ఆస్కార్ చేజారింది! | Jennifer Lawrence is scared of losing her Oscar trophy | Sakshi
Sakshi News home page

ఆస్కార్ చేజారింది!

Published Mon, Nov 11 2013 1:48 AM | Last Updated on Sat, Sep 2 2017 12:30 AM

Jennifer Lawrence is scared of losing her Oscar trophy

‘‘ఆ భగవంతుడు సృష్టించిన జీవులలో అందమైన జీవి ‘మనిషి’. ఆ అందాన్ని దాచుకుంటే ఏం వస్తుంది? నలుగురికీ చూపిస్తే... వాళ్లకీ ఆనందం. ఆ ఆనందాన్నిచ్చినందుకు మనకూ ఆనందం లభిస్తుంది’’ అని ఓ సందర్భంలో సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు జెన్నిఫర్ లారెన్స్. ‘ఎక్స్-మెన్: ఫస్ట్ క్లాస్’ చిత్రం ద్వారా హాలీవుడ్‌లో క్రేజీ కథానాయికగా మారిన జెన్నిఫర్‌కి చిన్నపాటి ఆవేదన ఉంది. అదేంటంటే, ఈ అందానికి ఇప్పటివరకు వెండితెరపై నగ్నంగా కనిపించే అవకాశం రాలేదట. సీన్ డిమాండ్ చేస్తే.. అలా కనిపించడానికి అభ్యంతరం లేదని చెబుతున్నారామె.
 
ఇదిలా ఉంటే... ఈ ఏడాది ‘సిల్వర్ లైనింగ్స్ ప్లే బుక్’ చిత్రం కోసం ఉత్తమ నటిగా ఆమెను ఆస్కార్ వరించింది. చిన్న వయసులో... ఆస్కార్ అవార్డ్ సొంతం చేసుకున్న రెండో ఆర్టిస్ట్ జెన్నిఫరే. కేవలం ఇరవై రెండేళ్లకే ఈ ఘనతను సొంతం చేసుకున్నారామె. కానీ, ఆస్కార్ అవార్డ్‌నే జాగ్రత్తగా దాచుకోలేకపోయారు. ఈ విషయం గురించి జెన్నిఫర్ చెబుతూ -‘‘ఆస్కార్ అవార్డ్ అందుకున్న తర్వాత నా జీవితంలో మార్పేం రాలేదు. అంత పెద్ద అవార్డ్ వచ్చేసింది.. ఇంకేముంది? అని పోజులు కొట్టలేదు.
 
ఆ అవార్డ్ అంటే నాకు చాలా ప్రేమ. అవార్డ్ గెల్చుకున్నప్పుడు మాటల్లో చెప్పలేనంత ఆనందపడ్డాను. ఆ ప్రతిమను నేను పుట్టిన ఊరు కెంటుక్కీ (యూఎస్)కి తీసుకెళ్లమని మా అమ్మతో చెప్పాను. అయితే, ఆ తర్వాత దాని గురించి మర్చిపోయాను. కెంటుక్కీలో ఆ అవార్డ్ లేదని ఈ మధ్యే తెలిసింది. మరెక్కడ ఉందో తెలియడంలేదు. సో... ఎంతో కష్టపడి గెల్చుకున్న అవార్డ్‌ని పోగొట్టుకున్నానేమో అనిపిస్తోంది’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement