loss angels
-
కన్నీళ్లు తెప్పించిన సజీవదహనం ఫోటోలు.. '31 మిలియన్ డాలర్లు చెల్లించండి'
అమెరికన్ బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబ్ బ్రియాంట్ 2020లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. అతని మరణవార్త అప్పట్లో క్రీడాలోకాన్ని తీవ్ర దిగ్ర్బాంతికి గురి చేసింది. సబర్బన్ లాస్ ఏంజిల్స్‌లో పొగమంచు కారణంగా హెలికాప్టర్ కుప్పకూలి మంటలు చెలరేగాయి. దీంతో బ్రియంట్తో సహా ఆయన 13 ఏళ్ల కూతురు జియానా దుర్మరణం చెందింది. హెలికాప్టర్ కూలుతూనే మంటల్లో చిక్కుకోవడంతో హెలికాప్టర్లో ఉన్న మరో ఎనిమిది మంది కూడా సజీవదహనమయ్యారు.. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. PC: కోబ్ బ్రియాంట్ భార్య వెనెస్సా బ్రియాంట్ అప్పట్లో కోబ్ బ్రియాంట్ మృతిపై సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా లాస్ ఏంజిల్స్ కౌంటీ డిప్యూటీస్ సహా అగ్నిమాపక అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని ఫోటోలు తీశారు. అంతటితో ఊరుకోకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో బ్రియాన్ సజీవదహనం ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలు బ్రయంట్ భార్య వెనెస్సాను ఎమోషన్‌కు గురిచేయడంతో పాటు మానసిక సంఘర్షణకు గురయ్యేలా చేశాయి. తన అనుమతి లేకుండా ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టడంపై లాస్ ఏంజిల్స్ కౌంటీపై కోర్టులో దావా వేసింది. తాజాగా బుధవారం దావాను పరిశీలించిన తొమ్మిది మందితో కూడిన ధర్మాసనం.. తీర్పును వెనెస్సాకు అనుకూలంగా ఇచ్చింది. కోబ్ బ్రయంట్ భార్య సహా మిగతావాళ్లకు కలిపి లాస్ ఏంజెల్స్ కౌంటీ 31 మిలియన్ డాలర్ల నష్టపరిహారాన్ని చెల్లించాలని జ్యూరీ ఆదేశించింది. వెనెస్సా బ్రయంట్ కుటుంబంతో పాటు క్రిస్ చెస్టర్, అతని భార్య సారా, కుమార్తె పేటన్ కూడా ఈ ప్రమాదంలో మరణించారు. దీంతో 31 మిలియన్ డాలర్స్‌లో వెనెస్సా బ్రియంట్కు 16 మిలియన్ డాలర్లు.. చెస్టర్ ఫ్యామిలీకి 15 మిలియన్ డాలర్లు చెల్లించాలని కౌంటీకి పేర్కొంది. PC: కోబ్ బ్రియాంట్ కుటుంబం(ఫైల్ ఫోటో) ధర్మాసనం తీర్పును చదవగానే భావోద్వేగానికి గురైన వెనెస్సా బ్రియాంట్ విలేకరులతో మాట్లాడకుండానే కన్నీళ్లు పెట్టుకుంటూ కోర్టు ఆవరణ నుంచి వెళ్లిపోయింది. ఆ తర్వాత ఇన్స్టాగ్రామ్ వేదికగా తన భర్త బ్రియాంట్, కూతురు జియానా ఫోటోను షేర్ చేస్తూ "ఆల్ ఫర్ యు! ఐ లవ్ యు! జస్టిస్ ఫర్ కోబ్ అండ్ జిగి!" అని క్యాప్షన్ జత చేసింది. PC: కోబ్ బ్రియాంట్(ఫైల్ ఫోటో) కొబ్ బ్రయంట్ తన 20 ఏళ్ల కెరీర్లో పలు రికార్డులు సాధించారు. నేషనల్ బాస్కెట్ బాల్ అసోసియేషన్ తరపున ఆడి ఐదు సార్లు ఛాంపియన్ గా నిలిచారు. 18సార్లు ఆల్ టైమ్ స్టార్ గా నిలిచారు. 2016లో ఎన్ బీఎ నుంచి మూడోసారి ఆల్ టైమ్ స్కోరర్ గా రిటైర్ అయ్యారు. కొబ్ బ్రయంట్ 2012 ఒలింపిక్స్ లో యూఎస్ టీమ్ తరపున ఆడి రెండు స్వర్ణ పతకాలు అందుకున్నారు. -
ఇప్పట్లో ప్రపంచం అంతం కాదు.. ఇదిగో ప్రూఫ్‌లు
లాస్ ఏంజెల్స్: భూగోళం అంతం గురించి ఎన్నో వార్తలు వింటున్నాం. ఆ రోజు అంతమైతది.. ప్రపంచంలో జీవి అనేదే ఉండదు.. భూగోళం మునిగిపోతుంది అని తదితర విషయాలు ప్రజలను భయాందోళన రేకెత్తించేలా వస్తుంటాయి. పైగా బ్రహ్మాంగారు చెప్పారు.. ఇదిగో సూచనలు.. సంకేతాలు అంటూ చెబుతూ మరికొందరు చెబుతుంటారు. అయితే ఇప్పుడు తాజాగా ఒకరు మన ఆదిత్య-369 సినిమాలో మాదిరి ఒక వ్యక్తి భవిష్యత్ కాలానికి వెళ్లి వచ్చాడట. ఇప్పట్లో భూగోళం అంతం కాదని తేల్చి చెప్పాడు. 5 వేల సంవత్సరానికి మాత్రం ప్రపంచం ఉండదంటూ.. ఇదిగో నేను చెప్పే దానికి ప్రూఫ్‌లుగా చెబుతూ కొన్ని ఫొటోలు చూపిస్తున్నాడు. ఈ వార్త ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఎడ్వర్డ్ అనే ప్రయాణికుడు ఈ విషయాన్ని తెలిపాడు. ఓ యూట్యూబ్ ఛానల్ అపెక్స్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘నేను భవిష్యత్‌కు వెళ్లానని.. ఆ సమయంలో భూగోళం అంతా నీటిలో మునిగిపోయి ఉంది’ అని వివరించాడు. ఇవిగో వాటికి ప్రూఫ్ అంటూ కొన్ని ఫొటోలను చూపించాడు. నీటిలో ఒక నగరమంతా మునిగి ఉన్న ఫొటోను బహిర్గత పరిచాడు. కేవలం భవనాలు తప్పా ఇంకేమీ కనిపించడం లేదు. ఐదు వేల సంవత్సరంలో భూగోళం మునిగిపోయింది అని చెప్పాడు. 2004లో తాను 3 వేల సంవత్సరాలు దాటి భవిష్యత్ కాలానికి వెళ్లినట్లు తెలిపాడు. ‘నేనొక కథ చెబితే మీకు అద్భుతంగా అనిపిస్తుంది. 2004లో నేను ఓ సీక్రెట్ మిషన్ ద్వారా భవిష్యత్ కాలానికి వెళ్లాను. అమెరికాలోని లాస్ఏంజెల్స్ నగరమంతా నీటిలో మునిగిపోయి ఉంది. వాతావరణ పరిస్థితుల కారణంగా అలా జరిగింది. అక్కడి నుంచి తిరిగివచ్చిన అనంతరం వాటికి సంబంధించిన ఫొటోలను లాబోరేటరిలో చూడగా ఈ విషయం తెలిసింది’ అని ఎడ్వర్డ్ తెలిపారు. ఈ ఇంటర్వ్యూ 2018 ఫిబ్రవరిలో చేయగా తాజాగా మళ్లీ బయటకు వచ్చి సంచలనంగా మారింది. ‘అప్పుడు నేను ఓ చెక్కపై నిలబడ్డా. నేనొక్కడినే కాదు ఇళ్లు, భవనాలు అన్నీ కలపతో చేసి ఉన్నవే. అప్పుడు నేను ఇది లాస్ ఏంజిల్స్ నగరంగా గుర్తించా.’ అని వివరించాడు. అయితే ఇంటర్వ్యూ ఇచ్చిన ఎడ్వర్డ్ ముఖం కనిపించకుండా చేశారు. అతడి స్వరాన్ని కూడా కొద్దిగా మార్చి ప్రసారం చేశారు. అతడికి ఏమైనా ఇబ్బందులు కలగవచ్చు అనే ఉద్దేశంతో ఇలా చేశారు. ఇది నేను తొలిసారి చేసిన ‘టైమ్ యాత్ర’ కాదు అని ఎడ్వర్డ్ చెబుతున్న వీడియో వైరల్‌గా మారింది. అయితే ప్రపంచం అంతం అవుతుందనే వార్తలు గతంలో కూడా చాలా వచ్చాయి. ఎడ్వర్డ్ చెబుతున్న దాన్ని చూస్తుంటే ఇప్పట్లో ప్రపంచం అంతం కాదనే విషయం స్పష్టమవుతోంది. మన పిల్లలు తాతముత్తాలు అయినా కూడా ఈ భూగోళం సురక్షితంగా ఉంటుందని తెలుస్తోంది. ఈ వార్తతోనైనా ఇకపై భూగోళం అంతం వార్తలు నమ్మొద్దు అని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
ముప్పై ఏళ్లలో 13 హత్యలు.. 50 రేప్‌లు
వాషింగ్టన్: ముప్పై ఏళ్లుగా వరుస హత్యలు, అత్యాచారాలకు పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన ‘గోల్డెన్ స్టేట్ కిల్లర్’గా పిలవబడే అమెరికా మాజీ పోలీసు అధికారి జోసెఫ్ జేమ్స్ డీ ఏంజెలో సోమవారం తన నేరాలను కోర్టు ముందు అంగీకరించాడు. 13హత్యలు, పదుల సంఖ్యలో అత్యాచారాలు, కిడ్నాప్‌లు, దొంగతనాలకు పాల్పడుతూ మూడు దశాబ్దాలుగా కాలిఫోర్నియాను భయభ్రాంతులకు గురి చేసిన జోసెఫ్‌కు సోమవారం కోర్టు శిక్ష విదించింది. విచారణలో అతడు పాల్పడిన భయంకరమైన నేరాలకు సంబంధించిన వివరాలను కోర్టు వెల్లడించింది. జోసెఫ్ దాదాపు 30 ఏళ్లుగా నేరాలు చేస్తూ తప్పించుకుని తిరుగుతు సమాజాన్ని భయభ్రాంతులకు గురి చేశాడని పోలీసులు తెలిపారు. 74 ఏళ్ల జోసెఫ్ కోర్టు విచారణ సమయంలో తన నేరాలకు సంబంధించి ‘అవును’.. ‘ఒప్పుకుంటున్నాను’.. ‘తప్పే వంటి’ సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలో ప్రాసిక్యూటర్ అమీ హాలిడే గతంలో జోసెఫ్‌కు విధించిన మరణశిక్షను రద్దు చేస్తూ.. పెరోల్‌కు అనుమతి లేకుండా 11 జీవిత ఖైదుల శిక్షను విధిస్తున్నట్లు తీర్పు వెల్లడించారు. ‘గోల్డెన్ స్టేట్ కిల్లర్’గా పిలవబడే జోసెఫ్‌ను మూడు దశాబ్దాల తర్వాత 2018లో అరెస్ట్ చేశారు. నేరం జరిగిన ప్రదేశంలో దొరికిన డీఎన్ఏను జోసెఫ్ డీఎన్ఏతో పోల్చారు. రెండు మ్యాచ్ కావడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి.. మూడు దశాబ్దాలుగా సాగిన నేరాల పరంపరకు ముగింపు పలికారు. మొదట ఇతడికి 1978లో నూతన జంట బ్రియాన్, కేటీ మాగ్గియోర్ హత్య కేసులో మాత్రమే కోర్టు శిక్ష విధించింది. ఆ తర్వాత 2018 నాటి కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూశాయి. ఈ క్రమంలో గత మూడు దశాబ్దాల నుంచి జోసెఫ్ దాదాపు 13 హత్యలు, 50 అత్యాచారాలు, పదుల కొద్ది దొంగతనాలకు పాల్పడ్డట్లు వెల్లడయ్యింది. న్యాయమూర్తి జోసెఫ్ నేరాల చిట్టాను చదువుతూ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఒక అత్యాచారం కేసులో జోసెఫ్ బాధితురాలి కొడుకు చెవి కోస్తానని బెదిరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని కోర్టు వెల్లడించింది. భారీ వస్తువుతో బాధితుల తలలు పగలకొట్టి హత్యలు చేసేవాడని తెలిపింది. ఇతడి నేరాలు మొదట 1975 సెంట్రల్ కాలిఫోర్నియాలోని శాక్రమెంటో ప్రాంతంలో ప్రారంభమయ్యి.. తర్వాత రాష్ట్రమంతా వ్యాపించాయి. 1986లో ఓ 18 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి హత్య చేశాడు. ఇదే ఇతడి ఆఖరి హత్య. ఈ క్రమంలో ‘ఈస్ట్ ఏరియా రేపిస్ట్’, ‘డైమండ్-నాట్ కిల్లర్’, ‘ఒరిజినల్ నైట్ స్టాకర్’ వంటి అనేక పేర్లతో జనాల గుండెల్లో భయాందోళనలు రేకెత్తించేవాడు. 1979లో ఓ షాపులో దొంగతానికి పాల్పడుతూ పోలీసులకు చిక్కాడు. దాంతో అతడిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆ తర్వాత జోసెఫ్ 20 ఏళ్ళకు పైగా సాక్రమెంటో ప్రాంతంలో నివసించాడు. అక్కడ ట్రక్ మెకానిక్‌గా పని చేస్తూ.. 2017లో పదవి విరమణ చేశాడు. కోర్టు జోసెఫ్‌కు శిక్ష విధిస్తూ.. ‘హత్యగావింపబడిన వారి కుటుంబ సభ్యులు తమ ప్రియమైన వారికి న్యాయం జరగడం కోసం దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. లైంగిక వేధింపుల బాధితులు న్యాయం కోసం ఇంతకాలం ఎదురు చూడటం విషాదకరం’ అంటూ బాధపడ్డారు. -
చలో లాస్ ఏంజిల్స్
పాస్‌పోర్ట్, నిత్యం అవసరమయే వస్తువులను జాగ్రత్తగా సూట్‌కేస్‌లో ప్యాక్ చేసుకుంటున్నారు హీరోయిన్ హ్యూమా ఖురేషి. త్వరలో ఆమె లాస్ ఏంజిల్స్‌కు పయనం కానున్నారు. దాదాపు రెండు నెలలు అక్కడే ఉంటారట.. ‘డ్వాన్ ఆఫ్ ది డెడ్, 300, జస్టిస్ లీగ్’ వంటి ఇంగ్లీష్ చిత్రాలను తెరకెక్కించిన జాక్ స్నైడర్ దర్శకత్వంలో ‘ఆర్మీ ఆఫ్ ది డెడ్’ అనే హాలీవుడ్ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో డావే బౌటిస్టా, థియో రోసి, హ్యూమా ఖురేషి కీలక పాత్రలు చేయనున్నారు. కిరాయి సైనికుల నేపథ్యంలో ఈ సినిమా సాగనుంది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలో లాస్ ఏంజిల్స్ను ప్రారంభం కానుంది. ఇందుకోసం అక్కడికి వెళ్లనున్నారు హ్యూమా. -
లాస్ ఏంజిల్స్ చరిత్రలో.. పెద్ద ప్రమాదం..
సాక్షి, లాస్ ఏంజిల్స్: లా ట్యూనా కెనియన్లో చెలరేగిన కార్చిచ్చు శనివారం రాత్రి ఉత్తర లాస్ ఏంజిల్స్ నగరాన్ని వణికించింది. గత రెండు రోజులుగా ఐదు వేల ఎకరాల అటవీ ప్రాంతం కార్చిచ్చు ధాటికి కాలి బూడిదైనట్లు లాస్ ఏంజిల్స్ ఫైర్ డిపార్ట్మెంట్ ఓ ప్రకటనలో తెలిపింది. కార్చిచ్చుకు 'లా ట్యూనా ఫైర్' అని నామకరణం చేసినట్లు వెల్లడించింది. మంటల కారణంగా గాలి ఉష్ణోగ్రత మూడు అంకెలను దాటడంతో ఆయా ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపింది. బర్బాంక్లో 300, గ్లెండాల్లో 250, లాస్ ఏంజిల్స్‌లో 180 ఇళ్లను ఖాళీ చేయించినట్లు వివరించింది. లాస్ ఏంజిల్స్ నగర చరిత్రలో అత్యంత పెద్ద ప్రమాదం ఇదేనని తెలిపింది. గాలి ఎక్కువగా ఉండటం మంటలు త్వరగా వ్యాప్తి చెందడానికి కారణం అవుతోందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. -
'ట్రంప్ మోడల్స్' మూత పడింది!
లాస్ ఏంజిల్స్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుటుంబానికి చెందిన మోడలింగ్ ఏజెన్సీ 'ట్రంప్ మోడల్స్' మూత పడింది. ఈ విషయాన్ని ఏజెన్సీ వర్గాలు మీడియాకు వెల్లడించాయి. 1999లో మొదలైన ట్రంప్ మోడల్స్ నుంచి కెరీర్ ప్రారంభించిన పలువురు మోడల్స్ ఉన్నత స్ధాయికి చేరుకున్నారు. ఉన్నట్లుండి ఏజెన్సీ మూసివేతకు స్ధాయికి తగిన ప్రాజెక్టులు రాకపోవడమే కారణమని తెలుస్తోంది. ఇటీవల ట్రంప్ మోడల్స్ లో పనిచేసే మేనేజర్ ఒకరు సంస్ధ నుంచి బయటకు వెళ్లి కొత్తగా ఏజెన్సీ ప్రారంభించినట్లు ఓ మీడియా సంస్ధ పేర్కొంది. సంస్ధలో పేరున్న చాలా మంది మోడల్స్ అతని ఏజెన్సీకి వెళ్లిపోయినట్లు తెలిపింది. ట్రంప్ మోడల్స్ మూసివేతకు ఇది కూడా ఓ కారణంగా భావిస్తున్నారు.