ఉత్తమ చిత్రం విభాగంలో పోటీపడుతున్న పది చిత్రాలు | 97th Oscar Awards: Academy Awards will be held on March 2 | Sakshi
Sakshi News home page

ఉత్తమ చిత్రం విభాగంలో పోటీపడుతున్న పది చిత్రాలు

Published Fri, Feb 28 2025 3:01 AM | Last Updated on Fri, Feb 28 2025 3:01 AM

97th Oscar Awards: Academy Awards will be held on March 2

రేసులో ముందున్న ‘ది బ్రూటలిస్ట్, ఎమిలియా పెరెజ్, అనోరా, ది సబ్‌స్టాన్స్‌’చిత్రాలు

ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవానికి సమయం దగ్గర పడింది. 97వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవంలో మొత్తం 23 విభాగాల్లో అవార్డులను ప్రదానం చేయనున్నారు. మార్చి 2న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఈ వేడుక గ్రాండ్‌గా జరగనుంది. దీంతో ప్రస్తుతం హాలీవుడ్‌తో పాటు ప్రపంచవ్యాప్త సినీ ప్రేమికుల చర్చ ఈ అవార్డుల విజేతలు ఎవరు? అనే టాపిక్‌పై జరుగుతోంది.

ముఖ్యంగా ఈ ఆస్కార్‌ అవార్డ్స్‌లో ప్రధాన విభాగమైన ‘ఉత్తమ చిత్రం’ పై ప్రత్యేక చర్చ జరుగుతోంది. వీరి వీరి గుమ్ముడి పండు... ఆస్కార్‌ విన్‌ అయ్యేదెవరు? ఉత్తమ చిత్రం ఏది? అనే తరహాలో హాట్‌ టాపిక్‌గా మారింది. ఇక ఈ విభాగంలో పోటీలో ఉన్న పది చిత్రాల గురించి తెలుసుకుందాం.

డ్రగ్‌ లీడర్‌ ట్రాన్స్‌జెండర్‌గా మారితే...
ఈ ఏడాది అత్యధికంగా 13 నామినేషన్లతో అవార్డ్స్‌ రేసులో దూసుకెళ్తున్న స్పానిష్‌ మ్యూజికల్‌ మూవీ ‘ఎమిలియా పెరెజ్‌’. ఆస్కార్‌ చరిత్రలో ఇన్ని నామినేషన్స్‌ దక్కించుకున్న నాన్‌–ఇంగ్లిష్‌ ఫిల్మ్‌గానూ ఈ చిత్రం రికార్డును సృష్టించింది. ఈ మూవీలో ఎమిలియాగా నటించిన ట్రాన్స్‌జెండర్‌ కార్లా సోఫియా గాస్కాన్‌కు బెస్ట్‌ యాక్ట్రస్‌ లీడ్‌ రోల్‌ నామినేషన్‌ దక్కింది. ఓ ట్రాన్స్‌ జెండర్‌ ఆస్కార్‌ నామినేషన్‌ను దక్కించుకోవడం కూడా తొలిసారి.

ఇంకా 82వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లోనూ ఈ చిత్రానికి పది నామినేషన్స్‌ లభించగా, మూడు అవార్డులు వచ్చాయి. వీటిలో ప్రధానమైన ‘బెస్ట్‌ మోషన్‌ పిక్చర్‌’ (మ్యూజికల్‌ లేదా కామెడీ) అవార్డు కూడా ఉంది. ఇలా అకాడమీ అవార్డ్స్, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్, బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో పదికిపైగా నామినేషన్స్‌ దక్కించుకున్న సినిమా ‘ఎమిలియా పెరెజ్‌’ కావడం విశేషం. అంతేకాదు... గత ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘జ్యూరీ ప్రైజ్, బెస్ట్‌ యాక్ట్రస్‌ అవార్డ్స్‌’ వరించాయి. మరి... ఈ ఆస్కార్‌ అవార్డ్స్‌లో మొత్తం 13 నామినేషన్స్‌లో ఈ మూవీకి ఎన్ని అవార్డులు వస్తాయో చూడాలి.

ఇక కథ విషయానికి వస్తే... ఓ మెక్సికన్‌ డ్రగ్‌ లార్డ్‌ తన ఐడెంటిటీని మార్చాలని ఓ లాయర్‌పై ఒత్తిడి తీసుకువస్తాడు. ఆ లాయర్‌ సాయంతో ట్రాన్స్‌ జెండర్‌లా మారిపోతాడు. అలాగే తన భార్యాపిల్లల బాగోగుల బాధ్యతలను కూడా ఆ లాయర్‌కే అప్పగిస్తాడు. నాలుగేళ్ల తర్వాత తిరిగి తన కుటుంబాన్ని కలుసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే తన భార్య మరొకరితో లైఫ్‌ను లీడ్‌ చేస్తుందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేస్తాడు? అన్నదే కథాంశం.

జాక్వెస్‌ ఆడియార్డ్‌ ఈ సినిమాను అద్భుతంగా డైరెక్ట్‌ చేశాడు. ఎమిలియా పెరెజ్‌గా కార్లా సోఫియా గాస్కాన్‌ యాక్టింగ్‌ సూపర్బ్‌గా ఉంటుంది. లాయర్‌గా జోయ్‌ సల్దానా రోల్‌ కూడా ఏ మాత్రం తీసిపోనిది. గాస్కాన్‌కు ఉత్తమ నటి విభాగంలో, సల్దానాకు ఉత్తమ సహాయ నటి విభాగంలో, జాక్వెస్‌ ఆడియార్డ్‌కు ఉత్తమ దర్శకుడి విభాగంలో ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్‌ దక్కాయి. మరి... ఉత్తమ చిత్రంగా  ‘ఎమిలియా పెరెజ్‌’ ఆస్కార్‌ అవార్డును ఎగరేసుకుపోతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

సెలబ్రిటీ వయసు తగ్గిపోతే...
ఈ ఏడాది అత్యధికంగా 13 నామినేషన్లతో అవార్డ్స్‌ రేసులో దూసుకెళ్తున్న స్పానిష్‌ మ్యూజికల్‌ మూవీ ‘ఎమిలియా పెరెజ్‌’. ఆస్కార్‌ చరిత్రలో ఇన్ని నామినేషన్స్‌ దక్కించుకున్న నాన్‌–ఇంగ్లిష్‌ ఫిల్మ్‌గానూ ఈ చిత్రం రికార్డును సృష్టించింది. ఈ మూవీలో ఎమిలియాగా నటించిన ట్రాన్స్‌జెండర్‌ కార్లా సోఫియా గాస్కాన్‌కు బెస్ట్‌ యాక్ట్రస్‌ లీడ్‌ రోల్‌ నామినేషన్‌ దక్కింది. ఓ ట్రాన్స్‌ జెండర్‌ ఆస్కార్‌ నామినేషన్‌ను దక్కించుకోవడం కూడా తొలిసారి.

ఇంకా 82వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లోనూ ఈ చిత్రానికి పది నామినేషన్స్‌ లభించగా, మూడు అవార్డులు వచ్చాయి. వీటిలో ప్రధానమైన ‘బెస్ట్‌ మోషన్‌ పిక్చర్‌’ (మ్యూజికల్‌ లేదా కామెడీ) అవార్డు కూడా ఉంది. ఇలా అకాడమీ అవార్డ్స్, గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్, బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో పదికిపైగా నామినేషన్స్‌ దక్కించుకున్న సినిమా ‘ఎమిలియా పెరెజ్‌’ కావడం విశేషం. అంతేకాదు... గత ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ‘జ్యూరీ ప్రైజ్, బెస్ట్‌ యాక్ట్రస్‌ అవార్డ్స్‌’ వరించాయి. మరి... ఈ ఆస్కార్‌ అవార్డ్స్‌లో మొత్తం 13 నామినేషన్స్‌లో ఈ మూవీకి ఎన్ని అవార్డులు వస్తాయో చూడాలి.

ఇక కథ విషయానికి వస్తే... ఓ మెక్సికన్‌ డ్రగ్‌ లార్డ్‌ తన ఐడెంటిటీని మార్చాలని ఓ లాయర్‌పై ఒత్తిడి తీసుకువస్తాడు. ఆ లాయర్‌ సాయంతో ట్రాన్స్‌ జెండర్‌లా మారిపోతాడు. అలాగే తన భార్యాపిల్లల బాగోగుల బాధ్యతలను కూడా ఆ లాయర్‌కే అప్పగిస్తాడు. నాలుగేళ్ల తర్వాత తిరిగి తన కుటుంబాన్ని కలుసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలోనే తన భార్య మరొకరితో లైఫ్‌ను లీడ్‌ చేస్తుందని తెలుసుకుంటాడు. ఆ తర్వాత అతను ఏం చేస్తాడు? అన్నదే కథాంశం.

జాక్వెస్‌ ఆడియార్డ్‌ ఈ సినిమాను అద్భుతంగా డైరెక్ట్‌ చేశాడు. ఎమిలియా పెరెజ్‌గా కార్లా సోఫియా గాస్కాన్‌ యాక్టింగ్‌ సూపర్బ్‌గా ఉంటుంది. లాయర్‌గా జోయ్‌ సల్దానా రోల్‌ కూడా ఏ మాత్రం తీసిపోనిది. గాస్కాన్‌కు ఉత్తమ నటి విభాగంలో, సల్దానాకు ఉత్తమ సహాయ నటి విభాగంలో, జాక్వెస్‌ ఆడియార్డ్‌కు ఉత్తమ దర్శకుడి విభాగంలో ఆస్కార్‌ అవార్డుల నామినేషన్స్‌ దక్కాయి. మరి... ఉత్తమ చిత్రంగా  ‘ఎమిలియా పెరెజ్‌’ ఆస్కార్‌ అవార్డును ఎగరేసుకుపోతుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.

దర్శకురాలు కోరాలీ ఫార్గెట్‌ డైరెక్ట్‌ చేసిన అమెరికన్‌ మూవీ ‘ది సబ్‌స్టాన్స్‌’ కలెక్షన్స్‌ పరంగా బ్లాక్‌ బస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాలో ఓ షో సెలబ్రెటీ వ్యాఖ్యాత ఎలిజబెత్‌గా డెమీ మూర్‌ అదిరిపోయే పెర్ఫార్మెన్స్‌ చేసింది. వయసు పెరిగిపోయి, స్క్రీన్‌ ప్రెజెన్స్‌ సరిగా లేదనే కారణంతో ఓ షో నుంచి ఎలిజబెత్‌ను ఆ షోప్రొడ్యూసర్‌ తొలగిస్తాడు. ఆ కోపంలో ఎలిజబెత్‌ వేగంగా కారును డ్రైవ్‌ చేసుకుంటూ వెళ్తుంటుంది. దారిలో ఓ ప్రమాదం జరిగి, ఓ హాస్పిటల్‌లో జాయిన్‌ కావాల్సి వస్తుంది.

అక్కడ ఆమెకు ఓ నర్సు ఓ ఇంజెక్షన్‌ ఇస్తుంది. దీంతో తిరిగి ఎలిజబెత్‌ యవ్వనంలోకి వస్తుంది. కానీ ఆ నర్సు చేసిన ఇంజక్షన్‌ పవర్‌ వారం రోజులు మాత్రమే ఉంటుంది. దీంతో ఎలిజబెత్‌ మరోసారి ఆ సీరమ్‌ను ఎలా ఇంజెక్ట్‌ చేసుకోగలిగింది? ఆ సీరమ్‌ లేకపోవడం వల్ల ఎలిజబెత్‌ ఆహార్యం ఏ విధంగా మారిపోయింది? అనే థ్రిల్లింగ్‌ అంశాలను ఈ సినిమాలో చూడొచ్చని హాలీవుడ్‌ మీడియా చెబుతోంది. ఈ ఏడాది మేలో జరిగిన 77వ కాన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ఉత్తమ స్క్రీన్‌ప్లే విభాగంలో ‘ది సబ్‌స్టాన్స్‌’ చిత్రానికి అవార్డులు వచ్చాయి. మరి... ఆస్కార్‌ ఉత్తమ చిత్రం అవార్డు కూడా ‘ది సబ్‌స్టాన్స్‌’ కి దక్కుతుందా? చూడాలి.

పోప్‌ ఎన్నిక
రచయిత రాబర్ట్‌ హారిస్‌ నవల ‘కాన్‌క్లేవ్‌’ (2016) ఆధారంగా అదే టైటిల్‌తో పీటర్‌ స్టృగన్‌ రాసిన స్టోరీ ఆధారంగా ఎడ్వర్డ్‌ బెర్గర్‌ డైరెక్షన్‌ చేసిన పోలిటికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘కాన్‌క్లేవ్‌’. యూఎస్‌ఏ, యూకే బాక్సాఫీస్‌ల వద్ద ఈ మూవీ సూపర్‌ వసూళ్లను రాబట్టుకోగలిగింది. రాల్ఫ్‌ ఫియన్నెస్, స్టాన్లీ టుస్సీ, జాన్‌ లిత్గో, ఇసాబెల్లా రోసెల్లిని ఈ మూవీలోని ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు. కేవలం రెండు గంటల నిడివి మాత్రమే ఉండే ఈ మూవీ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.

కథలోని థ్రిల్స్, ట్విస్ట్‌లు ఆడియన్స్‌ను ఆశ్చర్యపరుస్తాయి. థామస్‌ లారెన్స్‌ పాత్రలో రాల్ఫ్‌ ఫియన్నెస్‌ యాక్టింగ్‌ను ఆడియన్స్‌ను గుర్తుపెట్టుకుంటారు. ఇక స్టోరీ విషయానికి వస్తే... ప్రస్తుత పదవిలో ఉన్న పోప్‌ జాన్‌ పాల్‌ 2 హార్ట్‌ఎటాక్‌తో చనిపోతారు. దీంతో నెక్ట్స్‌ అధికారంలోకి రావాల్సిన పోప్‌ గురించి ఎన్నిక జరుగుతుంది.

ఓ భవనంలో ఈ ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నికలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయన్న ఆసక్తికర అంశాలతో ఈ మూవీ సాగుతుంది. రాజకీయం, నమ్మకం, విశ్వాసం... అనే మూడు ప్రధాన అంశాలతో ఈ మూవీ కథనం నడుస్తుంది. ఈ సినిమాకు గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో బెస్ట్‌ స్క్రీన్‌ప్లే అవార్డు వచ్చింది. బ్రిటిష్‌ అకాడమీ ఫిల్మ్‌ అవార్డ్స్‌లో ‘బెస్ట్‌ ఫిల్మ్, అవుట్‌ స్టాండింగ్‌ బ్రిటిష్‌ ఫిల్మ్‌’ వంటి అవార్డులు వచ్చాయి. మరి... ఆస్కార్‌ ఉత్తమ చిత్రం అవార్డు ‘కాన్‌క్లేవ్‌’ను వరిస్తుందా?...  చూడాలి.

డైలాన్‌ గోస్‌ ఎలక్ట్రికల్‌
అమెరికన్‌ ప్రముఖ సింగర్, సాంగ్‌ రైటర్‌ బాబ్‌ డైలాన్‌ బయోగ్రాఫికల్‌ మ్యూజికల్‌ డ్రామా ‘ఎ కంప్లీట్‌ అన్‌నోన్‌’. ఎలిజా వాల్డ్‌ రాసిన ‘డైలాన్‌ గోస్‌ ఎలక్ట్రిక్‌!’ బుక్‌ ఆధారంగా ఈ మూవీని డైరెక్ట్‌ చేశారు జేమ్స్‌ మాంగోల్డ్‌. బాబ్‌ డైలాన్‌ ఎవరిని స్ఫూర్తిగా తీసుకుని మ్యూజిక్‌ రంగంలోకి వచ్చారు? ఆయన వృత్తి–వ్యక్తిగత జీవితాల్లో ఎత్తుపల్లాలు... వంటి అంశాల నేపథ్యంలో ఈ మూవీ సాగుతుంది. ఈ మూవీలో బాబ్‌ డైలాన్‌గా తిమోతి అద్భుతంగా నటించారు. ఎడ్వర్ట్‌ నార్టన్, ఎల్లే ఫ్యానింగ్, మోనికా బార్భారో, బోయ్డ్‌ హోల్‌బ్రూక్, స్కూట్‌ మైక్‌నైరీ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు. ఈ మూవీ ఉత్తమ చిత్రంతో పాటు మొత్తంగా 8 విభాగాల్లో ఆస్కార్‌ నామినేషన్స్‌ను దక్కించుకుంది. మరి...ఫైనల్‌గా ఎన్ని అవార్డులు వస్తాయో చూడాలి.

ఆసాధారణ పోరాటం
అదృశ్యమైన తన భర్త ఆచూకీ, ఫ్యామిలీ సంరక్షణ కోసం ఓ మహిళ చేసే అసాధారణ పోరాటం నేపథ్యంలో సాగే పోలిటికల్‌ బయోగ్రాఫికల్‌ డ్రామా ‘ఐయామ్‌ స్టిల్‌ హియర్‌’. ఈ సినిమాలోని మెయిన్‌ లీడ్‌ యూనిస్‌ పైవా పాత్రలో బ్రెజిలియన్‌ నటి ఫెర్నాండా టోరెస్‌ తన నటనతో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. ఈ సినిమాలోని ఆమె నటనకు యాక్టింగ్‌లో విభాగంలో ఈ ఏడాది ఆస్కార్‌ నామినేషన్‌ కూడా దక్కింది. అలాగే బెస్ట్‌ పిక్చర్, బెస్ట్‌ ఇంటర్‌నేషనల్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ విభాగాల్లోనూ ఈ చిత్రానికి నామినేషన్స్‌ దక్కాయి.

ఈ సినిమాను వాల్టెర్‌ సల్లెస్‌ డైరెక్ట్‌ చేశారు. బ్రెజిలియన్‌ రచయిత మార్సెలో రూబెన్స్‌ పైవా రాసిన ‘ఐయామ్‌ స్టిల్‌ హియర్‌’ బుక్‌ ఆధారంగా ఈ సినిమా తీశారు. ఈ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే. ఆస్కార్‌ చరిత్రలో ఓ బ్రెజిలియన్‌ నిర్మించిన మూవీ ఉత్తమ చిత్రం విభాగంలో నామినేషన్‌ దక్కించుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఒకవేళ ఈ సినిమాకు అవార్డు వస్తే అది ఆస్కార్‌ హిస్టరీలో ఓ రికార్డుగా నిలిచిపోతుంది.

ఓ ఆర్కిటెక్ట్‌ వలస జీవితం
ఆస్కార్‌ అవార్డ్స్‌లోని ప్రధాన విభాగాలైన ‘ఉత్తమ చిత్రం, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు’ నామినేషన్స్‌తో సహా మొత్తం పది నామినేషన్లతో అందరి దృష్టినీ ఆకర్షించింది ‘ది బ్రూటలిస్ట్‌’ చిత్రం. బ్రాడీ కార్బెట్‌ డైరెక్షన్‌లోని ఈ పీరియాడికల్‌ ఫిల్మ్‌లో అడ్రియన్‌ బ్రోడీ, ఫెలిసిటీ జోన్స్, గై పియర్స్, జో ఆల్విన్‌లు ప్రధాన పాత్రల్లో నటించారు.

కొన్ని కారణాల వల్ల కుటుంబానికి దూరమై, యూరప్‌ నుంచి అమెరికా వలస వెళ్లిన ఓ ప్రతిభావంతుడైన ఆర్కిటెక్ట్‌ అక్కడ ఎలాంటి కష్టాలు అనుభవించాడు? ఎలాంటి అవమానాలను ఎదుర్కొని, తిరిగి తన వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని ఎలా పునరుద్ధరించుకోగలిగాడు? తన భార్యను మళ్లీ తిరిగి ఏ విధమైన పరిస్థితుల్లో కలుసుకోగలిగాడు? అనే అంశాల నేపథ్యంలో ఈ సినిమా కథనం సాగుతుంది. ఆర్కిటెక్ట్‌గా అడ్రియన్‌ అద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ ఇచ్చాడు.

78వ బ్రిటిష్‌ ఫిల్మ్‌ అకాడమీ అవార్డ్స్‌లో ఈ చిత్రం నాలుగు అవార్డులను దక్కించుకుంది. అలాగే ఈ ఏడాది జరిగిన 82వ గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డ్స్‌లో ప్రధాన విభాగమైన ‘బెస్ట్‌ మోషన్‌ పిక్చర్‌’ అవార్డుతో కలిపి మూడు అవార్డులను గెలుచుకుంది. ఇంకా 2024లో విడుదలైన అమెరికన్‌ ఫిల్మ్స్‌ టాప్‌ టెన్‌లో ‘ది బ్రూటలిస్ట్‌’ చిత్రం కూడా ఒకటి. మరి... ఈ ‘ది బ్రూటలిస్ట్‌’ ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా నిలుస్తుందా? లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.  

అనోరా ప్రేమకథ  
న్యూయార్క్‌లోని క్లబ్‌లో అనోరా ఓ వేశ్యగా పని చేస్తుంటుంది. సంపన్న కుటుంబానికి చెందిన ఓ అబ్బాయి అనోరాను ఇష్టపడతాడు. అనోరా కూడా ఆ అబ్బాయితో ప్రేమలో పడుతుంది. ఇద్దరూ ప్రేమించుకుంటారు. ఇంతలో ఈ విషయం మెక్సికోలో ఉన్న అబ్బాయి తండ్రికి తెలుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అనోరా జీవితం ఏ విధంగా ప్రభావితమైంది? అన్నది క్లుప్తంగా ‘అనోరా’ సినిమా కథాంశం. అనోరాగా టైటిల్‌ రోల్‌లో మైకీ మాడిసన్‌ పెర్ఫార్మెన్స్‌ను ఇరగదీశారు.

ఈ నటన ఆమెకు ఆస్కార్‌ నామినేషన్‌ను కూడా తెచ్చిపెట్టింది. మాడిసన్‌ నుంచి మంచి నటనను రాబట్టుకున్న ఈ చిత్రదర్శకుడు సీన్‌ బేకర్‌కు కూడా ఆస్కార్‌ దర్శకుడి విభాగంలో నామినేషన్‌ దక్కింది. గత ఏడాది జరిగిన కాన్స్‌ ఫిల్మ్‌ఫెస్టివల్‌లో ప్రతిష్టాత్మకమైన ఫామ్‌ డిఓర్‌ అవార్డు ఈ అమెరికన్‌ ‘అనోరా’ సినిమాకు దక్కింది. మరి... ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా అనోరా అవార్డును గెలిచి, ఔరా... అనిపిస్తుందా? ఏమో చూడాలి.

ఇద్దరు మిత్రులు
ఉత్తమ చిత్రం విభాగంతో పాటు పది నామినేషన్స్‌ను సొంతం చేసుకుంది అమెరికన్‌ మ్యూజికల్‌ ఫాంటసీ మూవీ ‘వీకెడ్‌’ . స్టీఫెన్‌ స్క్వార్ట్‌›్జ– విన్నీ హోల్జ్‌మ్యాన్‌ల స్టేజ్‌ షో ‘వికెడ్‌: ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ ది విచెస్‌ ఆఫ్‌ ఓజ్‌’ అనే స్టేజీ డ్రామా ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. జాన్‌.ఎమ్‌.చు ఈ సినిమాకు దర్శకుడు. సింథి యా ఎరివో, అరియానా గ్రాండే, జోనాథన్‌ బెయిలీ ఈ సినిమాలో లీడ్‌ రోల్స్‌ చేశారు.

ఇద్దరు స్నేహితుల మధ్య ఏర్పడిన అపార్థాలు, వారి జీవితాలను ఎలా ప్రభావితం చేశాయి? అనే పాయింట్‌ ఆఫ్‌ వ్యూలో ఈ సినిమా కథనం ఉంటుంది. ఎల్ఫాబాగా సింథియా, గ్లిండాగా అరియానాలు ఇద్దరు మంచి నటనను కనబరిచారు. సింథియాకు ఉత్తమ నటి విభాగంలో నామినేషన్‌ దక్కగా, అరియానాకు ఉత్తమ సహాయ నటిగా నామినేషన్‌ దక్కింది. వీరి స్నేహానికి ఆస్కార్‌ ఉత్తమ చిత్రం అవార్డు వరిస్తుందా? ఆస్కార్‌ ఓటర్స్‌ను మెప్పించిందా? చూడాలి.

స్నేహం కోసం...
అమెరికన్‌ నవలా రచయిత కోల్సన్‌ వైట్‌హెడ్‌ రాసిన ‘ది నికెల్‌ బాయ్స్‌’ పుస్తకం ఆధారంగా రూపోందిన అమెరికన్‌ హిస్టారికల్‌ మూవీ ‘నికెల్‌ బాయ్స్‌’. రామెల్‌ రాస్‌ డైరెక్ట్‌ చేశారు. ఏతాన్‌ హెరిస్సే, బ్రాండన్‌ విల్సన్‌ నటించారు. ఉన్నత చదువులు చదవాలనుకున్న ఎల్వుడ్‌ (ఏతాన్‌) ఓ శిక్ష కారణంగా కఠినమైన నిబంధనలు ఉన్న ఓ కళాశాలకు వెళ్తాడు. అక్కడ టర్నర్‌ (బ్రాండన్‌)తో స్నేహం ఏర్పడుతుంది. ఆ తర్వాత వీరిద్దరి స్నేహం,చదువు, వీరి జీవితాలు ఏమయ్యాయి? అన్నదే ఈ చిత్రకథ. ఈ నికెల్‌ బాయ్స్‌ ఆస్కార్‌ బెస్ట్‌ పిక్చర్స్‌తో పాటు, బెస్ట్‌ అడాప్టెడ్‌ స్క్రీన్‌ప్లే విభాగంలోనూ నామినేషన్స్‌ దక్కించుకుంది.  

పగ... ప్రేమ
2021లో వచ్చిన అమెరికన్‌ ఫిల్మ్‌ ‘డ్యూన్‌’కు సీక్వెల్‌గా గత ఏడాది ‘డ్యూన్‌ పార్టు 2’ వచ్చింది. తిమోతీ, జెండయా, ఫెర్గుసన్‌ ప్రధాన పాత్రలు పోషించారు. తొలి భాగం తీసిన డెనీ విల్నేవ్‌యే రెండో భాగాన్ని కూడా డైరెక్ట్‌ చేశారు. శత్రువుల చేతిలో తండ్రి మరణించిన తర్వాత తల్లి జెస్సికా (రెబెక్కా ఫెర్గూసన్‌)తో మరో గ్రహానికి వస్తాడు పాల్‌ అట్రీడియస్‌ (తిమోతీ). తమ రక్షకుడి కోసం ఆ గ్రహం వాసులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తుంటారు. ఇదే అదునుగా తన కొడుకు అట్రిడియస్‌యే ఆ రక్షకుడు అని, ఆ గ్రహం వాసులను నమ్మించేందుకు ప్రయత్నిస్తుంది జెస్సికా.

కానీ ఇది అట్రీడియస్‌కు ఇష్టం ఉండదు. పైగా చాని(జెండయా)తో ప్రేమలో పడతాడు. ఈ లోపు తన తండ్రిని చంపినవారే, అట్రిడియస్‌కి మళ్లీ తారసపడతారు. మరి... అట్రిడియస్‌ పగ తీర్చుకున్నాడా? అన్నది ‘డ్యూన్‌ 2’ స్టోరీ. ఈ సినిమాకు ఐదు ఆస్కార్‌ నామినేషన్స్‌ దక్కాయి. వీటిలో ఉత్తమ చిత్రం విభాగం కూడా ఉంది. ఇక ఫ్రాంక్‌ హార్బెర్ట్‌ రాసిన ‘డ్యూన్‌’ పుస్తకం ఆధారంగా ‘డ్యూన్‌’ ఫ్రాంచైజీ సైన్స్‌ఫిక్షన్‌ మూవీస్‌ రూపోందుతున్న సంగతి తెలిసిందే.  ఈ పది చిత్రాల్లో ఆస్కార్‌ ఉత్తమ చిత్రంగా ఏ మూవీ నిలుస్తుందనే ప్రశ్నకు వచ్చే నెల 2న తెరపడుతుంది. – ముసిమి శివాంజనేయులు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement