
ఉత్తమ సహనటిగా జెన్నిఫర్ లారెన్స్
లాస్ ఏంజెల్స్: ఉత్తమ సహనటిగా జెన్నిఫర్ లారెన్స్ ఎంపికైయ్యారు. జులియా రాబెర్ట్, షాలీ హకిన్స్, జూన్ స్క్విబ్ లను పక్కకు నెట్టి ఈ అవార్డను జెన్నిఫర్ గెలుచుకున్నారు. గోల్డెన్ గ్లోబ్ 71 వ సినిమా అవార్డులను ఆదివారం ప్రదానం చేసింది. ఉత్తమ సహాయ నటిగా ఎంపికైన ఆమె తన సహచరుల చేతులు మీదుగా అవార్డును అందుకున్నారు. అమెరికన్ హస్టిల్ చిత్రంలో ఆమె క్రిస్టియన్ బేల్ కు భార్యగా నటించింది. ఆ చిత్రంలో తన సహ నటుడు అమీ ఆడమ్స్ కు ఆన్ స్ర్కీన్ ముద్దు సన్నివేశాన్ని కూడా పంచుకుంది.
ఇదిలా ఉండగా శేఖర్ కపూర్ దర్శకత్వం వహించనున్న ‘పానీ’లో నటించడానికి ఆమె అంగీకరించారట. యశ్‌రాజ్ ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. భవిష్యత్తులో అంతర్జాతీయ సంస్థలు నీళ్లని తమ ఆధిక్యంలో ఉంచుకుంటే, ఇక్కడివాళ్లు ఆ నీళ్లను దక్కించుకోవడానికి ఏం చేస్తారు? అనేది ఈ చిత్రం ప్రధానాంశం అని బాలీవుడ్ టాక్.
కథానుగుణంగా ఈ చిత్రంలో ఇక్కడి తారలతో పాటు హాలీవుడ్ తారలను ఎంపిక చేయాలనుకున్నారు శేఖర్. జెన్నిఫర్ లారెన్స్‌కి అంతర్జాతీయంగా మంచి మార్కెట్ ఉండడంతో పాటు, ఈ చిత్రంలోని పాత్రకు ఆమె నప్పుతారు కాబట్టి, తీసుకోవాలనుకున్నారట. ఈ చిత్రకథ నచ్చి ఆమె వెంటనే అంగీకరించారని వినికిడి. దాదాపు 150 కోట్ల రూపాయలతో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారని బాలీవుడ్ టాక్.