జీవితంలో నువ్వు గొప్ప వాడివి కావాలంటే డబ్బు సంపాదించాలి.. అయితే ఇది అనుకున్న సులభమైతే కాదు, కానీ మనిషి అనుకుంటే అసాధ్యం మాత్రం కాదు. ఇప్పుడు కంపెనీలు ప్రారంభించాలా అని సందేహం రావొచ్చు.. అవేమీ అవసరం లేకుండానే మొక్కలు పెంచి కూడా నీదైన మెలకువలతో తప్పకుండా సక్సెస్ సాధించవచ్చు. ఈ కథనంలో బోన్సాయ్ మొక్కలు పెంచి లక్షలు ఎలా సంపాదించాలో వివరంగా తెలుసుకుందాం.
మనం ఎప్పుడైనా నర్సరీకి లేదా గార్డెన్ వంటి వాటికి వెళ్ళినప్పుడు చిన్నగా.. ఎంతో ముద్దుగా కనిపించే 'బోన్సాయ్' (Bonsai) మొక్కలు పెంచి తప్పకుండా లాభాలను పొందవచ్చు. జపనీస్ కళాకృతి మాదిరిగా ఉండే మొక్కలు చూడటానికి చాలా అందంగా కనిపిస్తూ ఎంతోమందిని ఆకర్షిస్తాయి. వీటిని ఇంట్లో ఓ మూల కుండీలో ఉంచి కూడా సులభంగా పెంచుకోవచ్చు.
మార్కెట్లో ధర..
ప్రపంచ వ్యాప్తంగా గ్రీనరీని ఇష్టపడే చాలామంది ఈ మొక్కలను ఎంతో ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. మార్కెట్లో వీటి ధర రూ. 200 నుంచి రూ. 2500 వరకు ఉన్నాయి. వీటి పెంపకం సాధారణ మొక్కల పెంపకం కంటే కూడా కొంత భిన్నంగా ఉంటుంది. అయితే దీని పెంపకం గురించి కొంత అవగాహనా కలిగి మొదలు పెడితే చాలా సులభంగా పెంచుకోవచ్చు.
బోన్సాయ్ మొక్కలు పెంపకానికి ప్రధానంగా కావలసింది మట్టిని ఎంచుకోవమే. మొక్క నాటడం, చిగురించే ప్రక్రియ, పొడవు వంటివన్నీ చాలా భిన్నంగా ఉంటాయి. వీటిని పువ్వులు వచ్చే వారకు సాగు చేయాలంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కావున కొంత ఓపిక అవసరం.
పెంపకం విధానం..
ఈ మొక్కల పెంపకం ప్రారంభించాలనుకునే వారు కొంత భూమి కలిగి నీటి వసతి కూడా సరైన విధంగా ఉండేలా చూసుకోవాలి. భూమిలేని వారు కూడా 100 నుంచి 150 చదరపు అడుగుల టెర్రస్ ఉన్నా చేసుకోవచ్చు. దీనికి మట్టి కుండలు లేదా గాజు కుండలు, శుభ్రమైన గులకరాళ్లు, నీటిని చల్లడానికి ఒక స్ప్రే బాటిల్ వంటివి సమకూర్చుకోవాలి. ఒక చిన్న షెడ్ మాదిరిగా నిర్మించాలనుకుంటే నెట్ కూడా అవసరం ఉంటుంది.
ఇదీ చదవండి: నెలకు రూ. 1 లక్ష.. 25 ఏళ్ళు రావాలంటే? ఇలా చేయండి!
తక్కువ పెట్టుబడితో కూడా బోన్సాయ్ మొక్కల పెంపకం ప్రారభించవచ్చు. కానీ లాభం పొందటానికి కనీసం రెండు నుంచి ఐదు సంవత్సరాల సమయం పడుతుంది. మొక్క కొంత పెరిగిన తరువాత సుమారు 30 నుంచి 50 శాతం అధిక ధరకు విక్రయించవచ్చు. గతంలో ఓ బోన్సాయ్ మొక్క ఏకంగా రూ. 9 కోట్లకు అమ్ముడైంది అంటే దీనికున్న డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇదీ చదవండి: ముఖేష్ అంబానీ వేతనం ఎంతో తెలుసా? మరో ఐదేళ్లూ అదే జీతం!
సగటు ఖర్చు..
ఒక మొక్కను మూడు సంవత్సరాలు సాగు చేయడానికి సగటున రూ. 240 ఖర్చు అవుతుంది. అయితే ఈ మొక్కల పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం కూడా ఒక్కో మొక్కకు రూ. 120 అందిస్తుంది. ఇందులో కూడా మీకు 50 శాతం సబ్సిడీ లభిస్తుంది. కేంద్ర & రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక సబ్సిడీలు అందిస్తాయి.
ఉదాహరణకు మీరు వంద మొక్కలు పెంచడానికి రూ. 24000 ఖర్చవుతుంది. ప్రభుత్వం మొక్కకు 120 అందిస్తుంది కావున వంద మొక్కలకు 12000 అందిస్తుంది. ఇందులో మీకు సబ్సిడీ రూ. 6000 లభిస్తుంది. ఈ లెక్కన మీకు అయ్యే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని స్పష్టమవుతుంది. ఈ సబ్సిడీలను పూర్తిగా ముందుగానే తెలుసుకుంటే మంచిది.
కొంత మంది రైతులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఒక హెక్టారులో 3 x 2.5 మీటర్ల విస్తీరణంలో 1500 నుంచి 2500 చెట్లను పెంచవచ్చు. మొక్కల మధ్య ఖాళీ స్థలంలో కూడా మరో పంట పండించుకోవచ్చు. మొత్తం మీద నెలకు సుమారు రూ. 3.5 లక్షల నుంచి రూ. 4 లక్షల వరకు సంపాదించవచ్చు. రీప్లాంటేషన్ కూడా పెద్దగా అవసరం ఉండదని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment