సాక్షి, సినిమా: దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి బ్లాక్‌బస్టర్ పీరియడ్ డ్రామా ఆర్‌ఆర్‌ఆర్ మేనియా ప్రపంచమంతా సాగుతోంది. ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కించుకుంది ఇందులోని నాటు నాటు సాంగ్. తద్వారా అరుదైన ఘనత సాధించిన భారతీయ చిత్రంగా నిలిచింది. ఎంఎం కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్.. ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీతో పాటు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో అవార్డు దక్కించుకుంది. ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్ ఆస్కార్ బరిలోనూ ఏదైనా అద్భుతం సృష్టిస్తుందా? అని ఎదురు చూస్తున్నారంతా.
ఈ లోపు రాజమౌళి తన ఫ్యాన్ బాయ్ ముచ్చటను తీర్చుకున్నాడు. హాలీవుడ్ దిగ్గజ ఫిల్మ్‌మేకర్ స్టీవెన్ స్పీల్‌బర్గ్(76)ను కలిశాడు. ఐ జస్ట్ మెట్ గాడ్ అంటూ తన భావాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు ఆయన. మొదటి చిత్రంలో ఆయన ఎక్స్‌ప్రెషన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఆ ఫొటోల్లో సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సైతం ఉన్నారు. జురాసిక్ పార్క్ లాంటి చిత్రాలతో స్టీవెన్ స్పీల్‌బర్గ్ మన దేశంలోనూ పాపులర్ అయిన సంగతి తెలిసిందే.
I just met GOD!!! ❤️🔥❤️🔥❤️🔥 pic.twitter.com/NYsNgbS8Fw
— rajamouli ss (@ssrajamouli) January 14, 2023
గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకల సందర్భంలోనే వీళ్ల కలయిక జరిగినట్లు అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. ఈ వెటరన్ ఫిల్మ్‌మేకర్ ది ఫాబెల్స్‌మ్యాన్ చిత్రానికి గానూ బెస్ట్ డైరెక్టర్(మోషన్ పిక్చర్)కేటగిరీలో అవార్డు అందుకున్నారు. ఇదిలా ఉంటే.. కేవలం రెండే గంటల్లో జక్కన్న పోస్ట్‌కి మిలియన్‌కి పైగా వ్యూస్ రావడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment