
ముచ్చటగా మూడోసారి పడింది!
‘‘ఈవిడగారు సులువుగా పడిపోతుంది. పడగొట్టడానికి ప్రత్యేకంగా ఎవరూ ఏమీ చేయనక్కర్లేదు’’ అంటూ హాలీవుడ్ తార జెన్నిఫర్ లారెన్స్ గురించి అక్కడివాళ్లు జోకులేసుకుంటున్నారు.
‘‘ఈవిడగారు సులువుగా పడిపోతుంది. పడగొట్టడానికి ప్రత్యేకంగా ఎవరూ ఏమీ చేయనక్కర్లేదు’’ అంటూ హాలీవుడ్ తార జెన్నిఫర్ లారెన్స్ గురించి అక్కడివాళ్లు జోకులేసుకుంటున్నారు. దానికి కారణం లేకపోలేదు. గత ఏడాది ఆస్కార్ అవార్డుల వేడుకలో జెన్నిఫర్ లారెన్స్ ఎర్ర తివాచీపై అందంగా నడుస్తూ జర్రున జారింది. ఈ ఏడాది ఆస్కార్ అవార్డు వేడుకలో కూడా సేమ్ సీన్ రిపీట్. తనకన్నా ముందు వెళుతున్న మహిళ పొడవాటి గౌను మీద ఈవిడగారు కాలేయడంతో మళ్లీ జారిపడింది. ఇలా రెండుసార్లు ఆమె పడటం హాట్ టాపిక్ అయ్యింది. ఇటీవల ముచ్చటగా మూడోసారి కూడా పడిపోయింది జెన్నిఫర్.
రెండు రోజుల క్రితం న్యూయార్క్‌లో జరిగిన ‘ఎక్స్-మెన్: డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్’ ప్రీమియర్ షోని వీక్షించడానికి అందంగా ముస్తాబై వెళ్లింది జెన్నిఫర్. తళుకులీనే నీలం రంగు పొడవాటి గౌనులో చక్కగా కనిపించిన జెన్నిఫర్‌ని చాలామంది కన్నార్పకుండా చూశారట. దిష్టి తగిలిందో లేక అలవాటు ప్రకారం పడకపోతే బాగుండదనుకుందో మెట్లెక్కుతూ పడిపోయింది జెన్నిఫర్. ఇలాంటివి జరిగితే రక్షించడానికి అంగరక్షకులు ఉంటారు కదా.. పూర్తిగా పడక ముందే జెన్నిఫర్‌ని పట్టుకున్నారు. ఏదేమైనా సినిమా తారలు పడితే న్యూస్ అవుతుంది. కానీ, జెన్నిఫర్‌లా పదే పదే పడితే మాత్రం ‘ఈవిడగారు పడకపోతే న్యూస్’ అని చెప్పుకుంటారు.