నాతో పాటు నలుగుర్ని నగ్నంగా నిలబెట్టింది! | Jennifer Lawrence Had to Do a 'Naked Line-Up,' Told to Lose Weight | Sakshi
Sakshi News home page

నాతో పాటు నలుగుర్ని నగ్నంగా నిలబెట్టింది!

Published Mon, Nov 27 2017 4:08 AM | Last Updated on Mon, Nov 27 2017 4:35 AM

Jennifer Lawrence Had to Do a 'Naked Line-Up,' Told to Lose Weight - Sakshi - Sakshi - Sakshi

ప్రపంచంలోని ఏ చిత్రపరిశ్రమలో చూసినా.. ప్రతిచోటా కామాంధులకు కొదవ లేదన్నట్టుంది పరిస్థితి! నటీమణులు తమ చేదు అనుభవాలను, చిత్రపరిశ్రమల్లోని నగ్న సత్యాలను బయటపెడుతున్నారు. ఇటీవల ‘క్యాస్టింగ్‌ కౌచ్‌’ అనేది ఎక్కువ వినబడుతోంది. క్యాస్టింగ్‌ కౌచ్‌ అంటే... చాన్సుల పేరుతో అమ్మాయిలకు వల వేయడం, లైంగికంగా లోబరుచుకోవడం అన్నమాట! ఇక్కడా... అక్కడా... అనే తేడాల్లేవ్‌! హాలీవుడ్‌లోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ ఓ రేంజ్‌లో ఉందండోయ్‌! ఆస్కార్‌ అవార్డు గ్రహీత, ప్రముఖ హీరోయిన్‌ జెన్నీఫర్‌ లారెన్స్‌కూ అటువంటి చేదు అనుభవాలున్నాయి.

అమెరికన్‌/హాలీవుడ్‌ హీరోయిన్లు అంటే మన దగ్గర ఓ వర్గం ప్రేక్షకులకు కొంచెం చిన్న చూపే! ‘బికినీలు వేసుకోవడం, నగ్నంగా నటించడం వాళ్లకు అలవాటే కదా!’ అనుకుంటారు. కానీ, వాళ్లకూ ఆత్మాభిమానం అనేది ఉంటుంది. అది మరిస్తే ఎలా? అసలు విషయంలోకి వెళితే... అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో ఓ మహిళా నిర్మాత జెన్నీఫర్‌ లారెన్స్‌ను 15 పౌండ్ల బరువు తగ్గమన్నారట! దానిపై జెన్నీఫర్‌ మాట్లాడుతూ– ‘‘రెండు వారాల్లో 15 పౌండ్ల బరువు తగ్గమని చెప్పింది. అంతే కాదు... ఓసారి నాతో పాటు నలుగురు అమ్మాయిలను నగ్నంగా పక్కపక్కన నిలబెట్టింది.

మా ఐదుగురులో ఓ అమ్మాయిని త్వరగా బరువు తగ్గలేదని బయటకు పంపింది. ‘నువ్వే నీ న్యూడ్‌ పిక్స్‌ తీసుకుంటే... త్వరగా బరువు తగ్గాలని ఇన్‌స్పైర్‌ అవుతావు’ అని సదరు మహిళా నిర్మాత చెప్పుకొచ్చింది’’ అని పేర్కొన్నారు. ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత హార్వే వెయిన్‌స్టన్‌ సుమారు 20 ఏళ్ల పాటు సాగించిన అకృత్యాలపై ఇటీవల నటీమణులు పెద్ద ఎత్తున గళం విప్పారు. ఈ సందర్భంగా ఎల్లే సంస్థ ‘విమెన్‌ ఇన్‌ హాలీవుడ్‌’ ఈవెంట్‌ నిర్వహించింది.

అమెరికాలోని లాస్‌ ఏంజిల్స్‌లో జరిగిన ఈ ఈవెంట్‌లో జెన్నీఫర్‌ ఈ వ్యాఖలు చేశారు. ‘‘ఓ నిర్మాత అయితే ‘నువ్వు కొంచెం లావుగా ఉన్నా... పడకగదిలో టైమ్‌ స్పెండ్‌ చేయడానికి ఆకర్షణీయంగా ఉన్నావ్‌’ అన్నాడు. అప్పుడు నాకు 16 ఏళ్లు. కెరీర్‌ని దృష్టిలో పెట్టుకుని ఎవరికీ కంప్లయింట్‌ చేయలేకపోయా’’ అని జెన్నీఫర్‌ పేర్కొన్నారు. ‘‘కలల ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ సమానమైన గౌరవం దక్కాలి. అప్పటివరకు ప్రతి అబ్బాయికి, అమ్మాయికి, మహిళకు, మగాడికీ నా గళాన్ని వినిపిస్తా’’ అని తెలిపారు జెన్నీఫర్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement