వచ్చే రెండేళ్లలో ఐటీలో లక్ష ఉద్యోగాలు | one lakh jobs in IT sector, says Minister Nara Lokesh | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో ఐటీరంగంలో లక్ష ఉద్యోగాలు

Published Tue, Apr 11 2017 1:38 PM | Last Updated on Wed, Aug 29 2018 3:37 PM

వచ్చే రెండేళ్లలో ఐటీలో లక్ష ఉద్యోగాలు - Sakshi

వచ్చే రెండేళ్లలో ఐటీలో లక్ష ఉద్యోగాలు

విజయవాడ :  రాష్ట్రంలో వచ్చే రెండేళ్లలో ఐటీ రంగంలో లక్ష ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయని ఐటీ శాఖ మంత్రి లోకేశ్‌ తెలిపారు. ఆయన మంగళవారం నగరంలో కేజే సిస్టమ్స్‌ ఎక్స్‌పాన్షన్‌ యూనిట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎలక్ట్రా‌నిక్స్‌ మాన్యుఫాక్చరింగ్‌ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌ రూపుదిద్దుకుంటుందని, ఈ రంగంలో 5 లక్షల ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు దక్కనున్నాయన్నారు.

పనిలో పనిగా గతంలోనే తాను ఐటీ రంగానికి తాను సేవలు అందించానంటూ చెప్పుకొచ్చారు. రెండేళ్ల క్రితమే సెల్‌ఫోన్‌ కంపెనీల యజమానుల సమావేశం ఏర్పాటు చేశానని, అయితే ఆ సమావేశానికి ముఖ్యమంత్రి అనివార్య కారణాల వల్ల వెళ్లలేకపోవడంతో తానే వెళ్లానన్నారు. దానివల్లే శ్రీసిటీలో 9వేల ఉద్యోగాలు వచ్చాయని మంత్రి నారా లోకేశ్‌ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement