షూటింగ్‌లో ప్రమాదం.. బెడ్‌పై ప్రకాశ్‌ రాజ్‌.. ఆసక్తికర ట్వీట్‌ | Viral Pic: Prakash Raj Shares His Health Update After Surgery | Sakshi
Sakshi News home page

Prakashraj : ఆస్పత్రి బెడ్‌పై ప్రకాశ్‌ రాజ్‌.. ద డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌ అంటూ ట్వీట్‌

Published Wed, Aug 11 2021 7:55 PM | Last Updated on Wed, Aug 11 2021 7:57 PM

Viral Pic: Prakash Raj Shares His Health Update After Surgery - Sakshi

ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ గాయపడిన సంగతి తెలిసిందే. ధనుష్‌ సినిమా షూటింగ్‌లో పాల్గొన్న ఆయన లొకేషన్‌లో ఫ్లోర్‌పై జారిపడ్డారు.  దీంతో ప్రకాశ్‌రాజ్‌ చేతికి ఫ్రాక్చర్‌ అయింది. ఈ విషయాన్ని ప్రకాశ్‌ రాజ్‌ ట్విటర్‌ ద్వారా తెలియజేస్తూ.. సర్జరీ కోసం తన స్నేహితుడు డాక్టర్ గురువా రెడ్డి దగ్గరకు హైదరాబాద్‌ వస్తున్నట్లు తెలిపారు. 

తాజాగా తన ఆరోగ్యంపై ప్రకాశ్‌ రాజ్‌ ట్వీటర్‌ ద్వారా స్పందించారు. సర్జరీ విజయవంతమయిందని చెబుతూ.. ‘డెవిల్‌ ఈజ్‌ బ్యాక్‌. సర్జరీ సక్సెస్‌ఫుల్‌గా జరిగింది. నాపై ప్రేమ చూపించి ప్రార్ధించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. త్వరలో యాక్షన్‌లో దిగుతా’అని ప్రకాశ్‌ రాజ్‌ ట్వీట్‌ చేశాడు. అలాగే ఆసుపత్రి బెడ్ మీద నవ్వులు చిందిస్తున్న ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. కాగా, త్వరలో జరగబోయే ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి ప్రకాశ్‌ రాజ్‌ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement