Mahogany Trees: జీవితంలో గొప్పవాడివి కావాలంటే తప్పకుండా ఏదో ఒక బిజినెస్ చేయాలి. బిజినెస్ అనగానే కోట్లలో పెట్టుబడి పెట్టాలనే భయం ఏ మాత్రం వద్దు. ఎందుకంటే నీ కృషి, పట్టుదలే నిన్ను జీవితంలో ఎదిగేలా చేస్తాయి. చెట్లను పెంచడం వల్ల కూడా కోటీశ్వరులయ్యే మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇందులో ఒకటి మహాగని చెట్ల పెంపకం. ఈ చెట్ల వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి? ఎన్ని రోజులకు వస్తాయనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
మహాగని మొక్కలను పెంచడం ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్లలోని ఆకులు, గింజలు, ఆఖరికి బెరడు కూడా విక్రయించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ మొక్కలు నాటిన తరువాత సుమారు 12 సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది.
మహాగని ఉపయోగాలు
మహాగని కలప సంగీత వాయిద్యాల్లోనూ, విగ్రహాల తయారీలోనూ, వాటర్‌క్రాఫ్ట్, అలంకార ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తారు. విత్తనాలను కొన్ని ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఔషదాలు షుగర్, క్యాన్సర్, బీపీ వంటి రుగ్మతల నివారణకు వాడే వైద్యంలో ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఇక ఆకుల విషయానికి వస్తే, ఇవి వ్యవసాయ పురుగు మందులగా ఉపయోగిస్తారు. సబ్బు, పెయింట్ వంటి తయారీలో మహాగని నుంచి తీసిన నూనెలను వినియోగిస్తారు. ఈ విధంగా ఈ చెట్టులోకి ప్రతి భాగం అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది.
(ఇదీ చదవండి: చదివింది బీటెక్.. చేసేది బట్టల వ్యాపారం.. రూ. కోట్లలో టర్నోవర్)
మహాగని వేర్లు భూమికి కొంత పైభాగంలోనే ఉంటాయి, కావున కొండ ప్రాంతాల్లో కాకుండా మిగిలిన అన్ని భూభాగాల్లో పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. కావున రైతులు వ్యవసాయ, బంజరు భూములలో కూడా పెంచుకోవచ్చు. ఈ చెట్టు కలప రంగును బట్టి మార్కెట్లో గిరాకీ ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న కలప ధర రూ. 1300 నుంచి రూ. 2500 వరకు (క్యూబిక్‌ఫీట్) ఉంటుంది. బ్రౌన్ రంగులో ఉన్న కలప కొంత తక్కువ ధర పలుకుతుంది. ఈ చెట్టు సుమారు 60 నుంచి 80 అడుగులు పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ చెట్టు 40 క్యూబిక్ అడుగులు పెరుగుతుంది. క్యూబిక్ ఫీట్ ధర సరాసరి రూ. 1500 అనుకున్నప్పటికీ ఒక చెట్టు రూ. 60,000 వరకు అమ్ముడవుతుంది.
(ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!)
ఒక కేజీ మహాగని విత్తనాల ధర మార్కెట్లో రూ. 1000. ఈ విధంగా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. ఒక వ్యక్తి మహాగని పెంచాలనుకున్నప్పుడు సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో సమీకృత వ్యవసాయం కూడా చేయవచ్చు. అలాంటి పంటలు కూడా వారికి కొంత లాభాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment