‘బార్బెన్‌హైమర్‌’ పోరు ఖరారు!  | Here's The Full List Of Oscar Nominations For 2024 Academy Awards, Check All Categories Nominations Inside - Sakshi
Sakshi News home page

Oscar Nominations 2024 List: ‘బార్బెన్‌హైమర్‌’ పోరు ఖరారు! 

Published Wed, Jan 24 2024 1:45 AM

the full list of Oscar nominations for 2024 Academy Awards - Sakshi

గత ఏడాది బాక్సాఫీస్‌ దగ్గర సంచలన వసూళ్లు కురిపించిన దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ ‘ఒప్పెన్‌హైమర్‌’, దర్శకురాలు గ్రెటా గెర్విగ్‌ ‘బార్బీ’ చిత్రాలు ఆస్కార్‌ అవార్డ్స్‌లోనూ పో టీలో నిలిచాయి. 96వ ఆస్కార్‌ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు మంగళవారం సాయంత్రం (భారతీయ కాలమాన ప్రకారం) వెలువడ్డాయి. 23 విభాగాల్లోని ప్రధాన విభాగాల్లో ‘ఒప్పెన్‌హైమర్‌’కు 13 నామినేషన్లు దక్కగా, ‘బార్బీ’ ఎనిమిది నామినేషన్లను సొంతం చేసుకుంది. నామినేషన్ల జాబితాను నటుడు జాక్‌ క్వైడ్, నటి జాజీ బీట్జ్‌ ప్రకటించారు.

ఇంకా అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న చిత్రాల్లో 11 నామినేషన్లతో యోర్గోస్‌ లాంతిమోస్‌ దర్శకత్వం వహించిన ‘పూర్‌ థింగ్స్‌’, పది నామినేషన్లతో మార్టిన్‌ స్కోర్సెస్‌ దర్శకత్వం వహించిన ‘కిల్లర్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌’, ఏడు నామినేషన్లతో ‘మేస్ట్రో’ ఉన్నాయి. ఉత్తమ చిత్రం విభాగంలో ‘ఒప్పెన్‌హైమర్‌’, ‘బార్బీ’ పో టీ పడుతుండటంతో ‘ఇది బార్బెన్‌హైమర్‌ పో రు’ అని హాలీవుడ్‌ వర్గాలు పేర్కొన్నాయి.


కాగా, ఉత్తమ దర్శకుల విభాగంలో ‘బార్బీ’ దర్శకురాలు గ్రెటా గెర్విగ్‌కి నామినేషన్‌ దక్కుతుందనే అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆమె నామినేట్‌ కాకపో వడం ఆశ్చర్యానికి గురి చేసిందని హాలీవుడ్‌ అంటున్న మాట. కానీ ఇదే చిత్రానికి సహాయ నటి విభాగంలో అమెరికా ఫెర్రెరాకి దక్కడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫెర్రెరాకి నామినేషన్‌ దక్కుతుందనే కనీస అంచనాలు లేకపో వడమే ఈ ఆశ్చర్యానికి కారణం.

అలాగే ‘బార్బీ’లో టైటిల్‌ రోల్‌ చేసిన మార్గెట్‌ రాబీకి ఉత్తమ నటి నామినేషన్‌ దక్కకపో వడం ఘోరం అనే టాక్‌ కూడా ఉంది. ఇక దర్శకుల విభాగంలో గ్రెటా గెర్విగ్‌కి దక్కకపో యినప్పటికీ ‘అనాటమీ ఆఫ్‌ ఎ ఫాల్‌’ చిత్రదర్శకురాలు జస్టిన్‌ ట్రైట్‌కి దక్కడంతో ఈ కేటగిరీలో ఓ మహిళ ఉన్నట్లు అయింది. ఇక మార్చి 10న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో (భారత కాలమానం ప్రకారం మార్చి 11) ఆస్కార్‌ అవార్డుల వేడుక జరగనుంది.

మూడేళ్లుగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ కెమ్మెల్‌ ఈసారి కూడా ఆ బాధ్యతను నిర్వర్తించనున్నారు. ఇదిలా ఉంటే గతేడాది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (‘నాటు నాటు...’ పాటకు ‘బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌’ అవార్డు), బెస్ట్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ విభాగంలో ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’ ఆస్కార్‌ అవార్డు దక్కించుకుని, భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటాయి. ఈసారి దేశం నుంచి ఏ సినిమా పో టీలో లేదు. అయితే కెనడాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన నిషా పహుజా దర్శకత్వం వహించిన కెనెడియన్‌ డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ‘టు కిల్‌ ఏ టైగర్‌’కి నామినేషన్‌ దక్కింది.

ఉత్తమ చిత్రం:

  • అమెరికన్‌ ఫిక్షన్‌
  • అటానమీ ఆఫ్‌ ఎ ఫాల్‌
  • బార్బీ
  • ది హోల్డోవర్స్‌
  • కిల్లర్స్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌
  • మేస్ట్రో ∙ఒప్పెన్‌హైమర్‌
  • పాస్ట్‌ లైవ్స్‌ ∙పూర్‌ థింగ్స్‌
  • ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌

ఉత్తమ దర్శకుడు:

  • అటానమీ ఆఫ్‌ ఎ ఫాల్‌: జస్టిన్‌ ట్రైట్‌
  • కిల్లర్స్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌: మార్టిన్‌ స్కోర్సెస్‌
  • ఒప్పైన్‌ హైమర్‌: క్రిస్టోఫర్‌ నోలన్‌
  • పూర్‌ థింగ్స్‌: యోర్గోస్‌
  • ది జోన్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌: జొనాథన్‌ గ్లేజర్‌

ఉత్తమ నటుడు:

  • బ్రాడ్లీ కూపర్‌: మేస్ట్రో
  • కోల్మన్‌ డొమింగో: రస్టిన్‌
  • పాల్‌ జియామటి: ది హోల్డోవర్స్‌
  • కిలియన్‌ మర్ఫీ: ఒప్పెన్‌ హైమర్‌
  • జెఫ్రీ రైట్‌: అమెరికన్‌ ఫిక్షన్‌  

ఉత్తమ నటి:

  • అన్నెతే బెనింగ్‌: నయాడ్‌
  • లిల్లీ గ్లాడ్‌స్టోన్‌: కిల్లర్స్‌ ఆఫ్‌ ది ఫ్లవర్‌ మూన్‌
  • సాండ్రా హూల్లర్‌: అటానమీ ఆఫ్‌ ఎ ఫాల్‌
  • కెర్రీ ములిగన్‌: మేస్ట్రో
  • ఎమ్మా స్టోన్‌: పూర్‌ థింగ్స్‌

ఏ 91 ఏళ్ల కంపో జర్‌ జాన్‌ విల్లియమ్స్‌ 54వ నామినేషన్‌ దక్కించుకున్నారు. ‘ఇండియా జోన్స్‌ అండ్‌ ది డయల్‌ ఆఫ్‌ డెస్టినీ’ చిత్రానికి గాను ఆయనకు నామినేషన్‌ దక్కింది. అత్యధిక సార్లు నామినేషన్‌ దక్కించుకున్న సంగీతదర్శకుడిగా ఆయన రికార్డ్‌ సాధించారు. ఇప్పటికే ఐదు ఆస్కార్‌ అవార్డులు సొంతం చేసుకున్న జాన్‌కి ఈ చిత్రం కూడా ఆస్కార్‌ తెచ్చి, ఆనందపరుస్తుందా అనేది చూడాలి ఏ ఈ ఏడాది నామినేషన్స్‌ 61 ఏళ్ల జోడీ ఫాస్టర్‌ని మళ్లీ పో టీలో నిలబెట్టాయి.

29 ఏళ్ల తర్వాత ‘నయాడ్‌’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో ఆమె నామినేషన్‌ దక్కించుకున్నారు. అంతకు ముందు ‘నెల్‌’ చిత్రానికిగాను 1995లో ఆమెకు నామినేషన్‌ దక్కింది. కాగా ‘ది అక్యూస్డ్‌’, ‘ది సైలెన్స్‌ ఆఫ్‌ ది ల్యాంబ్స్‌’ చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆస్కార్‌ అవార్డులు అందుకున్నారు జోడీ. ఇప్పుడు సహాయ నటి అవార్డును ఇంటి తీసుకెళతారా చూడాలి ఏ 96వ ఆస్కార్‌ అవార్డ్స్‌లో దర్శకుడు మార్టిన్‌ ఏ స్కోర్సెస్‌కి ఉత్తమ దర్శకుడిగా నామినేషన్‌ దక్కింది.

దర్శకుడిగా పది నామినేషన్లు దక్కించుకుని, ప్రస్తుతం జీవించి ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ దర్శకునిగా స్టీవెన్‌ స్పీల్‌బర్గ్‌ తొమ్మిది నామినేషన్స్‌ దక్కించుకున్నారు. అయితే ఇప్పటివరకు పది సార్లు నామినేషన్‌ దక్కించుకున్న మార్టిన్‌కు ఒక ఆస్కార్‌ అవార్డు మాత్రమే దక్కింది. 2006లో వచ్చిన ‘డిపార్టెడ్‌’ సినిమాకు అవార్డు అందుకున్నారు మార్టిన్‌.

ఇదిలా ఉంటే.. తొమ్మిదిసార్లు నామినేట్‌ అయినప్పటికీ రెండు సార్లు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్‌ అందుకున్నారు స్టీవెన్‌ సీల్‌బర్గ్‌. ఉత్తమ దర్శకుడి విభాగంలో విలియమ్‌ వైలర్‌ 12 నామినేషన్స్‌ దక్కించుకుని రికార్డు సొంతం చేసుకున్నారు.. అలాగే మూడు ఆస్కార్‌ అవార్డులు సాధించారు. అయితే ప్రస్తుతం ఆయన జీవించి లేరు.

 
Advertisement
 
Advertisement