2016 ఆస్కార్ నామినేషన్స్ ఇవే..
2016 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల ప్రదానానికి రంగం సిద్దమైతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కారానికి (88వ అకాడమీ అవార్డ్స్) నామినేషన్లను ఆస్కార్ కమిటీ వెల్లడించింది. లియోనార్డో డికాప్రియో సినిమా 'రెవనెంట్' ఈ ఏడాది అత్యధికంగా 12 విభాగాల్లో నామినేషన్లను సాధించింది.
మరో చిత్రం మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్ చిత్రం పది అంశాల్లో పోటీ పడనుంది. ఉత్తమ చిత్రాల బరిలో ది బిగ్ షార్ట్, బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్, బ్రోక్లెన్, మాడ్ మాక్స్:ఫ్రే రోడ్, ది మార్టిన్, ది రెవెనెంట్, రోమ్, స్పాట్ లైట్ చిత్రాలు ఉన్నాయి.
ఉత్తమ నటుడి విభాగంలో స్టార్ హీరోలు లియోనార్డో డికాప్రియో, బ్రయాన్ క్రాన్ స్టన్, మాట్ డామన్, మైఖెల్ ఫాస్బెండర్, ఎడ్డిల్ లు పోటీ పడుతున్నారు. ఉత్తమ నటి విభాగంలో కేట్ బ్లాంచెట్, బ్రై లార్సన్, జెన్నిఫర్ లారెన్స్, షార్లెట్ రాంఫ్లింగ్, రోనన్ లు నామినేషన్స్ పొందారు. కాగా టైటానిక్ సుందరి కేట్ విన్స్లెట్ 'స్టీవ్ జాబ్స్ ' సినిమాకు గాను.. ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ పొందింది.
మరో వైపు ఉత్తమ విదేశీ భాషా చిత్రాల విభాగానికి నామినేషన్ దాఖలు చేసిన..మరాఠీ చిత్రం 'కోర్ట్' తుది నామినేషన్లలో చోటు సంపాదించలేక పోయింది. దీంతో ఈ ఏడాది కూడా భారతీయులకు నిరాశే మిగిలింది. ఫిబ్రవరి 28న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సం జరగనుంది.