
సాక్షి, న్యూఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం షియోమి భారత్‌లో మూడు స్మార్ట్ ఫోన్ తయారీ కేంద్రాలను నెలకొల్పనున్నట్టు సోమవారం ప్రకటించింది. ఏపీలోని శ్రీసిటీతో పాటు తమిళనాడులోని పెరంబదూర్‌లో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. దేశంలో ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ అసెంబ్లీ యూనిట్ల తయారీ కోసం చెన్నైలో కంపెనీ తొలిసారిగా సర్‌ఫేస్ మౌంట్ టెక్నాలజీ (ఎస్‌ఎంటీ) ప్లాంట్‌ను నెలకొల్పనుంది. సప్లయర్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్ సందర్భంగా షియోమీ గ్లోబల్ ఎండీ వైస్ ప్రెసిడెంట్ మనూ జైన్ ఈ వివరాలు వెల్లడించారు. భారత స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో షియోమి విప్లవాత్మక మార్పులు తీసుకువస్తోందని చెప్పారు.
భారత్‌ను అంతర్జాతీయ తయారీ హబ్‌గా మలిచే క్రమంలో షియోమి కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఫాక్స్‌కాన్ భాగస్వామ్యంతో ఈ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. ఫాక్స్‌కాన్ ప్లాంట్‌ల్లో 95 శాతం మంది మహిళలే ఉద్యోగులు కావడం గమనార్హం. ఈ మూడు స్మార్ట్ ఫోన్ ప్లాంట్‌లు, చెన్నైలోని ఎస్‌ఎంటీ ప్లాంట్‌తో స్ధానికులకు పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు సమకూరుతాయని షియోమి పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment