Alicia Vikander
-
బాక్సాఫీస్ రైడర్
‘బ్లాక్‌పాంథర్’ జోరు మెల్లిగా తగ్గింది. వచ్చే నెల విడుదలయ్యే ‘అవెంజర్స్’కు ఇప్పట్నుంచే హంగామా మొదలైంది. ఇక ఈ మధ్యన కూడా కొన్ని సినిమాలు వస్తున్నా ఈ రెండు పెద్ద సినిమాల స్థాయి మాత్రం ఇంకో సినిమాకు లేదు. అయినప్పటికీ గత శుక్రవారం విడుదలైన ‘టూంబ్ రైడర్’ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఎలీసియా వికాండర్ మెయిన్ లీడ్ చేసిన ఈ సినిమా ఆద్యంతం యాక్షన్ అడ్వెంచర్ ఎపిసోడ్స్‌తో అభిమానులను మెప్పిస్తోంది. ముఖ్యంగా ఎలీసియా యాక్టింగ్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. అమెరికాలో ఈ వారం టాప్ ప్లేస్‌లో టూంబ్ రైడరే ఉంది. ఇక ఇండియాలోనూ ఈ సినిమాకు మొదట్నుంచీ మంచి ప్రమోషన్స్ చేయడంతో ఓపెనింగ్స్ బాగున్నాయి. రోర్ ఉతౌగ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు.. అదే పేరుతో వచ్చి, పాపులర్ అయిన వీడియో గేమ్ ప్రేరణ. -
'మ్యాడ్ మ్యాక్స్'కు అవార్డుల పంట
లాస్ ఏంజిల్స్ : ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నతంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. 88వ ఆస్కార్ అవార్డుల పురస్కారాల్లో ఈసారి 'మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్' అవార్డుల రేసులో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఏకంగా ఆరు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించిన మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ చిత్రం 10 నామినేషన్లను దక్కించుకున్న విషయం తెలిసిందే. 'మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్' చిత్రం కథనానికి వెళితే ఓ మహిళ, మరి కొందరు మహిళా ఖైదీలతో కలిసి చేసిన పోరాటానికి మ్యాక్స్ అనే వ్యక్తి సహాయం చేస్తాడు. వారు తమ సొంత భూమిని వెదుక్కుంటూ జీవించడానికి చేసే పోరాటమే ఈ చిత్రం. కాస్ట్యూమ్ డిజైన్‌లో జెన్నీ బీవాన్‌కు ఆస్కార్ దక్కింది. జెన్సీ బీవాన్‌కు ఆస్కార్ దక్కడం ఇదో రెండోసారి. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్న కొలిన్ గిబ్సన్, లీసా థాంప్సన్ కూడా ఆస్కార్‌ను గెలుచుకున్నారు. మేకప్-హెయిర్ స్టయిల్ విభాగంలోనూ మ్యాడ్ మ్యాక్స్ ఫిల్మ్‌కే ఆస్కార్ దక్కింది. ఫిల్మ్ ఎడిటింగ్‌లోనూ ఫ్యూరీ రోడ్‌కు ఆస్కార్ దక్కింది. మార్గరేట్ సిక్సల్ ఆ కేటగిరీలో ఆస్కార్‌ను అందుకున్నారు. సౌండ్ ఎడిటింగ్‌లో మార్క్ మాంగిని, డేవిడ్ వైట్లు ఆస్కార్లను అందుకున్నారు. సౌండ్ మిక్సింగ్ విభాగంలో క్రిస్ జెన్కిన్స్, గ్రెగ్ రుడాల్ఫ్, బెన్ ఓస్మో ఆస్కార్‌ను గెలుచుకున్నారు. ఉత్తమ్ ఎడిటింగ్ (సీక్సెల్) కాస్టూమ్ డిజైనింగ్(జెన్నీ బెవన్) ప్రొడక్షన్ డిజైనింగ్(కొలిన్ గిబ్సన్) మేకప్, కేశాలంకరణ(లెస్లే వాండర్‌వాల్ట్, ఎల్కా వార్డెజ్) సౌండ్ ఎడిటింగ్( మార్క్ మాగ్నీ, డేవిడ్ వైట్) సౌండ్ మిక్సింగ్(క్రిస్ జెన్కిన్స్, గ్రిజ్ రడాల్ఫ్) -
2016 ఆస్కార్ అవార్డుల ప్రదానం
లాస్ఏంజిల్స్ : 2016 సంవత్సరానికి ఆస్కార్ పురస్కారానికి (88వ అకాడమీ అవార్డ్స్) తెర లేచింది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లో వైభవంగా ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అమెరికాలోని లాస్ ఏజెల్స్‌లో హాలీవుడ్ డాల్బీ థియేటర్లో ఈ వేడుగ అట్టహాసంగా జరుగుతోంది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వివిధ విభాగాల్లో మొత్తం 20 మంది నటులు ఆస్కార్ కోసం పోటీపడుతున్నారు. అయితే ఇందులో 70 శాతం మంది ఇది వరకు ఆస్కార్ తీసుకున్నవాళ్లే కావడం విశేషం. ఇక 'టైటానిక్' ఫేమ్ లియోనార్డో డికాప్రియో సినిమా 'రెవనెంట్' ఈ ఏడాది అత్యధికంగా 12 విభాగాల్లో నామినేషన్లను సాధించింది. ఇక మరో చిత్రం మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్ చిత్రం పది అంశాల్లో పోటీ పడనుంది. ఉత్తమ చిత్రాల బరిలో ది బిగ్ షార్ట్, బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్, బ్రోక్లెన్, మాడ్ మాక్స్:ఫ్రే రోడ్, ది మార్టిన్, ది రెవెనెంట్, రోమ్, స్పాట్ లైట్ చిత్రాలు ఉన్నాయి. ఉత్తమ నటుడి విభాగంలో స్టార్ హీరోలు లియోనార్డో డికాప్రియో, బ్రయాన్ క్రాన్ స్టన్, మాట్ డామన్, మైఖెల్ ఫాస్బెండర్, ఎడ్డిల్ లు పోటీ పడుతున్నారు. ఉత్తమ నటి విభాగంలో కేట్ బ్లాంచెట్, బ్రై లార్సన్, జెన్నిఫర్ లారెన్స్, షార్లెట్ రాంఫ్లింగ్, రోనన్ లు నామినేషన్స్ పొందారు. కాగా టైటానిక్ సుందరి కేట్ విన్స్లెట్ 'స్టీవ్ జాబ్స్ ' సినిమాకు గాను.. ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ పొందింది. 88వ ఆస్కార్ అవార్డులు ఇవీ... 88వ ఆస్కార్ అవార్డులు ఇవీ... ఉత్తమ నటుడు : లియెనార్డో డి కాప్రియో (ది రివెనెంట్) ఉత్తమ నటి : బ్రి లార్సన్ (రూమ్) ఉత్తమ సహాయ నటి అలీషియా వికందర్ ( ద డానిష్ గర్ల్) ఉత్తమ స్క్రీన్ ప్లే- స్పాట్ లైట్ బెస్ట్ కాస్ట్యుమ్ డిజైనర్ -జెన్నీబీవన్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొలిన్ గిబ్సన్, లిసా థామ్సన్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: మార్గరేట్ సిక్సల్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) బెస్ట్ సౌండ్ ఎడిటింగ్:డేవిడ్ వైట్ అండ్ మార్క్ మంగిని (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) బెస్ట్ సినిమాటోగ్రఫీ ...ఎమాన్యువల్ లుబెజ్కి (ద రెవెనంట్) బెస్ట్ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ (ఇన్సైడ్ అవుట్) బెస్ట్ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్ (ది బేర్ స్టోరీ) బెస్ట్ సహాయ నటుడు మార్క్ రిలాన్స్(బ్రిడ్జి ఆఫ్ స్పైస్) బెస్ట్ డైరెక్టర్ అలెజాండ్రో (ది రివెనెంట్)