ఆస్కార్ ఉత్తమ నటుడిగా లియోనార్డో డికాప్రియా
లాస్‌ఏంజిల్స్ : ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నఆస్కార్ అవార్డుల విజేతల పేర్లను సోమవారం ప్రకటించారు. 86వ ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో భాగంగా ఉత్తమ నటుడిగా లియోనార్డో డికాప్రియో(బ్రూస్) ఎంపికవ్వగా, ఉత్తమ సహాయ నటుడిగా జారెడ్ లెటో(డల్లాస్ బయ్యర్స్ క్లబ్) ఎంపికైయ్యాడు. కాగా గత సంవత్సరం ఉత్తమ నటిగా ఎంపికైన జెన్నీఫర్ లారెన్స్ ఈసారి ఉత్తమ సహాయ నటిగా ఆస్కార్ కు నామినేట్ అయ్యింది. తాజా చిత్రం ‘కామసూత్ర’ త్రీడి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ఎంట్రీ పోటీలో నిలిచింది. ఏకంగా మూడు విభాగాల్లో ఈ చిత్రం పోటీకి నిలవడం విశేషం. ‘బెస్ట్ మోషన్ పిక్చర్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’’ విభాగాలకు ఈ చిత్రం ఎంపికైంది.
మన భారతదేశం నుంచి దాదాపు ఐదేళ్ల క్రితం ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రం ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’విభాగాల్లో రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఈ విభాగాల్లో ‘కామసూత్ర’ నిలిచింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 75 పాటలు పోటీపడబోతున్నాయి. వీటిలో ‘కామసూత్ర’ లోని ఐదు పాటలూ ఉండటం విశేషం. చెన్నయ్‌కి చెందిన సచిన్, శ్రీజిత్ ఈ పాటలకు స్వరాలందించారు. రూపేష్ పౌల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా, జనవరి 16న అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలను ప్రకటించారు. మార్చి 3న అస్కార్ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది.