంప దెబ్బ కొట్టండ అనేది 'షాకింగ్, బాధాకరమైనది, క్షమించరానిది' అని పేర్కొన్నాడు. 'నేను అకాడమీ నమ్మకానికి ద్రోహం చేశాను. ఈ వేడుకను అద్భుతమైన ప్రతిభ కనబర్చిన ఇతర నామినీలు, విజేతలు సంతోషంగా జరుపుకునే అవకాశాన్ని నేను కోల్పోయేలా చేశాను, నేను పోగొట్టుకున్నాను. నా గుండె ముక్కలైంది (హార్ట్ బ్రోకేన్). కాబట్టి, నేను అకాడమీ అవార్డ్స్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. బోర్డు తీసుకునే ఏ చర్యలకైనా సిద్ధమే. తదుపరి పరిణామాలను అంగీకరిస్తాను.' అని స్మిత్ ఒక ప్రకటనలో తెలిపాడు. చదవండి: ఆస్కార్ విన్నర్ విల్ స్మిత్ భార్యకు ఉన్న వ్యాధి లక్షణాలు ఇవే.. అంతేకాకుండా 'మార్పుకు సమయం పడుతుంది. హింసను అనుమతించకుండా, అందుకు కారణమయ్యే పరిస్థితులను అధిగమించేలా నా పనికి నేను కట్టుబడి ఉంటాను.' అని విల్ చెప్పుకొచ్చాడు. విల్ స్మిత్ రాజీనామాను ఆమోదించినట్లు అకాడమీ అవార్డ్స్ ప్రెసిడెంట్ డేవిడ్ రూబిన్ తెలిపారు. క్షమశిక్షణా చర్యలో భాగంగా అదనపు ఆంక్షలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఏప్రిల్ 18న జరిగే గ్రూప్ బోర్డు సమావేశంలో ఈ విషయం గురించి చర్చించనున్నారు. అయితే గత ఆదివారం జరిగిన ఆస్కార్ వేడుకలో కమెడియన్ క్రిస్ రాక్ హోస్ట్‌గా వ్యవహరించాడు. కార్యక్రమంలో భాగంగా ఉత్తమ డాక్యుమెంటరీ అవార్డును ప్రకటించాడనికి ముందు వీక్షకుల్ని నవ్వించే ప్రయత్నం చేశాడు. చదవండి: విల్ స్మిత్ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ? 'అలోపేసియా' వ్యాధి కారణంగా జుత్తు కోల్పోయిన విల్ స్మిత్ భార్య జాడా పింకెట్‌ను ఉద్దేశించి జోక్ చేశాడు వ్యాఖ్యాత క్రిస్ రాక్. దీంతో ఆగ్రహానికి లోనైనా విల్ స్మిత్.. క్రిస్ రాక్ చెంప చెల్లుమనించిన సంగతి తెలిసిందే. తర్వాత ఆస్కార్ అందుకునే సమయంలో అకాడమీ నిర్వాహకులకు, నామినీలకు, తర్వాతి రోజు ఇన్‌స్టా గ్రామ్‌లో క్షమాపణలు కూడా తెలిపాడు విల్. అకాడమీ చర్యల్లో భాగంగా విల్ స్మిత్ రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. #WillSmith resigns from the #Academy for slapping #ChrisRock at the #Oscars His statement pic.twitter.com/3sDhcAkDuZ — Ramesh Bala (@rameshlaus) April 2, 2022 -
వీడియోతో దొరికిపోయిన విల్ స్మిత్.. ఇప్పుడేం అంటాడో మరి?
Will Smith Old Video: సోమవారం ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఫలానా సినిమాకి అవార్డు రావాల్సిందనో, ఫలానా స్టార్‌కి ఆస్కార్ రాకపోవడం అన్యాయమనో, ఫంక్షన్ బాగా జరిగిందనో... ఇలాంటి చర్చలు జరుగుతాయి. కానీ అలోపేసియా వ్యాధి కారణంగా జుత్తు కోల్పోయిన విల్ స్మిత్ భార్య జడా పింకెట్‌ను ఉద్దేశించి వ్యాఖ్యాత క్రిస్ రాక్ వేసిన జోక్ గురించి, విల్ స్మిత్ అతడి చెంప చెళ్లుమనిపించిన ఘటన గురించీ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దాదాపు 30 ఏళ్ల క్రితం అలోపేసియాతో బాధపడుతున్న జాన్ విల్లియమ్స్ బట్టతలపై ‘ది అర్సెనియా హాల్ షో’లో విల్ స్మిత్ వేసిన జోక్‌కి సంబంధించిన వీడియో అది. ‘అతనికో రూల్ ఉంది. అదేంటంటే అతను ప్రతి రోజూ తన తలను వ్యాక్స్ (కవర్ చేయాలనేది ఉద్దేశం) చేయాల్సిందే. అదే రూల్’ అంటూ జోక్ చేసి, ‘ఇది జస్ట్ జోక్’ అని కూడా అన్నాడు విల్ స్మిత్. ఆ వీడియోను ఇప్పుడు ఎవరో బయటపెట్టారు. మరి.. ఇప్పుడు క్రిస్ చేసింది కూడా జోక్‌లో భాగమే కదా అంటున్నారు నెటిజన్లు. ‘క్రిస్ చేస్తే తప్పు... నువ్వు చేస్తే ఒప్పా?’ అంటూ విల్ స్మిత్‌ని విమర్శిస్తున్నారు. 15 రోజుల్లోపు విల్ వివరణ ఇవ్వాలి క్రిస్‌పై విల్ దాడి పట్ల ఆస్కార్ కమిటీ చాలా ఆగ్రహంగా ఉంది. అదే వేదిక సాక్షిగా కమిటీకి, వీక్షకులకు క్షమాపణలు చెప్పాడు విల్. అయితే క్రిస్‌కి చెప్పలేదు. కానీ మరుసటి రోజు ఇన్స్టాగ్రామ్ వేదికగా క్రిస్‌కి క్షమాపణలు చెప్పాడు విల్. తన భార్యపై జోకులు వేయడంతో ఆగ్రహం పట్టలేకే అలా చేశానని కూడా అన్నాడు. ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకల్లో విల్ ఇలా దాడి చేయడంపై ఆస్కార్ కమిటీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనుకుంటోంది. ఈ విషయంపై చర్చించడానికి కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు కూడా. క్రిస్ పై దాడి చేశాక విల్ స్మిత్‌ని వేడుక నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరినా అతను వెళ్లకపోవడంపై కూడా కమిటీ తీవ్ర ఆగ్రహంగా ఉందట. అందుకే తన ప్రవర్తనపై విల్ 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించిందట. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఏప్రిల్ 18న కమిటీ మరోసారి సమావేశం కానుందని సమాచారం. “He gotta wax his head every morning.” Now this is a video of Will Smith saying a joke about someone with Alopecia. One reason I love the internet, it never forgets. pic.twitter.com/4OGlgSrcjA — Peter O.K.H (@Peter_OKH) March 28, 2022 -
ఆస్కార్ వేడుకల్లో కమెడియన్‌పై చెంపదెబ్బ.. విల్ స్మిత్‌పై చర్యలు !
Academy Will Take Action Against Will Smith Slap In Oscars: 92వ అకాడమీ అవార్డుల (ఆస్కార్) ప్రదానోత్సవంలో జరిగిన చెంపదెబ్బ ఘటన ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. ఈ విషయంపై పలువురు సెలబ్రిటీలు స్పందిస్తూ వారి అభిప్రాయం చెబుతున్నారు. ఇప్పుడు ఈ టాపిక్ హాట్ టాపిక్‌గా చర్చనీయాంశమైంది. అమెరికన్ కమెడియన్ క్రిస్ రాక్‌పై ఆస్కార్ విన్నర్, స్టార్ హీరో విల్ స్మిత్ చేయిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో విల్ స్మిత్‌పై ఆస్కార్ అకాడమీ తీవ్ర అసంతృప్తి, ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. త్వరలోనే విల్ స్మిత్‌పై చర్యలు తీసుకునే అవాశం ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: హీరో విల్ స్మిత్ ఇంటికి పోలీసులు.. కారణం అదేనా ? అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఏఎమ్పీఏఎస్) అధ్యక్షుడు డేవిడ్ రూబిన్ అకాడమీ సభ్యులకు తాజాగా ఓ లేఖ పంపారు. విల్ చేయి చేసుకోవడంపై అకాడమీ తగిన చర్యలు తీసుకుంటుందని భావిస్తున్నట్లు అందులో తెలిపారు. 2021 సినీ రంగంలో అద్భుతమైన ప్రతిభ కనబర్చిన అనేక మంది వ్యక్తులను సత్కరించేందుకుగానూ ఆదివారం 94వ ఆస్కార్ వేడుకలు నిర్వహించాం. కానీ ఇలాంటి వేదికపై ఓ నామినీ ఆమోదయోగ్యం కానీ, హానికరమైన ప్రవర్తనతో మేము కలత చెందాం. విల్ స్మిత్ చేయి చేసుకోవడాన్ని మేము ఖండిస్తున్నాం. విల్ హద్దు మీరి ప్రవర్తించారు. నియమనింబంధనల్లో భాగంగా అకాడమీ గవర్నర్ల బోర్డు విల్ స్మిత్‌పై తగిన చర్యలు తీసుకోవాలి. అని అధ్యక్షుడు డేవిడ్ ఆ లేఖలో పేర్కొన్నారు. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 చదవండి: ఆస్కార్ వేడుకల్లో షాకింగ్ ఘటన.. చెంప పగలకొట్టిన విల్‌స్మిత్ -
విల్ స్మిత్ ఆస్కార్ వెనక్కి తీసేసుకుంటారా?
ఆస్కార్స్ 2022 ఈవెంట్ వేదికగా జరిగిన షాకింగ్ ఈవెంట్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. నటుడు విల్ స్మిత్, మరో నటుడు క్రిస్ రాక్‌ను స్టేజ్‌పైనే ముఖం పగల కొట్టిన ఘటన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విల్ స్మిత్‌కు దక్కిన బెస్ట్ యాక్టర్ అవార్డును వెనక్కి తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. విల్ స్మిత్.. క్రిస్ రాక్ చెంప పగలకొట్టిన ఘటన వీడియో సోషల్ మీడియాను కుదిపేస్తోంది. ఈ ఇన్సిడెంట్ ఈవెంట్ లైవ్‌లో టెలికాస్ట్ కాలేదు. పైగా ఈ ఘటన తర్వాత ఆస్కార్స్ 2022 ఈవెంట్‌ను కాసేపు నిలిపేసినట్లు సమాచారం. అయితే కాసేపటికే ఆ వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం జరిగిందో.. లేక నిజంగా జరిగిందో అర్థంకానీ పరిస్థితి ఏర్పడింది. మరోవైపు ఈ ఈవెంట్ వేదికగానే విల్ స్మిత్ బెస్ట్ యాక్టర్‌గా ఆస్కార్ ట్రోఫీ అందుకున్నారు.. ఆపై జరిగిన ఘటనకు క్షమాపణలు కూడా చెప్పారు. అయితే అకాడమీ రూల్స్ ప్రకారం.. విల్ స్మిత్ ఆస్కార్‌ను వెనక్కి తీసుకోవాల్సిందేనని కొందరు గళం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అకాడమీ స్పందించింది. ‘‘హింస ఏ రూపంలో ఉన్నా అకాడమీ సహించదు. ఈ రాత్రి మా 94వ అకాడమీ అవార్డుల వేడుకలు జరగడం, విజేతల గుర్తింపు దక్కడంపై మేం సంతోషిస్తున్నాము. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారి సహచరులు, సినీ ప్రేమికుల నుండి ఈ క్షణానికి గుర్తింపు పొందారు (sic)’’ అంటూ ట్వీట్ చేసింది అకాడమీ. The Academy does not condone violence of any form. Tonight we are delighted to celebrate our 94th Academy Awards winners, who deserve this moment of recognition from their peers and movie lovers around the world. — The Academy (@TheAcademy) March 28, 2022 ఇక ఇలాంటి సందర్భాల్లో అకాడమీ గట్టి చర్యలు తీసుకోవాలని, సరైన మార్గదర్శకాలు రిలీజ్ చేయాలని, అసలు ఈ ఉదంతాన్ని ఒక దాడిగా పరిగణించి విల్ స్మిత్ అవార్డును వెనక్కి తీసుకోవాలంటూ కొందరు నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే అకాడమీ మాత్రం అవార్డు వెనక్కి తీసుకునే వ్యవహారంపై ఇంతవరకు అధికారికంగా ఒక ప్రకటన విడుదల చేయలేదు. VIA JAPANESE TELEVISION: The uncensored exchange between Will Smith and Chris Rock pic.twitter.com/j0Z184ZyXa — Timothy Burke (@bubbaprog) March 28, 2022 అకాడమీ రూల్స్ ఏం చెబుతోందంటే.. 2017లో విడుదల చేసిన అకాడమీ కండక్ట్ కోడ్.. అకాడమీ విలువలను పరిరక్షించడంతో పాటు అవతలి వాళ్ల గౌరవానికి భంగం కలిగించకూడదు. అంతేకాదు.. అకాడమీ వాతావరణంలో అనైతికంగా వ్యవహరించకూడదు కూడా. అయితే విల్ స్మిత్ దాడి విషయంలో.. స్టేజ్ మీద ఉన్న క్రిస్ రాక్.. విల్ స్మిత్ భార్య, నటి జాడా పింకెట్ స్మిత్ మీద జోక్ పేల్చాడు. ఆమె చూడడానికి జీఐ జేన్ 2(సినిమా.. అందులో లీడ్ రోల్) లాగా ఉందంటూ కామెంట్ చేశాడు. కానీ, జాడా అలోపెషియాతో బాధపడుతోంది. ఆ అనారోగ్యం వల్లే ఆమె జుట్టు రాలిపోగా.. అలా గుండు లుక్‌తో దర్శనమిచ్చింది. అందుకే భార్య మీద వేసిన జోక్‌కు విల్ స్మిత్‌కు మండిపోయి గూబ పగలకొట్టి ఉంటాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. విల్ స్మిత్, జాడా పింకెట్లు 1997లో వివాహం చేసుకున్నారు. 2018లో జాడా తనకు ఉన్న అలోపెసియా గురించి ఓపెన్ అయ్యింది. తద్వారా గొంతు సమస్యలు, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపింది. -
Oscars 2022: ఆస్కార్.. వచ్చినా ఏం లాభం?
Oscar Trophy Birth And Intresting Facts: సినీ జగత్‌కు పెద్ద పండుగ ‘ఆస్కార్’ కౌంట్ డౌన్‌కి మరొక రోజే మిగిలి ఉంది. ఫైనల్ నామినేషన్ల లిస్ట్ బయటకు వచ్చినప్పటి నుంచి విజేతల గురించి మూవీ లవర్స్ జోరుగా చర్చించుకుంటున్నారు. కరోనా జోరు తగ్గడంతో ఈసారి కాస్త హడావిడిగానే ఈవెంట్‌ను జరపాలని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెన్స్(ఎఎంపీఏఎస్) నిర్ణయించుకుంది. ఇంతకీ ఆస్కార్ వస్తే ఏం లాభం? నటులకు, టెక్నిషీయన్లకు అంతగా ఏం ఒరుగుతుంది?.. ఆస్కార్ అవార్డులకు ప్రామాణికం.. వేడుకల్లో అందించే ట్రోఫీ. ఈ ట్రోఫీకి చాలా చరిత్రే ఉంది. ఈ గోల్డెన్ స్టాచ్యూ ట్రోఫీని ‘అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్’ అంటారు. ఫ్రాన్స్‌కి చెందిన డెకో స్టయిలో ఈ విగ్రహాన్ని తయారు చేశారు. అమెరికా డిజైనర్ కెడ్రిక్ గిబ్సన్ ఈ ట్రోఫీ డిజైన్‌ను స్కెచ్ చేయగా, ఐరిష్ ఆర్ట్ డైరెక్టర్ జార్జ్ స్టాన్లీ ఆస్కార్ ట్రోఫీ బొమ్మను తయారు చేశాడు. ఈ బొమ్మను కంచుతో తయారు చేస్తారు. పైన బంగారు పూత పూస్తారు. ఒక్కో విగ్రహం తయారీకి ఐదు నుంచి 900ల డాలర్ల ఖర్చు అవుతుంది. యాభై విగ్రహాల తయారీకి మూడు నెలల టైం పడుతుంది. ట్రోఫీ పొడవు 34 సెంటిమీటర్లు, బరువు మూడున్నర కేజీలు ఉంటుంది. 1929 నుంచి ఇప్పటిదాకా 3,160 ట్రోఫీలను ఇచ్చింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. కానీ, సినిమావాళ్లు గొప్పగా భావించే ఈ ట్రోఫీని.. ఒకవేళ అమ్మితే వచ్చేది మాత్రం కేవలం ఒక్క డాలర్!. 2021 ఆస్కార్ విజేతలు కోర్టుకెక్కి మరీ 1950కి ముందుదాకా.. అవార్డు గెల్చుకున్నవాళ్లకే ట్రోఫీపై అన్ని హక్కులు ఉండేవి. ఆ తర్వాత అకాడమీ తన రూల్స్ సవరించింది. విజేతలు ఎవరైనా సరే ఆస్కార్ ట్రోఫీని.. వేరే వాళ్లకు అమ్మడానికి వీల్లేదు. ఒకవేళ అమ్మాలంటే.. అకాడమీకే అమ్మాలని ముందుగానే కాంట్రాక్ట్ మీద విజేతలతో సైన్ చేయించుకుంటారు. అలా అమ్మేయగా ఒక్కటంటే ఒక్క డాలర్ మాత్రమే ఇస్తారు. ఒప్పందాన్ని కాదని వేరేవాళ్లకు అమ్మితే.. కోర్టుకు ఇడుస్తుంది అకాడమీ. అయినప్పటికీ కొందరు ట్రోఫీలను అమ్మడం విశేషం. ‘ఎరౌండ్ ది వరల్డ్ ఇన్ 80 డేస్’(1956) బెస్ట్ మూవీగా ఆస్కార్ ట్రోఫీ గెల్చుకుంది. ఈ మూవీ ప్రొడ్యూసర్ మైకేల్ టాడ్స్. ఈయన మనవడు 1989లో ట్రోఫీని వేలం వేయాలని ప్రయత్నించాడు. కోర్టులో కేసు వేసి ఆ వేలంపాటను అకాడమీ అడ్డుకుంది. 1992లో ‘బెస్ట్ సపోర్ట్ యాక్టర్’ ట్రోఫీ గెల్చుకున్న హరోల్డ్ రస్సెస్.. తన భార్య ఆరోగ్యం కోసం అరవై వేల డాలర్లకు ఆస్కార్ ట్రోఫీని అమ్మేశాడు. ఈ విషయంలో అకాడమీ నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. అయితే తన భార్య ఆరోగ్యం కంటే ఏదీ ముఖ్యం కాదని పోరాడి మరీ కేసు గెలిచాడు హరోల్డ్. హాలీవుడ్ కల్ట్ క్లాసిక్ ‘సిటిజన్ కేన్’(1941) ఒరిజినల్ స్క్రీన్‌ప్లే కేటగిరీలో ఆస్కార్ గెల్చుకుంది. స్క్రీన్‌ప్లే రైటర్ ఓర్సన్ వెల్స్ వారసులు ఆ ట్రోఫీని వేలం అమ్మేయాలని ప్రయత్నించారు. ఈ కేసు కోర్టులో నడిచినప్పటికీ.. వెల్స్ వారసులే కేసు నెగ్గారు. ఆ టైంలో అకాడమీ కాంట్రాక్ట్‌లో వెల్స్ సైన్ చేయకపోవడం ఆ వారసులకు కలిసొచ్చింది. కోర్టు తీర్పు తర్వాత 2011లో ఆ ట్రోఫీని వేలం వేయగా.. ఎనిమిదిన్నర లక్షల డాలర్లు వచ్చింది. ఇంత సమస్యలున్నప్పుడు.. అసలు ఆస్కార్ ట్రోఫీ గెలవడం వల్ల లాభం ఏంటంటారా?. ఆర్టిస్టులు, ఇతర టెక్నిషియలు తమ రెమ్యునరేషన్ పెంచుకోవడం కోసం, తమ బ్రాండ్లను మార్కెటింగ్ చేసుకోవడం కోసమే పనికొస్తుంది. అన్నింటికి మించి సినీ ప్రపంచంలో ఇదొక ఔనత్యమైన అవార్డు అనే గుర్తింపు దక్కుతుంది కదా!. ఆస్కార్‌పై కథలు 1939 వరకు అకాడమీ అవార్డ్ ఆఫ్ మెరిట్ అనే ట్రోఫీని పిలిచేవాళ్లు. ఆ తర్వాత అఫీషియల్‌గా ‘ఆస్కార్’ అనే ముద్దుపేరుతో పిలుస్తున్నారు. ఆ పేరు అసలు ఎలా వచ్చిందనే దానిపై రకరకాల కథలు వినిపిస్తుంటాయి. అమెరికన్ నటి బెట్టె డేవిస్ అప్పట్లో అకాడమీ ఆర్గనైజేషన్‌కి ప్రెసిడెంట్ పని చేసింది. తన మొదటి భర్త పేరు హర్మన్ ఆస్కార్ నెల్సన్. ఆయన పేరు మీదుగా ఆమె ట్రోఫీలకు ఆ పేరు పెట్టిందని చెప్తారు. మరో వెర్షన్ ఏంటంటే.. హాలీవుడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్, ఆ బొమ్మ రూపం తన అంకుల్ ఆస్కార్‌ని పోలి ఉండడంతో ఆమె ఆ పేరు పెట్టించిందని చెప్తారు. అమెరికన్ కాలమిస్ట్ సిడ్నీ స్కోలిస్కై మాత్రం తన కాలమ్‌లో ‘అకాడమీ ఎంప్లాయిస్ ముద్దుగా ఆ పేరు పెట్టుకున్నార’ని రాశాడు. అయితే 1934లో ట్రోఫీ అందుకున్న తర్వాత ప్రముఖ ప్రొడ్యూసర్ వాల్టర్ ఎలియాస్ డిస్నీ(వాల్ట్ డిస్నీ) ఫస్ట్ టైం ‘ఆస్కార్’ అనే పదాన్ని స్టేజ్ మీద ఉపయోగించడం కొసమెరుపు. అకాడమీ మోషన్ పిక్చర్స్ అవార్డులకు ‘ఆస్కార్’ అనే ట్రేడ్ మార్క్ ఉంది. అయితే ఇటలీలో ఏ రంగంలో అవార్డులు ఇచ్చినా ఆస్కార్ అనే పిలుస్తుంటారు. 2020.. వరస్ట్! 1930లో ఆస్కార్ వేడుకల ఈవెంట్‌ను రేడియోలో బ్రాడ్కాస్ట్ చేశారు. 1953 నుంచి టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే ఆర్కీవ్స్ మాత్రం 1949 నుంచి భద్రపరుస్తున్నారు. రీల్, వీడియో, డిజిటల్ కాపీలుగా వాటిని భద్రపరిచారు. వేదికలు.. మారుతూ వస్తున్నాయి. కొడాక్ థియేటర్.. డాల్బీ థియేట్లో జరుగుతున్నాయి. అయితే 2018లో ఈవెంట్‌ను టెలికాస్ట్ చేయలేదు. కొన్ని ఆస్కార్ వేడుకల్లో.. బ్రేక్ టైంలో అవార్డులూ ఇచ్చారు. కొత్తగా కొన్ని కేటగిరీలను కలిపారు. రాను రాను కొన్ని కేటగిరీలను ఎత్తేశారు. వీటిపై విమర్శలు వచ్చాయి. అయినా అకాడమీ తగ్గడం లేదు. 1998 ఆస్కార్ విజేతలు అంతకు ముందు ఆస్కార్ అవార్డుల నామినేషన్ల ఫలితాల్ని ఫిబ్రవరి మొదటి వారంలో అనౌన్స్ చేసేవాళ్లు. 2004 నుంచి అకాడమీ అవార్డుల నామినేషన్ ఫలితాల్ని జనవరి మధ్యలోనే ప్రకటిస్తున్నారు. ఆస్కార్ వేడుకల టెలికాస్టింగ్‌కు సంబంధించి.. 1980 నుంచి టీఆర్పీని లెక్కిస్తున్నారు. హయ్యెస్ట్ టీఆర్పీ 1998లో వచ్చింది. 57 టీఆర్పీతో అస్కార్ చరిత్రలోనే రికార్డ్ నెలకొల్పింది. మరి లోయెస్ట్ టీఆర్ఫీ అంటారా? అది.. 2020లోనే రికార్డయ్యింది. ఫస్ట్ .. రీసెంట్ ప్రపంచంలోనే చాలాకాలం నుంచి జరుగుతున్న ఎంటర్టైన్మెంట్ అవార్డుల ఈవెంట్.. ఈ ‘అకాడమీ’(ఆస్కార్) అవార్డులు. మొదటి వేడుక ఎలాంటి ఆర్భాటాలు లేకుండా జరిగింది. 1929, మే 16న లాస్ ఏంజెలెస్‌లోని హాలీవుడ్ రూజ్వెల్ట్ హోటల్లో ప్రైవేట్ డిన్నర్ ఫంక్షన్ ఏర్పాటు చేసి అవార్డులను ఇచ్చారు. ఈ ఈవెంట్‌కు 270 మంది హాజరయ్యారు. అమెరికన్ యాక్టర్ డగ్లస్ ఫెయిర్‌బ్యాంక్ ఈ వేడుకలకు హోస్ట్‌గా వ్యవహరించాడు. 1927–28 మధ్య రిలీజ్ అయిన సినిమాలకు ఈ అవార్డులు దక్కాయి. అయితే ఈవెంట్‌ను కేవలం పదిహేను నిమిషాల్లోనే ముగించారు. మొత్తం పదిహేను ట్రోఫీలను ఇచ్చారు. మొదటి ఈవెంట్లో గెలిచినవాళ్ల పేర్లను మూడు నెలల ముందే మీడియాకు రిలీజ్ చేయడం విశేషం. ఈ రూల్‌ను రెండో ఆస్కార్ వేడుకలకు(1930) మార్చేశారు. అకాడమీ అవార్డుల మొదటి వేడుక అవార్డులిచ్చే రాత్రి విన్నర్ల పేర్ల లిస్ట్‌ను పేపర్ హౌజ్‌లకు పంపించేవాళ్లు. 1940 వరకు ఇదే జరిగింది. అయితే లాస్ఏంజెలెస్ టైమ్స్ వాళ్లు సరిగ్గా అవార్డు వేడుక జరిగే ముందే పేర్లను అనౌన్స్ చేసేది. ఇది చూసి అకాడమీ వాళ్లు సీల్డ్ కవలర్‌లో విన్నర్స్‌ను అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు జరగబోయే అవార్డుల వేడుక 94వది. మార్చి 27న 2022న కాలిఫోర్నియా లాస్ ఏంజెల్స్ డాల్బీ థియేటర్లో జరుగనుంది. భారత కాలమానం ప్రకారం.. మార్చి 28 సోమవారం ఉదయం ఐదుగంటలకు ఈ ఈవెంట్ మొదలవుతుంది. Disney+Hotstar App ద్వారా మన దేశంలో ఆస్కార్ వేడుకల్ని లైవ్‌గా వీక్షించొచ్చు. :::సాక్షి వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
జై భీమ్‌కు నిరాశ.. ఈ ఏడాది బరిలో ఉన్న చిత్రాలివే!
ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న 94వ ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్స్ ఫిబ్రవరి 8 (మంగళవారం) వెల్లడయ్యాయి. ట్రెసీ ఎల్లిస్ రాస్, లెస్లీ జోర్డాన్ ఆస్కార్ నామినేషన్స్ ప్రకటనకు హోస్ట్స్‌గా వ్యవహరించారు. ఈ నామినేషన్స్‌లో ‘ద పవర్ ఆఫ్ ది డాగ్’ చిత్రం ఏకంగా 12 నామినేషన్లు దక్కించుకోగా, ‘డ్యూన్’ చిత్రం 10, ‘వెస్ట్ సైడ్ స్టోరీ’, ‘బెల్ఫాస్ట్’ చిత్రాలకు ఏడేసి చొప్పున నామినేషన్లు లభించాయి. అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న ఈ నాలుగు చిత్రాలూ ఉత్తమ చిత్రం విభాగంలో ఉండటం విశేషం. అలా ఉత్తమ చిత్రం అవార్డు కోసం మొత్తం పది చిత్రాలు పోటీ పడుతున్నాయి. అయితే నామినేషన్స్ దక్కించుకున్న వారిలో ఫైనల్‌గా ఎవరు ఆస్కార్ ప్రతిమను సొంతం చేసుకుంటారో చూడాలంటే ఈ ఏడాది మార్చి వరకూ ఆగాల్సిందే. మార్చి 27న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం జరగనున్న సంగతి తెలిసిందే. మన దేశం నుంచి ఢిల్లీకి చెందిన ఫిల్మ్‌మేకర్స్ రిటు థామస్, సుస్మిత్ ఘోష్ తీసిన ‘రైటింగ్ విత్ ఫైర్’ ఆస్కార్ నామినేషన్‌ను దక్కించుకుంది. బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో చోటు దక్కించుకుంది. ఇప్పటికే పదిహేనుకు పైగా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో అవార్డులు సాధించిన ఈ డాక్యుమెంటరీ ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకుంటే బాగుంటుందన్నది భారత సినీ ప్రేమికుల అభిలాష. దర్శకురాలు జేన్ కాంపియన్ రెండు విభాగాల్లో ఆస్కార్ అవార్డ్స్‌కు నామినేటయ్యారు. ‘ది పవర్ ఆఫ్ ది డాగ్’ సినిమాకు సంబంధించి ఉత్తమ దర్శకురాలు, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే విభాగాల్లో నామినేషన్స్ దక్కించుకున్నారు. ఈ ఫీట్ సాధించిన తొలి మహిళ కాంపియనే కావడం విశేషం. ∙డేమ్ జూడీ డెంచ్ (87) ‘బెల్ ఫాస్ట్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటిగా నామినేషన్ దక్కించుకున్నారు. ఆస్కార్ చరిత్రలో నామినేషన్ దక్కించుకున్న అత్యధిక వయసు ఉన్న నటిగా జ్యూడీ డెంచ్ చరిత్ర సృష్టించారు. ఇప్పటివరకు తన కెరీర్లో ఏడు భిన్నమైన విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకుని రికార్డు సృష్టించారు కెన్నెత్ బ్రానాగ్. ఇంతకుముందు డైరెక్టర్, యాక్టర్, సపోర్టింగ్ యాక్టర్, అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే, లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్నారు కెన్నెత్. తాజాగా ఆయన దర్శకత్వం వహించిన ‘బెల్ఫాస్ట్’కి బెస్ట్ పిక్చర్, ఒరిజినల్ స్క్రీన్‌ప్లే విభాగంలో చోటు దక్కింది. దీంతో కెన్నెత్ బ్రానాగ్ ఏడు విభాగాల్లో ఆస్కార్ నామినేషన్స్ దక్కించుకున్న తొలి వ్యక్తిగా రికార్డు సృష్టించారు. మొత్తం 23 విభాగాలకు సంబంధించిన నామినేషన్లను అవార్డు కమిటీ ప్రకటించింది. వాటిలో ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, నటి, నటీమణి నామినేషన్లు ఈ విధంగా... ఉత్తమ చిత్రం: బెల్ ఫాస్ట్, కోడా, డోన్ట్ లాకప్, డ్రైవ్ మై కార్, డ్యూన్, కింగ్ రిచర్డ్, లికోరైస్ పిజా, నైట్మేర్ అల్లీ. ది పవర్ ఆఫ్ ది డాగ్, వెస్ట్ సైడ్ స్టోరీ ఉత్తమ దర్శకుడు: జాన్ కాంపియన్ (ది పవర్ ఆఫ్ ది డాగ్), పాల్ థామస్ ఆండ్రూసన్ (లికోరైస్ పిజ్జా), స్టీవెన్ స్పీల్బర్గ్ (వెస్ట్ సైడ్ స్టోరీ), ర్యూసుకీ హమగుచి (డ్రైవ్ మై కార్), కెన్నెత్ బ్రానాగ్ (బెల్ఫాస్ట్) ఉత్తమ నటుడు: ఆండ్రూ గార్ఫీల్డ్ (టిక్, టిక్ ... బూమ్), విల్ స్మిత్ (కింగ్ రిచర్డ్), బెనెడిక్ట్ కంబర్ బ్యాచ్ (ది పవర్ ఆఫ్ ది డాగ్), డెంజిల్ వాషింగ్టన్ (ది ట్రాజెడీ ఆఫ్ మెక్బెత్), జేవియర్ బార్డెమ్ (బీయింగ్ ది రికార్డోస్) ఉత్తమ నటి: నికోల్ కిడ్‌మెన్ (బీయింగ్ ది రికార్డోస్), ఓలీవియా కోల్మన్ (ది లాస్ట్ డాటర్), క్రిస్టెన్ స్టీవర్ట్ (స్పెన్సర్), జెస్సికా కాస్టెయిన్ (ది ఐస్ ఆఫ్ టమ్మీ ఫేయీ), పెనెలోప్ క్రజ్ (సమాంతర తల్లులు) మళ్లీ నిరాశ బెస్ట్ ‘ఫీచర్ ఫిల్మ్స్ ఇన్ కన్సిడరేషన్ ఫర్ 94 ఆస్కార్ అవార్డ్స్’ అంటూ కొన్ని రోజుల క్రితం నామినేషన్ ఎంట్రీ పోటీలో ఆస్కార్ ఆకాడమీ ప్రకటించిన 276 చిత్రాల్లో తమిళ ‘ౖజై భీమ్’, మలయాళ ‘మరక్కర్: అరబికడలింటే సింహమ్’ చిత్రాలు చోటు దక్కించుకోగలిగాయి. కానీ ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్‌లో మాత్రం ఈ చిత్రాలకు నిరాశ తప్పలేదు. కానీ ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ ప్రకటించడానికి ముందు సోషల్ మీడియా, నెట్టింట్లో కాస్త డ్రామా నడిచింది. ‘ఆస్కార్ నామినేషన్స్ ఎవరికి దక్కుతాయి’ అనే చర్చలో భాగంగా అమెరికాకు చెందిన ఓ వెబ్సైట్ ఎడిటర్ జాక్వెలిన్ కోలే చేసిన ట్వీట్ వైరల్ అయింది. ‘జై భీమ్’ చిత్రానికి నామినేషన్ దక్కుతుంది. నన్ను నమ్మండి’ అంటూ జాక్వెలిన్ ట్వీట్ చేశారు. దీంతో ‘జై భీమ్’కు ఆస్కార్ నామినేషన్ దక్కుతుందా? అనే చర్చ జోరుగా నెట్టింట్లో సాగింది. -
ఆస్కార్ అవార్డ్స్: తుది జాబితాలో నిలిచిన 10 విభాగాలు ఇవే..
94th Oscar Awards Announced Shortlists Of 10 Categories: సినిమాల్లో నటీనటులకు మంచి గుర్తింపు వచ్చేది వారి యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయినప్పుడు. లేదా సినిమాలు భారీగా హిట్ టాక్ తెచ్చుకున్నప్పుడు. వీటితోపాటు నటీనటులను పలు అవార్డులు వరించినప్పుడు. అలా సినిమా అవార్డుల్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనది 'ఆస్కార్'. ప్రతీ నటుడు, నటికి ఈ అవార్డు ఒక కలగా ఉంటుంది. అలాంటి ఆస్కార్ అవార్డుల మహోత్సవం త్వరలో జరగనుంది. ఈసారి నిర్వహించే 94వ అకాడమీ అవార్డులను ఫిబ్రవరి 1, 2022న ప్రకటించనున్నారు. అయితే ఈ అవార్డుల కోసం 10 విభాగాల వరకు కుదించారు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన తుది జాబితాను ప్రకటించింది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్. ఈ తుది జాబితా ఎంపికైన చిత్రాలకు జనవరి 27, 2022 గురువారం నుంచి ఫిబ్రవరి 1, 2022 మంగళవారం వరకు ఓటింగ్ నిర్వహిస్తారు. 1. ఉత్తమ డాక్యుమెంటరీ (ఫీచర్) 94వ అకాడమీ అవార్డుల కోసం ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ విభాగంలో 15 సినిమాలు తుది జాబితాలో ఉన్నాయి. ఈ కేటగిరీలో 138 సినిమాలు అర్హత సాధించాయి. ఈ షార్ట్ లిస్ట్, నామినీలను డాక్యుమెంటరీకి సంబంధించిన బ్రాంచ్ సభ్యులు నిర్ణయిస్తారు. 2. ఉత్తమ డాక్యుమెంటరీ (షార్ట్ సబ్జెక్ట్) ఈ కేటగిరీలో మొత్తం 82 సినిమాలు అర్హత సాధించగా.. 15 చిత్రాలు తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 3. ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ ఈ ఉత్తమ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో 92 దేశాలకు చెందిన సినిమాలు అర్హత సాధించాయి. అందులో భారతదేశం నుంచి ఎంపికైన హీరోయిన్ నయనతార, దర్శకుడు విఘ్నేష్ శివన్ కలిసి నిర్మించిన కూళాంగల్ (అంతర్జాతీయంగా సినిమా పేరు 'పెబుల్స్') ఒకటి. తుదిజాబితాకు 15 సినిమాలు వెళ్లగా.. అందులో కూళాంగల్కు స్థానం దక్కలేదు. ఈ షార్ట్ లిస్ట్ చేసిన సినిమాలు చూశాక ఓటింగ్ నిర్వహిస్తారు. 4. మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ ఈ విభాగంలో 10 సినిమాలు తుదిజాబితాలో స్థానం సంపాదించాయి. అకాడమీ మేకప్ ఆర్టిస్ట్స్, హెయిర్ స్టైలిస్ట్‌ల బ్రాంచ్‌లోని సభ్యులందరూ జనవరి 30, 2022 ఆదివారం షార్ట్ లిస్ట్ చేసిన ప్రతి సినిమాను వీక్షించి నిర్ణయం తీసుకుంటారు. తర్వాత చివరి ఐదు చిత్రాలను నామినేట్ చేయడానికి బ్రాంచ్ సభ్యులు ఓటు వేస్తారు. 5. మ్యూజిక్ (ఒరిజినల్ స్కోర్) ఇందులో 136 ఒరిజినల్ స్కోర్లు అర్హత సాధిచగా 15 షార్ట్ లిస్ట్ అయ్యాయి. ఈ విభాగంలో కూడా బ్రాంచ్ సభ్యులు ఓటు వేస్తారు. 6. మ్యూజిక్ (ఒరిజినల్ సాంగ్) ఇందులో 84 పాటలు అర్హత సాధించగా 15 పాటలు తుది జాబితాలో చోటు దక్కించుకున్నాయి. 7. ఉత్తమ యానిమేటెడ్ షార్ట్‌ఫిల్మ్ ఈ కేటగిరీలో 82 సినిమాలకు 15 చిత్రాలు తుది జాబితాకు వెళ్లాయి. 8. ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్ ఈ ఉత్త లైవ్ యాక్షన్ షార్ట్‌ఫిల్మ్ విభాగంలో 145 సినిమాలు అర్హత సాధించగా.. 15 చిత్రాలు షార్ట్ లిస్ట్‌లోకి వెళ్లాయి. షార్ట్ ఫిల్మ్స్, ఫీచర్ యానిమేషన్ సభ్యులు, దర్శకులు, నిర్మాతలు, రచయితల శాఖల సభ్యులు షార్ట్‌లిస్ట్, నామినీలను నిర్ణయించడానికి ఓటు వేస్తారు. 9. సౌండ్ ఈ విభాగంలో 94వ అకాడమీ అవార్డుల కోసం 10 సినిమాలు ఫైనల్ లిస్ట్‌లో ఉన్నాయి. ఈ జాబితాలోని చిత్రాలను బ్రాంచ్ సభ్యులు జనవరి 28, 2022 శుక్రవారం వీక్షించి చివరిగా 5 సినిమాలను నామినేట్ చేసేందుకు ఓటు వేస్తారు. 10. ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్ ఈ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీలో 10 చిత్రాలు షార్ట్ లిస్ట్ అయ్యాయి. విజువల్ ఎఫెక్ట్స్ బ్రాంచ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ షార్ట్‌లిస్ట్‌ను నిర్ణయించింది. విజువల్ ఎఫెక్ట్స్ బ్రాంచ్‌లోని సభ్యులందరూ జనవరి 29, 2022 శనివారం నాడు షార్ట్‌లిస్ట్ చేయబడిన ప్రతి సినిమా నుంచి 10 నిమిషాల సారాంశాన్ని వీక్షిస్తారు. అనంతరం ఆస్కార్ నామినేషన్‌కు 5 సినిమాలను ఎంపిక చేసేందుకు ఓటు వేస్తారు. -
ఆస్కార్ స్టార్స్
-
ఆస్కార్‌లో కనిపించని ప్రియాంక..
బాలీవుడ్ నుంచి హాలీవుడ్‌కు వెళ్లి సత్తా చాటుకుంది ప్రియాంక చోప్రా. క్వాంటికో’ టీవీ సిరీస్‌తో పాటు బేవాచ్ మూవీతో హాలీవుడ్‌లోకీ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక గ్లోబల్ స్టార్ అయింది. దీంతో ఈ ఏడాదికి గానూ 90వ అకాడమీ అవార్డ్స్ సెర్మనీలో అవార్డులు అందించే అరుదైన ఛాన్స్‌ని ప్రియాంక దక్కించుకుంది. కానీ ఆ అవకాశాన్ని ప్రియాంక చేజార్చుకుంది. భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం లాస్ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో జరిగిన అకాడమీ అవార్డులు వేడుకలకు అనారోగ్యం కారంణంగా ప్రియాంక హాజరుకాలేకపోయింది. ఈ విషయాన్ని ప్రియాంక ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ' నామినెట్ అయిన వాళ్లందరికీ ఆల్ ద బెస్ట్.. అసలు రాలేని స్థితిలో ఉన్నా..' అని బెడ్‌పై ఉన్న ఫొటోను పోస్ట్ చేసింది. కాగా 2016, 2017 ఆస్కార్ వేడుకలో రెడ్ కార్పెట్‌పై నడిచి అలరించింది ప్రియాంక. -
ది షేప్ ఆఫ్ వాటర్; ఎలా ఉంటుంది?
తెరపై దర్శకుడు కథ చెప్పే తీరును బట్టి ఆయా పాత్రలతో మనం మమేకమవుతుండటం సహజం. ఆ కథానేపథ్యం.. మనిషిలోని క్రూరస్వభావానికి, వింతజీవుల అమాయకత్వానికి మధ్య కొనసాగే వైరమైతే.. మనం ఎవరిపక్షాన నిలబడతాం? ‘అవతార్’లో నావీలే గెలవాలని, ‘ఈగ’ లో సినిమాలోనూ ఈగే గెలవాలని ప్రేక్షకులు బలంగా కోరుకునేలాచేయడం గొప్ప సినిమాటిక్ టెక్నీక్. సరిగ్గా ఇదే టెక్నీక్‌ను అనుసరించి అటు కమర్షియల్‌గా, ఇటు అవార్డుల పరంగా అనూహ్యవిజయం సాధించాడు హాలీవుడ్ డైరెక్టర్ గిలెర్మో డెల్ టోరో. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఫ్యాంటసీ డ్రామా ‘ది షేప్ ఆఫ్ వాటర్’ ఆస్కార్-2018 ఉత్తమ చిత్రం పురస్కారాన్ని గెలుచుకుంది. లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో 90వ అకాడమీ అవార్డు వేడుకలు ఆదివారం రాత్రి(స్థానిక కాలమానం ప్రకారం) అట్టహాసంగా జరిగాయి. ఉత్తమ చిత్రంతోపాటు ఉత్తమ దర్శకుడు, ప్రొడక్షన్ డిజైన్, ఒరిజినల్ స్కోర్ విభాగాల్లో నాలుగు ఆస్కార్లను గెలుచుకుంది. ఇదీ కథ.. : అమెరికా-రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం జరుగుతున్న రోజుల్లో ఇరుదేశాలూ అంతరీక్షంలో సైతం పోట్లాడుకునే సందర్భమది. అప్పటికే రష్యా ఓ కుక్క(లైకా)ను స్పేస్‌లోకి పంపించిన విజయోత్సాహంలో ఉంటుంది. ఎలాగైనాసరే, వాళ్లకంటే గొప్ప ప్రయోగం చేసితీరాల్సిందేనని అమెరికా భావిస్తుంది. ఇందుకోసం బాల్టిమోర్(మేరీలాండ్)లోని ఓ రహస్య ప్రదేశంలో ప్రయోగాలు నిర్వహిస్తూఉంటుంది. ఆ ల్యాబ్‌లో హౌస్‌కీపింగ్ క్లీనర్స్‌లో ఓ మూగ యువతి ఉంటుంది. పేరు ఎలీసా ఎపోసిటో (సాలీ హాకిన్స్ పోషించారీ పాత్ర). తల్లిదండ్రులు ఎవరో తెలీని అనాథ. నదిలో కొట్టుకొచ్చిన ఆమెను రెస్క్యూహోం వాళ్లు చేరదీసిస్తారు. మాటలు రాకున్నా అద్భుతమైన ప్రజ్ఞ ఆమె సొంతం. సైగల భాషలో దిట్ట. అయితే తన మెడ భాగంలో ఏర్పడ్డ చారల గురించి నిత్యం మధనపడిపోతుంది. పక్క ఫ్లాట్‌లో నివసించే గిలే (మలివయ చిత్రకారుడైన గే పాత్ర ఇది), పని ప్రదేశంలో తోటి వర్కర్ జెల్డా (ఆక్టావియా స్పెన్సర్)లు ఇద్దరితో మాత్రమే ఎలీసా స్నేహంగా మెలుగుతూ ఉంటుంది. ఒకరోజు.. రహస్య ల్యాబ్ ఇన్చార్జి కల్నల్ రిచర్డ(మిచెల్ షానాన్) ఓ విచిత్రజీవిని బంధించి తీసుకొస్తాడు. అది మానవరూపంలో కనిపించే ఉభయచరం. దానికి శిక్షణ ఇచ్చి, అంతరీక్షంలోకి పంపాలన్నది ప్లాన్. అయితే ఆ హ్యూమనాయిడ్ క్రియేచర్ ఎంతకీ మాట వినకపోవడంతో క్రూరంగా వ్యవహరిస్తాడు కల్నల్. ఆ జీవిని బంధించిన గదిని శుభ్రం చేసేబాధ్యత ఎలీసాది. అలా ప్రతిరోజూ హ్యూమనాయిడ్ వద్దకెళ్లే ఆమె.. క్రమంగా దానితో స్నేహం పెంచుకుంటుంది. తనలాగే అనాధలాపడిఉన్న జీవిని మనసారా ప్రేమిస్తుంది. . శారీరకంగానూ ఒక్కటవుతారు: ఇదిక అంతరిక్ష ప్రయోగాలకు పనిరాదని నిర్ధారించుకున్న పిదప హ్యూమనాయిడ్‌ను చంపిపారేయాలనే నిర్ధారణకు వస్తారు. కల్నక్కు అసిస్టెంట్‌గా వ్యవహరించే డాక్టర్ రాబర్ట్ మాత్రం దాన్నలా బతికేఉంచి వేరే ప్రయోగాలు చేద్దామంటాడు. ఈ విఫలయత్నం బయటికి పొక్కితే అమెరికా పరువు పోతుందనే ఉన్నతాధికారులు సైతం చంపడానికే సయ్యంటారు. వాళ్ల సంభాషణను రహస్యంగా విన్న ఎలీసా.. ఎలాగైనాసరే ఆ జీవిని కాపాడాలనుకుంటుంది. ల్యాబ్‌లో అందరి కళ్లుగప్పి హ్యూమనాయిడ్‌ను తనతో తీసుకెళుతుంది. ఇంటికి దగ్గర్లోని నదీపాయలోకి నీళ్లు విడుదలయ్యే రోజున.. ఆ జీవిని వదిలిపెట్టాలని నిర్ణయించుకుంటుంది ఎలీసా. జీవిని ల్యాబ్ నుంచి తీసుకొచ్చే ప్లాన్‌కు మొదట నిరాకరించినా ఆతర్వాత సాయం చేసేందుకు స్నేహితులిద్దరూ అంగీకరిస్తారు. డాక్టర్ రాబర్ట్కూడా సహకరిస్తాడు. తన ఫ్లాట్‌లోని బాత్రూమ్లో.. ఉప్పునీళ్లతో నిండిన బాత్‌టబ్‌లో ఎలీసా, హ్యూమనాయిడ్లు ఇద్దరూ కలసి ఆటలాడుతూ, ప్రేమ సైగలు చేసుకుంటూ, శారీరకంగానూ ఒక్కటవుతారు. ఆమె మెడపై చారల రహస్యం : ఒక వర్షాకాలపు రాత్రి వింతజీవిని వదిలేసే సమయం ఆసన్నమవుతుంది. గిలే వెంటరాగా, హ్యూమనాయిడ్‌ను తీసుకుని కెనాల్ వద్దకొస్తుంది ఎలీసా. ఈ లోపే కల్నల్ రిచర్డ్ అక్కడికి వస్తాడు. హ్యూమనాయిడ్‌ను దొంగిలించడమేకాక, అధికారులతో తిట్లుతినడానికి కారకురాలైన ఎలీసాపై ఆగ్రహంతో రగిలిపోతాడు. తుపాకి తీసి హ్యూమనాయిడ్తోపాటు ఎలీసాను, వృధ్ధుడైన గిలేను కాల్చేస్తాడు. తనకున్న దివ్య శక్తితో బుల్లెట్ గాయం నుంచి క్షణాల్లో కోలుకుంటుందా జీవి. పట్టరాని కోపంలో తన పదునైన గోర్లను ఉపయోగించి రిచర్డ్ పీకను తెగ్గోసి చంపేస్తుంది. బుల్లెట్ దెబ్బతిన్న గిలేనూ దివ్యశక్తితో బతికిస్తుంది. ఈలోపే పోలీసులు అక్కడికి రావడంతో ఎలీసాను ఎత్తుకుని నీళ్లలోకి దూకేస్తుంది. నీళ్లలో ఊపిరాడక కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఎలీసాను కూడా దివ్యశక్తితో బతికించుకుంటుంది. అప్పుడు ఎలీసా మెడపైనున్న చారలు.. మొప్పలుగా మారి శ్వాస తీసుకుంటాయి. ‘ఆ విధంగా నీటి అడుగుభాగాన ఆ ప్రేమ జీవులు హాయిగా జీవించసాగాయి.. ’ అనే అర్థంలో ‘షేప్ ఆఫ్ వాటర్’ స్వరూపాన్ని వివరిస్తుండగా కథ ముగుస్తుంది. ఎలా ఉంది? : శబ్ధం చెయ్యకుండా ఎలీసా పాత్రలో నవరసాలను ఒలికించిన సాలీ హాకిన్స నటన మహాద్భుతంగా ఉంటుంది. ఆస్కార్ ఉత్తమ నటి అవార్డు మిస్సైనప్పికీ హాకిన్స ఇప్పటికే ఈ పాత్రకుగానూ లెక్కకుమిక్కిలి పురస్కారాలు అందుకుంది. సినిమా ప్రారంభం నుంచి ఎలీసాలో ఏదో తెలియని వింతగుణం ఉందనే భావనను దర్శకుడు చాలా బాగా ఎలివేట్ చేస్తాడు. ఒకదశలో ‘మనిషిగా ఉంటూ ఇంత ఇల్లాజికల్‌గా ఆలోచిస్తున్నావేంటి? అని స్నేహితులు ఎలీసాను ప్రశ్నిస్తారు. అలా చివరికి ఆమె కూడా హ్యూమనాయిడ్లా మారిపోవడాన్ని ప్రేక్షకులు అంగీకరించేలా పాత్రను అర్థవంతంగా చిత్రీకరించాడు దర్శకుడు టొరో. కోల్డ్‌వార్ నేపథ్యం తన కథకు మరింత బలాన్నిచ్చిందన్న దర్శకుడి మాటలు ఎంత నిజమో సినిమా చూసిన ప్రతిఒక్కరికీ అర్థమవుతుంది. ►ఫాక్స్ సెర్చింగ్ పిచ్చర్స్ డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్న ఈ సినిమా 2017 ఆగస్టులో వెనీస్లోనూ, 2017 డిసెంబర్లో యూఎస్‌లోనూ విడుదలైంది. నిడివి 123 నిమిషాలు. 19.5 మిలియన్ డాలర్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ‘షేప్’.. బాక్సాఫీస్ వద్ద 126.4 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టింది. -
ఆస్కార్ వేడుకలో శ్రీదేవికి నివాళి
లాస్ ఏంజెల్స్: 90వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైంది. లాస్ఏంజెల్స్లోని డాల్బీ థియేటర్లో భారత కాలమాన ప్రకారం సోమవారం ఉదయం 6.30 గంటలకు ప్రారంభమైన వేడుక సినీతారల సందోహం, సందడి మధ్య కన్నులపండువగా జరిగింది. అవార్డులు ప్రకటించే ఏడాదిలో కన్నుమూసిన సినీ ప్రముఖులకు నివాళులర్పించడం ఆస్కార్‌లో సంప్రదాయంగా వస్తోంది. దీనిలో భాగంగా ఇటీవల కన్నుమూసిన అతిలోక సుందరి శ్రీదేవిని ఆస్కార్ వేదిక గౌరవించింది. శ్రీదేవి జ్ఞాపకార్థం ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై అమెకు నివాళులర్పించారు. శ్రీదేవితో పాటు ప్రముఖ బాలీవుడ్ నటుడు, నిర్మాత శశి కపూర్‌కు కూడా స్మృత్యంజలి ఘటించారు. వీరిద్దరి చిత్రాలను బిగ్ స్క్రీన్ పై చూపుతూ చలనచిత్ర రంగానికి వీరు చేసిన సేవలను సభా వేదిక గుర్తు చేసుకుంది. శ్రీదేవి, శశి కపూర్లను స్మరించుకుంటూ ఎడ్డీ వెడ్డెర్ (పెరల్ జామ్ ఫేమ్) ప్రదర్శన జరిగింది. ‘ఇన్ మెమొరియం’ పేరుతో జరిగిన ఈ కార్యక్రమంలో జేమ్స్ బాండ్ స్టార్ రోజర్ మౌరే, మేరీ గోల్డ్బెర్గ్, జోహాన్ జోహోన్సన్,జాన్ హెర్డ్, శామ్ షెఫర్డ్‌లకు కూడా అకాడమీ అవార్డుల వేదిక నివాళర్పించింది. -
ఆస్కార్ రేసులో అదరగొట్టిన ‘షేప్ ఆఫ్ వాటర్’!
యావత్ సినీప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆస్కార్గా పేరొందిన 90వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్లో సినీతారల సందోహం, సందడి మధ్య కన్నులపండువగా జరిగింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డు ‘షేఫ్ ఆఫ్ వాటర్’ సినిమాను వరించగా.. ఉత్తమ నటుడు అవార్డును గ్యారీ ఓల్డ్మన్ (డార్కెస్ట్ హవర్), ఉత్తమ నటి అవార్డును ఫ్రాన్సెస్ మెక్‌డార్మమండ్ (త్రి బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబింగ్, మిసోరి) సొంతం చేసుకున్నారు. ఆస్కార్ ఉత్తమ దర్శకుడి అవార్డును ‘ద షేప్ ఆఫ్ వాటర్’ సినిమాకుగాను గిలెర్మో డెల్ టోరో సొంతం చేసుకున్నారు. మొత్తానికి 13 నామినేషన్లతో ఆస్కార్ అవార్డుల రేసులో అగ్రభాగంలో నిలిచిన గ్విలెర్మో డెల్ టోరో రొమాంటిక్ ఫాంటసీ ‘ద షేప్ ఆఫ్ వాటర్’కు అవార్డుల పంట పండిందని చెప్పవచ్చు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితోపాటు బెస్ట్ ప్రోడక్షన్ డిజైన్ అవార్డును ఈ చిత్రం ఎగరేసుకుపోయింది. ఇక బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డును ‘గెట్ ఔట్’ సినిమాకుగాను జోర్డన్ పీలె అందుకోగా, బెస్ట్ రైటింగ్ ఫర్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే అవార్డు ‘కాల్ మీ బై యువర్ నేమ్’ సినిమాను వరించింది. 8 నామినేషన్లతో రెండోస్థానంలో నిలిచిన క్రిస్టోఫర్ నోలాన్ వార్ ఎపిక్ ‘డంకిర్క్’ మూడు అవార్డులు సొంతం చేసుకోగా.. ఏడు నామినేషన్లతో సాధించిన మార్టిన్ మెక్‌డొనాగ్స్ బ్లాక్ కామెడీ ‘ద త్రి బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబింగ్, మిసోరి’ చిత్రానికి ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు సహా పలు అవార్డులు వరించాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: సామ్ రాక్‌వేల్ ( త్రి బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబింగ్, మిసోరి) బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ ఆర్టిస్ట్ : కజుహిరో సుజి, డేవిడ్ మాలినోవిస్కి, లూసీ సిబ్బిక్ (డార్కెస్ట్ హవర్) బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: మార్క్ బ్రిడ్జెస్ (ఫాంతమ్ థ్రెడ్) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్: బ్రియాన్ ఫోజెల్, డాన్ కోగన్ (ఇకారస్) బెస్ట్ ఫిలీం ఎడిటింగ్: లీ స్మిత్ (డంకిర్క్) బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: అలెక్స్ గిబ్సన్, రిచర్డ్ కింగ్ (డంకిర్క్) బెస్ట్ సౌండ్ మిక్సింగ్: మార్క్ వీంగార్టెన్, గ్రెగ్ లాండకెర్, గ్యారీ ఏ రిజ్జో బెస్ట్ ప్రోడక్షన్ డిజైన్: జెఫ్రీ ఏ మెల్విన్, షేన్ వీవు (ద షేప్ ఆఫ్ వాటర్) బెస్ట్ ఫారెన్ లాగ్వెంజ్ ఫిలిం ( ఉత్తమ విదేశీ చిత్రం): ఏ ఫెంటాస్టిక్ వుమన్ (చిలీ) ఉత్తమ సహాయనటి: అలిసన్ జేనీ (ఐ, టోన్యా) యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: డియర్ బాస్కెట్ బాల్ చిత్రానికి గాను గ్లెన్ కెనీ, కోబ్ బ్రయాంట్ అందుకున్నారు యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: కోకో చిత్రానికిగాను లీ ఉంక్రిచ్, డార్లా కే అండర్సన్ అందుకున్నారు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: బ్లేడ్ రన్నర్ చిత్రానికిగాను జాన్ నెల్సన్, పాల్ లాంబర్ట్, రిచర్డ్ ఆర్ హువర్, గెర్డ్ నెఫ్జర్ అందుకున్నారు (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గెలిచేదెవరు..?
-
ఆస్కార్... ఫుల్ జోర్!
హాలీవుడ్లో ‘ఆస్కార్’ ఫీవర్ మొదలైంది. ఆదివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం) లాస్ ఏంజిల్స్‌లో జరగనున్న ఈ అవార్డ్ వేడుక కోసం నిర్వాహకులు సర్వసన్నాహాలు చేస్తున్నారు. అవార్డుకు వేదికగా నిలవనున్న డాల్బీ థియేటర్ అందంగా ముస్తాబవుతోంది. ‘ది మోస్ట్ గ్లామరస్ నైట్’ కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తళతళలాడే బంగారు బొమ్మ వరించేది ఎవరిని అంటూ హాలీవుడ్లో జోరుగా చర్చ సాగుతోంది. ఈ అవార్డుల వేడుక గురించి పలు ఆసక్తికరమైన విశేషాలు... ♦ ఈ ఏడాది వివిధ విభాగాల్లో మొత్తం 20 మంది నటులు ఆస్కార్ కోసం పోటీపడుతున్నారు. అయితే ఇందులో 70 శాతం మంది ఇది వరకు ఆస్కార్ తీసుకున్నవాళ్లే కావడం విశేషం. ♦ ‘టైటానిక్’ ఫేమ్ లియోనార్డో డికాప్రియో ఈసారి ఉత్తమ చిత్రం విభాగాల్లో నిలిచిన రెండు చిత్రాల్లో తెరపై మెరిశారు. ఆ సినిమాల్లో ఒకటి... ‘ద రెవరెంట్’, మరొకటి ‘రూమ్’. విశేషం ఏంటంటే... ‘ద రెవరెంట్’ చిత్రంలో ఆయనది ప్రధాన పాత్ర. తద్వారా ఉత్తమ నటుడి విభాగంలో ఆయన ఆస్కార్ బరిలో నిలిచారు. ఇక, ఉత్తమ చిత్రం విభాగంలో ఉన్న మరో చిత్రం ‘రూమ్’లోనూ ఆయన కనిపిస్తారు. కానీ, ఫొటో రూపంలోనే. ఈ చిత్రంలోని బాల నటుడు, డికాప్రియోకు వీరాభిమాని. ఆ అభిమానాన్ని వ్యక్తపరిచే సన్నివేశాల్లో లియొనార్డో ఫొటో కనిపిస్తుంది. ♦ ప్రముఖ నటుడు సిల్వెస్టర్ స్టాలెన్ ‘క్రీడ్’ చిత్రంలో పోషించిన రాకీ బాల్బోవా అనే పాత్ర కోసం ఉత్తమ సహాయ నటుడి విభాగంలో నామి నేషన్ దక్కించుకున్నారు. ♦1976లో నటించిన ‘రాకీ’లో కూడా ఆయన పాత్ర పేరు రాకీ బాల్బోవానే. ఆ చిత్రంలో రాకీ బాల్బోవా అనేది హీరో పాత్ర అయితే తాజా చిత్రం ‘క్రీడ్’లో సహాయ నటుడి పాత్ర. అప్పట్లో సిల్వెస్టర్ స్టాలెన్ ఆ పాత్ర కోసం ఆస్కార్ నామినేషన్ దక్కించు కున్నారు. మొదటిసారి ఆయనకు నామినేషన్ దక్కింది ఆ పాత్రకే. ఇప్పుడుమళ్లీ అదే పేరుతో చేసిన పాత్రకు నామినేషన్ దక్కించుకోవడం విశేషం. ఇలా ఒకే పాత్ర పేరుతో ఆస్కార్ బరిలో నిలిచిన రెండో నటుడిగా స్టాలెన్ ఓ రికార్డ్ దక్కించుకున్నారు. మొదటి రికార్డ్ నటుడు పాల్ న్యూమ్యాన్ది. ♦ చిన్న వయసులోనే ఆస్కార్ దక్కించుకున్న నటిగా జెన్నీఫర్ లారె న్స్ 2013లో రికార్డు సాధించారు. ఆ తర్వాత ఆమె ఆస్కార్ బరిలో నిలుస్తూనే ఉన్నారు. ఈ ఏడాది కూడా నామినేషన్ దక్కించుకున్నారు. తనతో పాటు పోటీపడుతున్న తారలందరి కన్నా ఎక్కువగా సంపాదిస్తున్నది జెన్నిఫర్ లారెన్సే అట. ఈ క్యూట్ బ్యూటీ సంపాదన ఏడాదికి 358 కోట్ల రూపాయలట. మరి... జెన్నిఫరా... మజాకానా? ఇప్పుడు జెన్నీఫర్‌తో ఆస్కార్ బరిలో నిలిచిన తారలు కేట్ బ్లాంచెట్, బ్రీ లార్సెన్, ఛార్లోట్ రాంప్లింగ్, సాయోర్స్ రోనన్ల సంపాదన ఏడాదికి 41 కోట్ల రూపాయలు కూడా మించడం లేదట. ♦2013లో ‘గ్రావిటీ’, 2014లో ‘బర్డ్‌మ్యాన్’ చిత్రాలకు గాను ఉత్తమ ఛాయాగ్రాహకుడిగా ఆస్కార్ గెల్చు కున్న ఇమ్మాన్యూల్ లుబెజ్కీ ఈసారి ‘ద రెవరెంట్’ చిత్రంతో బరిలో నిలిచారు. ఈ ఏడాది కూడా ఇమ్మాన్యూల్ ఆస్కార్ దక్కించుకుంటే వరుసగా మూడుసార్లు ఆస్కార్ గెలిచి, హ్యాట్రిక్ సాధించిన కెమెరామ్యాన్‌గా చరిత్రలో నిలిచిపోతారు. ♦ స్టీవెన్ స్పీల్బెర్గ్ పేరు ఈ ఏడాది ఉత్తమ దర్శకుని విభాగంలో లేకపోయినా, నిర్మాతగా ఆయన పేరు ఉత్తమ చిత్ర విభాగం బరిలో ఉంది. స్వీయ దర్శక త్వంలో ఆయన నిర్మించిన ‘బ్రిడ్జ్ ఆఫ్ ద సై్పస్’ చిత్రానికి నామినేషన్ దక్కింది. ఇప్పటికే ఎక్కువ సార్లు ఆస్కార్‌కు నామినేట్ అయిన వ్యక్తిగా స్పీల్ బెర్గ్ చరిత్రలో నిలిచిపోయారు. 1982 నుంచి 2015 వరకూ ఆయన దర్శకత్వం వహించిన చిత్రాలకు ‘బెస్ట్ ఫిల్మ్’ కేటగిరీలో 9 సార్లు చోటు దక్కింది. దర్శకునిగా పలుసార్లు ఆస్కారందుకున్న స్పీల్బెర్గ్ నిర్మాతగా ఒకే ఒక్కసారి 1994లో ‘షిల్లిండర్స్ లిస్ట్’కి అందుకున్నారు. మరి.. ఈసారి ఏం జరుగుతుందో? ♦ ఏకంగా 50 ఆస్కార్ నామినేషన్లు సాధించిన పెద్ద వయస్కుడిగా ‘స్టార్ వార్స్- ద ఫోర్స్ ఎవేకన్స్’ సంగీత దర్శకుడు జాన్ విలియమ్స్ ఈసారి కూడా నామినేషన్ల జాబితాలో ఉన్నారు. వాల్ట్ డిస్నీ ఏకంగా 59 నామినేషన్లతో చరిత్ర సృష్టిస్తే, ఆ తర్వాత స్థానంతో జాన్ తన పేరును చరితార్థం చేసుకున్నారు. ఇప్పటివరకూ జాన్ 5 సార్లు ఆస్కార్లు అందుకున్నారు. మరి, ఈసారీ ఆస్కార్ అందుకుంటారా? ♦ అవార్డు అందుకోవడానికి వేదిక పైకి వచ్చే విజేతల్లో తడబాటు ఉండటం ఖాయం. అందుకే నామినేషన్ దక్కించుకునే వాళ్లతో ముందు రిహార్సల్ చేస్తారు. ‘అండ్ ద విన్నర్ ఈజ్...’ అంటూ అనౌన్స్ చేసి, వేదిక పైకి పిలిచి ముందుగానే తయారు చేయించిన డమ్మీ ఆస్కార్ అవార్డును అందజేస్తారు. అలా చేయడంవల్ల వేడుక రోజున విజేతలుగా నిలిచేవాళ్లల్లో కొంచెం ఖంగారు తగ్గుతుందని నిర్వాహకుల ఫీలింగ్. ♦ 14 ఏళ్లుగా డాల్బీ థియేటర్లోనే ఆస్కార్ వేడుక జరుగుతోంది. 3,400 సీటింగ్ సామ ర్థ్యమున్న ఈ వేడుక ప్రాంగణానికి 500 అడుగుల నిడివున్న రెడ్ కార్పెట్‌పై నడుచు కుంటూ రావాలి. ఆస్కార్ స్థాయి పేరున్న ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డ్స్ రెడ్ కార్పెట్ కన్నా ఆస్కార్ అవార్డ్స్ రెడ్‌కార్పెట్ నిడివి ఎక్కువ. గోల్డెన్ గ్లోబ్ రెడ్ కార్పెట్ నిడివి 437 అడుగులే. ♦ ఇప్పటివరకూ అత్యధిక సార్లు ఆస్కార్ అవార్డు కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన రికార్డు నటుడు బాబ్ హోప్‌కు దక్కుతుంది. 1940 నుంచి 1978 మధ్య 19 ఆస్కార్ అవార్డులకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఘనత ఆయనది. నటుడు క్రిస్ రాక్ ఈ ఏడాది హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ♦ ఈసారి అవార్డులు ప్రదానం చేసే తారల్లో మన ప్రియాంకా చోప్రా ఉండటం విశేషం. మరి ఫ్యాషన్ ఐకాన్ అనిపించుకున్న ప్రియాంక ఈ వేడుకల్లో ఎలాంటి దుస్తులు ధరిస్తారో, విదేశీయుల్ని ఏ స్థాయిలో ఆకట్టుకుంటారో చూడాలి. ట్రాఫిక్ మళ్లింపు! ప్రతిష్ఠాత్మకంగా జరిగే ఆస్కార్ అవార్డు వేడుకల్లో ఎలాంటి పొరపాట్లూ దొర్లకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పలువురు సినీ ప్రముఖులు ఈ వేడుకలో పాల్గొంటారు. అలాగే, ఇతర దేశాల నుంచి కూడా అతిథులు హాజరవుతారు. ఈ భారీ వేడుకను కవర్ చేయడానికి మీడియావాళ్లు కూడా భారీ ఎత్తున పాల్గొంటారు. ట్రాఫిక్ పరంగా ఎవరికీ ఏ అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. డాల్బీ థియేటర్ ఉన్న హాలీవుడ్, హైల్యాండ్ ఏరియాలను కనెక్ట్ చేస్తున్న ‘హాలీవుడ్ బౌలీవార్డ్’ వీధిని ఈ నెల 21 ఉదయం పది గంటల నుంచే మూసి వేశారు. మళ్లీ యథావిధిగా మార్చి 1న తెరవనున్నారు. ఆ వీధిలో నివసిస్తున్నవారికీ, అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుంది. 50 బొమ్మలకు 3 నెలలు! బంగారు రంగులో తళుకులీనే ఆస్కార్ బొమ్మకు ఈసారి కొత్త సొబగులు అద్దారు. 1920లో తయారు చేసిన ఆస్కార్ ప్రతిమను స్ఫూర్తిగా తీసుకుని, కొత్త బొమ్మను తయారు చేశారు. న్యూయార్క్‌కు చెందిన పొలిచ్ టల్లిక్స్ ఫైన్ ఆర్ట్ ఫౌండ్రీకి ఆస్కార్ బొమ్మలను తయారు చేసే బాధ్యతను అప్పగించారు నిర్వాహకులు. తొలిసారి ఈ అవకాశాన్ని దక్కించుకోవడంతో ఆ ఫౌండ్రీ దీన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. త్రీడీ ప్రింటింగ్ విధానంలో ప్రతిమల్ని తయారు చేసింది. వేదికపై ఇవ్వనున్న సుమారు 50 ఆస్కార్ ప్రతిమల్ని తయారు చేయడానికి దాదాపు మూడు నెలలు పట్టింది. గత 34 ఏళ్లల్లో ప్రదానం చేసిన ఆస్కార్ ప్రతిమల కన్నా ఈసారి ఇవ్వనున్న ప్రతిమ మరింత ఆకర్షణీయంగా ఉంటుందట. విజేతల వదనాల్లో కళకళలతో పాటు చేతిలో ఉన్న ప్రతిమ కూడా మిలమిల మెరిసిపోవడం ఖాయం అన్నమాట. -
2016 ఆస్కార్ నామినేషన్స్ ఇవే..
2016 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల ప్రదానానికి రంగం సిద్దమైతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కారానికి (88వ అకాడమీ అవార్డ్స్) నామినేషన్లను ఆస్కార్ కమిటీ వెల్లడించింది. లియోనార్డో డికాప్రియో సినిమా 'రెవనెంట్' ఈ ఏడాది అత్యధికంగా 12 విభాగాల్లో నామినేషన్లను సాధించింది. మరో చిత్రం మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్ చిత్రం పది అంశాల్లో పోటీ పడనుంది. ఉత్తమ చిత్రాల బరిలో ది బిగ్ షార్ట్, బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్, బ్రోక్లెన్, మాడ్ మాక్స్:ఫ్రే రోడ్, ది మార్టిన్, ది రెవెనెంట్, రోమ్, స్పాట్ లైట్ చిత్రాలు ఉన్నాయి. ఉత్తమ నటుడి విభాగంలో స్టార్ హీరోలు లియోనార్డో డికాప్రియో, బ్రయాన్ క్రాన్ స్టన్, మాట్ డామన్, మైఖెల్ ఫాస్బెండర్, ఎడ్డిల్ లు పోటీ పడుతున్నారు. ఉత్తమ నటి విభాగంలో కేట్ బ్లాంచెట్, బ్రై లార్సన్, జెన్నిఫర్ లారెన్స్, షార్లెట్ రాంఫ్లింగ్, రోనన్ లు నామినేషన్స్ పొందారు. కాగా టైటానిక్ సుందరి కేట్ విన్స్లెట్ 'స్టీవ్ జాబ్స్ ' సినిమాకు గాను.. ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ పొందింది. మరో వైపు ఉత్తమ విదేశీ భాషా చిత్రాల విభాగానికి నామినేషన్ దాఖలు చేసిన..మరాఠీ చిత్రం 'కోర్ట్' తుది నామినేషన్లలో చోటు సంపాదించలేక పోయింది. దీంతో ఈ ఏడాది కూడా భారతీయులకు నిరాశే మిగిలింది. ఫిబ్రవరి 28న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సం జరగనుంది. -
ఆస్కార్ బరిలో మన చిత్రం.. 'లయర్స్ డైస్'
జాతీయ అవార్డు పొందిన హిందీ చిత్రం 'లయర్స్ డైస్'కు ఆస్కార్ ఎంట్రీ లభించింది. 87వ అకాడమీ అవార్డుల బరిలో గీతాంజలి థాపా, నవాజుద్దీన్ సిద్దిఖీ నటించిన ఈ చిత్రానికి అవకాశం వచ్చింది. ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎఫ్ఐ) నియమించిన 12 మంది సభ్యుల జ్యూరీ ఈ చిత్రాన్ని ఎంపిక చేసింది. ఈసారి అత్యధికంగా రికార్డు స్థాయిలో 30 సినిమాలు దీనికోసం పోటీ పడ్డాయి. వీటిలోంచి లయర్స్ డైస్‌ను భారతదేశం తరఫున విదేశీ చిత్రాల కేటగిరీలో అవార్డు కోసం పంపుతున్నట్లు ఎఫ్ఎఫ్ఐ ప్రధాన కార్యదర్శి సుప్రాణ్ సేన్ తెలిపారు. మళయాళ నటి గీతూ మోహన్‌దాస్ తొలిసారిగా దర్శకత్వం వహించి తీసిన ఈ సినిమాలో తన మూడేళ్ల కూతురితో కలిసి ఓ మహిళ.. తప్పిపోయిన తన భర్త కోసం వెతుకుతుంటుంది. దారిలో వాళ్లకు సైన్యం నుంచి బయటికొచ్చిన ఓ వ్యక్తి కలుస్తాడు. అతడు వారు తమ గమ్యాన్ని చేరుకునేవరకు తోడుంటాడు. 61వ జాతీయ సినిమా అవార్డులలో ఈ సినిమాకుగాను గీతాంజలికి ఉత్తమనటి అవార్డు, రాజీవ్ రాయ్‌కి ఉత్తమ సినిమాటోగ్రఫీ అవార్డు వచ్చాయి. -
ఆస్కార్... కొన్ని ఆసక్తికరమైన విషయాలు!
ఆస్కార్ పేరెలా వచ్చిందంటే... ప్రతి పేరు వెనక ఓ కథ ఉంటుంది. అలాగే ‘ఆస్కార్’ పేరు వెనక కూడా ఓ కథ ఉంది. వాస్తవానికి ముందుగా ‘అకాడమీ అవార్డ్’ అనే పిలిచేవారు. అయితే, ఆస్కార్ ప్రతిమను చూసి, అకాడమీ లైబ్రేరియన్ మార్గరెట్ హెర్రిక్ అది తన మామయ్య ఆస్కార్ మాదిరిగా ఉందని పేర్కొన్నారట. అప్పట్నుంచీ ఆ ప్రతిమను ఆస్కార్ అని అక్కడి ఉద్యోగులు పిలవడం మొదలుపెట్టారు. చివరికి ఆ పేరే స్థిరపడింది. 1927లో ఆస్కార్ అవార్డుల ప్రదానం ప్రారంభమైతే, ఆస్కార్ అనే పేరు స్థిరపడింది 1939 నుంచి అని చరిత్ర చెబుతోంది. ఆస్కార్ బొమ్మ ఎలా తయారైందంటే... 1927లో ‘అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అవార్డ్స్ అండ్ సెన్సైస్’ అనే సంస్థ ప్రారంభించి, చిత్రరంగంలోని ప్రతిభావంతులకు అవార్డు ప్రదానం చేయాలనుకుంది ఓ కమిటీ. ఆ అవార్డు ప్రతిమ డిజైన్ని కళాదర్శకుడు సిడ్రిక్ గిబ్సన్స్ రూపొందించారు. నటీనటులు, రచయితలు, దర్శక, నిర్మాతలూ, సాంకేతిక నిపుణులు.. ఇలా చిత్రనిర్మాణంలో కీలక పాత్ర వహించే శాఖలను దృష్టిలో పెట్టుకుని ఐదు స్పోక్స్ ఉన్న ఒక ఫిలిం రీల్‌పై ఓ వీరుడు కత్తి పట్టుకుని నిలబడినట్లుగా ప్రతిమను డిజైన్ చేశారు. ఆస్కార్ ప్రతిమ ఖరీదు ఎంతంటే... ఒక్కో ఆస్కార్ ప్రతిమ తయారు చేయడానికి దాదాపు 40 గంటలు పడుతుందట. ఒక్కోదానికి సుమారు 17వేలకు పైగా ఖర్చవుతుంది. మొత్తం 24 శాఖలకు అవార్డులు ప్రదానం చేస్తారు. ఒక్కోసారి ఒక్కో విభాగంలో ఇద్దరికీ అవార్డులు ప్రదానం చేయాల్సి వస్తుంది. అందుకని, ముందు జాగ్రత్తగా 60 ప్రతిమల వరకు తయారు చేస్తారు. అవార్డ్ వేడుక పూర్తయ్యాక మిగిలిన ప్రతిమలను లాకర్లో ఉంచి సీల్ వేస్తారు. 1945 వరకు ఒక్కో ఏడాది ఒక్కో సైజ్‌లో ఆస్కార్ ప్రతిమ ఉండేది. అయితే, ఆ తర్వాత ఒకే సైజుని ఫిక్స్ చేశారు. 13.5 అంగుళాల పొడువు, 3.85 కిలోల బరువుతో ఉంటుంది ఆస్కార్ బొమ్మ. ఎక్కువసార్లు ఆస్కార్ సొంతం చేసుకున్నది ఎవరంటే... 86 ఏళ్ల ఆస్కార్ అవార్డ్ చరిత్రలో ఎక్కువసార్లు అవార్డులు అందుకున్న వ్యక్తి వాల్ట్ డిస్నీ. వివిధ విభాగాల్లో ఆయన 22సార్లు అవార్డు గెల్చుకున్నారు. అలాగే, ఉత్తమ నటిగా నాలుగుసార్లు అవార్డ్ పొందిన ఏకైక నటి కేథరిన్ హెప్బర్న్. ఎక్కువ అవార్డులు సొంతం చేసుకున్న దర్శకుడు జాన్‌ఫోర్డ్ కావడం విశేషం.