
‘ది ఫాబెల్‌మ్యాన్స్’ (2022) చిత్రం తర్వాత హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బర్గ్ తదుపరి చిత్రం గురించి ఇంకా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే స్పీల్‌బర్గ్ తర్వాతి సినిమా గురించి అతి త్వరలోనే కొత్త కబురు వినిపించనుందని హాలీవుడ్ టాక్. హాలీవుడ్ ప్రముఖ నటి ఎమిలీ బ్లంట్ లీడ్ రోల్‌లో స్పీల్‌బర్గ్ ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నారట.
ఈ సినిమా గురించి ఎమిలీతో చర్చించారట కూడా. త్వరలోనే ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన రానుందని టాక్. ఓ వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాను 2026 వేసవిలో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారట స్పీల్‌బర్గ్.
Comments
Please login to add a commentAdd a comment