82వ గోల్డెన్ గ్లోబ్స్(Golden Globes) ఈ నెల జనవరి 6, 2025న లాస్ ఏంజిల్స్‌లోని బెవర్లీ హిల్టన్‌లో అట్టహాసంగా జరిగింది. ఇది స్టార్ స్టడ్స్ అవార్డుల ప్రధానోత్సవం. ఏదైన హాలీవుడ్ ఫారిన్ ప్రెస్ అసోసియేషన్ (HFPA) గతేడాది సినిమా, టెలివిజన్‌లలోని ఆయా విభాగాల్లో అత్యుత్తమ విజయాన్ని సాధించిన వారికి అవార్డులు అందజేస్తారు. ఈ వేడుకలో ప్రముఖులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున పాల్గొంటారు. అలాంటి ప్రతిష్టాత్మకమైన ఈవెంట్‌లో వడ్డించే విందు కూడా అత్యంత గ్రాండ్‌గానే ఉంటుంది. సాదాసీదా చెఫ్‌లు తయారు చేయరని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇంతకీ మెనూలో ఉండే వెరైటీ వంటకాలెంటో చూద్దామా..!.
ఈ వేడుకలో వంటకాలను తయారు చేసేది పాక ప్రపంచంలో ప్రముఖ లెజెండ్ అయిన నోబు మత్సుహిసా(Chef Nobu Matsuhisa). ఆయన సాంప్రదాయ జపనీస్ రుచులకు వివిధ పద్ధతుల మిళితం చేసి అందించడంలో ఫేమస్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో రెస్టారెంట్‌లో నోబు తన పాక నైపుణ్యాన్ని రుచి చూపించారు ఆహారప్రియులకు. ఇలాటి లగ్జరీయస్ ఈవెంట్‌లోని మెనూ బాధ్యతను చెఫ్ నోబు తీసుకోవడం రెండోసారి.
ఇక ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్స్ 2025లోని అతిథులకు చెఫ్ నోబు ..ఎల్లోటైల్ జలపెనో, సిగ్నేచర్ మాట్సుహిసా డ్రెస్సింగ్‌తో సాషిమి సలాడ్, మిసో బ్లాక్ కాడ్, సీవీడ్ టాకోస్ విత్ కేవియర్, సాల్మన్, ట్యూనా, తాయ్ వంటి వాటితో రకరకాల డిష్‌లు తయారు చేశారు. ఈ రుచికరమైన పదార్థాలన్నింటిలో అత్యంత లగ్జరీయస్ రెసిపీ కూడా షేర్ చేసుకున్నారు. ఆ మెనూలో హైలెట్‌గా గోల్డ్ స్టాండర్డ్ రోల్(Gold Standard Roll) నిలిచింది.
దీన్ని ఈ గోల్డెన్ గ్లోబ్స్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారట చెఫ్ నోబు. ఈ అద్భుతమైన రోల్‌ని కింగ్ క్రాబ్, సాల్మన్ ఉపయోగించి తయారు చేశారట. అలాగే 24-క్యారెట్ బంగారు రేకులు(24-karat gold ), కేవియర్‌తో అలంకరించి సర్వ్ చేశామని తెలిపారు చెఫ్ నోబు. అంతేకాదండోయ్ ఈ వేడుకలో ప్రీమియం షాంపైన్, వైన్‌ను హాయిగా సిప్ చేయొచ్చట.
(చదవండి: మంచు దుప్పటిలో విలక్షణమైన ఇల్లు..ఒక్క రాత్రికి ఎంతో తెలుసా...!)
Comments
Please login to add a commentAdd a comment