టైమ్ టు రొమాన్స్ | Time to Romance | Sakshi
Sakshi News home page

టైమ్ టు రొమాన్స్

Published Tue, Oct 14 2014 12:52 AM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

టైమ్ టు రొమాన్స్ - Sakshi

టైమ్ టు రొమాన్స్

చూస్తుంటే పంజాబీ గుమ్మ సిమ్రాన్‌కౌర్ ముండీకి కాలం కలిసొచ్చినట్టే ఉంది. పంజాబీ, తెలుగు... ఇప్పుడు బాలీవుడ్‌లో మరో ఆఫర్ కొట్టేసింది. బుల్లి తెరపై కామెడీ షోలతో గిలిగింతలు పెట్టే కపిల్‌శర్మ ఎంట్రీ ఫిల్మ్‌లో ఈ అమ్మడు చాన్స్ కొట్టేసింది. దర్శకద్వయం అబ్బాస్- మస్తాన్ అందాల రాసి కోసం... అదీ పంజాబీ రూపురేఖలున్న అమ్మాయి కోసం వెతుకుతుండగా వారి మదిలో సిమ్రాన్ మెరిసిందట. దీంతో పాటు ఆమె మోడలింగ్ ఎక్స్‌పీరియన్సూ ప్లస్సయిందట. ఈ ఆఫర్‌కు తెగ సంబరపడిపోతోంది సిమ్రాన్.
 
వన్స్ ఎగైన్!
షూటింగ్‌లో కలుసుకొని.. రీల్‌లో రొమాన్స్ పండించి.. రియల్ లైఫ్‌లో దాన్ని పంచుకుని.. విడిపోయిన హాలీవుడ్ స్టార్స్ జెన్నీఫర్ లారెన్స్, నికోలాస్‌హౌల్ట్ మళ్లీ ఒక్కటవుతున్నారు. కానీ.. ఆన్‌స్క్రీన్‌లోనే.  2011లో ‘ఎక్స్‌మాన్- ఫస్ట్‌క్లాస్’ సమయంలో డేటింగ్ చేసిన వీరు ఇటీవల విడిపోయారు. కారణాలడిగితే... బిజీ షెడ్యూల్స్ వల్ల కలవలేకపోతున్నామంటూ దాటేశారు. మళ్లీ  వీరిద్దరూ కలసి నటిస్తున్న చిత్రం కూడా ఎక్స్‌మ్యాన్ ‘ఎక్స్‌టెన్షనే’. అదే.. ‘ఎక్స్‌మ్యాన్- అపోక్యాలిప్స్’ అనమాట.
 
డబుల్ హ్యాపీస్
పుట్టీ పుట్టగానే పెర్‌ఫార్మెన్స్ ఇచ్చేసే అవకాశం ఎంత మందికి దక్కుతుంది చెప్పండి! అదీ బాలీవుడ్ బిగ్‌స్క్రీన్‌పై. ఇప్పుడంత సీన్ ఎవరికుందనేగా..! బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ చిన్న కుమారుడు అబ్‌రామ్. కింగ్ ఖాన్ తాజా చిత్రం ‘హ్యాపీ న్యూ ఇయర్’లో కనిపించబోతున్నాడట. ఓ లేటెస్ట్ ఇంటర్వ్యూలో షారూఖ్ సతీమణి గౌరీఖాన్ ఈ విషయాన్ని చెప్పింది. ‘ఇది అప్పటికప్పుడు పుట్టిన ఆలోచన. నేను, వాడు కలసి సినిమాలో కనిపిస్తాం’ అంటూ ఉప్పొంగే ఆనందంతో చెప్పింది గౌరీ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement