
సక్సెస్ అంత ఈజీగా రాదు. ఎన్నో ఆటంకాలు, అవమానాలు దాటుకుని వచ్చాకే విజయ ఫలాల్ని అందుకోగలరు. తెలుగు హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) విషయంలోనూ ఇదే జరిగింది. టాలీవుడ్ (Tollywood)లో కంటే బాలీవుడ్ (Bollywood)లోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుందీ బ్యూటీ. అయితే హీరోయిన్‌గా నిలదొక్కుకోవడానికి ముందు చేదు అనుభవాల్ని ఎదుర్కొందట. గతంలో తనే ఈ విషయాన్ని వెల్లడించింది.

రాత్రి 11.30 గంటలకు ఫోన్
శోభిత మాట్లాడుతూ.. ఒక బ్రాండ్ వాళ్లు రాత్రి 11.30 గంటలకు ఫోన్ చేసి ఆడిషన్‌కు పిలిచారు. నాకు కాస్త విచిత్రంగా అనిపించింది. సర్లే అని వెళ్లాను. ఆడిషన్ పూర్తయింది. నన్ను సెలక్ట్ చేశామని తెలిపారు. యాడ్ షూటింగ్ కోసం గోవాకు వెళ్లాల్సి ఉంటుందన్నారు. అదేదో థాయ్‌లాండ్, ఆస్ట్రేలియా కాకపోయినా గోవా అనగానే నేను ఎగ్జయిట్ అయ్యాను. గోవా వెళ్లాక మొదటిరోజు షూటింగ్ బానే జరిగింది. కానీ కెమెరాలో ఏదో ప్రాబ్లమ్ ఉందని చెప్పి మిగిలింది తర్వాత షూట్ చేద్దామన్నారు.

సెట్టవట్లే అని తీసేశారు
తర్వాతి రోజు నేను సెట్‌కు వెళ్లగానే.. ఈ అమ్మాయి మన బ్రాండ్ ఇమేజ్‌కు సరిపోదు అని మాట్లాడుతున్నారు. కారణమేంటో తెలుసా? నేను కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నానని వద్దన్నారు. అంత ఆత్మస్థైరంతో కనిపించే అమ్మాయి ఈ బ్రాండ్‌కు సెట్టవదని పక్కన పెట్టేశారు. నా ప్లేస్‌లో ఓ శునకాన్ని తీసుకున్నారు. కానీ ఒకరోజు పనిచేసినందుకు నాకు డబ్బులిచ్చారు అని చెప్పుకొచ్చింది. అది విన్న యాంకర్.. శోభితకు బదులు శునకాన్ని బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడుకోవడమేంటని నోరెళ్లబెట్టారు.
సినిమా..
రామన్ రాఘవన్ 2.0 సినిమాతో వెండితెరపై తన ప్రయాణం ఆరంభించింది శోభిత. గూఢచారితో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. మేజర్, పొన్నియన్ సెల్వన్ చిత్రాల్లో మెరిసింది. మంకీ మ్యాన్ అనే హాలీవుడ్‌లో మూవీలోనూ యాక్ట్ చేసింది. కల్కి 2898 ఏడీ చిత్రంలో దీపికా పదుకొణెకు తెలుగు డబ్బింగ్ చెప్పింది. శోభిత 2024 డిసెంబర్ 4న హీరో అక్కినేని నాగచైతన్యను పెళ్లాడింది.