గరమ్ గరమ్!
ప్రభుదేవాతో ఎఫైర్ నడిపి... పెళ్లి దాకా వెళ్లి... చివరకు డ్రాపైన మలయాళ కుట్టి నయనతార పేరు చెబితే శాండల్‌వుడ్ హీరోలు గుర్రుమంటున్నారు. ఉపేంద్రతో కలసి ‘సూపర్’లో చేసిన ఈ సోగ కళ్ల బ్యూటీ... ఆ తరువాత కన్నడ స్టార్లు ఎవరడిగినా కాదంటోందట. బచ్‌హాన్‌లో చేయమని సుదీప్ ఇచ్చిన ఆఫర్‌ను కాదన్న నయన... ఆ తరువాత అభిమానుల ఆరాధ్య నటుడు పునీత్ అడిగినా పట్టించుకోలేదట. చూస్తుంటే.. ఈ అమ్మడికి ఎందుకో కన్నడ ఇండస్ట్రీ అంటే బొత్తిగా ఇష్టం లేనట్టు కనిపిస్తోంది. దీనిపై అభిమానులు, ఇండస్ట్రీ గరమ్‌గా ఉన్నారని టాక్.
నికోలాస్ ‘హాల్ట్’!
అటు తిరిగి ఇటు తిరిగి... కాదనుకుని... వదులుకొని మళ్లీ పాత బాయ్‌ఫ్రెండ్‌నే కావాలనుకుంటోంది బాలీవుడ్ సూపర్‌స్టార్ జెన్నీఫర్ లారెన్స్. నికోలాస్ హాల్ట్‌తో ప్రేమాయణం నడిపిన ఈ గుమ్మ... లాస్ట్ సమ్మర్‌లో విడిపోయింది. కొంత కాలం పాప్ స్టార్ క్రిస్ మార్టినతో రొమాన్స్ నడిపింది. తాజాగా... ఎక్స్ బాయ్‌ఫ్రెండ్‌తో చెక్కర్లు కొడుతోందని ఫిమేల్ ఫస్ట్ కో డాట్ యూకే సైట్ కథనం. ‘నికోలాస్ రోజూ జెన్నీఫర్‌కు కాల్ చేస్తూనే ఉన్నాడు. స్కైప్‌లో మాట్లాడుకొంటున్నారు. ఒకరి యోగ క్షేమాలు ఒకరు అడిగి తెలుసుకొంటున్నారు’ అని పేర్కొంది.
అక్షర... అప్‌సెట్!
ఇంకా తెరంగేట్రం చేయకముందే మాంచి పాపులారిటీ తెచ్చుకొంటున్న కమల్‌హాసన్ రెండో కుమార్తె అక్షర... కోపంతో ఊగిపోతోంది. కారణం... ఆకతాయిలెవరో ఆమె ఫొటోలను మార్ఫింగ్ చేసి అశ్లీలంగా పోస్ట్ చేశారు. నెట్‌లో ఎక్కడ చూసినా ఇప్పుడివే కనిపిస్తున్నాయి. ‘ఈ ఫొటోలు చూస్తుంటే చిర్రెత్తుకొస్తోంది. బికీనీలో పోజుచ్చినట్టు పెట్టారు. ఇవి నావి కావు. నా పేరుతో ఎఫ్‌బీ ప్రొఫైల్స్ కూడా కుప్పలు తెప్పలున్నాయి. అందరికీ తెలియాల్సిందేమిటంటే... నాకు ఏ సోషల్ వెబ్‌సైట్లో అకౌంట్ లేదు. అలాగే చెన్నైలో షూటింగ్ చేస్తున్నట్టు స్టేటస్ అప్‌డేట్ చేశారు. రెండు నెలలుగా నేను చెన్నైలోనే లేను’ అంటూ ఆవేదన వెళ్లబోసుకుంది అక్షర.
మూవీస్ టాక్
Published Mon, Nov 17 2014 1:32 AM | Last Updated on Sat, Sep 2 2017 4:35 PM
Advertisement
Advertisement