చెన్నై: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీ సిటీలో ఏర్పాటు చేస్తున్న ప్రపంచస్థాయి ప్లాంటు ఈ ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో క్వార్టర్‌లో ప్రారంభమయ్యే వీలున్నట్లు ఏసీలు, ఎయిర్ ప్యూరిఫయర్‌ల తయారీ దిగ్గజం బ్లూస్టార్ తాజాగా వెల్లడించింది. కంపెనీ ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్‌లో ఏర్పాటు చేసిన తయారీ ప్లాంటును విస్తరించగా.. శ్రీ సిటీలో భారీ యూనిట్‌ను నెలకొల్పుతున్నట్లు బ్లూస్టార్ లిమిటెడ్ ఎండీ బి.త్యాగరాజన్ తెలియజేశారు.
ఆత్మనిర్భర్ భారత్‌ను బలంగా విశ్వసించే తాము పీఎల్‌ఐ పథకంలో భాగంగా ఈ ప్లాంటును నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. మూడో త్రైమాసికం(అక్టోబర్–డిసెంబర్)లో ప్లాంటు కార్యకలాపాలు ప్రారంభమయ్యే అవకాశమున్నట్లు తెలియజేశారు.
తొలి దశలో భాగంగా ఈ ప్లాంటుపై రూ.250 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. మొత్తంగా రూ.550 కోట్ల పెట్టుబడి ప్రణాళికలున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది 20% వృద్ధిని అంచనా వేయడంతోపాటు.. 14% మార్కెట్ వాటాపై కన్నేసినట్లు తెలిపారు. రెసిడెన్షియల్ ఏసీల మార్కెట్లో ప్రస్తుతం 13.2% వాటాను కలిగి ఉన్నట్లు పేర్కొన్నారు.
చదవండి: ఏపీలో ఫ్లిప్‌కార్ట్ పెట్టుబడులు
Comments
Please login to add a commentAdd a comment