Oscar winning actress
-
ఆస్కార్ విన్నింగ్ మూవీ నటి అరెస్ట్
టెహ్రాన్: ఇరాన్లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనల్లో పాల్గొంటున్న వారితో పాటు వారికి మద్దతు తెలుపుతున్న వారిపైనా ఉక్కుపాదం మోపుతోంది అక్కడి ప్రభుత్వం. ఇప్పటికే వందల మందిని అరెస్ట్ చేసి జైళ్లలో వేసింది. పలువురిని బహిరంగంగానే ఉరి తీసిన సంఘటనలూ ఉన్నాయి. తాజాగా హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు మద్దతు తెలినందుకు ప్రముఖ సినీ నటి, ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మూవీలో నటించిన తరనేహ్ అలిదూస్తి(38)ను అరెస్ట్ చేసింది. తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ అల్లర్లు సృష్టించేందుకు కారణమవుతున్నారన్న ఆరోపణలతో ఈ చర్యలు తీసుకున్నట్లు తస్నిమ్ న్యూస్ నివేదించింది. 2016లో ఆస్కార్ అవార్డు అందుకున్న ‘ద సేల్స్‌మ్యాన్’ ద్వారా నటి తరనేహ్ అలిదూస్తి అందరి దృష్టిని ఆకర్షించారు. డిసెంబర్ 8న హిజాబ్ వ్యతిరేక ఆందోళనలకు మద్దతు తెలుపుతున్నట్లు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేశారు అలిదూస్తి. అదే రోజు మొహ్సెన్ షేకారి(23) అనే యువకుడిని ఇరాన్ బహిరంగంగానే ఉరి తీయటం ప్రాధాన్యం సంతరించుకుంది. తన ఇన్స్టాగ్రామ్ వేదిగా ఓ పోస్ట్ చేశారు.‘మీరు మౌనంగా ఉండడం అంటే అణచివేత, అణచివేతదారులకు మద్దతుగా నిలిచినట్లే. ఇలాంటి రక్తపాతాన్ని చూసి ఎలాంటి చర్యలు తీసుకోని అంతర్జాతీయ సంస్థలు ఉండడం మానవత్వానికి అవమానకరం’అని రాసుకొచ్చారు నటి తరనేహ్ అలిదూస్తి. టీనేజ్ నుంచి ఇరాన్ సినిమాలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు నటి తరనేహ్ అలిదూస్తి. ఇటీవల విడుదలైన ‘లైలా బ్రదర్స్’ అనే సినిమాలో నటించారు. ఆ మూవీ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. ఇదీ చదవండి: మధుమేహం పెరుగుదలలో చైనా, భారత్ పోటాపోటీ -
'ఐ హేట్ న్యూ ఇయర్'
లండన్: ప్రపంచమంతా నూతన సంవత్సర వేడుకలు ఎలా జరుపుకోవాలి.. ఎక్కడికి వెళ్లాలి.. ఏ స్నేహితులతో గడపాలి అని ఆలోచిస్తుంటే హాలీవుడ్ నటి జెన్నిఫర్ లారెన్స్ మాత్రం 'ఐ హేట్ న్యూ ఇయర్' అంటూ సింపుల్‌గా చెప్పేసింది. గ్రహమ్ నార్టాన్ నిర్వహించిన యూకే టాక్ షో కార్యక్రమానికి గురువారం ఆస్కార్ నటి జెన్నిఫర్ హాజరయ్యింది. తనకు ఈ వేడుక అస్సలు ఇష్టం ఉండదని 'ది హంగర్ గేమ్స్' హీరోయిన్ తేల్చి చెప్పింది. అయితే, అనివార్య కారణాల వల్ల 2016 న్యూ ఇయర్ వేడుకలో పాల్గొనాల్సి ఉంటుందని ఈ అమ్మడు చెప్పుకొచ్చింది. తనకు ఎప్పుడు మంచి జ్ఞాపకాలు, అనుభవాలు ఎదురుకాలేదని.. ప్రతి ఒక్కరూ మంచి జరగాలని తాపత్రయపడుతుంటారని, అయితే ఎప్పుడు నిరాశ చెందడం తప్ప ప్రయోజనం లేదంటోంది అమెరికా భామ. ఎప్పుడూ ముక్కుసూటిగా, మనసులో ఉన్నది ఉన్నట్లుగా చెప్పే ఈ నటి న్యూ ఇయర్ వేడుకలు, చెడు అనుభవాలపై మాట్లాడింది. న్యూ ఈయర్ వేడుక జరుపుకునే ప్రతి ఏడాది నైట్ పార్టీ పీడకలగా మిగిలిపోతున్నాయన్నది. 'మద్యం సేవించడం.. నిరాశ చెందడం' ఎప్పుడూ జరుగుతుంటుందని తన అనుభవాలను, గత స్మృతులను టీవీ షో ద్వారా అభిమానులతో పంచుకుంది. హాలీవుడ్ ఎంట్రీకి ముందు మోడలింగ్ చేశానని, ఓ ఫొటోషూట్ నుంచి వచ్చిన ఫొటోలు తనకు బాగా నచ్చాయని.. కానీ అనుమతి లేకుండానే అందరి చేతుల్లోకి వెళ్లడం లాంటివి నచ్చలేదని జెన్నీ వివరించింది. ఎక్స్-మెన్, పాసింజర్స్ మూవీల షూటింగ్‌లతో ప్రస్తుతం బిజిబిజీగా ఉన్న విషయం తెలిసిందే.