sricity
-
శ్రీసిటీలో సీఎం చంద్రబాబు హైడ్రామా
సాక్షి, విశాఖపట్నం: శ్రీసిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. శ్రీసిటీలో తమ హయాంలో పరిశ్రమలు ఏర్పాటు కాగా, ఇప్పుడు వాటికి చంద్రబాబు ప్రారంభోత్సవాలు, ఇప్పటికే పనులు మొదలుపెట్టిన కంపెనీలకు శంకుస్థాపనలు, ఎప్పుడో కుదిరిన ఒప్పందాలకు మళ్లీ ఒప్పందాలు చేస్తున్నారని, చంద్రబాబుది ఎప్పుడూ ప్రచార ఆర్భాటమే అని స్పష్టం చేశారు. వేరొకరి కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడం.. అదే ఎప్పటికీ చంద్రబాబు నిస్సిగ్గు వ్యవహారం అని చురకలంటించారు.విశాఖలో నాడు తమ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ (జీఐఎస్)లోని ఒప్పందాలన్నీ దాదాపు కార్యరూపం దాల్చాయని మాజీ మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు వాటికే తిరిగి ప్రారంభోత్సవాలు చేస్తూ, ఏకంగా 16 పరిశ్రమలు ఏర్పాటైనట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఆక్షేపించారు. వందల కోట్లతో ఏర్పాటయ్యే పరిశ్రమల పనులకు కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని గుర్తు చేసిన ఆయన, ఈరోజు చంద్రబాబు ప్రారంభించిన వాటిలో ఏ ఒక్కటీ ఈ ప్రభుత్వంలో వచ్చినవి కావని స్పష్టం చేశారు.అలాగే తమ ప్రభుత్వ హయాంలో కొన్నింటి శంకుస్థాపనలు చేయగా, మరి కొన్నింటికి భూకేటాయింపులు జరిగాయని, ఇప్పుడు వాటన్నింటినీ సీఎం చంద్రబాబు తన ఖాతాలో వేసుకుంటున్నారని దుయ్యబట్టారు.దాదాపు రెండున్నర ఏళ్లు కోవిడ్ సంక్షోభం ఉన్నా, 2023 మార్చిలో విశాఖలో జీఐఎస్ నిర్వహించి, 386కు పైగా ఒప్పందాలు చేసుకున్నామన్న గుడివాడ అమర్నాథ్, ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న డ్రామాలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు నాటి ఎంవోయూలకు సాక్ష్యాలని తేల్చి చెప్పారు. శ్రీసిటీలో పలు అంతర్జాతీయ ఉత్పత్తి సంస్థలు తమ కార్యకలాపాలు నిర్వహించేలా అవసరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. కొందరికి వీసా సమస్య వస్తే, కేంద్రంతో మాట్లాడి వీసాలు ఇప్పించామని వివరించారు.అందుకే ఇకనైనా వాస్తవాలను మననం చేసుకుని, తమ ప్రభుత్వంపై నిందలు మానాలని, దుష్ప్రచారాలు విడనాడాలని, ప్రచార ఆర్భాటం వదిలి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని, వేరొకరి క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవడం వంటి నిస్సిగ్గు వ్యవహారాలు వదిలిపెట్టాలని సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ హితవు చెప్పారు. -
డైకిన్ ఏసీలు.. ఇక మేడిన్ ఆంధ్రా
సాక్షి, అమరావతి: ప్రపంచంలోనే అతిపెద్ద ఏసీ తయారీ సంస్థ.. జపాన్‌కు చెందిన డైకిన్ ఇక నుంచి మేడిన్ ఆంధ్రా ఏసీలను విక్రయించనుంది. ఈ మేరకు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీసిటీలో జపాన్ కంపెనీ ప్రతినిధులు, రాయబారుల సమక్షంలో నవంబర్ 23న లాంఛనంగా వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించనుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు వెల్లడించారు. రూ.1,000 కోట్ల పెట్టుబడితో 75.5 ఎకరాల విస్తీర్ణంలో డైకిన్ ఈ యూనిట్‌ను స్థాపించింది. గతేడాది ఏప్రిల్‌లో నిర్మాణ పనులు ప్రారంభించిన డైకిన్ రికార్డు స్థాయిలో కేవలం 18 నెలల్లోనే యూనిట్‌ను సిద్ధం చేసింది. తొలి దశలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్‌కు ఏటా 10 లక్షల ఏసీలను తయారు చేసే సామర్థ్యం ఉంది. ఈ యూనిట్ ద్వారా సుమారు 3,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించింది. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన యూనిట్లలో 75 శాతం నియామకాలు స్థానికులకే ఉండాలన్న ప్రభుత్వ నిబంధనకు అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)తో డైకిన్ ఒప్పందం కుదుర్చుకుంది. 2020–21లో డిప్లొమా పూర్తి చేసుకున్న విద్యార్థులకు తమ సంస్థలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించామని డైకిన్ వెల్లడించింది. ఎంపికైన ఉద్యోగులకు రూ.1.99 లక్షల వార్షిక వేతనాన్ని అందిస్తున్నట్లు తెలిపింది. వేగంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు.. రెండో దశలో మరో రూ.1,000 కోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా ఈ యూనిట్ ఉత్పత్తి సామర్థ్యాన్ని ఏటా 20 లక్షల ఏసీలకు డైకిన్ చేర్చనుంది. 2017లో రాజస్థాన్‌లోని నిమ్రాణాలో రెండో యూనిట్‌ను ప్రారంభించిన డైకిన్ ఏపీలో మూడో యూనిట్‌ను ఏర్పాటు చేసింది. దక్షిణాది రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వ్యూహాత్మకంగా శ్రీసిటీని ఎంపిక చేసుకున్నట్లు శంకుస్థాపన సమయంలో డైకిన్ ఇండియా చైర్మన్ అండ్ ఎండీ కన్వలజీత్ జావా వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల అనుమతులు వేగంగా మంజూరు చేయడంతో రికార్డు స్థాయిలో డైకిన్ ఉత్పత్తికి సిద్ధమైందని తెలిపారు. ఏసీ తయారీ హబ్‌గా శ్రీసిటీ.. దేశీయ ఏసీ మార్కెట్లో బిలియన్ డాలర్ల మార్కును అందుకున్న సందర్భంగా శ్రీసిటీలో మూడో యూనిట్ అందుబాటులోకి రావడంపై శ్రీసిటీ వ్యవస్థాపక ఎండీ రవీంద్ర సన్నారెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. ఏసీ తయారీ హబ్‌గా శ్రీసిటీ ఎదుగుతోందన్నారు. డైకిన్‌తో పాటు బ్లూస్టార్, లాయిడ్ (హావెల్స్), పానాసోనిక్, యాంబర్, ఈప్యాక్ వంటి అనేక సంస్థలు ఇక్కడ యూనిట్లను ఏర్పాటు చేశాయన్నారు. రాష్ట్రంలో 50 లక్షల ఏసీల ఉత్పత్తి.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏటా 75 లక్షల గృహవినియోగ ఏసీలు అమ్ముడవుతున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఈ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 50 లక్షల ఏసీలకు పైనే ఉంటుందని అంచనా. ఈ విధంగా చూస్తే వచ్చే మార్చి నుంచి దేశవ్యాప్తంగా అమ్ముడయ్యే ప్రతి ఏసీలో ఒకటి మన రాష్ట్రంలో తయారైందే ఉంటుందని అంచనా వేస్తున్నారు. మొత్తం ఈ ఆరు యూనిట్లు, వీటికి సరఫరా చేసే ఉపకరణాల యూనిట్లను చూసుకుంటే ఒక్క ఏసీ తయారీ రంగంలోనే రాష్ట్రం రూ.3,755 కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఈ యూనిట్లకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాలిటెక్నిక్‌లో ప్రత్యేక కోర్సులను సైతం అందుబాటులోకి తెచ్చింది. -
శ్రీసిటీని సందర్శించిన జపాన్ ప్రతినిధుల బృందం
వరదయ్యపాళెం(తిరుపతి జిల్లా): ఒసాకాలోని జపాన్ ఎక్స్టర్నల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (జెట్రో) డైరెక్టర్ జనరల్ మురహషి మసుయుకి, ఒసాకా చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ బిజినెస్ కమిటీ చైర్మన్ టొమిటా మినోరు ఆధ్వర్యంలో 23మంది ప్రముఖ జపాన్ వ్యాపార ప్రతినిధుల బృందం గురువారం శ్రీసిటీని సందర్శించింది. శ్రీసిటీ మౌలిక సదుపాయాలు పరిశీలించడం, పెట్టుబడి అవకాశాలను అన్వేషించడం వీరి పర్యటన ముఖ్య ఉద్దేశం. శ్రీసిటీ ప్రెసిడెంట్(ఆపరేషన్స్)సతీష్ కామత్ వారికి స్వాగతం పలికారు. శ్రీసిటీలో అత్యున్నత స్థాయి మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అభివృద్ధి, తయారీ యూనిట్లను నెలకొల్పడం వల్ల కలిగే వివిధ ప్రయోజనాల గురించి శ్రీసిటీ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ బోడ్గన్ జార్జ్ వివరించారు. జపాన్‌కు చెందిన ప్రముఖ వ్యాపార ప్రతినిధులు, జెట్రో, ఓసీసీఐ ఉన్నతాధికారులు పర్యటనకు రావడంపై శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. జపనీస్ భారీ పరిశ్రమలకు అవసరమైన సంస్థలు తమ పరిశ్రమలను ఏర్పాటు చేసుకునేట్టు ప్రోత్సహించే అనువైన పర్యావరణ వ్యవస్థ శ్రీసిటీలో ఉందంటూ ఆయన పేర్కొన్నారు. మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అనుకూల వాతావరణం పై టొమిటా మినోరు సంతృప్తి వ్యక్తం చేశారు. ఇక్కడి వ్యాపార సామర్ధ్యం, వేగవంతమైన అభివృద్ధి తమను ఎంతగానో ఆకట్టుకుందని తెలిపారు. శ్రీసిటీ అధికారులతో చర్చల సందర్భంగా వివిధ అంశాలపై జపాన్ ప్రతినిధుల బృందం ప్రశ్నలు అడిగి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, ఎల్రక్టానిక్స్ ఆటో విడిభాగాలు, టెక్నికల్, టెక్స్టైల్స్ మొదలైన రంగాలకు చెందిన ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులు ఈ పర్యటనలో పాల్గొన్నారు. -
శ్రీసిటీలో స్టాన్ఫోర్డ్ వర్సిటీ విద్యార్థులు
వరదయ్యపాళెం: స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్‌మ్యాటిక్స్ (ఎస్టీఈఎం) విభాగానికి చెందిన 20 మంది అధ్యాపకులు, విద్యార్థులతో కూడిన ప్రతినిధుల బృందం శుక్రవారం శ్రీసిటీని సందర్శించింది. ప్రొఫెసర్ మైకేల్ కోచెండర్ ఫర్, పీహెచ్డీ స్కాలర్ డైలాన్ మిచెల్ ఆస్మార్ నేతృత్వంలోని ఈ బృందానికి శ్రీసిటీ ప్రెసిడెంట్ (ఆపరేషన్స్) సతీష్ కామత్ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీసిటీ చైర్మన్ సి.శ్రీనిరాజు వర్చువల్ విధానంలో వారితో మాట్లాడారు. 1980లలో స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వర్క్, లివ్, లెర్న్, ప్లే సూత్రం ఆధారంగా పచ్చదనం, పరిశుభ్రత, పారిశ్రామిక అనుకూల వాతావరణంలో శ్రీసిటీ ప్రగతి సాగుతోందని తెలిపారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా సౌర విద్యుత్ ఉత్పత్తి, నీటి నిర్వహణ తదితర కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. పారిశ్రామిక విస్తరణ, పర్యావరణ పరిరక్షణ మధ్య సమతుల్యతను కాపాడడంపై తాము ప్రత్యేక దృష్టి సారించామన్నారు. భారతదేశంలో మొట్టమొదటి కార్బన్ న్యూట్రల్ పారిశ్రామికవాడగా శ్రీసిటీ అవతరించాలన్నది తమ ఆకాంక్ష అన్నారు. శ్రీసిటీలో ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, రవాణా అనుసంధానం, ఇతర ప్రత్యేకతల గురించి సతీష్ కామత్ వివరించారు. పెప్సికో, క్యాడ్బరీస్, కోల్గేట్ పామోలివ్, వీఆర్వీ చాట్ ఇండస్ట్రీస్, బాల్ కార్పొరేషన్, కెల్లాగ్స్, వెస్ట్ ఫార్మాతో సహా 11 ప్రముఖ అమెరికన్ కంపెనీలతో పాటు ప్రపంచంలోని 28 దేశాలకు చెందిన 210 పరిశ్రమలు శ్రీసిటీలో ఏర్పాటైనట్లు తెలిపారు. శ్రీసిటీ అభివృద్ధి పట్ల స్టాన్ఫోర్డ్ బృందం సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీసిటీ మోడల్, ఇక్కడ అమలు చేస్తున్న సుస్థిరత కార్యక్రమాలను నేరుగా వీక్షించి అర్థం చేసుకోవడమే తమ పర్యటన ముఖ్య ఉద్దేశంగా వారు తెలిపారు. అనంతరం శ్రీసిటీలోని క్రియా విశ్వవిద్యాలయాన్ని సందర్శించారు. -
శ్రీసిటీలో అమెరికన్ కంపెనీల అద్భుత వృద్ధి
వరదయ్యపాళెం(తిరుపతి జిల్లా): శ్రీసిటీలోని అమెరికన్ కంపెనీలు అద్భుత వృద్ధిని సాధిస్తున్నాయని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సుల్ జనరల్ (ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా) జెన్నీఫర్ లారెన్స్ అన్నారు. జెన్నీఫర్ లారెన్స్‌తోపాటు వైస్ కాన్సుల్ జనరల్ అఖిల్ బెరీ, ఆర్థిక వ్యవహారాల నిపుణుడు సిబా ప్రసాద్త్రిపాఠి, యూఎస్ ఫారిన్ కమర్షియల్ సర్విస్ కమర్షియల్ అడ్వైజర్ సునీల్‌కుమార్ గురువారం శ్రీసిటీని సందర్శించారు. వారికి శ్రీసిటీ చైర్మన్ శ్రీనిరాజు, మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి సాదర స్వాగతం పలికారు. శ్రీసిటీలోని వీఆర్వీ పరిశ్రమలో నూతన ఆక్సిజన్ క్లీనింగ్ ప్లాంట్‌ను లాంఛనంగా జెన్నీఫర్ లారెన్స్ ప్రారంభించారు. శ్రీసిటీలోని అన్ని అమెరికన్ కంపెనీల సీఈవోలు, సీఎక్స్‌వోలతో ఆమె ప్రత్యేకంగా సమావేశమయ్యారు. -
ఏపీలో 'బ్లూస్టార్' వందల కోట్ల పెట్టుబడులు!
చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న ప్రపంచస్థాయి ప్లాంటు ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో క్వార్టర్లో ప్రారంభమయ్యే వీలున్నట్లు ఏసీలు, ఎయిర్ ప్యూరిఫయర్ల తయారీ దిగ్గజం బ్లూస్టార్ తాజాగా వెల్లడించింది. కంపెనీ ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన తయారీ ప్లాంటును విస్తరించగా.. శ్రీ సిటీలో భారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు బ్లూస్టార్ లిమిటెడ్ ఎండీ బి.త్యాగరాజన్ తెలియజేశారు. ఆత్మనిర్భర్ భారత్‌ను బలంగా విశ్వసించే తాము పీఎల్ఐ పథకంలో భాగంగా ఈ ప్లాంటును నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలియజేశారు. తొలి దశలో భాగంగా ఈ ప్లాంటుపై రూ.250 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా రూ.550 కోట్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది 20% వృద్ధిని అంచనా వేయడంతోపాటు.. 14% మార్కెట్ వాటాపై కన్నేసినట్లు తెలిపారు. రెసిడెన్షియల్ ఏసీల మార్కెట్లో ప్రస్తుతం 13.2% వాటాను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు. చదవండి: ఏపీలో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు -
ఇసుజు కార్ల ప్లాంట్ విస్తరణ
వరదయ్యపాళెం(చిత్తూరు జిల్లా): శ్రీసిటీలోని జపనీస్ యుటిలిటీ వాహన తయారీదారు ఇసుజు మోటార్స్ ఇండియా పరిశ్రమలో అదనపు ఉత్పత్తుల యూనిట్‌ను సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. కంపెనీ ఆవరణలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో జపాన్ కాన్సుల్ జనరల్ కొజిరో యఖియామా, ఇసుజు మోటార్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ టోరూ నకాటా, మిట్సుబిషి కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, సీఈఓ ఇవారో టోయిడి శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డిలు ముఖ్య అతిథులుగా పాల్గొని రూ. 400కోట్ల పెట్టుబడులతో అదనపు ఉత్పత్తి కేంద్రంగా ఏర్పాటు చేసిన ప్రెస్‌షాప్ సదుపాయం, ఇంజన్ అసెంబ్లింగ్ యూనిట్లను ప్రారంభించారు. ఈ రెండవ దశ కార్యకలాపాల ప్రారంభం భారత్‌లోని ఇసుజు ప్రయాణంలో అతి ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందని జపాన్ కాన్సుల్ జనరల్ తెలిపారు. అంతర్జాతీయ తయారీ కేంద్రాలలో ఒకటిగా ఈ ప్లాంటును తీర్చిదిద్దడానికి ఇసుజు చేస్తున్న ప్రయత్నాలను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు. అనివార్య పరిస్థితుల్లో ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయిన రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పంపిన అభినందన సందేశాన్ని శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి చదివి వినిపించారు. మంత్రి తన సందేశంలో ఇసుజుకు అన్నివిధాలా రాష్ట్ర ప్రభుత్వం మద్దతు, భరోసా ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఆటో మొబైల్ తయారీకి ఇసుజు ఒక ప్రామాణికంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి కార్ల పరిశ్రమ ఇసుజు అంటూ శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ రవీంద్ర సన్నారెడ్డి వ్యాఖ్యానించారు. టోరూ నకాటా మాట్లాడుతూ.. పోటీ మార్కెట్లో అత్యుత్తమ శ్రేణి ఉత్పత్తులు, సేవలను అందించడానికి ఇసుజు ఎప్పుడూ ప్రయత్నిస్తూ ఉంటుందన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఉత్పత్తుల నాణ్యత, విశ్వసనీయతకు భరోసా అందిస్తామన్నారు. రెండవ దశ కార్యకలాపాలు తమ వృద్ధిని మరింత వేగవంతం చేయడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్ సామర్థ్యాన్ని విస్తరించనుందని పేర్కొన్నారు. -
భారత్‌లో మూడు షియోమి స్మార్ట్‌ఫోన్ ప్లాంట్స్
సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి భారత్‌లో మూడు స్మార్ట్ ఫోన్ తయారీ కేంద్రాలను నెలకొల్పనున్నట్టు సోమవారం ప్రకటించింది. ఏపీలోని శ్రీసిటీతో పాటు తమిళనాడులోని పెరంబదూర్‌లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. దేశంలో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ యూనిట్ల తయారీ కోసం చెన్నైలో కంపెనీ తొలిసారిగా సర్ఫేస్ మౌంట్ టెక్నాలజీ (ఎస్ఎంటీ) ప్లాంట్‌ను నెలకొల్పనుంది. సప్లయర్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సందర్భంగా షియోమీ గ్లోబల్ ఎండీ వైస్ ప్రెసిడెంట్ మనూ జైన్ ఈ వివరాలు వెల్లడించారు. భారత స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో షియోమి విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని చెప్పారు. భారత్‌ను అంతర్జాతీయ తయారీ హబ్‌గా మలిచే క్రమంలో షియోమి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఫాక్స్‌కాన్ భాగస్వామ్యంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఫాక్స్‌కాన్ ప్లాంట్ల్లో 95 శాతం మంది మహిళలే ఉద్యోగులు కావడం గమనార్హం. ఈ మూడు స్మార్ట్ ఫోన్ ప్లాంట్లు, చెన్నైలోని ఎస్ఎంటీ ప్లాంట్‌తో స్ధానికులకు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు సమకూరుతాయని షియోమి పేర్కొంది. -
వచ్చే రెండేళ్లలో ఐటీలో లక్ష ఉద్యోగాలు
-
వచ్చే రెండేళ్లలో ఐటీలో లక్ష ఉద్యోగాలు
విజయవాడ : రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని ఐటీ శాఖ మంత్రి లోకేశ్ తెలిపారు. ఆయన మంగళవారం నగరంలో కేజే సిస్టమ్స్ ఎక్స్పాన్షన్ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్ రూపుదిద్దుకుంటుందని, ఈ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయన్నారు. పనిలో పనిగా గతంలోనే తాను ఐటీ రంగానికి తాను సేవలు అందించానంటూ చెప్పుకొచ్చారు. రెండేళ్ల క్రితమే సెల్‌ఫోన్ కంపెనీల యజమానుల సమావేశం ఏర్పాటు చేశానని, అయితే ఆ సమావేశానికి ముఖ్యమంత్రి అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోవడంతో తానే వెళ్లానన్నారు. దానివల్లే శ్రీసిటీలో 9వేల ఉద్యోగాలు వచ్చాయని మంత్రి నారా లోకేశ్ అన్నారు. -
శ్రీసిటీని సందర్శించిన అమెరికా ప్రతినిధి
సత్యవేడు: చెన్నైలోని అమెరికా కాన్సుల్ జనరల్ ఫిలిప్ ఎ మిన్ మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రమణ్యం ఆయనకు సాదరస్వాగతం పలికారు. ఈసందర్భంగా శ్రీసిటీలోని మౌళిక వసతులను, పారిశ్రామిక ప్రగతిని వివరించారు. పెప్సికో, కోల్గేట్, క్యాడ్బరీస్, కెల్లాగ్స్ వంట భారీ పరిశ్రమలతో సహా పదికి పైగా అమెరికా కంపెనీలు ఇక్కడ ఏర్పాటైనట్లు తెలిపారు. శ్రీసిటీలో మౌళిక వసతులు ఆకట్టుకొనే విధంగాను, స్పూర్తిదాయకంగా ఉన్నాయంటూ ఫిలిప్ ఎ మిన్ కొనియాడారు. శ్రీసిటీ స్వరూపం ప్రాజెక్టు దీని భవిష్యత్‌కు అద్దం పడుతున్నాయన్నారు. పలు అమెరికన్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటుకావడం ఆనందదాయకమన్నారు. శ్రీసిటీలోని పెప్పికో, కోల్గేట్ పామోలిన్ కంపెనీలను ఆయన సందర్శించారు. అనంతరం స్ధానిక పలు అమెరికన్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. ఈమేరకు శ్రీసిటీ ఎండీ రవీద్రసన్నారెడ్డి ఒక ప్రకటనలో శ్రీసిటీ అభివృద్ధి పథమే ఇక్కడ పెట్టుబడులకు మరింత అవకాశం కల్పిస్తోందన్నారు. భాతర దేశం పెట్టబడుల ర్యాంకింగ్‌లో ఉత్తమ స్థానం సంపాదించుకున్నందున పలు గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కు వస్తున్నాయన్నారు. -
'లాజిస్టిక్ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతాం'
-
ఏపీలో మరిన్ని పెప్సీకో ప్లాంట్లు: ఇంద్రానూయి
తిరుమల : పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అనుకూలమని గుర్తించినట్లు పెప్సీకో ఛైర్మన్ అండ్ సీఈవో ఇంద్రానూయి తెలిపారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ఆమె శుక్రవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఇంద్రానూయి మాట్లాడుతూ శ్రీసిటీలో ఫ్లాంట్‌ను ప్రారంభించేముందు స్వామివారిని దర్శించుకున్నట్లు చెప్పారు. స్వామివారి ఆశీర్వాదాలతో ప్రతిపనీ వియజవంతం అవుతుందని ఆమె తెలిపారు. ఆంధ్రపద్రేశ్లో పెప్సీ ఫ్లాంట్ పెట్టడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. రాష్ట్రాంలో మరిన్ని ప్లాంట్లు పెట్టే ఆలోచన ఉన్నట్లు ఇంద్రానూయి తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబుతో పాటు తాము కూడా కృషి చేస్తామన్నారు. -
సత్యవేడులో దళితుల ఆందోళన
తిరుపతి : చిత్తూరు జిల్లా సత్యవేడులో సోమవారం ఉద్రిక్తత నెలకొంది. సత్యవేడు తహసీల్దార్ కార్యాలయాన్ని దళితులు ముట్టడించి శ్రీసిటీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శ్రీసిటీ పరిధిలోని రామచంద్రాపురంలో కేటాయించిన భూములను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వారు ఆందోళనకు దిగారు. లేనిపక్షంలో ఐఐఐటీ నిర్మాణాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.