Jennifer Lawrence
-
శ్రీసిటీలో అమెరికన్ కంపెనీల అద్భుత వృద్ధి
వరదయ్యపాళెం(తిరుపతి జిల్లా): శ్రీసిటీలోని అమెరికన్ కంపెనీలు అద్భుత వృద్ధిని సాధిస్తున్నాయని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సుల్ జనరల్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా) జెన్నీఫర్ లారెన్స్ అన్నారు. జెన్నీఫర్ లారెన్స్‌తోపాటు వైస్ కాన్సుల్ జనరల్ అఖిల్ బెరీ, ఆర్థిక వ్యవహారాల నిపుణుడు సిబా ప్రసాద్త్రిపాఠి, యూఎస్ ఫారిన్ కమర్షియల్ సర్విస్ కమర్షియల్ అడ్వైజర్ సునీల్‌కుమార్ గురువారం శ్రీసిటీని సందర్శించారు. వారికి శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీలోని వీఆర్వీ పరిశ్రమలో నూతన ఆక్సిజన్ క్లీనింగ్ ప్లాంట్‌ను లాంఛనంగా జెన్నీఫర్ లారెన్స్ ప్రారంభించారు. శ్రీసిటీలోని అన్ని అమెరికన్ కంపెనీల సీఈవోలు, సీఎక్స్‌వోలతో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
నా నగ్న శరీరాన్ని ఎవరైనా చూడొచ్చు.. నటి ఘాటు వ్యాఖ్యలు
Jennifer Lawrence Opens Up About Her Private Photos Leak: 2014లో జరిగిన సంఘటన కారణంగా ఇప్పటికీ మానసిక ఒత్తిడికి గురవుతున్నానని ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫల్ లారెన్స్ ఆవేదన వ్యక్తం చేసింది. వేర్వేరు సెలబ్రిటీలకు సంబంధించిన సుమారు 500 ప్రైవేట్ ఫొటోలను హ్యాకర్లు సేకరించి ఆన్లైన్లో లీక్ చేశారు. ఆ సెలబ్రిటీల్లో సింగర్ రిహన్నా, సెలీనా గోమెజ్‌లతో పాటు నటి జెన్నిఫర్ లారెన్స్ కూడా ఉన్నారు. అప్పుడు జరిగిన ఆ స్కాండల్‌తో నిరంతరం మానసిక ఒత్తిడికి గురవుతున్నానని వెల్లడించింది. 'నా అంగీకారం లేకుండా ఎవరైనా నా నగ్న శరీరాన్ని చూడొచ్చు. ఫ్రాన్స్‌కు చెందిన వారేవరో వాటిని పోస్ట్ చేశారు. కానీ నా గాయం మాత్రం ఎన్నటికీ మానదు.' అని తన మనసులోని బాధను ఘాటుగా బయటపెట్టింది జెన్నిఫర్. అలాగే గతంలో ఈ హ్యాక్‌ని ఒక లైంగిక నేరం, లైంగిక ఉల్లంఘనగా పేర్కొంది. జెన్నిఫర్ 2017లో జరిగిన అనుభవం గురించి కూడా చెప్పుకొచ్చింది. తన స్వస్థలమైన లూయిస్ విల్లే, కెంటక్కీ నుంచి న్యూయార్క్‌కు ఒక ప్రైవేట్ విమానంలో బయలుదేరింది. అప్పుడు విమానంలోని రెండు ఇంజిన్లు ఫెయిల్ కావడంతో చనిపోతాననే భావన గట్టిగా కలిగింది జెన్నిఫర్‌కు. 'నా అస్థిపంజరం సీటులో ఉండిపోతుంది. నేను నా కుటుంబానికి వాయిస్ మేయిల్స్ ఇవ్వడం మొదలు పెట్టాను. నేను గొప్ప జీవితాన్ని గడిపాను. నన్ను క్షమించండి.' అని అప్పటి అనుభవాన్ని షేర్ చేసుకుంది. ప్రస్తుతం జెన్నిఫర్ తన రాబోయే చిత్రం డోంట్ లుక్ అప్ ప్రమోషన్లో బిజీగా ఉంది. ఈ సెటైరికల్ సైన్స్ ఫిక్షన్ బ్లాక్ కామెడీ చిత్రంలో లియోనార్డో డికాప్రియో, జెన్నిఫర్ లారెన్స్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్ 10న పరిమిత థియేటర్లలో విడుదలవనుంది. అలాగే డిసెంబర్ 24 నుంచి ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇది చదవండి: ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టమంటున్న 'వండర్ వుమెన్' -
హాలీవుడ్ నటి జెన్నీఫర్ కంటికి గాయం
వాషింగ్టన్ : హాలీవుడ్ అందాల భామ, ఆస్కార్ నటి జెన్నిఫర్ లారెన్స్ గాయపడ్డారు. ఈమె ప్రస్తుతం ‘డోన్ట్ లుక్ అప్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రెస్టారెంట్లో పేలుడు సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. కిటికీ అద్దం పగిలి, జెన్నీఫర్ కంటికి గాయమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం జెన్నీఫర్‌కు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జెన్నీఫర్ క్షేమంగానే ఉన్నారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. (ఇన్స్టాగ్రామ్ మోడల్‌కు చేదు అనుభవం) ప్రమాద ఘటనతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఆడమ్ మెక్కే దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రంలో జెన్నీఫర్ ఖగోల శాస్త్రవేత్తగా కనిపించనుంది. ఈ సినిమాలో మెరీల్ స్ట్రీప్, తిమోతీ చాలమెట్, అరియానా గ్రాండే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక 2019లో ప్రముఖ ఆర్ట్ ఎక్స్పర్ట్ కుక్ మరోనీని జెన్నిఫర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. (‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వేసవికి వాయిదా) -
న్యూడ్‌గా కనిపించడం నా ఛాయిస్!
‘‘చుట్టూ సినిమా టీమ్ ఉంది. డైరెక్టర్ ఫ్రాన్సిస్ నా దగ్గరకొచ్చి, నేనప్పుడు చేస్తోన్న సీన్లో నేను మిస్ చేసిన చిన్న కరెక్షన్ చెబుతున్నాడు. అప్పుడు నా ఒంటి మీద బట్టలున్నట్టుగానే ఆయన నన్ను చూశాడు. నేనూ నా ఒంటి మీద బట్టలున్నట్టే భావించా. చుట్టూ ఉన్నవాళ్లంతా ప్రొఫెషనల్స్. నాకేం ఇబ్బంది అనిపించలేదు.’’ జెన్నిఫర్ చెప్పిన మాటలివి. ‘రెడ్ స్పారో’ సినిమాలో సందర్భానుసారం ఒక సన్నివేశంలో జెన్నిఫర్ న్యూడ్‌గా కనిపించింది. ‘‘సినిమా కథ ప్రకారం, ఆ పాత్ర అప్పుడు న్యూడ్‌గా కనిపించడం అవసరం అనుకున్నా. నో చెప్పలేదు. సినిమాల్లో న్యూడ్‌గా కనిపించాలనుకోవడం నా ఛాయిస్. ఇక్కడ ఆ అవసరం ఉందని, చుట్టూ ఉన్నవాళ్లూ కథ గురించే ఆలోచిస్తారనే ఆ సీన్ చేశా..’’ అని చెప్పుకొచ్చిందామె. గత శుక్రవారమే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ స్పై థ్రిల్లర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకొని బాక్సాఫీస్ వద్ద మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది. -
లవ్.. బ్రేకప్.. ప్యాచప్...
‘ప్రేమలో ఉండకుండా ఉండలేరెవ్వరూ..’ అని ఏ కవో ఎక్కడో చెప్పే ఉంటాడు. అలాగే ఉంటాయి ప్రేమకథలు. కొన్ని అప్పుడప్పుడే చూసుకుంటున్న ప్రేమలు. కొన్ని చేతులందుకున్న ప్రేమలు. కొన్ని చెయ్యి జారిన ప్రేమలు. కొన్ని జారవిడిచిన చెయ్యిని మళ్లీ అంది పట్టుకున్న ప్రేమలు. అవి ఏ కథలైనా ప్రేమకు అటో.. ఇటో.. ఉంటూనే ఉండడమే మ్యాజిక్. హాలీవుడ్లో ఇప్పుడు ఇలా అటూ, ఇటూ, ఆ మధ్యలో కొట్టుకుంటున్న కొన్ని ప్రేమకథలను చూద్దాం... దాచేదేముంది.. ప్రేమే ఎమ్మా వాట్సన్ కథ ఇలా ఉంటే, మరో స్టార్ హీరోయిన్ టేలర్ స్విఫ్ట్ మాత్రం ‘దాచడానికి ఏముంది? ప్రేమేగా!’ అంటూ బాయ్‌ఫ్రెండ్ జాయ్ అల్విన్‌తో చెట్టాపట్టాలేసుకొని తిరిగేస్తోంది. టేలర్ షూటింగ్‌తో బిజీగా ఉన్నప్పుడు, ఒకవేళ జాయ్ ఖాళీగా ఉంటే ఆమెతో పాటు షూటింగ్స్‌కు వెళ్లిపోతున్నాడు. ఇద్దరూ ఒకరి టైమింగ్స్, షెడ్యూల్స్ ప్రకారం ఇంకొకరు అడ్జస్ట్ అయిపోతూ, ప్రేమలో పడిన కొత్తల్లో, దూరం ఉండలేని ఒక ఫీలింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు. హాలీవుడ్లో ఇప్పుడున్న హాట్ కపుల్స్‌లో వీళ్లూ టాప్ ప్లేసెస్‌లోనే ఉంటున్నారు. టేలర్ స్విఫ్ట్, జాయ్ అల్విన్ వాళ్లు విడిపోయారు మార్చి 4న ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఆస్కార్ అవార్డు ఫంక్షన్లో ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ది షేప్ ఆఫ్ వాటర్’ బెస్ట్ పిక్చర్ అవార్డు అందుకుంది. అదే ఫంక్షన్లో ఆయన బెస్ట్ డైరెక్టర్‌గా కూడా అవార్డు అందుకున్నాడు. ఆయనే గెలెర్మో డెల్‌టోరో. ఆరోజుకు సరిగ్గా ఏడాది క్రితం తన జీవితంలో జరిగిన ఓ కీలక విషయాన్ని మాత్రం ఆయన ఆరోజు తర్వాతిరోజు వరకూ దాచాడు. అదే.. భార్య లొరెంజో న్యూటన్తో వేరు పడడం. ముప్పై ఏళ్ల తమ బంధానికి గతేడాది ఫిబ్రవరిలో బ్రేకప్ చెప్పుకున్నారు గెలెర్మో, న్యూటన్. అయితే ఆ విషయాన్ని ఆస్కార్ అందుకున్న రోజు వరకూ ప్రపంచానికి చెప్పలేదు గెలెర్మో. ఆయన వయస్సు ఇప్పుడు 53 సంవత్సరాలు. లొరెంజో న్యూటన్, గెలెర్మో డెల్‌టోరో వీళ్లు మళ్లీ కలిసిపోయారు ఈ దశాబ్దంలో హాలీవుడ్లో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్స్‌లో ఒకరైన జెన్నిఫర్ లారెన్స్ ప్రేమకథలు ఎప్పటికప్పుడు కొత్త మలుపులు తీసుకుంటాయి. ‘‘నా లైఫ్‌లో బెస్ట్ రొమాన్స్ ఎప్పుడూ చూడలేదు. నాకది ఇష్టం లేదేమో కూడా!’’ అంటుందామె. 2014కు ముందువరకూ నికోలస్ హౌల్ట్తో పీకల్లోతు ప్రేమలో ఉన్న లారెన్స్, కొన్ని అనుకోని పరిస్థితుల్లో అతనికి బ్రేకప్ చెప్పేసింది. అయితే తాజాగా ఈ జంట మళ్లీ కలిసిపోయింది. ఇప్పుడు కొత్తగా పాత రొమాన్స్‌ను తలుచుకుంటూ మళ్లీ ప్రేమలో పడిపోతోంది. ఈ ప్రేమ జంట మళ్లీ పూర్తిగా కలిసిపోతే మాత్రం, ఇద్దరూ ప్రేమను వెతుక్కుంటూ ఒకే దగ్గర ఆగారని చెప్పుకోవచ్చు. జెన్నీఫర్ లారెన్స్, నికోలస్ హౌల్ట్ లవ్వా? అదేం లేదే ‘‘నేనంటూ ప్రేమలో ఉంటే అది నా పర్సనల్ విషయం. బయటకు అస్సలు చెప్పను. నాకు నచ్చదు.’’ అంది ఎమ్మా వాట్సన్ ఒక ఇంటర్వ్యూలో. ఈ హ్యారీపాటర్ స్టార్‌కు ప్రపంచవ్యాప్తంగా ఏ స్థాయిలో ఫాలోయింగ్ ఉందో చెప్పక్కర్లేదు. సో, ప్రేమలో ఉంటే ఎలాగూ చెప్పనని ముందే చెప్పింది కాబట్టి, ఎమ్మా ప్రేమకథ ఏదైనా ఉంటే అది అఫీషియలా కాదా ఎవ్వరూ చెప్పలేరు. తాజాగా ఎమ్మా వాట్సన్ ఆస్కార్ పార్టీలో కోర్డ్ ఓవర్స్ట్రీట్తో కనిపించింది. మరో రెండు పార్టీల్లోనూ ఈ జంటే కలర్ఫుల్గా కనిపించింది. ఈ ఫొటోలు, వీళ్లిద్దరు కలిసి ఉండడం చూసి కోర్డ్తో ఆమె ప్రేమలో ఉందనుకున్నారంతా. కాకపోతే, కోర్డ్ తనకు ‘జస్ట్ ఫ్రెండ్’ అని చెబుతోందట ఎమ్మా. వాళ్లిద్దరూ ఒకరినొకరు ఇష్టపడుతున్నారని, ఇంకా అఫీషియల్‌గా ప్రేమలో అయితే పడలేదని హాలీవుడ్ సమాచారం. మరి ఇష్టపడుతున్నారంటే, త్వరలోనే ప్రేమలోనూ పడొచ్చైతే.. చూడాలి! ఎమ్మా వాట్సన్, కోర్డ్ ఓవర్ స్ట్రీట్ అటో.. ఇటో.. ఎటో.. అన్ని ప్రేమకథలదీ ఒక ఎత్తు. జస్టిన్ బీబర్, సెలెనా గోమేజ్ల ప్రేమకథ ఇంకో ఎత్తు. వీళ్లిద్దరూ ఎప్పుడు కలిసుంటారో, ఎప్పుడు విడిపోతారో, మళ్లీ ఎప్పుడు కలుస్తారో ఎవ్వరికీ అర్థం కాదు. ఎనిమిదేళ్లుగా ఈ ప్రేమకథ ఇలాగే నడుస్తోంది. గత జనవరిలో మళ్లీ కలిసి ఒక్కటైన ఈ జంట, తాజాగా మరోసారి ‘టేక్ ఎ బ్రేక్’ అనుకున్నారట. ఇప్పుడు జస్టిన్‌కు కాస్తంత దూరంగానే ఉంటోందట సెలెనా. అయితే ఇది బ్రేకప్ కాదు. టేక్ ఎ బ్రేక్ అంతే. అంటే మళ్లీ త్వరలోనే ఒక్కటైపోతారని అనుకోవాలి. ఇంకొన్నాళ్లకైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ ప్రేమకథ ఒక దగ్గర ఆన్ అయి అలా వెలుగుతూనే ఉండాలని కోరుకుందాం. స్టిన్ బీబర్, సెలెనా గోమేజ్ -
నాతో పాటు నలుగుర్ని నగ్నంగా నిలబెట్టింది!
ప్రపంచంలోని ఏ చిత్రపరిశ్రమలో చూసినా.. ప్రతిచోటా కామాంధులకు కొదవ లేదన్నట్టుంది పరిస్థితి! నటీమణులు తమ చేదు అనుభవాలను, చిత్రపరిశ్రమల్లోని నగ్న సత్యాలను బయటపెడుతున్నారు. ఇటీవల ‘క్యాస్టింగ్ కౌచ్’ అనేది ఎక్కువ వినబడుతోంది. క్యాస్టింగ్ కౌచ్ అంటే... చాన్సుల పేరుతో అమ్మాయిలకు వల వేయడం, లైంగికంగా లోబరుచుకోవడం అన్నమాట! ఇక్కడా... అక్కడా... అనే తేడాల్లేవ్! హాలీవుడ్‌లోనూ క్యాస్టింగ్ కౌచ్ ఓ రేంజ్లో ఉందండోయ్! ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ హీరోయిన్ జెన్నీఫర్ లారెన్స్కూ అటువంటి చేదు అనుభవాలున్నాయి. అమెరికన్/హాలీవుడ్ హీరోయిన్లు అంటే మన దగ్గర ఓ వర్గం ప్రేక్షకులకు కొంచెం చిన్న చూపే! ‘బికినీలు వేసుకోవడం, నగ్నంగా నటించడం వాళ్లకు అలవాటే కదా!’ అనుకుంటారు. కానీ, వాళ్లకూ ఆత్మాభిమానం అనేది ఉంటుంది. అది మరిస్తే ఎలా? అసలు విషయంలోకి వెళితే... అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ మహిళా నిర్మాత జెన్నీఫర్ లారెన్స్‌ను 15 పౌండ్ల బరువు తగ్గమన్నారట! దానిపై జెన్నీఫర్ మాట్లాడుతూ– ‘‘రెండు వారాల్లో 15 పౌండ్ల బరువు తగ్గమని చెప్పింది. అంతే కాదు... ఓసారి నాతో పాటు నలుగురు అమ్మాయిలను నగ్నంగా పక్కపక్కన నిలబెట్టింది. మా ఐదుగురులో ఓ అమ్మాయిని త్వరగా బరువు తగ్గలేదని బయటకు పంపింది. ‘నువ్వే నీ న్యూడ్ పిక్స్ తీసుకుంటే... త్వరగా బరువు తగ్గాలని ఇన్స్పైర్ అవుతావు’ అని సదరు మహిళా నిర్మాత చెప్పుకొచ్చింది’’ అని పేర్కొన్నారు. ప్రముఖ హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టన్ సుమారు 20 ఏళ్ల పాటు సాగించిన అకృత్యాలపై ఇటీవల నటీమణులు పెద్ద ఎత్తున గళం విప్పారు. ఈ సందర్భంగా ఎల్లే సంస్థ ‘విమెన్ ఇన్ హాలీవుడ్’ ఈవెంట్ నిర్వహించింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ ఈవెంట్లో జెన్నీఫర్ ఈ వ్యాఖలు చేశారు. ‘‘ఓ నిర్మాత అయితే ‘నువ్వు కొంచెం లావుగా ఉన్నా... పడకగదిలో టైమ్ స్పెండ్ చేయడానికి ఆకర్షణీయంగా ఉన్నావ్’ అన్నాడు. అప్పుడు నాకు 16 ఏళ్లు. కెరీర్‌ని దృష్టిలో పెట్టుకుని ఎవరికీ కంప్లయింట్ చేయలేకపోయా’’ అని జెన్నీఫర్ పేర్కొన్నారు. ‘‘కలల ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ సమానమైన గౌరవం దక్కాలి. అప్పటివరకు ప్రతి అబ్బాయికి, అమ్మాయికి, మహిళకు, మగాడికీ నా గళాన్ని వినిపిస్తా’’ అని తెలిపారు జెన్నీఫర్. -
అందుకే డ్రగ్స్, మందు మానేశాను : ఆస్కార్ నటి
ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ జెన్నిఫర్ లారెన్స్ తనకు సంబంధించిన విషయాలను మోహమాటం లేకుండా వెల్లడించింది. మద్యం అలవాటున్న తాను ఒకసారి డ్రగ్స్ తీసుకున్నానని చెప్పింది. తన పేరేంట్స్ కరెన్, గ్యారీ లారెన్స్ తన ఆరోగ్యం గురించి ఎంతో ఆందోళన చెందారట. దీంతో ఎంతా కాలం నుంచి ఉన్న దురలవాట్లను మానేశానని ఈ అమ్మడు అంటోంది. ముఖ్యంగా 'హంగర్ గేమ్స్' సినిమా షూటింగ్ సమయంలో డ్రగ్స్ తీసుకున్నానని గతంలో ఓ షో సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి జెన్నిఫర్ లారెన్స్. వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకారం 2016లో అత్యధిక పారితోషికం అందుకునే నటీమణుల జాబితాల్లో రూ.308కోట్లకు పైగా ఆర్జిస్తున్న జెన్నిఫర్ తొలి స్థానంలో ఉంది. గత జూన్ నెలలో కెనడాకు వెళ్లేముందు తన పేరేంట్స్ తనతో ఎన్నో విషయాలు మాట్లాడారని చెప్పింది. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే చాలు, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేకున్నా సరే అని వాళ్లు తన వద్ద బాధపడ్డ విషయాన్ని ప్రస్తావించింది. వారి సూచనల మేరకు తాను అన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండి పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని హాలీవుడ్ బామ చెప్పుకొచ్చింది. -
అత్యధిక పారితోషికం అందుకునే నటి ఈమెనట..
ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటీమణి ఎవరో తెలుసా..? మళ్లీ "హంగర్ గేమ్స్" స్టార్ జెన్నిఫర్ లారెన్సేనట. వరుసగా రెండో ఏడాది కూడా ఈ బ్యూటీనే అత్యధిక పారితోషికం అందుకునే జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఫోర్బ్స్ మ్యాగజీన్ వెల్లడించిన 2016లో అత్యధిక పారితోషికం అందుకునే నటీమణుల జాబితాల్లో, 46 మిలియన్ డాలర్ల(308కోట్లకు పైగా)తో జెన్నిఫర్ ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. జెన్నిఫర్ తర్వాతి స్థానంలో మెలిస్సా కార్టీ నిలిచినట్టు ఫోర్బ్స్ మంగళవారం వెల్లడించింది. ప్రఖ్యాత అమెరికన్ రచయిత సుజానే కోలిన్స్ నవల ఆధారంగా తెరకెక్కిన హంగర్ గేమ్స్ నుంచి వచ్చిన లాభాలతో ఈ నటి మళ్లీ టాప్ నిలిచినట్లు ఫోర్బ్స్ తెలిపింది. హాలీవుడ్ నటులు అందుకుంటున్న పారితోషికాలు కంటే నటీమణులు అందుకునే పారితోషికాలు ఇంకా తక్కువగానే ఉంటున్నాయని లారెన్స్ మరోసారి స్పష్టంచేసింది. పారితోషికం చెల్లించడంలో లింగవివక్ష చూపుతున్నారని లారెన్స్ చేసిన వ్యాఖ్యలు గతేడాది చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే గతేడాదితో పోలిస్తే జెన్నిఫర్ ఆదాయాలు 2016లో 11.5 శాతం క్షీణించాయి. గతేడాది ఆమె పారితోషికం 52 మిలియన్ డాలర్లు. మొత్తంగా అత్యధిక పారితోషికం అందుకుంటున్న 10 మంది నటీమణుల సంపద 205 మిలియన్ డాలర్లుగా ఉందని ఫోర్బ్స్ తెలిపింది. మూవీస్, టీవీ, కాస్మోటిక్, ఇతర కంపెనీల నుంచి వచ్చే ఎండోర్స్మెంట్స్ ఆదాయాలను పరిగణలోకి తీసుకుని ఫోర్బ్స్ ఈ జాబితాను రూపొందిస్తుంది. ఈ లిస్టులో న్యూకామర్గా బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొణే నిలిచారు. 10 మిలియన్ డాలర్లతో దీపికా టాప్ 10లో చోటుదక్కించుకుంది. -
ఒకసారి డ్రగ్స్ తీసుకున్నా: హీరోయిన్
లాస్ ఏంజెలెస్: ఆస్కార్ విన్నింగ్ నటి జెన్నిఫర్ లారెన్స్ తనకు సంబంధించిన రహస్యం వెల్లడించింది. ఒకసారి డ్రగ్స్ తీసుకున్నానని చెప్పింది. అయితే తాను కావాలని మత్తుపదార్థాలు తీసుకోలేదని తెలిపింది. 'హంగర్ గేమ్స్' సినిమా షూటింగ్ సమయంలో డ్రగ్స్ తీసుకున్నానని పేర్కొంది. జిమ్మీ ఫాలన్ గేమ్ షో 'ట్రు కన్ఫెసన్'లో ఆమె ఈ విషయాలు వెల్లడించింది. జాన్ అలీవర్ తో కలిసి ఈ షోలో ఆమె పాల్గొంది. ఆమె చెప్పిన షాకింగ్ విషయం నిజమా, కాదా అనేది తేల్చుకునేందుకు ఫాలన్ పలు ప్రశ్నలు సంధించాడు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత నిద్రపోయే సీన్ లో నటించారా అని అడగ్గా.. 'కాదు, డాన్స్ చేశాన'ని జెన్నిఫర్ జవాబిచ్చింది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల తేడా వస్తుందని అనుకున్నానని, మెలకువ వచ్చిన తర్వాత చూస్తే అంతా బాగానే ఉందని ఆమె వివరించింది. ఇలాంటి విషయాలు వెల్లడించడం వల్ల నిర్మాణ సంస్థల నుంచి ఇబ్బందులు వస్తాయోమోనని ప్రశ్నించగా.. 'హంగర్ గేమ్స్' గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇప్పుడు 'స్టార్ వార్స్' సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారని తెలిపింది. ఇదంతా వాస్తవమేనా అని మరోసారి ఫాలన్, అలీవర్ ప్రశ్నించగా.. నిజంగా జరిగిందని జెన్నిఫర్ స్పష్టం చేసింది. -
సెల్ఫీల కోసం నా ఇంటి ముందు పడిచస్తారు..!
లండన్: హాలీవుడ్ అందాల భామ జెన్నిఫర్ లారెన్స్ పెద్ద గొప్పలకు పోతోంది. తనకు పాపులారిటీ ఎంత ఉందో మనకు చెప్పకనే చెబుతోంది. తన కోసం ఎప్పుడూ ఇంటి ముందు ఓ పది మంది మగవాళ్లు పడిగాపులు కాస్తారని చెప్పింది. తనతో ఫొటో దిగేందుకు ఎప్పుడూ చాలా మంది ఇలా వస్తూనే ఉంటారని, వారికి తన దర్శనం కోసం ఎదురుచూపులు తప్పవని తెలిసినా ఈ ప్రక్రియ జరగుతూనే ఉంటుందని ఈ చిన్నది హోయలు పోయింది. ఎక్స్ మెన్ మూవీతో జెన్నిఫర్ లారెన్స్ స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ఎప్పుడూ పాత వ్యక్తులేనా.. అంటూ బుంగమూతి పెట్టుకుంటోందట. ఎప్పుడూ అవే ముఖాలను చూడటం బోర్ కొడుతుందని, తనతో సెల్ఫీల కోసం కొత్త వ్యక్తులు రావాలని ఈ ముద్దుగుమ్మ ఆశ పడుతుంది. నిద్రలేవగానే కొత్త వ్యక్తులను చూడాలని తాపత్రయపడగా అదే వ్యక్తులు ప్రతిరోజు ఇంటి ముందు తారస పడుతుండటంతో కాస్త నిరాశ చెందిన విషయాన్ని వెల్లడించింది. రెగ్యూలర్ గా ఆ పది మంది వ్యక్తులు తన ఇంటి ముందు ఆమె దర్శనం కోసం పడుకుని ఉంటారని, ఈ విషయాన్ని తోటి నటీనటులతో పంచుకున్నట్లు వివరించింది. వారిలో కొందరికి ఇదే సమస్య ఉందని చెప్పారని, ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నందుకు అదృష్టవంతులుగా భావించాలని వారు డిసైడ్ అయిపోయారట. ఇంటి వద్ద మరీ ఆ విధంగా పడిగాపులు కాస్తూ ఎదురుచూసే కంటే కూడా షూటింగ్స్ లో, మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు, సినిమాలో తనను ఫ్యాన్స్ చూడటాన్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తానని జెన్నిఫర్ అంటోంది. -
హీరోయిన్‌కు ఘోర అవమానం!
లాస్ ఏంజెల్స్: జెన్నిఫర్ లారెన్స్.. ప్రస్తుతం ఈ పేరు హాలీవుడ్ ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తోంది. కానీ, నటుడు హ్యారీసన్ ఫోర్డ్ ఒకప్పుడు ఆమె ఎవరో కూడా గుర్తించలేదట. ఈ విషయాన్ని లారెన్స్ 'గ్రాహం నోర్టాన్ షో' లో బయటపెట్టింది. బ్రిటిష్ కమెడియన్ జాక్ వైట్ హాల్‌తో బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగిందని తెలిపింది. ఆ ఘటన అనంతరం ఫోర్డ్, స్టార్ వార్స్ ది ఫోర్స్ అవేకన్ జేజే అబ్రమ్స్ తో కలిసి డాన్స్ చేయాలని నిర్ణయించుకున్నట్లు లారెన్స్ వివరించింది. తాను అందరూ తనను గుర్తించాలని కోరుకోనని.. కానీ ఫోర్డ్, అబ్రమ్స్ కూడా తనను గుర్తించలేకపోవడాన్ని తీవ్ర అవమానంగా భావించానని తెలిపింది. దాంతో వారివద్దకు వెళ్లి ఏం చేస్తున్నానో కూడా అర్ధం కాకుండా డాన్స్ చేసినట్లు వివరించింది. ఆ తర్వాత తనకే చాలా ఇబ్బందిగా అనిపించినట్లు తెలిపిందీ హీరోయిన్. ప్రస్తుతం 'ది హంగర్ గేమ్స్: మాకింగ్ జే- పార్ట్-1' లో నటిస్తోంది. -
సెలబ్రిటీల న్యూడ్ ఫొటోలు లీక్ చేసి..!
- నేరాన్ని ఒప్పుకున్న నిందితుడు హాలీవుడ్ టాప్ హీరోయిన్లు, మహిళా సెలబ్రిటీల జీమెయిల్, ఐక్లౌడ్ అకౌంట్లను హ్యాక్ చేసి.. వారి న్యూడ్ ఫొటోలను లీక్ చేసిన వ్యవహారంలో తన పాత్ర కూడా ఉందని ఓ వ్యక్తి న్యాయస్థానం ముందు నేరాన్ని ఒప్పుకొన్నాడు. జెన్నిఫర్ లారెన్స్, కేట్ అప్టన్, కిర్‌స్టెన్ డంస్ట్ తదితరులు వందమందికిపైగా సెలబ్రిటీల అకౌంట్లను హ్యాక్ చేసి.. వారి నగ్న ఫొటోలను 2014 సెప్టెంబర్‌లో 'ద ఫాప్పెనింగ్' పేరిట ఇంటర్నెట్లో పెట్టడం పెనుదుమారం రేపింది. 4చాన్ అనే ఇంటర్నెట్ ఫోరంలో ఈ ఫొటోలు దర్శనమిచ్చాయి. ఈ వ్యవహారంలో కొంతవరకు తన పాత్ర ఉందని అమెరికా పెన్సిల్వేనియాలోని లాంక్స్టర్కు చెందిన ర్యాన్ కొలిన్స్ అనే వ్యక్తి కాలిఫోర్నియా జిల్లా కోర్టులో నేరాన్ని అంగీకరించాడు. అయితే సెలబ్రిటీల ఫొటోలు ఇంటర్నెట్లో పోస్టు చేయడంగానీ, లీక్ చేయడంగానీ తాను చేయలేదని, ఆ వ్యవహారంతో తనకు సంబంధం లేదని అతను కోర్టుకు తెలిపాడు. అయితే అక్రమంగా ప్రముఖ వ్యక్తుల అంకౌంట్ల యాక్సెస్ పొందిన మాట వాస్తవమేనని అంగీకరించాడు. ఈ అభియోగం కింద అతనికి 18 నెలల జైలుశిక్ష పడే అవకాశముంది. హాలీవుడ్ హీరోయిన్లకు యాపిల్, గూగుల్ పేరిట బూకటపు ఈమెయిళ్లు పంపి, వారి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌లను అతడు తెలుసుకున్నాడు. ఈ ప్రక్రియను ఆన్లైన్లో 'ఫిషింగ్' అంటారు. ఈ వివరాలతో పలువురి ప్రైవేటు ఈమెయిల్ అకౌంట్లలోకి చొరబడి, వారి నగ్న ఫొటోలు, వీడియోలు, వ్యక్తిగత సమాచారాన్ని అతడు లీక్ చేశాడు. సెలబ్రిటీల ప్రైవేటు ఫొటోలు, వ్యక్తిగత సమాచారం లీక్ చేయడంలో తనకు ఎలాంటి పాత్ర లేదని అతను చెప్తున్నప్పటికీ, ఎఫ్‌బీఐ మాత్రం అతడు చేసింది తీవ్రమైన నేరమని, ఎంతోమంది వ్యక్తిగత జీవితాలతో అతను ఆడుకున్నాడని కోర్టుకు తెలిపింది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో ఇంటర్నెట్ యూజర్లు తమ వ్యక్తిగత అకౌంట్ల పాస్వర్డ్స్ బలోపేతం చేసుకోవాలని, వ్యక్తిగత సమాచారం కోరుతూ వచ్చే ఏ మెయిల్స్ పట్లనైనా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని ఎఫ్‌బీఐ సూచించింది. -
'మ్యాడ్ మ్యాక్స్'కు అవార్డుల పంట
లాస్ ఏంజిల్స్ : ప్రపంచ చలనచిత్ర రంగంలో అత్యున్నతంగా భావించే ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. 88వ ఆస్కార్ అవార్డుల పురస్కారాల్లో ఈసారి 'మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్' అవార్డుల రేసులో దూసుకుపోతోంది. ఇప్పటివరకూ ఏకంగా ఆరు అవార్డులను తన ఖాతాలో వేసుకుంది. జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించిన మ్యాడ్ మ్యాక్స్: ఫ్యూరీ రోడ్ చిత్రం 10 నామినేషన్లను దక్కించుకున్న విషయం తెలిసిందే. 'మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్' చిత్రం కథనానికి వెళితే ఓ మహిళ, మరి కొందరు మహిళా ఖైదీలతో కలిసి చేసిన పోరాటానికి మ్యాక్స్ అనే వ్యక్తి సహాయం చేస్తాడు. వారు తమ సొంత భూమిని వెదుక్కుంటూ జీవించడానికి చేసే పోరాటమే ఈ చిత్రం. కాస్ట్యూమ్ డిజైన్‌లో జెన్నీ బీవాన్‌కు ఆస్కార్ దక్కింది. జెన్సీ బీవాన్‌కు ఆస్కార్ దక్కడం ఇదో రెండోసారి. మ్యాడ్ మ్యాక్స్ ఫ్యూరీ రోడ్ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా ఉన్న కొలిన్ గిబ్సన్, లీసా థాంప్సన్ కూడా ఆస్కార్‌ను గెలుచుకున్నారు. మేకప్-హెయిర్ స్టయిల్ విభాగంలోనూ మ్యాడ్ మ్యాక్స్ ఫిల్మ్‌కే ఆస్కార్ దక్కింది. ఫిల్మ్ ఎడిటింగ్‌లోనూ ఫ్యూరీ రోడ్‌కు ఆస్కార్ దక్కింది. మార్గరేట్ సిక్సల్ ఆ కేటగిరీలో ఆస్కార్‌ను అందుకున్నారు. సౌండ్ ఎడిటింగ్‌లో మార్క్ మాంగిని, డేవిడ్ వైట్లు ఆస్కార్లను అందుకున్నారు. సౌండ్ మిక్సింగ్ విభాగంలో క్రిస్ జెన్కిన్స్, గ్రెగ్ రుడాల్ఫ్, బెన్ ఓస్మో ఆస్కార్‌ను గెలుచుకున్నారు. ఉత్తమ్ ఎడిటింగ్ (సీక్సెల్) కాస్టూమ్ డిజైనింగ్(జెన్నీ బెవన్) ప్రొడక్షన్ డిజైనింగ్(కొలిన్ గిబ్సన్) మేకప్, కేశాలంకరణ(లెస్లే వాండర్‌వాల్ట్, ఎల్కా వార్డెజ్) సౌండ్ ఎడిటింగ్( మార్క్ మాగ్నీ, డేవిడ్ వైట్) సౌండ్ మిక్సింగ్(క్రిస్ జెన్కిన్స్, గ్రిజ్ రడాల్ఫ్) -
2016 ఆస్కార్ అవార్డుల ప్రదానం
లాస్ఏంజిల్స్ : 2016 సంవత్సరానికి ఆస్కార్ పురస్కారానికి (88వ అకాడమీ అవార్డ్స్) తెర లేచింది. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవం లాస్ ఏంజిల్స్‌లో వైభవంగా ప్రారంభమైంది. భారత కాలమానం ప్రకారం సోమవారం ఉదయం అమెరికాలోని లాస్ ఏజెల్స్‌లో హాలీవుడ్ డాల్బీ థియేటర్లో ఈ వేడుగ అట్టహాసంగా జరుగుతోంది. ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా వివిధ విభాగాల్లో మొత్తం 20 మంది నటులు ఆస్కార్ కోసం పోటీపడుతున్నారు. అయితే ఇందులో 70 శాతం మంది ఇది వరకు ఆస్కార్ తీసుకున్నవాళ్లే కావడం విశేషం. ఇక 'టైటానిక్' ఫేమ్ లియోనార్డో డికాప్రియో సినిమా 'రెవనెంట్' ఈ ఏడాది అత్యధికంగా 12 విభాగాల్లో నామినేషన్లను సాధించింది. ఇక మరో చిత్రం మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్ చిత్రం పది అంశాల్లో పోటీ పడనుంది. ఉత్తమ చిత్రాల బరిలో ది బిగ్ షార్ట్, బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్, బ్రోక్లెన్, మాడ్ మాక్స్:ఫ్రే రోడ్, ది మార్టిన్, ది రెవెనెంట్, రోమ్, స్పాట్ లైట్ చిత్రాలు ఉన్నాయి. ఉత్తమ నటుడి విభాగంలో స్టార్ హీరోలు లియోనార్డో డికాప్రియో, బ్రయాన్ క్రాన్ స్టన్, మాట్ డామన్, మైఖెల్ ఫాస్బెండర్, ఎడ్డిల్ లు పోటీ పడుతున్నారు. ఉత్తమ నటి విభాగంలో కేట్ బ్లాంచెట్, బ్రై లార్సన్, జెన్నిఫర్ లారెన్స్, షార్లెట్ రాంఫ్లింగ్, రోనన్ లు నామినేషన్స్ పొందారు. కాగా టైటానిక్ సుందరి కేట్ విన్స్లెట్ 'స్టీవ్ జాబ్స్ ' సినిమాకు గాను.. ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ పొందింది. 88వ ఆస్కార్ అవార్డులు ఇవీ... 88వ ఆస్కార్ అవార్డులు ఇవీ... ఉత్తమ నటుడు : లియెనార్డో డి కాప్రియో (ది రివెనెంట్) ఉత్తమ నటి : బ్రి లార్సన్ (రూమ్) ఉత్తమ సహాయ నటి అలీషియా వికందర్ ( ద డానిష్ గర్ల్) ఉత్తమ స్క్రీన్ ప్లే- స్పాట్ లైట్ బెస్ట్ కాస్ట్యుమ్ డిజైనర్ -జెన్నీబీవన్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) మేకప్ అండ్ హెయిర్ స్టయిలింగ్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: కొలిన్ గిబ్సన్, లిసా థామ్సన్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్: మార్గరేట్ సిక్సల్ (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) బెస్ట్ సౌండ్ ఎడిటింగ్:డేవిడ్ వైట్ అండ్ మార్క్ మంగిని (మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్) బెస్ట్ సినిమాటోగ్రఫీ ...ఎమాన్యువల్ లుబెజ్కి (ద రెవెనంట్) బెస్ట్ యానిమేషన్ ఫీచర్ ఫిల్మ్ (ఇన్సైడ్ అవుట్) బెస్ట్ యానిమేషన్ షార్ట్ ఫిల్మ్ (ది బేర్ స్టోరీ) బెస్ట్ సహాయ నటుడు మార్క్ రిలాన్స్(బ్రిడ్జి ఆఫ్ స్పైస్) బెస్ట్ డైరెక్టర్ అలెజాండ్రో (ది రివెనెంట్) -
2016 ఆస్కార్ నామినేషన్స్ ఇవే..
2016 సంవత్సరానికి ఆస్కార్ అవార్డుల ప్రదానానికి రంగం సిద్దమైతోంది. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ పురస్కారానికి (88వ అకాడమీ అవార్డ్స్) నామినేషన్లను ఆస్కార్ కమిటీ వెల్లడించింది. లియోనార్డో డికాప్రియో సినిమా 'రెవనెంట్' ఈ ఏడాది అత్యధికంగా 12 విభాగాల్లో నామినేషన్లను సాధించింది. మరో చిత్రం మ్యాడ్ మాక్స్: ఫ్యూరీ రోడ్ చిత్రం పది అంశాల్లో పోటీ పడనుంది. ఉత్తమ చిత్రాల బరిలో ది బిగ్ షార్ట్, బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్, బ్రోక్లెన్, మాడ్ మాక్స్:ఫ్రే రోడ్, ది మార్టిన్, ది రెవెనెంట్, రోమ్, స్పాట్ లైట్ చిత్రాలు ఉన్నాయి. ఉత్తమ నటుడి విభాగంలో స్టార్ హీరోలు లియోనార్డో డికాప్రియో, బ్రయాన్ క్రాన్ స్టన్, మాట్ డామన్, మైఖెల్ ఫాస్బెండర్, ఎడ్డిల్ లు పోటీ పడుతున్నారు. ఉత్తమ నటి విభాగంలో కేట్ బ్లాంచెట్, బ్రై లార్సన్, జెన్నిఫర్ లారెన్స్, షార్లెట్ రాంఫ్లింగ్, రోనన్ లు నామినేషన్స్ పొందారు. కాగా టైటానిక్ సుందరి కేట్ విన్స్లెట్ 'స్టీవ్ జాబ్స్ ' సినిమాకు గాను.. ఉత్తమ సహాయ నటి విభాగంలో నామినేషన్ పొందింది. మరో వైపు ఉత్తమ విదేశీ భాషా చిత్రాల విభాగానికి నామినేషన్ దాఖలు చేసిన..మరాఠీ చిత్రం 'కోర్ట్' తుది నామినేషన్లలో చోటు సంపాదించలేక పోయింది. దీంతో ఈ ఏడాది కూడా భారతీయులకు నిరాశే మిగిలింది. ఫిబ్రవరి 28న ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సం జరగనుంది. -
'టైటానిక్' హీరోకి గోల్డెన్ గ్లోబ్ పురస్కారం
కాలిఫోర్నియా: 73 గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రదానోత్సవం కాలిఫోర్నియాలోని బెవెర్లీ హిల్స్‌లో అట్టహాసంగా జరిగింది. హాలీవుడ్ తారల వెలుగుజిలుగుల మధ్య ఆద్యంతం కన్నులపండువగా జరిగిన ఈ వేడుకలో ఉత్తమ నటుడి అవార్డు 'టైటానిక్' స్టార్ లియోనార్డ్ డీకాప్రియోను వరించింది. డ్రామా కేటగిరిలో 'ద రెవెనంట్' సినిమాలో చూపిన అభినయానికిగాను ఆయనకు ఈ పురస్కారం దక్కింది. ఉత్తమ నటి పురస్కారాన్ని బ్రీ లార్సన్ కైవసం చేసుకుంది. డ్రామ కేటగిరీలో 'రూమ్' సినిమాలో చూపిన నటనకుగాను ఆమెను ఈ అవార్డు వరించింది. డ్రామా కేటగిరీలో ఉత్తమ చిత్రంగా 'రెవెనంట్' నిలువగా, మ్యూజికల్, కామెడీ కేటగిరీలో 'మార్షియన్' ఉత్తమ సినిమా అవార్డు దక్కించుకుంది. ఈ ఏడాది 'రెవెనంట్' చిత్రం అధిక గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలతో సత్తా చాటింది. డ్రామా కేటగిరీలో ఉత్తమ దర్శకుడి అవార్డు కూడా 'రెవెనంట్' డైరెక్టర్ అలెజాండ్రో ఇనారితును వరించింది. ఇక మ్యూజికల్ కామెడీ కేటగిరీలో ఉత్తమ నటుడిగా మాట్ డామన్ (మార్షియన్), ఉత్తమ నటిగా జెన్నిఫర్ లారెన్స్ (జాయ్) పురస్కారాలు దక్కించుకున్నారు. ఇక 'క్రీడ్' సినిమాకుగాను సీనియర్ నటుడు సిల్వెస్టర్ స్టాలోన్ ఉత్తమ సహాయ నటుడి పురస్కారం గెలుపొందారు. -
'ఐ హేట్ న్యూ ఇయర్'
లండన్: ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు ఎలా జరుపుకోవాలి.. ఎక్కడికి వెళ్లాలి.. ఏ స్నేహితులతో గడపాలి అని ఆలోచిస్తుంటే హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ మాత్రం 'ఐ హేట్ న్యూ ఇయర్' అంటూ సింపుల్‌గా చెప్పేసింది. గ్రహమ్ నార్టాన్ నిర్వహించిన యూకే టాక్ షో కార్యక్రమానికి గురువారం ఆస్కార్ నటి జెన్నిఫర్ హాజరయ్యింది. తనకు ఈ వేడుక అస్సలు ఇష్టం ఉండదని 'ది హంగర్ గేమ్స్' హీరోయిన్ తేల్చి చెప్పింది. అయితే, అనివార్య కారణాల వల్ల 2016 న్యూ ఇయర్ వేడుకలో పాల్గొనాల్సి ఉంటుందని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. తనకు ఎప్పుడు మంచి జ్ఞాపకాలు, అనుభవాలు ఎదురుకాలేదని.. ప్రతి ఒక్కరూ మంచి జరగాలని తాపత్రయపడుతుంటారని, అయితే ఎప్పుడు నిరాశ చెందడం తప్ప ప్రయోజనం లేదంటోంది అమెరికా భామ. ఎప్పుడూ ముక్కుసూటిగా, మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ఈ నటి న్యూ ఇయర్ వేడుకలు, చెడు అనుభవాలపై మాట్లాడింది. న్యూ ఈయర్ వేడుక జరుపుకునే ప్రతి ఏడాది నైట్ పార్టీ పీడకలగా మిగిలిపోతున్నాయన్నది. 'మద్యం సేవించడం.. నిరాశ చెందడం' ఎప్పుడూ జరుగుతుంటుందని తన అనుభవాలను, గత స్మృతులను టీవీ షో ద్వారా అభిమానులతో పంచుకుంది. హాలీవుడ్ ఎంట్రీకి ముందు మోడలింగ్ చేశానని, ఓ ఫొటోషూట్ నుంచి వచ్చిన ఫొటోలు తనకు బాగా నచ్చాయని.. కానీ అనుమతి లేకుండానే అందరి చేతుల్లోకి వెళ్లడం లాంటివి నచ్చలేదని జెన్నీ వివరించింది. ఎక్స్-మెన్, పాసింజర్స్ మూవీల షూటింగ్‌లతో ప్రస్తుతం బిజిబిజీగా ఉన్న విషయం తెలిసిందే. -
ఇప్పుడు స్టార్ట్.. యాక్షన్... కట్...!
కథానాయికగా చిన్న వయసులోనే ఆస్కార్ అవార్డు అందుకున్న హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ త్వరలో దర్శకురాలిగా స్టార్ట్.. యాక్షన్.. కట్ చెప్పడానికి రెడీ అవుతున్నారు. ఒకవైపు కథానాయికగా నటిస్తూనే తాను తీయబోయే చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారామె. ‘ప్రాజెక్ట్ డెలీరియం’ టైటిల్‌తో కామెడీ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ‘‘నాకు యాక్టింగ్ ఎంత ఇష్టమో, డెరైక్షన్ కూడా అంతే ఇష్టం. నటిగా మొదటి సినిమా చేస్తున్నప్పుడే ఎప్పటికైనా డెరైక్షన్ చేయాలనే కోరిక నాలో కలిగింది. అది ఇప్పుడు తీర్చుకుంటున్నా. 60వ దశకాల్లో మిలటరీ నేపథ్యంలో సాగే సినిమా ఇది. డెలీరియం అనే రసాయనం మీద పరిశోధనలు చేస్తున్నప్పుడు చోటు చేసుకున్న పరిణామాలతో సాగే కథ ఇది. చాలా ఫన్నీగా ఉంటుంది’’ అని జెన్నిఫర్ చెప్పారు. -
'అబ్బాయిలంతే.. వాడుకుని వదిలేస్తారు'
లాస్ ఎంజెల్స్: అబ్బాయిలు తమ స్వార్థం తాము చూసుకుంటారని, వాడుకుని వదిలేస్తారని ప్రముఖ హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ తెలిపింది. అందుకే ఇప్పుడు తనకు ఎవరితో గడపాలో కూడా అర్థంకానీ పరిస్థితి తయారైందని వాపోయింది. దాదాపు ఏడాదికాలంపాటు క్రిస్ మార్టిన్ తో కలిసి డేటింగ్ చేసిన ఆమె ఇటీవల బ్రేకప్ చేసుకుంది. ఆయనతో సంబంధం తెగదెంపులు చేసుకోవడానికి కారణాలపై ప్రశ్నించగా.. ఇందులో తన తప్పేం లేదని చెప్పింది. 'ఈ విషయంలో ఎవరూ నన్ను ఏ విధంగా నిందించాల్సిన పనిలేదు. బయటకు రా అని ఇప్పుడు నన్ను ఎవరూ పిలవడం లేదు. ప్రతి శనివారం నేను ఒంటరిగానే ఉంటున్నాను' అంటూ చెప్పుకొచ్చింది. అబ్బాయిలు ముందు తనపట్ల ఆకర్షణతో ఉంటూ అనంతరం ఒంటరిగా వదిలేస్తారని, తాను చెప్పిన సమయానికి డేటింగ్‌కు రాకుండా ఏవో కారణాలతో వ్యతిరేకిస్తుంటారని, అందుకే తన దృష్టిలో అబ్బాయిలంటే స్వార్థపరులు, వాడుకుని వదిలేసి రకం అంటూ ఆక్రోశం వెల్లగక్కింది. -
అతని మాటలకు షాక్ తిన్నా..! - ప్రియాంకా చోప్రా
స్త్రీల కన్నా పురుషులకు గుర్తింపు, ప్రాధాన్యం ఇవ్వడం ఏ రంగంలోనైనా ఉండేదే. కానీ ఇది సినీ పరిశ్రమలో మరీ ఎక్కువ. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ చాలా మంది ప్రముఖ నటీమణులు ఈ విషయంలో వివక్షను ఎదుర్కొన్నారు కూడా. గతంలో హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ ఈ విషయంపై మొదటి సారిగా గళం విప్పారు. ఇటీవలే నటి ఎమ్మావాట్సన్ కూడా పారితోషికాల విషయంలో హాలీవుడ్లో యాక్టర్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని బహిరంగంగానే ఆరోపించారు. తాజాగా బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా కూడా ఈ విషయంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘నేను సినిమాల్లోకి వచ్చిన కొత్తలో నాకు ఈ విషయం గురించి అంత అవగాహన ఉండేది కాదు. ఒకవేళ మా డేట్స్ మ్యాచ్ కాకపోయినా, ఎంతో కొంత పారితోషికం ఆశిస్తున్నా సరే...మీ బదులు కొత్త అమ్మాయిని తీసుకుంటామని, అంతేగాని హీరోలను మార్చే ప్రసక్తి లేదని అప్పట్లోనే నాతో ఓ నిర్మాత నిర్మొహమాటంగానే చెప్పారు. అతని మాటలకు నేను షాక్ తిన్నాను. ‘బాజీరావ్ మస్తానీ’ షూటింగ్ టైంలో నేను, దీపికా ఈ విషయం గురించి చర్చించుకున్నాం. ఏ రంగంలోనైనా ఇంతే. కార్పొరేట్ కంపెనీలకు మహిళలు సీఈవోలుగా పనిచేస్తున్నా, వారికి తక్కువ జీతాలే అందుతాయి. అయినా నాకు ఎప్పటికైనా ఒక్కటే ఆశ. పురుషులతో సమానంగా ట్రీట్ చే యకపోయినా పర్లేదు గానీ మా ప్రతిభకు, మా మాటకు కాస్త విలువ ఇవ్వాలని కోరుతున్నా. ఎప్పటికైనా మార్పు వస్తుందన్న ఆశ ఉంది’’ అని అన్నారు. -
వాళ్లకో న్యాయం...మాకో న్యాయమా..?
- జెన్నిఫర్ లారెన్స్ ‘‘ఏం మాకేం తక్కువ? మేమూ మనుషులమే కదా. మగవాళ్లకో న్యాయం ఆడవాళ్లకో న్యాయమా?’’ అని హాలీవుడ్ హాట్‌గాళ్ జెన్నిఫర్ లారెన్స్ విరుచుకుపడుతున్నారు. ఈవిడగారి ఆగ్రహానికి కారణం కథానాయకులు తీసుకుంటున్న పారితోషికం. వాళ్లతో పోల్చితే కథానాయికలకు తక్కువ ఇస్తున్నారని జెన్నిఫర్ వాపోతున్నారు. ఈ విషయాన్ని మరో తార అమీ ఆడమ్స్‌తో చెప్పుకుని వాపోయారు. అమీకి కూడా సేమ్ ఫీలింగ్ ఉంది. దాంతో ఇద్దరూ ఈ మెయిల్స్ ద్వారా సోనీ సంస్థ ప్రతినిధులపై కారాలు మిరియాలూ నూరారు. సోనీ సంస్థ ఈ మెయిల్‌ని ఎవరో హ్యాక్ చేయడంతో ఈ తతంగం మొత్తం బయటవాళ్లకు తెలిసిపోయింది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మలు సోనీ సంస్థపై ఎందుకు విరుచుకుపడ్డారో తెలుసా? ఆ సంస్థ నిర్మించిన ‘అమెరికన్ హసల్’ చిత్రంలో నటించినందుకు జెన్నిఫర్‌కి 7 శాతం ఇచ్చారట. అమీకి కూడా దాదాపు అంతే ఇచ్చారని వినికిడి. కానీ, ఇందులో నటించిన సహనటులకు ఏకంగా 9 శాతం వాటాను ముట్టజెప్పారని సమాచారం. ఈ విషయంలోనే కథానాయికలిద్దరూ ఫీలైపోయారు. జెన్నిఫర్ అయితే దీన్నో ఉద్యమంలా తీసుకున్నారట. నటులకు దీటుగా నటీమణులకు కూడా పారితోషికం ఇవ్వాలని డిమాండ్ చేశారట. మొత్తానికి సాధించారామె. ప్రస్తుతం నటిస్తున్న ‘వాటర్ టైట్’ చిత్రానికిగాను ఆ చిత్ర నిర్మాతలు జెన్నిఫర్‌కి 20 మిలియన్ డాలర్లు (సుమారు 124 కోట్లు) చెల్లించడానికి సిద్ధపడ్డారట. అలాగే, ‘పాసింజర్స్’ అనే చిత్రం కోసం ఆమె తన తోటి నటుడు క్రిస్ పాట్ కన్నా రెండింతలు ఎక్కువ తీసుకుంటున్నారట. దీంతో లియోనార్డో డికాప్రియో, బ్రాడ్లీ కూపర్ వంటి అత్యధిక పారితోషికం తీసుకునే తారల జాబితాలో జెన్నిఫర్ లారెన్స్ కూడా చేరిపోయారు. -
అరుదైన మహిళ జీవితకథతో...
ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్, సుప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్, నటి జెన్నీఫర్ లారెన్స్... అరుదైన ఈ కాంబినేషన్ నిజం కానుంది. యుద్ధక్షేత్రాల్లో ఫోటోలు తీయడంలో ప్రసిద్ధురాలైన లిన్సే అడారియో జ్ఞాపకాల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ‘ఇట్స్ వాట్ ఐ యు - ఎ ఫోటోగ్రాఫర్స్ లైఫ్ ఆఫ్ లవ్ అండ్ వార్’ అనే జ్ఞాపకాల పుస్తకాన్ని తెర కెక్కించే హక్కుల్ని వార్నర్ బ్రదర్స్ సొంతం చేసుకుంది. ప్రధానంగా పురుషులే ఉండే ‘వార్ ఫోటోగ్రఫీ’లో స్థానం సంపాదించి, ఒకప్పుడు కిడ్నాప్‌కు కూడా గురైన ఈ మహిళా ఫొటోగ్రాఫర్ జీవితం అరుదైన వెండితెర అనుభవం కానుంది. -
ఆ జంట మళ్లీ ఒక్కటైంది?
లాస్ ఏంజిల్స్: హాలీవుడ్ నటి జెన్నీఫర్ లారెన్స్-మ్యుజీషియన్ క్రిస్ మార్టిన్ ల జంట మళ్లీ ఒక్కటైయ్యారు. చి న్నపాటి విభేదాల వల్ల విడిపోయిన ఈ జోడి తిరిగి డేటింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరు బిజీగా ఉన్నా.. వారి మధ్య బంధాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నట్లు పీపుల్ డాట్ కమ్ పేర్కొంది. భార్య వైనీత్ కు మార్టిన్ దగ్గరగా ఉంటున్నాడని భావించిన జెన్నీఫర్ అతనితో బంధాన్ని అక్టోబర్ లో తెంచుకుంది. గత ఆగస్టులోడేటింగ్ ఆరంభించిన ఈ జోడీ రెండు నెలల్లోనే దూరమయ్యారు. అయితే ఆ జోడీ డిసెంబర్ 30 వ తేదీన మళ్లీ వారి బంధాన్నిబలపరస్తూ ఓ డిన్నర్ లో కలుసుకుంది. వారి మధ్య చోటు చేసుకున్న విభేదాలను ప్రక్కకు పెట్టిన జెన్నీఫర్-మార్టిన్ లు తిరిగి రొమాన్స్ లో మునిగితేలుతున్నారు. అసలు వారిద్దరి మధ్య గొడవ రావడానికి మార్టిన్ పిల్లలే కారణమట. మార్టిన్ -వైనీత్ జంటకు కు ఇద్దరు పిల్లలు ఆపిల్(10), మోసెస్(8) లు ఉన్నారు. ఈ క్రమంలోనే మార్టిన్ తరచు వైనీత్ ఇంటికి వెళ్లడంతో జెన్నీఫర్ కాస్త అలిగింది. అయితే తిరిగి ఈ విషయాన్ని లైట్ గా తీసుకున్న జెన్నీఫర్ తిరిగి మార్టిన్ తో తన రిలేషన్ ను కొనసాగిస్తోంది. -
మూవీస్ టాక్
గరమ్ గరమ్! ప్రభుదేవాతో ఎఫైర్ నడిపి... పెళ్లి దాకా వెళ్లి... చివరకు డ్రాపైన మలయాళ కుట్టి నయనతార పేరు చెబితే శాండల్‌వుడ్ హీరోలు గుర్రుమంటున్నారు. ఉపేంద్రతో కలసి ‘సూపర్’లో చేసిన ఈ సోగ కళ్ల బ్యూటీ... ఆ తరువాత కన్నడ స్టార్లు ఎవరడిగినా కాదంటోందట. బచ్హాన్లో చేయమని సుదీప్ ఇచ్చిన ఆఫర్‌ను కాదన్న నయన... ఆ తరువాత అభిమానుల ఆరాధ్య నటుడు పునీత్ అడిగినా పట్టించుకోలేదట. చూస్తుంటే.. ఈ అమ్మడికి ఎందుకో కన్నడ ఇండస్ట్రీ అంటే బొత్తిగా ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. దీనిపై అభిమానులు, ఇండస్ట్రీ గరమ్‌గా ఉన్నారని టాక్. నికోలాస్ ‘హాల్ట్’! అటు తిరిగి ఇటు తిరిగి... కాదనుకుని... వదులుకొని మళ్లీ పాత బాయ్‌ఫ్రెండ్‌నే కావాలనుకుంటోంది బాలీవుడ్ సూపర్‌స్టార్ జెన్నీఫర్ లారెన్స్. నికోలాస్ హాల్ట్‌తో ప్రేమాయణం నడిపిన ఈ గుమ్మ... లాస్ట్ సమ్మర్లో విడిపోయింది. కొంత కాలం పాప్ స్టార్ క్రిస్ మార్టినతో రొమాన్స్ నడిపింది. తాజాగా... ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో చెక్కర్లు కొడుతోందని ఫిమేల్ ఫస్ట్ కో డాట్ యూకే సైట్ కథనం. ‘నికోలాస్ రోజూ జెన్నీఫర్‌కు కాల్ చేస్తూనే ఉన్నాడు. స్కైప్‌లో మాట్లాడుకొంటున్నారు. ఒకరి యోగ క్షేమాలు ఒకరు అడిగి తెలుసుకొంటున్నారు’ అని పేర్కొంది. అక్షర... అప్సెట్! ఇంకా తెరంగేట్రం చేయకముందే మాంచి పాపులారిటీ తెచ్చుకొంటున్న కమల్‌హాసన్ రెండో కుమార్తె అక్షర... కోపంతో ఊగిపోతోంది. కారణం... ఆకతాయిలెవరో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా పోస్ట్ చేశారు. నెట్లో ఎక్కడ చూసినా ఇప్పుడివే కనిపిస్తున్నాయి. ‘ఈ ఫొటోలు చూస్తుంటే చిర్రెత్తుకొస్తోంది. బికీనీలో పోజుచ్చినట్టు పెట్టారు. ఇవి నావి కావు. నా పేరుతో ఎఫ్బీ ప్రొఫైల్స్ కూడా కుప్పలు తెప్పలున్నాయి. అందరికీ తెలియాల్సిందేమిటంటే... నాకు ఏ సోషల్ వెబ్సైట్లో అకౌంట్ లేదు. అలాగే చెన్నైలో షూటింగ్ చేస్తున్నట్టు స్టేటస్ అప్డేట్ చేశారు. రెండు నెలలుగా నేను చెన్నైలోనే లేను’ అంటూ ఆవేదన వెళ్లబోసుకుంది అక్షర. -
బ్రేకై.. ఒక్కటై..!
వద్దనుకొని విడిపోయి... మళ్లీ ఒక్కటైపోయి... డేటింగ్ల్లో మునిగిపోతూ... మాంచి మసాలా సినిమాను తలపిస్తున్నారు హాలీవుడ్ సూపర్‌స్టార్ జెన్నీఫర్ లారెన్స్, మ్యుజీషియన్ క్రిస్ మార్టిన్. రియల్ లైఫ్‌లో చాలా కాలం రొమాన్స్ చేసిన ఇద్దరూ.. అలా బ్రేకపయ్యారో లేదో... అంతలోనే ఒకరికొకరు దగ్గరైపోయారు. వినేత్కు బాగా క్లోజైపోయి జెన్నీఫర్‌ను నిర్లక్ష్యం చేస్తున్నాడని... దాని ఫలితమే ఈ బ్రేకప్ అని ఓ వెబ్సైట్ కథనం. అయితే రోజైనా గడవక ముందే మార్టిన్ ఇంట్లో రెండు గంటలకు పైగా ఈ ముద్దుగుమ్మ స్పెండ్ చేసిందని సమాచారం.