
సీనియర్ హీరోయిన్ టబు షూటింగ్‌లో తీవ్రంగా గాయపడింది.బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న భోలా సినిమా షూటింగ్‌లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ట్రక్కును బైక్స్‌తో ఛేజ్ చేసే సీన్ షూట్ చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. ట్రక్కు అద్దాలు పగిలి టబు కన్ను, నుదుటికి గుచ్చుకున్నట్లు తెలుస్తోంది. దీంతో యూనిట్ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
ప్రమాదం జరగడంతో హీరో అజయ్ దేవగన్ షూటింగ్‌కు చిన్న విరామం ప్రకటించారు. రెప్ప పాటులో ఆమె కంటికి పెను ప్రమాదం తప్పిందని సమాచారం. దీంతో మూవీ యూనిట్ ఊపిరి పీల్చుకుంది. ఈ సినిమాలో ఆమె పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం హైదరాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.
కాగా మరో సినిమా షూటింగ్ సెట్‌లో హీరోయిన్ శిల్పాశెట్టి గాయపడింది. యాక్షన్ సన్నివేశాలు చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడటంతో ఆమె కాలు విరిగింది. ఒకే రోజు ఇద్దరు సీనియర్ హీరోయిన్స్ గాయపడటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment