ఒకసారి డ్రగ్స్ తీసుకున్నా: హీరోయిన్ | I once took drug while filming 'The Hunger Games': Lawrence | Sakshi
Sakshi News home page

ఒకసారి డ్రగ్స్ తీసుకున్నా: హీరోయిన్

Published Wed, May 25 2016 11:05 AM | Last Updated on Mon, Sep 4 2017 12:55 AM

ఒకసారి డ్రగ్స్ తీసుకున్నా: హీరోయిన్

ఒకసారి డ్రగ్స్ తీసుకున్నా: హీరోయిన్

లాస్ ఏంజెలెస్: ఆస్కార్ విన్నింగ్ నటి జెన్నిఫర్ లారెన్స్ తనకు సంబంధించిన రహస్యం వెల్లడించింది. ఒకసారి డ్రగ్స్ తీసుకున్నానని చెప్పింది. అయితే తాను కావాలని మత్తుపదార్థాలు తీసుకోలేదని తెలిపింది. 'హంగర్ గేమ్స్' సినిమా షూటింగ్ సమయంలో డ్రగ్స్ తీసుకున్నానని పేర్కొంది. జిమ్మీ ఫాలన్ గేమ్ షో 'ట్రు కన్ఫెసన్'లో ఆమె ఈ విషయాలు వెల్లడించింది.

జాన్ అలీవర్ తో కలిసి ఈ షోలో ఆమె పాల్గొంది. ఆమె చెప్పిన షాకింగ్ విషయం నిజమా, కాదా అనేది తేల్చుకునేందుకు ఫాలన్ పలు ప్రశ్నలు సంధించాడు. డ్రగ్స్ తీసుకున్న తర్వాత నిద్రపోయే సీన్ లో నటించారా అని అడగ్గా.. 'కాదు, డాన్స్ చేశాన'ని జెన్నిఫర్ జవాబిచ్చింది. డ్రగ్స్ తీసుకోవడం వల్ల తేడా వస్తుందని అనుకున్నానని, మెలకువ వచ్చిన తర్వాత చూస్తే అంతా బాగానే ఉందని ఆమె వివరించింది.

ఇలాంటి విషయాలు వెల్లడించడం వల్ల నిర్మాణ సంస్థల నుంచి ఇబ్బందులు వస్తాయోమోనని ప్రశ్నించగా.. 'హంగర్ గేమ్స్' గురించి ఎవరూ పట్టించుకోవడం లేదని, ఇప్పుడు 'స్టార్ వార్స్' సినిమాల గురించే మాట్లాడుకుంటున్నారని తెలిపింది. ఇదంతా వాస్తవమేనా అని మరోసారి ఫాలన్, అలీవర్ ప్రశ్నించగా.. నిజంగా జరిగిందని జెన్నిఫర్ స్పష్టం చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement