'ఆమెతో నటించడం అద్భుతం'.. శోభిత ధూళిపాళ్లపై నటుడు ప్రశంసలు! | Love Sitara actor Rajeev Siddhartha praises Sobhita Dhulipala | Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: 'నటనపై ఆమె అంకితభావం ఆదర్శం'.. శోభితపై నటుడు ప్రశంసలు!

Published Sun, Oct 20 2024 7:47 PM | Last Updated on Sun, Oct 20 2024 7:53 PM

Love Sitara actor Rajeev Siddhartha praises Sobhita Dhulipala

టాలీవుడ్ హీరో నాగచైతన్యకు కాబోయే భార్య శోభిత ధూళిపాళ్ల బాలీవుడ్‌ సినిమాల్లో నటిస్తోంది. తెలుగమ్మాయి అయినప్పటికీ ఎక్కువగా బాలీవుడ్‌లోనే రాణిస్తోంది. ఇటీవల లవ్-సితార మూవీతో ప్రేక్షకులను పలకరించింది శోభిత. ఇందులో బాలీవుడ్ నటుడు రాజీవ్ సిద్ధార్థ్‌తో జంటగా నటించింది. ప్రస్తుతం హానీమూన్ ఫోటోగ్రాఫర్‌ వెబ్‌ సిరీస్‌లో నటించిన రాజీవ్ సిద్ధార్థ్.. శోభితతో కలిసి పనిచేయడంపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తనతో కలిసి నటించడం ఓ మంచి అనుభవమని అ‍న్నారు.

రాజీవ్ మాట్లాడుతూ.. 'ఆమెతో కలిసి పనిచేయడం చాలా మంచి అనుభవం. వర్క్‌షాప్‌ మొదటి రోజు నుంచి సినిమా చివరి దాకా సమష్టింగా పనిచేశాం. శోభిత చాలా అద్భుతమైన సహనటి. మేమిద్దరం సినిమా ఎలా ఉంటుందనే దానిపైనే శ్రద్ధ పెట్టాం. మా సన్నివేశాలు చాలా అద్భుతంగా వచ్చాయి. ప్రతి సీన్‌ని మెప్పించేలా పని చేశాం. ఈ క్రెడిట్ అంతా మా దర్శకురాలు వందనా కటారియాకు ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆమెకు సినిమా అంటే ప్రాణం. ఈ చిత్రం సిబ్బందిలోని ప్రతి ఒక్కరూ ఆమె విజన్‌ కోసం చాలా కష్టపడ్డారు.' అని చెప్పుకొచ్చారు.

(ఇది చదవండి: కాబోయే భార్యతో నాగచైతన్య.. పెళ్లికి ముందే చెట్టాపట్టాల్!)

కాగా.. శోభిత ధూళిపాళ్లకు, హీరో నాగచైతన్యకు ఎంగేజ్‌మెంట్ జరిగిన సంగతి తెలిసిందే. వీరద్దరూ త్వరలోనే వివాహబంధంలోకి అడుగు పెట్టనున్నారు. నిశ్చితార్థం తర్వాత ఈ జంట తొలిసారి బయట కనిపించారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో పెద్దఎత్తున వైరలైంది. మరోవైపు నాగ చైతన్య తండేల్ మూవీలో నటిస్తున్నారు. చందు మొండేటి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ చిత్రంలో సాయిపల్లవి హీరోయిన్‌గా నటిస్తోంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement