అందుకే డ్రగ్స్, మందు మానేశాను : ఆస్కార్ నటి | actress Jennifer Lawrence left all bad habbits | Sakshi
Sakshi News home page

అందుకే డ్రగ్స్, మందు మానేశాను : ఆస్కార్ నటి

Published Sun, Sep 11 2016 2:42 PM | Last Updated on Mon, Sep 4 2017 1:06 PM

అందుకే డ్రగ్స్, మందు మానేశాను : ఆస్కార్ నటి

అందుకే డ్రగ్స్, మందు మానేశాను : ఆస్కార్ నటి

ఆస్కార్ విన్నింగ్ హీరోయిన్ జెన్నిఫర్ లారెన్స్ తనకు సంబంధించిన విషయాలను మోహమాటం లేకుండా వెల్లడించింది. మద్యం అలవాటున్న తాను ఒకసారి డ్రగ్స్ తీసుకున్నానని చెప్పింది. తన పేరేంట్స్ కరెన్, గ్యారీ లారెన్స్ తన ఆరోగ్యం గురించి ఎంతో ఆందోళన చెందారట. దీంతో ఎంతా కాలం నుంచి ఉన్న దురలవాట్లను మానేశానని ఈ అమ్మడు అంటోంది. ముఖ్యంగా 'హంగర్ గేమ్స్' సినిమా షూటింగ్ సమయంలో డ్రగ్స్ తీసుకున్నానని గతంలో ఓ షో సందర్భంగా పేర్కొంది. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం అందుకుంటున్న నటి జెన్నిఫర్ లారెన్స్. వరుసగా రెండో ఏడాది కూడా అగ్రస్థానంలో నిలిచింది.

ఫోర్బ్స్ మ్యాగజీన్ ప్రకారం 2016లో అత్యధిక పారితోషికం అందుకునే నటీమణుల జాబితాల్లో రూ.308కోట్లకు పైగా ఆర్జిస్తున్న జెన్నిఫర్ తొలి స్థానంలో ఉంది. గత జూన్ నెలలో కెనడాకు వెళ్లేముందు తన పేరేంట్స్ తనతో ఎన్నో విషయాలు మాట్లాడారని చెప్పింది. చెడు అలవాట్లకు దూరంగా ఉంటే చాలు, ఎలాంటి పేరు ప్రఖ్యాతులు లేకున్నా సరే అని వాళ్లు తన వద్ద బాధపడ్డ విషయాన్ని ప్రస్తావించింది. వారి సూచనల మేరకు తాను అన్ని చెడు అలవాట్లకు దూరంగా ఉండి పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని హాలీవుడ్ బామ చెప్పుకొచ్చింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement