సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ టాప్ హీరోయిన్‌గా వెలుగొందింది టబు. తన పూర్తి పేరు టబసమ్ ఫాతిమా హష్మీ. ఇందులో ఆమె తల్లి ఇంటిపేరే ఉంది కానీ తండ్రి ఇంటి పేరు లేదు. అంతేకాదు, అసలు ఎక్కడా తన తండ్రి పేరును ఉపయోగించదు టబు. దీనికి గల కారణమేంటో తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించిందీ సీనియర్ హీరోయిన్.
'నా బాల్యం గొప్పగా జరిగింది. నాన్న అమ్మకు విడాకులిచ్చాక మేము హైదరాబాద్‌లోని అమ్మమ్మవాళ్లింట్లో ఉన్నాం. అక్కడే పెరిగాను. అమ్మ టీచర్ కావడంతో నేను ఎక్కువగా అమ్మమ్మతోనే సమయం గడిపేదాన్ని. తను నాకోసం ఎన్నో పుస్తకాలు చదివి వినిపించేది. అలాగే పెరుగుతూ వచ్చాను. నేను చాలా పిరికిదాన్ని. అప్పట్లో పెద్దగా గొంతు పెగిల్చేదాన్ని కాదు. నిజానికి హీరోయిన్ అయ్యాక కూడా నేను ఎప్పుడూ గట్టిగా మాట్లాడలేదు.
నా పేరులోని ఫాతిమా అమ్మ పుట్టింటి నుంచి వచ్చిన ఇంటిపేరు. ఇకపోతే నాన్న ఇంటి పేరునే వాడాలని నాకెప్పుడూ అనిపించలేదు. నాన్నకు సంబంధించిన ఏ జ్ఞాపకాలూ నా దగ్గర లేవు. అతడి గురించి ఆలోచించాలన్న ఆసక్తి కూడా లేదు. ఇప్పుడెలా ఉన్నానో అలానే ఉండాలనుకుంటున్నాను. ఇలాగే సంతోషంగా ఉన్నాను కూడా!' అని చెప్పుకొచ్చింది టబు.
చదవండి: తెలుగులో మలయాళ హిట్ మూవీ డబ్, స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఇనయ నీ మనసులో ఏముందు తెలుసు, సీక్రెట్ రూమ్ ఓపెన్ చేసిన నాగ్
Comments
Please login to add a commentAdd a comment