శ్రీసిటీని సందర్శించిన అమెరికా ప్రతినిధి
సత్యవేడు: చెన్నైలోని అమెరికా కాన్సుల్ జనరల్ ఫిలిప్ ఎ మిన్ మంగళవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ ప్రెసిడెంట్ రమేష్ సుబ్రమణ్యం ఆయనకు సాదరస్వాగతం పలికారు. ఈసందర్భంగా శ్రీసిటీలోని మౌళిక వసతులను, పారిశ్రామిక ప్రగతిని వివరించారు. పెప్సికో, కోల్గేట్, క్యాడ్‌బరీస్, కెల్లాగ్స్ వంట భారీ పరిశ్రమలతో సహా పదికి పైగా అమెరికా కంపెనీలు ఇక్కడ ఏర్పాటైనట్లు తెలిపారు. శ్రీసిటీలో మౌళిక వసతులు ఆకట్టుకొనే విధంగాను, స్పూర్తిదాయకంగా ఉన్నాయంటూ ఫిలిప్ ఎ మిన్ కొనియాడారు. శ్రీసిటీ స్వరూపం ప్రాజెక్టు దీని భవిష్యత్‌కు అద్దం పడుతున్నాయన్నారు. పలు అమెరికన్ కంపెనీలు ఇక్కడ ఏర్పాటుకావడం ఆనందదాయకమన్నారు. శ్రీసిటీలోని పెప్పికో, కోల్గేట్ పామోలిన్ కంపెనీలను ఆయన సందర్శించారు. అనంతరం స్ధానిక పలు అమెరికన్ కంపెనీల ప్రతినిధులతో ఆయన సమావేశం అయ్యారు. ఈమేరకు శ్రీసిటీ ఎండీ రవీద్రసన్నారెడ్డి ఒక ప్రకటనలో శ్రీసిటీ అభివృద్ధి పథమే ఇక్కడ పెట్టుబడులకు మరింత అవకాశం కల్పిస్తోందన్నారు. భాతర దేశం పెట్టబడుల ర్యాంకింగ్‌లో ఉత్తమ స్థానం సంపాదించుకున్నందున పలు గ్లోబల్ కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు భారత్‌కు వస్తున్నాయన్నారు.