
వాషింగ్టన్ : హాలీవుడ్ అందాల భామ, ఆస్కార్ నటి జెన్నిఫర్ లారెన్స్ గాయపడ్డారు. ఈమె ప్రస్తుతం ‘డోన్ట్ లుక్ అప్’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రెస్టారెంట్‌లో పేలుడు సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా ప్రమాదం జరిగింది. కిటికీ అద్దం పగిలి, జెన్నీఫర్ కంటికి గాయమైంది. దీంతో వెంటనే అప్రమత్తమైన చిత్ర బృందం జెన్నీఫర్‌కు ప్రథమ చికిత్స చేసి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం జెన్నీఫర్ క్షేమంగానే ఉన్నారని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. (ఇన్‌స్టాగ్రామ్ మోడల్‌కు చేదు అనుభవం)
ప్రమాద ఘటనతో షూటింగ్‌కు బ్రేక్ పడింది. ఆడమ్ మెక్కే దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రంలో జెన్నీఫర్ ఖగోల శాస్త్రవేత్తగా కనిపించనుంది. ఈ సినిమాలో మెరీల్ స్ట్రీప్, తిమోతీ చాలమెట్, అరియానా గ్రాండే ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక 2019లో ప్రముఖ ఆర్ట్ ఎక్స్‌పర్ట్ కుక్ మరోనీని జెన్నిఫర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. (‘ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వేసవికి వాయిదా)
Comments
Please login to add a commentAdd a comment