
శ్రీసిటీలో ఆక్సిజన్ క్లీనింగ్ ప్లాంట్‌ను ప్రారంభిస్తున్న కాన్సుల్ జనరల్
వరదయ్యపాళెం(తిరుపతి జిల్లా): శ్రీసిటీలోని అమెరికన్ కంపెనీలు అద్భుత వృద్ధిని సాధిస్తున్నాయని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సుల్ జనరల్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా) జెన్నీఫర్ లారెన్స్ అన్నారు. జెన్నీఫర్ లారెన్స్‌తోపాటు వైస్ కాన్సుల్ జనరల్ అఖిల్ బెరీ, ఆర్థిక వ్యవహారాల నిపుణుడు సిబా ప్రసాద్‌త్రిపాఠి, యూఎస్ ఫారిన్ కమర్షియల్ సర్విస్ కమర్షియల్ అడ్వైజర్ సునీల్‌కుమార్ గురువారం శ్రీసిటీని సందర్శించారు. వారికి శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీలోని వీఆర్వీ పరిశ్రమలో నూతన ఆక్సిజన్ క్లీనింగ్ ప్లాంట్‌ను లాంఛనంగా జెన్నీఫర్ లారెన్స్ ప్రారంభించారు. శ్రీసిటీలోని అన్ని అమెరికన్ కంపెనీల సీఈవోలు, సీఎక్స్‌వోలతో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment