'ఐ హేట్ న్యూ ఇయర్' | Jennifer Lawrence hates New Year's event | Sakshi
Sakshi News home page

'ఐ హేట్ న్యూ ఇయర్'

Published Thu, Dec 31 2015 9:02 AM | Last Updated on Wed, Oct 17 2018 4:29 PM

'ఐ హేట్ న్యూ ఇయర్' - Sakshi

'ఐ హేట్ న్యూ ఇయర్'

లండన్: ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు ఎలా జరుపుకోవాలి.. ఎక్కడికి వెళ్లాలి.. ఏ స్నేహితులతో గడపాలి అని ఆలోచిస్తుంటే హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ మాత్రం 'ఐ హేట్ న్యూ ఇయర్' అంటూ సింపుల్గా చెప్పేసింది. గ్రహమ్ నార్టాన్ నిర్వహించిన యూకే టాక్ షో కార్యక్రమానికి గురువారం ఆస్కార్ నటి జెన్నిఫర్ హాజరయ్యింది.  తనకు ఈ వేడుక అస్సలు ఇష్టం ఉండదని 'ది హంగర్ గేమ్స్' హీరోయిన్ తేల్చి చెప్పింది. అయితే, అనివార్య కారణాల వల్ల 2016 న్యూ ఇయర్ వేడుకలో పాల్గొనాల్సి ఉంటుందని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. తనకు ఎప్పుడు మంచి జ్ఞాపకాలు, అనుభవాలు ఎదురుకాలేదని.. ప్రతి ఒక్కరూ మంచి జరగాలని తాపత్రయపడుతుంటారని, అయితే ఎప్పుడు నిరాశ చెందడం తప్ప ప్రయోజనం లేదంటోంది అమెరికా భామ.

ఎప్పుడూ ముక్కుసూటిగా, మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ఈ నటి న్యూ ఇయర్ వేడుకలు, చెడు అనుభవాలపై మాట్లాడింది. న్యూ ఈయర్ వేడుక జరుపుకునే ప్రతి ఏడాది నైట్ పార్టీ పీడకలగా మిగిలిపోతున్నాయన్నది. 'మద్యం సేవించడం.. నిరాశ చెందడం' ఎప్పుడూ జరుగుతుంటుందని తన అనుభవాలను, గత స్మృతులను టీవీ షో ద్వారా అభిమానులతో పంచుకుంది. హాలీవుడ్ ఎంట్రీకి ముందు మోడలింగ్ చేశానని, ఓ ఫొటోషూట్ నుంచి వచ్చిన ఫొటోలు తనకు బాగా నచ్చాయని.. కానీ అనుమతి లేకుండానే అందరి చేతుల్లోకి వెళ్లడం లాంటివి నచ్చలేదని జెన్నీ వివరించింది. ఎక్స్-మెన్, పాసింజర్స్ మూవీల షూటింగ్లతో ప్రస్తుతం బిజిబిజీగా ఉన్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement