Business concept
-
పొట్టి మొక్కతో పుట్టెడు లాభాలు.. నెలకు రూ. 4 లక్షలు పక్కా!
జీవితంలో నువ్వు గొప్ప వాడివి కావాలంటే డబ్బు సంపాదించాలి.. అయితే ఇది అనుకున్న సులభమైతే కాదు, కానీ మనిషి అనుకుంటే అసాధ్యం మాత్రం కాదు. ఇప్పుడు కంపెనీలు ప్రారంభించాలా అని సందేహం రావొచ్చు.. అవేమీ అవసరం లేకుండానే మొక్కలు పెంచి కూడా నీదైన మెలకువలతో తప్పకుండా సక్సెస్ సాధించవచ్చు. ఈ కథనంలో బోన్సాయ్ మొక్కలు పెంచి లక్షలు ఎలా సంపాదించాలో వివరంగా తెలుసుకుందాం. మనం ఎప్పుడైనా నర్సరీకి లేదా గార్డెన్ వంటి వాటికి వెళ్ళినప్పుడు చిన్నగా.. ఎంతో ముద్దుగా కనిపించే 'బోన్సాయ్' (Bonsai) మొక్కలు పెంచి తప్పకుండా లాభాలను పొందవచ్చు. జపనీస్ కళాకృతి మాదిరిగా ఉండే మొక్కలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఎంతోమందిని ఆకర్షిస్తాయి. వీటిని ఇంట్లో ఓ మూల కుండీలో ఉంచి కూడా సులభంగా పెంచుకోవచ్చు. మార్కెట్లో ధర.. ప్రపంచ వ్యాప్తంగా గ్రీనరీని ఇష్టపడే చాలామంది ఈ మొక్కలను ఎంతో ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్లో వీటి ధర రూ. 200 నుంచి రూ. 2500 వరకు ఉన్నాయి. వీటి పెంపకం సాధారణ మొక్కల పెంపకం కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. అయితే దీని పెంపకం గురించి కొంత అవగాహనా కలిగి మొదలు పెడితే చాలా సులభంగా పెంచుకోవచ్చు. బోన్సాయ్ మొక్కలు పెంపకానికి ప్రధానంగా కావలసింది మట్టిని ఎంచుకోవమే. మొక్క నాటడం, చిగురించే ప్రక్రియ, పొడవు వంటివన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. వీటిని పువ్వులు వచ్చే వారకు సాగు చేయాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కావున కొంత ఓపిక అవసరం. పెంపకం విధానం.. ఈ మొక్కల పెంపకం ప్రారంభించాలనుకునే వారు కొంత భూమి కలిగి నీటి వసతి కూడా సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి. భూమిలేని వారు కూడా 100 నుంచి 150 చదరపు అడుగుల టెర్రస్ ఉన్నా చేసుకోవచ్చు. దీనికి మట్టి కుండలు లేదా గాజు కుండలు, శుభ్రమైన గులకరాళ్లు, నీటిని చల్లడానికి ఒక స్ప్రే బాటిల్ వంటివి సమకూర్చుకోవాలి. ఒక చిన్న షెడ్ మాదిరిగా నిర్మించాలనుకుంటే నెట్ కూడా అవసరం ఉంటుంది. ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి! తక్కువ పెట్టుబడితో కూడా బోన్సాయ్ మొక్కల పెంపకం ప్రారభించవచ్చు. కానీ లాభం పొందటానికి కనీసం రెండు నుంచి ఐదు సంవత్సరాల సమయం పడుతుంది. మొక్క కొంత పెరిగిన తరువాత సుమారు 30 నుంచి 50 శాతం అధిక ధరకు విక్రయించవచ్చు. గతంలో ఓ బోన్సాయ్ మొక్క ఏకంగా రూ. 9 కోట్లకు అమ్ముడైంది అంటే దీనికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం! సగటు ఖర్చు.. ఒక మొక్కను మూడు సంవత్సరాలు సాగు చేయడానికి సగటున రూ. 240 ఖర్చు అవుతుంది. అయితే ఈ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా ఒక్కో మొక్కకు రూ. 120 అందిస్తుంది. ఇందులో కూడా మీకు 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సబ్సిడీలు అందిస్తాయి. ఉదాహరణకు మీరు వంద మొక్కలు పెంచడానికి రూ. 24000 ఖర్చవుతుంది. ప్రభుత్వం మొక్కకు 120 అందిస్తుంది కావున వంద మొక్కలకు 12000 అందిస్తుంది. ఇందులో మీకు సబ్సిడీ రూ. 6000 లభిస్తుంది. ఈ లెక్కన మీకు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని స్పష్టమవుతుంది. ఈ సబ్సిడీలను పూర్తిగా ముందుగానే తెలుసుకుంటే మంచిది. కొంత మంది రైతులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఒక హెక్టారులో 3 x 2.5 మీటర్ల విస్తీరణంలో 1500 నుంచి 2500 చెట్లను పెంచవచ్చు. మొక్కల మధ్య ఖాళీ స్థలంలో కూడా మరో పంట పండించుకోవచ్చు. మొత్తం మీద నెలకు సుమారు రూ. 3.5 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు సంపాదించవచ్చు. రీప్లాంటేషన్ కూడా పెద్దగా అవసరం ఉండదని చెబుతున్నారు. -
ఈ చెట్ల పెంపకం మీ జీవితాన్ని మార్చేస్తుంది - రూ. కోట్లలో ఆదాయం పొందవచ్చు!
Mahogany Trees: జీవితంలో గొప్పవాడివి కావాలంటే తప్పకుండా ఏదో ఒక బిజినెస్ చేయాలి. బిజినెస్ అనగానే కోట్లలో పెట్టుబడి పెట్టాలనే భయం ఏ మాత్రం వద్దు. ఎందుకంటే నీ కృషి, పట్టుదలే నిన్ను జీవితంలో ఎదిగేలా చేస్తాయి. చెట్లను పెంచడం వల్ల కూడా కోటీశ్వరులయ్యే మార్గాలు కోకొల్లలుగా ఉన్నాయి. ఇందులో ఒకటి మహాగని చెట్ల పెంపకం. ఈ చెట్ల వల్ల ఎలాంటి లాభాలు వస్తాయి? ఎన్ని రోజులకు వస్తాయనే మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం. మహాగని మొక్కలను పెంచడం ద్వారా ఎక్కువ లాభాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ చెట్లలోని ఆకులు, గింజలు, ఆఖరికి బెరడు కూడా విక్రయించడానికి ఉపయోగపడుతుంది. అయితే ఈ మొక్కలు నాటిన తరువాత సుమారు 12 సంవత్సరాలు వేచి ఉండాల్సి ఉంటుంది. మహాగని ఉపయోగాలు మహాగని కలప సంగీత వాయిద్యాల్లోనూ, విగ్రహాల తయారీలోనూ, వాటర్క్రాఫ్ట్, అలంకార ఉత్పత్తులలోనూ ఉపయోగిస్తారు. విత్తనాలను కొన్ని ఔషదాల తయారీలో ఉపయోగిస్తారు. ఈ ఔషదాలు షుగర్, క్యాన్సర్, బీపీ వంటి రుగ్మతల నివారణకు వాడే వైద్యంలో ఉపయోగిస్తారని చెబుతున్నారు. ఇక ఆకుల విషయానికి వస్తే, ఇవి వ్యవసాయ పురుగు మందులగా ఉపయోగిస్తారు. సబ్బు, పెయింట్ వంటి తయారీలో మహాగని నుంచి తీసిన నూనెలను వినియోగిస్తారు. ఈ విధంగా ఈ చెట్టులోకి ప్రతి భాగం అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. (ఇదీ చదవండి: చదివింది బీటెక్.. చేసేది బట్టల వ్యాపారం.. రూ. కోట్లలో టర్నోవర్) మహాగని వేర్లు భూమికి కొంత పైభాగంలోనే ఉంటాయి, కావున కొండ ప్రాంతాల్లో కాకుండా మిగిలిన అన్ని భూభాగాల్లో పెరుగుదలకు అనుకూలంగా ఉంటాయి. కావున రైతులు వ్యవసాయ, బంజరు భూములలో కూడా పెంచుకోవచ్చు. ఈ చెట్టు కలప రంగును బట్టి మార్కెట్లో గిరాకీ ఉంటుంది. ఎరుపు రంగులో ఉన్న కలప ధర రూ. 1300 నుంచి రూ. 2500 వరకు (క్యూబిక్ఫీట్) ఉంటుంది. బ్రౌన్ రంగులో ఉన్న కలప కొంత తక్కువ ధర పలుకుతుంది. ఈ చెట్టు సుమారు 60 నుంచి 80 అడుగులు పెరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే ఈ చెట్టు 40 క్యూబిక్ అడుగులు పెరుగుతుంది. క్యూబిక్ ఫీట్ ధర సరాసరి రూ. 1500 అనుకున్నప్పటికీ ఒక చెట్టు రూ. 60,000 వరకు అమ్ముడవుతుంది. (ఇదీ చదవండి: కేవలం 18 నెలలు.. రూ. 100 కోట్ల టర్నోవర్ - ఒక యువతి సక్సెస్ స్టోరీ!) ఒక కేజీ మహాగని విత్తనాల ధర మార్కెట్లో రూ. 1000. ఈ విధంగా కూడా డబ్బు సంపాదించుకోవచ్చు. ఒక వ్యక్తి మహాగని పెంచాలనుకున్నప్పుడు సుదీర్ఘ సమయం వేచి ఉండాల్సి వస్తుంది. ఆ సమయంలో సమీకృత వ్యవసాయం కూడా చేయవచ్చు. అలాంటి పంటలు కూడా వారికి కొంత లాభాన్ని తీసుకురావడంలో సహాయపడతాయి. -
భూముల సేకరణలో వ్యాపార దృక్పధం: ధర్మాన
-
భూముల సేకరణలో వ్యాపార దృక్పధం: ధర్మాన
హైదరాబాద్: ఏపీ రాజధాని నిర్మాణం కోసం ప్రభుత్వం భూముల సేకరణలో వ్యాపారం దృక్పధం స్పష్టంగా కనిపిస్తోందని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి ధర్మాన ప్రసాద రావు విమర్శించారు. రాజధాని ఏర్పాటు వల్ల దక్కే ప్రయోజనాలు రైతులకు మాత్రమే చెందాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న చేసిన ప్రకటన ద్వారా ఇందులో ప్రైవేటు సంస్థలకు భాగస్వామ్యం ఉన్నట్లు స్పష్టంగా అర్ధమవుతోందన్నారు. రాజధాని నిర్మాణం వల్ల ఎవరూ ఇబ్బంది పడకూడదన్నారు. చట్టాలు ఉన్నది పేదల ప్రయోజనాల కోసంమేనని చెప్పారు. రాజధాని నిర్మించ తలపెట్టిన గ్రామాలలోని చాలా మంది రైతులలో అయోమయ స్థితి నెలకొందని ధర్మాన పేర్కొన్నారు. రాజధాని ల్యాండ్ పూలింగ్పై ప్రభుత్వ విధాన ప్రకటనను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని చెప్పారు. రాజధాని పేరుతో వ్యాపారం చేస్తే తాము ఊరుకోం అన్నారు. అన్ని విధాలుగా అడ్డుకుంటామని హెచ్చరించారు. రెండు ప్రధాన కంపెనీలు రాజధాని నిర్మాణం చేపట్టనున్నట్లు అర్ధమవుతోందన్నారు. వ్యాపార ప్రయోజనాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతోందని విమర్శించారు. ప్రైవేటు వ్యక్తుల కడుపు నింపడమే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ధోరణి ప్రమాదకరమైనదని, చట్టబద్దతలేని వ్యవహారాలు శ్రేయస్కరం కాదని ధర్మాన హితవుపలికారు. **