
బాలీవుడ్ భామ టబు తెలుగువారికి సుపరిచితమే. టాలీవుడ్‌లో మెగాస్టార్ అందరివాడు చిత్రంలో మెరిసింది. అంతకుముందే విక్టరీ వెంకటేశ్, నాగార్జున సరసన నటించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో బిజీగా ఉన్న ముద్దుగమ్మ ఇటీవల క్రూ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం అజయ్ దేవగన్‌తో కలిసి ఆరోన్ మే కహన్ దమ్ థా చిత్రంలో నటిస్తోంది. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ముద్దుగుమ్మ అజయ్ దేవగణ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ గురించి మాట్లాడింది.
టబు మాట్లాడుతూ..'అజయ్ దేవగన్‌ని తాను చాలా గౌరవిస్తా. నాకు ఏదైనా చిత్రనిర్మాతతో సమస్యలు వచ్చినప్పుడల్లా నా తరపున మాట్లాడడానికి అజయ్‌ను పిలుస్తాను. అతను నాతో పూర్తిగా స్వతంత్రంగా ఉంటాడు. అంతే కాదు నాతో పనిచేయడానకి కూడా ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అజయ్ నా నిర్ణయాలలో ఎలాంటి జోక్యం చేసుకోడు. ఒకరిని ప్రభావితం చేయడానికి ఎప్పుడూ ప్రయత్నించడు. ఎందుకంటే అతను ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాడు' అని తెలిపింది.

అంతే కాకుండా అజయ్ తన సోదరుడికి చిన్ననాటి స్నేహితుడని.. టీనేజ్ నుంచే తాము ఒకరికొకరు తెలుసని టబు తెలిపింది. మేమిద్దరం కలిసి పెరిగామని.. అతను సినిమాల ద్వారా నాకు పరిచయం కాలేదని పేర్కొంది. ఇతర సహనటుల కంటే.. ఆయనతో ఉన్న రిలేషన్ వేరని ఆమె అన్నారు. ఆయనకు పెళ్లయినప్పటికీ మా మధ్య రిలేషన్‌లో ఎలాంటి మార్పులేదని తెలిపింది. ఆయనకు సినిమా అంటే మక్కువ అని.. దర్శకుడు కావాలని కోరుకున్నట్లు ఆమె వివరించింది.