2016 ఆస్కార్ అవార్డుల ప్రదానం | Alicia Vikander wins the oscar in the 'Best Actress in a Supporting role' category for the danish Girl. | Sakshi
Sakshi News home page

2016 ఆస్కార్ అవార్డుల ప్రదానం

Published Mon, Feb 29 2016 8:18 AM | Last Updated on Sun, Sep 3 2017 6:42 PM

2016 ఆస్కార్ అవార్డుల ప్రదానం

2016 ఆస్కార్ అవార్డుల ప్రదానం

లాస్ఏంజిల్స్ :  2016 సంవత్సరానికి ఆస్కార్ పురస్కారానికి  (88వ అకాడమీ అవార్డ్స్) తెర లేచింది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్లో వైభవంగా ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అమెరికాలోని లాస్ ఏజెల్స్లో హాలీవుడ్ డాల్బీ థియేటర్లో ఈ వేడుగ అట్టహాసంగా జరుగుతోంది.  ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వివిధ విభాగాల్లో మొత్తం 20 మంది నటులు ఆస్కార్ కోసం పోటీపడుతున్నారు. అయితే ఇందులో 70 శాతం మంది ఇది వరకు ఆస్కార్
తీసుకున్నవాళ్లే కావడం విశేషం.

ఇక 'టైటానిక్' ఫేమ్  లియోనార్డో డికాప్రియో సినిమా 'రెవనెంట్'  ఈ ఏడాది అత్యధికంగా 12 విభాగాల్లో  నామినేషన్లను సాధించింది. ఇక మరో చిత్రం మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్ చిత్రం పది అంశాల్లో పోటీ పడనుంది.  ఉత్తమ చిత్రాల బరిలో ది బిగ్ షార్ట్,  బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్,  బ్రోక్లెన్,  మాడ్ మాక్స్:ఫ్రే రోడ్, ది మార్టిన్, ది రెవెనెంట్, రోమ్, స్పాట్ లైట్ చిత్రాలు ఉన్నాయి.

ఉత్తమ నటుడి విభాగంలో స్టార్ హీరోలు లియోనార్డో డికాప్రియో, బ్రయాన్ క్రాన్ స్టన్, మాట్ డామన్, మైఖెల్ ఫాస్బెండర్, ఎడ్డిల్ లు పోటీ పడుతున్నారు. ఉత్తమ నటి విభాగంలో కేట్ బ్లాంచెట్, బ్రై లార్సన్, జెన్నిఫర్ లారెన్స్, షార్లెట్ రాంఫ్లింగ్, రోనన్ లు నామినేషన్స్ పొందారు. కాగా టైటానిక్ సుందరి కేట్ విన్స్లెట్ 'స్టీవ్ జాబ్స్ ' సినిమాకు గాను.. ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ పొందింది.

88వ ఆస్కార్ అవార్డులు ఇవీ...
88వ ఆస్కార్ అవార్డులు ఇవీ...
ఉత్తమ నటుడు : లియెనార్డో డి కాప్రియో (ది రివెనెంట్)
ఉత్తమ నటి : బ్రి లార్సన్ (రూమ్)
ఉత్తమ సహాయ నటి అలీషియా వికందర్ ( ద డానిష్ గర్ల్)
ఉత్తమ స్క్రీన్ ప్లే- స్పాట్ లైట్

బెస్ట్ కాస్ట్యుమ్ డిజైనర్ -జెన్నీబీవన్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్)
మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్)
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్:  కొలిన్ గిబ్సన్, లిసా థామ్సన్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్)
బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: మార్గరేట్ సిక్సల్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్)
బెస్ట్ సౌండ్ ఎడిటింగ్:డేవిడ్ వైట్ అండ్ మార్క్ మంగిని (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్)


బెస్ట్ సినిమాటోగ్రఫీ ...ఎమాన్యువల్ లుబెజ్కి (ద రెవెనంట్)
బెస్ట్ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ (ఇన్సైడ్ అవుట్)
బెస్ట్ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్ (ది బేర్ స్టోరీ)
బెస్ట్ సహాయ నటుడు మార్క్ రిలాన్స్(బ్రిడ్జి ఆఫ్ స్పైస్)
బెస్ట్ డైరెక్టర్ అలెజాండ్రో (ది రివెనెంట్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement