Hero Vishal Got Accident In Lathi Movie Shooting, Treatment Underway - Sakshi
Sakshi News home page

Actor Vishal Accident: హీరో విశాల్‌కు గాయాలు.. నిలిచిపోయిన సినిమా షూటింగ్‌

Published Mon, Jul 4 2022 11:08 AM | Last Updated on Mon, Jul 4 2022 11:38 AM

Hero Vishal Got Accident In Lathi Movie Shoot - Sakshi

Hero Vishal Got Accident In Lathi Movie Shoot: సినిమాల్లో యాక్షన్‌ సీక్వెన్స్‌ కోసం రిస్క్‌ చేసే హీరోల్లో విశాల్‌ ఒకరు. పోరాట సన్నివేశాలకోసం డూప్ లేకుండా చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటాడు. ఎంత సహజంగా చిత్రీకరిస్తే సినిమాకు అంత ప్లస్‌ అవుతుందని నమ్మే హీరో విశాల్‌. అయితే ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రమాదాలు కూడా చోటుచేసుకుంటాయి. ఈ ప్రమాదాల కారణంగా ఇప్పటికే చాలా సార్లు గాయలపాలయ్యాడు విశాల్‌. అయిన కూడా సినిమా కోసం కాంప్రమైజ్‌ కాడు విశాల్. అయితే తాజాగా మరోసారి సినిమా షూటింగ్‌లో విశాల్‌ తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. 

విశాల్ నటిస్తున్న లేటెస్ట్‌ చిత్రం 'లాఠీ'. ఈ సినిమా క్లైమాక్స్‌ ఫైట్‌ సీన్స్‌ తెరకెక్కుస్తుండంగా ప్రమాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో విశాల్‌ కాలికి గాయామైనట్లు తెలుస్తోంది. దీంతో సినిమా షూటింగ్‌ను నిలిపివేశారు. ఇదివరకు హైదరాబాద్‌లో ఇదే సినిమా చిత్రీకరణ సమయంలో విశాల్‌ చేతికి, చేతి వేళ్లకు గాయాలు అయ్యాయి. వెంటనే షూటింగ్‌ ఆపేసి కేరళ వెళ్లి చికిత్స తీసుకున్నారు. గాయాల నుంచి కోలుకున్న తర్వాత తిరిగి షూటింగ్ ప్రారంభించిన విశాల్‌ మరోసారి ప్రమాదానికి గురయ్యాడు. అయితే గతంతో పోలిస్తే ఈసారి గాయాలు తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అభిమానులు విశాల్ త్వరగా కోలుకోవాలని, ఇలాంటి రిస్క్‌ షాట్‌లు ఇకపై చేయొద్దని కోరుకుంటున్నారు. 

చదవండి: కమల్‌ హాసన్‌కు ప్రభుత్వం నోటీసులు ! కారణం ?
కేన్సర్‌తో పోరాటం.. అంతలోనే కరోనా.. 30 ఏళ్లకే స్టార్‌ నటుడు మృతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement