సెల్ఫీల కోసం నా ఇంటి ముందు పడిచస్తారు..! | 10 men sleep outside my house, says Jennifer Lawrence | Sakshi
Sakshi News home page

సెల్ఫీల కోసం నా ఇంటి ముందు పడిచస్తారు..!

Published Sun, May 22 2016 8:50 AM | Last Updated on Mon, Sep 4 2017 12:41 AM

సెల్ఫీల కోసం నా ఇంటి ముందు పడిచస్తారు..!

సెల్ఫీల కోసం నా ఇంటి ముందు పడిచస్తారు..!

లండన్: హాలీవుడ్ అందాల భామ జెన్నిఫర్ లారెన్స్ పెద్ద గొప్పలకు పోతోంది. తనకు పాపులారిటీ ఎంత ఉందో మనకు చెప్పకనే చెబుతోంది. తన కోసం ఎప్పుడూ ఇంటి ముందు ఓ పది మంది మగవాళ్లు పడిగాపులు కాస్తారని చెప్పింది. తనతో ఫొటో దిగేందుకు ఎప్పుడూ చాలా మంది ఇలా వస్తూనే ఉంటారని, వారికి తన దర్శనం కోసం ఎదురుచూపులు తప్పవని తెలిసినా ఈ ప్రక్రియ జరగుతూనే ఉంటుందని ఈ చిన్నది హోయలు పోయింది. ఎక్స్ మెన్ మూవీతో జెన్నిఫర్ లారెన్స్ స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ఎప్పుడూ పాత వ్యక్తులేనా.. అంటూ బుంగమూతి పెట్టుకుంటోందట. ఎప్పుడూ అవే ముఖాలను చూడటం బోర్ కొడుతుందని, తనతో సెల్ఫీల కోసం కొత్త వ్యక్తులు రావాలని ఈ ముద్దుగుమ్మ ఆశ పడుతుంది.

నిద్రలేవగానే కొత్త వ్యక్తులను చూడాలని తాపత్రయపడగా అదే వ్యక్తులు ప్రతిరోజు ఇంటి ముందు తారస పడుతుండటంతో కాస్త నిరాశ చెందిన విషయాన్ని వెల్లడించింది. రెగ్యూలర్ గా ఆ పది మంది వ్యక్తులు తన ఇంటి ముందు ఆమె దర్శనం కోసం పడుకుని ఉంటారని, ఈ విషయాన్ని తోటి నటీనటులతో పంచుకున్నట్లు వివరించింది. వారిలో కొందరికి ఇదే సమస్య ఉందని చెప్పారని, ఇలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నందుకు అదృష్టవంతులుగా భావించాలని వారు డిసైడ్ అయిపోయారట. ఇంటి వద్ద మరీ ఆ విధంగా పడిగాపులు కాస్తూ ఎదురుచూసే కంటే కూడా షూటింగ్స్ లో, మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నప్పుడు, సినిమాలో తనను ఫ్యాన్స్ చూడటాన్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తానని జెన్నిఫర్ అంటోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement