అరుదైన మహిళ జీవితకథతో... | Jennifer Lawrence, Steven Spielberg & Warner Bros Land War Photog Memoir 'It's What I Do' | Sakshi
Sakshi News home page

అరుదైన మహిళ జీవితకథతో...

Mar 3 2015 11:37 PM | Updated on Sep 2 2017 10:14 PM

అరుదైన మహిళ జీవితకథతో...

అరుదైన మహిళ జీవితకథతో...

ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్, సుప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్, నటి జెన్నీఫర్ లారెన్స్...

ప్రసిద్ధ చిత్ర నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్, సుప్రసిద్ధ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్, నటి జెన్నీఫర్ లారెన్స్... అరుదైన ఈ కాంబినేషన్ నిజం కానుంది. యుద్ధక్షేత్రాల్లో ఫోటోలు తీయడంలో ప్రసిద్ధురాలైన లిన్సే అడారియో జ్ఞాపకాల ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ‘ఇట్స్ వాట్ ఐ యు - ఎ ఫోటోగ్రాఫర్స్ లైఫ్ ఆఫ్ లవ్ అండ్ వార్’ అనే జ్ఞాపకాల పుస్తకాన్ని తెర కెక్కించే హక్కుల్ని వార్నర్ బ్రదర్స్ సొంతం చేసుకుంది. ప్రధానంగా పురుషులే ఉండే ‘వార్ ఫోటోగ్రఫీ’లో స్థానం సంపాదించి, ఒకప్పుడు కిడ్నాప్‌కు కూడా గురైన ఈ మహిళా ఫొటోగ్రాఫర్   జీవితం అరుదైన వెండితెర అనుభవం కానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement