oscar nominations
-
ఆస్కార్ రేస్‌లో 6 తమిళ చిత్రాలు
తమిళసినిమా: ఈసారి ఆస్కార్ అవార్డుల రేస్‌లో 6 తమిళ చిత్రాలు చోటు చేసుకోవడం విశేషం. ఆస్కార్ అవార్డు అనేది తమిళ చిత్రాలను ఊరిస్తూనే ఉంది. సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నా, అవి ఆంగ్ల చిత్రానికి కావడం గమనార్హం. కాగా 2024వ ఏడాదికి గానూ మన భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 29 చిత్రాలు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయినట్లు ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ కార్యవర్గం అధికారికంగా ప్రకటించారు. అందులో 6 తమిళ చిత్రాలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. వాటిలో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన మహారాజా, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్, సూరి ప్రధాన పాత్రను పోషించిన కొట్టుక్కాళి, రాఘవలారెన్స్, ఎస్జే.సూర్య కలిసి నటించిన జిగర్తండా డబుల్ఎక్స్, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ కథానాయకుడిగా నటించి,దర్శకత్వం వహించిన జమ చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ మంచి కథా బలం ఉన్న చిత్రాలే. ఈ సారి అయినా వీటిలో ఏదైనా అస్కార్ అవార్డును గెలుచుకుంటుందేమో చూడాలి. -
‘బార్బెన్‌హైమర్’ పోరు ఖరారు!
గత ఏడాది బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లు కురిపించిన దర్శకుడు క్రిస్టోఫర్ నోలన్ ‘ఒప్పెన్‌హైమర్’, దర్శకురాలు గ్రెటా గెర్విగ్ ‘బార్బీ’ చిత్రాలు ఆస్కార్ అవార్డ్స్‌లోనూ పో టీలో నిలిచాయి. 96వ ఆస్కార్ అవార్డులకు సంబంధించిన నామినేషన్లు మంగళవారం సాయంత్రం (భారతీయ కాలమాన ప్రకారం) వెలువడ్డాయి. 23 విభాగాల్లోని ప్రధాన విభాగాల్లో ‘ఒప్పెన్‌హైమర్’కు 13 నామినేషన్లు దక్కగా, ‘బార్బీ’ ఎనిమిది నామినేషన్లను సొంతం చేసుకుంది. నామినేషన్ల జాబితాను నటుడు జాక్ క్వైడ్, నటి జాజీ బీట్జ్ ప్రకటించారు. ఇంకా అత్యధిక నామినేషన్లు దక్కించుకున్న చిత్రాల్లో 11 నామినేషన్లతో యోర్గోస్ లాంతిమోస్ దర్శకత్వం వహించిన ‘పూర్ థింగ్స్’, పది నామినేషన్లతో మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వం వహించిన ‘కిల్లర్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’, ఏడు నామినేషన్లతో ‘మేస్ట్రో’ ఉన్నాయి. ఉత్తమ చిత్రం విభాగంలో ‘ఒప్పెన్‌హైమర్’, ‘బార్బీ’ పో టీ పడుతుండటంతో ‘ఇది బార్బెన్‌హైమర్ పో రు’ అని హాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి. కాగా, ఉత్తమ దర్శకుల విభాగంలో ‘బార్బీ’ దర్శకురాలు గ్రెటా గెర్విగ్కి నామినేషన్ దక్కుతుందనే అంచనాలు నెలకొన్న నేపథ్యంలో ఆమె నామినేట్ కాకపో వడం ఆశ్చర్యానికి గురి చేసిందని హాలీవుడ్ అంటున్న మాట. కానీ ఇదే చిత్రానికి సహాయ నటి విభాగంలో అమెరికా ఫెర్రెరాకి దక్కడం పట్ల ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫెర్రెరాకి నామినేషన్ దక్కుతుందనే కనీస అంచనాలు లేకపో వడమే ఈ ఆశ్చర్యానికి కారణం. అలాగే ‘బార్బీ’లో టైటిల్ రోల్ చేసిన మార్గెట్ రాబీకి ఉత్తమ నటి నామినేషన్ దక్కకపో వడం ఘోరం అనే టాక్ కూడా ఉంది. ఇక దర్శకుల విభాగంలో గ్రెటా గెర్విగ్కి దక్కకపో యినప్పటికీ ‘అనాటమీ ఆఫ్ ఎ ఫాల్’ చిత్రదర్శకురాలు జస్టిన్ ట్రైట్కి దక్కడంతో ఈ కేటగిరీలో ఓ మహిళ ఉన్నట్లు అయింది. ఇక మార్చి 10న లాస్ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్లో (భారత కాలమానం ప్రకారం మార్చి 11) ఆస్కార్ అవార్డుల వేడుక జరగనుంది. మూడేళ్లుగా వ్యాఖ్యాతగా వ్యవహరించిన జిమ్మీ కెమ్మెల్ ఈసారి కూడా ఆ బాధ్యతను నిర్వర్తించనున్నారు. ఇదిలా ఉంటే గతేడాది ‘ఆర్ఆర్ఆర్’ (‘నాటు నాటు...’ పాటకు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’ అవార్డు), బెస్ట్ డాక్యుమెంటరీ ఫిల్మ్ విభాగంలో ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ ఆస్కార్ అవార్డు దక్కించుకుని, భారత దేశ కీర్తిని ప్రపంచానికి చాటాయి. ఈసారి దేశం నుంచి ఏ సినిమా పో టీలో లేదు. అయితే కెనడాలో స్థిరపడ్డ భారత సంతతికి చెందిన నిషా పహుజా దర్శకత్వం వహించిన కెనెడియన్ డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘టు కిల్ ఏ టైగర్’కి నామినేషన్ దక్కింది. ఉత్తమ చిత్రం: అమెరికన్ ఫిక్షన్ అటానమీ ఆఫ్ ఎ ఫాల్ బార్బీ ది హోల్డోవర్స్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ మేస్ట్రో ∙ఒప్పెన్‌హైమర్ పాస్ట్ లైవ్స్ ∙పూర్ థింగ్స్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉత్తమ దర్శకుడు: అటానమీ ఆఫ్ ఎ ఫాల్: జస్టిన్ ట్రైట్ కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్: మార్టిన్ స్కోర్సెస్ ఒప్పైన్ హైమర్: క్రిస్టోఫర్ నోలన్ పూర్ థింగ్స్: యోర్గోస్ ది జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్: జొనాథన్ గ్లేజర్ ఉత్తమ నటుడు: బ్రాడ్లీ కూపర్: మేస్ట్రో కోల్మన్ డొమింగో: రస్టిన్ పాల్ జియామటి: ది హోల్డోవర్స్ కిలియన్ మర్ఫీ: ఒప్పెన్ హైమర్ జెఫ్రీ రైట్: అమెరికన్ ఫిక్షన్ ఉత్తమ నటి: అన్నెతే బెనింగ్: నయాడ్ లిల్లీ గ్లాడ్‌స్టోన్: కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్ సాండ్రా హూల్లర్: అటానమీ ఆఫ్ ఎ ఫాల్ కెర్రీ ములిగన్: మేస్ట్రో ఎమ్మా స్టోన్: పూర్ థింగ్స్ ఏ 91 ఏళ్ల కంపో జర్ జాన్ విల్లియమ్స్ 54వ నామినేషన్ దక్కించుకున్నారు. ‘ఇండియా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ’ చిత్రానికి గాను ఆయనకు నామినేషన్ దక్కింది. అత్యధిక సార్లు నామినేషన్ దక్కించుకున్న సంగీతదర్శకుడిగా ఆయన రికార్డ్ సాధించారు. ఇప్పటికే ఐదు ఆస్కార్ అవార్డులు సొంతం చేసుకున్న జాన్‌కి ఈ చిత్రం కూడా ఆస్కార్ తెచ్చి, ఆనందపరుస్తుందా అనేది చూడాలి ఏ ఈ ఏడాది నామినేషన్స్ 61 ఏళ్ల జోడీ ఫాస్టర్ని మళ్లీ పో టీలో నిలబెట్టాయి. 29 ఏళ్ల తర్వాత ‘నయాడ్’ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటి విభాగంలో ఆమె నామినేషన్ దక్కించుకున్నారు. అంతకు ముందు ‘నెల్’ చిత్రానికిగాను 1995లో ఆమెకు నామినేషన్ దక్కింది. కాగా ‘ది అక్యూస్డ్’, ‘ది సైలెన్స్ ఆఫ్ ది ల్యాంబ్స్’ చిత్రాలకు గాను ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డులు అందుకున్నారు జోడీ. ఇప్పుడు సహాయ నటి అవార్డును ఇంటి తీసుకెళతారా చూడాలి ఏ 96వ ఆస్కార్ అవార్డ్స్‌లో దర్శకుడు మార్టిన్ ఏ స్కోర్సెస్కి ఉత్తమ దర్శకుడిగా నామినేషన్ దక్కింది. దర్శకుడిగా పది నామినేషన్లు దక్కించుకుని, ప్రస్తుతం జీవించి ఉన్న వ్యక్తిగా ఆయన రికార్డు సొంతం చేసుకున్నారు. ఉత్తమ దర్శకునిగా స్టీవెన్ స్పీల్బర్గ్ తొమ్మిది నామినేషన్స్ దక్కించుకున్నారు. అయితే ఇప్పటివరకు పది సార్లు నామినేషన్ దక్కించుకున్న మార్టిన్‌కు ఒక ఆస్కార్ అవార్డు మాత్రమే దక్కింది. 2006లో వచ్చిన ‘డిపార్టెడ్’ సినిమాకు అవార్డు అందుకున్నారు మార్టిన్. ఇదిలా ఉంటే.. తొమ్మిదిసార్లు నామినేట్ అయినప్పటికీ రెండు సార్లు ఉత్తమ దర్శకుడిగా ఆస్కార్ అందుకున్నారు స్టీవెన్ సీల్బర్గ్. ఉత్తమ దర్శకుడి విభాగంలో విలియమ్ వైలర్ 12 నామినేషన్స్ దక్కించుకుని రికార్డు సొంతం చేసుకున్నారు.. అలాగే మూడు ఆస్కార్ అవార్డులు సాధించారు. అయితే ప్రస్తుతం ఆయన జీవించి లేరు. -
ఆస్కార్ బరిలో ఆ ఐదుగురు స్పెషల్.. ఎందుకంటే?
ఆస్కార్ ఆ పేరు వింటేనే అదో గొప్ప. అవార్డ్ రాకపోయినా సరే.. కనీసం నామినేట్ అయినా ఆ ఫీలింగే వేరు. ప్రపంచ వేదికపై మన పేరు వినిపించాలని ఎవరికీ మాత్రం కోరిక ఉండదు. ఈ ఏడాది జరగునున్న 95వ ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఆసక్తికర విషయాలెన్నో ఉన్నాయి. ఎందుకంటే ప్రతి కేటగిరీలో ఐదుగురు పోటీ పడుతున్నారు. కాగా.. ఉత్తమ నటుడు విభాగంలో నామినేషన్ దక్కించుకున్న ఐదుగురు గురించి ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఎందుకంటే ఈ ఐదుగురు తొలిసారి ఆస్కార్ బరిలో నిలవడం విశేషం. దీంతో ఎవరినీ అవార్డ్ వరించినా అది తొలిసారి దక్కించుకున్న ఘనత వారికి సొంతమవుతుంది.. ఉత్తమ నటుడి రేసులో తొలిసారి పోటీలో నిలిచిన ఐదుగురు వీరే ఆస్టిన్ రాబర్ట్ బట్లర్ అమెరికన్ సింగర్ ఎల్వీస్ ప్రెస్లీ జీవిత కథలో అద్భుతంగా నటించారు ఆస్టిన్ రాబర్ట్ బట్లర్. ఆయన నటనే 95వ ఆస్కార్ రేసులో నిలిచేలా చేసింది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డును కూడా గెలుచుకున్నారు. బట్లర్ యుక్త వయస్సులోనే టెలివిజన్ ధారావాహికలు ‘ది క్యారీ డైరీస్’, ది షన్నారా క్రానికల్స్’ లో నటనకు పేరు సంపాదించారు. ఏలియన్స్ ఇన్ ది అట్టిక్(2009) చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. చికాగో ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్‌లో మోస్ట్ ప్రామిసింగ్ పెర్ఫార్మర్ అవార్డును కైవసం చేసుకున్నారు. కోలిన్ జేమ్స్ ఫారెల్ ది బన్షీస్ ఆఫ్ ఇనిషెరిన్’ చిత్రంలో పాడ్రాయిక్ పాత్రతో నామినేషన్ దక్కించుకున్నారు కోలిన్ జేమ్స్ ఫారెల్(46). ఈ సినిమాలో ఆయన నటనకు మంచి ప్రశంసలు అందుకున్నారు. ఫారెల్ ది వార్ జోర్ సినిమాతో కెరీర్ మొదలెట్టిన కోలిన్ జేమ్స్ ‘టైగర్ ల్యాండ్, మైనారిటీ రిపోర్ట్ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో ప్రధాన పాత్రల్లో నటించారు. బ్లాక్ కామెడీ చిత్రం ఇన్ బ్రూగెస్‌లో ఆయన పాత్రకి ఉత్తమ నటుడిగా గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకున్నారు. బ్రెండన్ జేమ్స్ ఫ్రేజర్ కామెడీ సినిమాలతో గుర్తింపు పొందిన హాలీవుడ్ నటుడు బ్రెండన్ జేమ్స్ ఫ్రేజర్. ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచారాయన. అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి యుక్త వయస్సులో ఉన్న తన కూతురితో బంధాన్ని ఏర్పరచుకోవాలని ప్రయత్నించే నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘ది వేల్’. ఈ చిత్రంలో ఉపాధ్యాయుడి పాత్రను పోషించి అందర్నీ ఆకట్టుకున్నారు. ఆయన ‘డాగ్ ఫైట్’, ‘ఎన్సినో మ్యాన్, స్కూల్ టైస్, జార్జ్ ఆఫ్ ది జంగిల్’ లాంటి సినిమాలతో గుర్తింపు పొందారు. ‘ది వేల్’ చిత్రంలోని నటనకు ఫ్రేజర్ ఉత్తమ నటుడిగా 12 అంతర్జాతీయ అవార్డులు గెలుచుకున్నారు. చిన్న వయస్సులో పాల్ మెస్కల్ ఆస్కార్ ఉత్తమ నటుడి విభాగంలో ఆస్కార్ నామినేషన్ పొందిన అతి చిన్న వయస్సు కలిగిన నటుడు పాల్ మెస్కల్(27). ‘ఆఫ్టర్ సన్’ ఈ చిత్రంలో 11 ఏళ్ల అమ్మాయికి తండ్రిగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. నార్మల్ పీపుల్ అనే మినీ సిరీస్‌తో మెస్కల్ గుర్తింపు పొందారు. బ్రిటీష్ అకాడమీ టెలివిజన్ అవార్డ్స్‌లో కూడా ఉత్తమ నటుడిగా అవార్డ్ దక్కించుకున్నారు. అత్యధిక వయసులో బిల్ నైజీ అత్యధిక వయసులోనూ ‘లివింగ్’ అనే చిత్ర నటుడు బిల్ నైజీ 73 ఏళ్ల వయసులో బరిలో నిలిచాడు. ఈ ఏడాది ఉత్తమ నటుడి విభాగంలో నామినేషన్ దక్కించుకున్నారు. ప్రాణాంతకమైన అనారోగ్యంతో బాధపడుతున్న ఒక వ్యక్తి పాత్రలో నటించి మెప్పించారు. ‘గిడియాన్స్ డాటర్ చిత్రానికి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ దక్కింది. లవ్ యాక్చువల్లీ అనే చిత్రానికి బ్రిటీష్ అకాడమీ ఫిల్మ్ అవార్డ్స్‌లో ఉత్తమ సహాయ నటుడిగా అవార్డును గెలుచుకున్నారు. -
రాజమౌళి సార్.. ఇది ఎల్లప్పుడు మీ కోసమే: సుకుమార్
సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు పోస్ట్‌లతో దర్శకుడు సుకుమార్ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా తనదైన శైలిలో విష్ చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. దర్శకధీరుడు రాజమౌళిపై సుకుమార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌కు నామినేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సంధర్భంగా రాజమౌళికి వినూత్న రీతిలో అభినందనలు తెలియజేశారు సుకుమార్. ఓ మీటింగ్ రూమ్‌లో తన బృందంతో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ఖాళీగా ఉన్న కుర్చీని ప్రస్తావించారు. సుకుమార్ మాట్లాడుతూ..'ఇన్నాళ్లుగా నా టీమ్ మీటింగ్‌లు, డిస్కషన్స్ అన్నింటిలో అసంకల్పితంగా ప్రిన్సిపల్ కుర్చీని ఖాళీగా వదిలేశా. కానీ, ఇప్పుడు నేను అలా ఎందుకు చేశానో అర్థం చేసుకున్నా. ఎస్.ఎస్.రాజమౌళి సార్ ఈ కుర్చీ మీ కోసమే. ఈ కుర్చీ ఎప్పుడు మీకు చెందినదే. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది. రాజమౌళి అండ్ మూవీ టీమ్‌కి అభినందనలు.' అని అన్నారు. ఆ తర్వాత నాటు నాటు సాంగ్ లిరిక్స్ అందించిన చంద్రబోస్.. సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి, పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ కొరియోగ్రాఫర్ ప్రేమ్రక్షిత్తో పాటు చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. View this post on Instagram A post shared by Sukumar B (@aryasukku) -
ఆర్ఆర్ఆర్కు పోటీగా జాక్వెలిన్ మూవీ.. ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు
ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత దక్కడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఐదు చిత్రాలు ఎంపికయ్యాయి. 95వ ఆస్కార్ -2023 నామినేషన్లను జనవరి 24న తేదీన ప్రకటించారు. మార్చి 13న ఈ అవార్డులను ఎంపికైన వారికి ప్రదానం చేయనున్నారు. అయితే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ 'నాటు నాటు'తో పాటు మరో ఐదు చిత్రాలు పోటీలో నిలిచాయి. అందులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన 'టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్' చిత్రంలోని అప్లాజ్ అనే సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. దీంతో ఈ విభాగంలో ఆర్ఆర్ఆర్కు పోటీగా నిలిచింది. జాక్వెలిన్ మాట్లాడుతూ, "టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ టీమ్‌ని చూసి నేను చాలా గర్వపడుతున్నా. ముఖ్యంగా చప్పట్లతో అద్భుతమైన సంగీతాన్ని సృష్టించిన డయాన్, సోఫియా గురించి నేను చాలా గర్వపడుతున్నా. ఈ సినిమా చేసిన అనుభవం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ఆస్కార్ నామినేషన్స్‌తో అనుబంధం కలిగి ఉండటం చాలా ప్రత్యేకమైనది.' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ సాంగ్ ఆస్కార్ నామినేట్ కావడం పట్ల జాక్వెలిన్ ఆర్ఆర్ఆర్ బృందానికి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపింది. ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ జాబితా ఇదే నాటు నాటు (ఆర్ఆర్ఆర్) అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్) హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్) లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్) ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) View this post on Instagram A post shared by Jacqueline Fernandez (@jacquelinef143) -
కోట్లాది మంది ప్రేక్షకుల ఆకాంక్షలు ఫలించాలి: మెగాస్టార్
టాలీవుడ్ సంచలనం ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌కు నామినేట్ కావడంతో పలువురు సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. టాలీవుడ్ సినిమా వైభవాన్ని చాటేందుకు ఇక ఒక అడుగు దూరమే ఉన్నామని అన్నారు. కోట్లాది మంది ప్రేక్షకుల ఆకాంక్ష, ప్రార్థనలు మార్చి 12న ఫలించాలని మెగాస్టా చిరంజీవి ఆకాంక్షించారు. ONE STEP AWAY FROM THE PINNACLE OF CINEMATIC GLORY !!! 🎉🔥🎉👏👏 Heartiest Congrats on THE Oscar Nomination for Best Original Song @mmkeeravaani garu & the visionary @ssrajamouli and the Entire Team behind #NaatuNaatu & @RRRMovie — Chiranjeevi Konidela (@KChiruTweets) January 24, 2023 గర్వంగా ఉంది: ఎన్టీఆర్ అంతే కాకుండా చిత్రబృంద సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాటు నాటు సాంగ్ ఎంపిక కావడం పట్ల యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. నాటు నాటు పాట మరో ఘనత సాధించినందుకు గర్వంగా ఉందన్నారు. ఈ సందర్భంగా సంగీత దర్శకులు కీరవాణి, రచయిత చంద్రబోస్ లకు నా అభినందనలు తెలిపారు. Congratulations @MMKeeravaani Garu and @boselyricist Garu on achieving another well-deserved and monumental feat... This song will forever hold a special place in my heart.@ssrajamouli @alwaysramcharan #RRRMovie #NaatuNaatu #Oscars95 pic.twitter.com/YYmtD0kVou — Jr NTR (@tarak9999) January 24, 2023 గౌరవంగా భావిస్తున్నా: రామ్ చరణ్ నాటు నాటు సాంగ్ ఆస్కార్‌కు నామినేట్ కావడం పట్ల నిజంగా గౌరవంగా భావిస్తున్నానని మెగా హీరో రామ్ చరణ్ అన్నారు. మన దేశానికి ఇది గర్వకారణమని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కీరవాణి, ఎన్టీఆర్, ఆర్ఆర్ఆర్ చిత్రబృందానికి అభినందనలు తెలిపారు. What brilliant news! Truly an honour to see “Naatu Naatu” nominated for the Oscars. Another very proud moment for us & India. Well deserved @MMKeeravaani Garu, @SSRajamouli Garu, my brother @tarak9999 and the entire team of #RRR🙏 All love ❤️ — Ram Charan (@AlwaysRamCharan) January 24, 2023 చిత్ర బృందానికి అభినందనలు: కీరవాణి నాటునాటు పాట ఆస్కార్ అవార్డుకు నామినేట్ కావడంపై సంగీత దర్శకుడు కీరవాణి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. Congratulations to my team !! Big hugs to all 🤗 pic.twitter.com/S8g6v1Ubyv — mmkeeravaani (@mmkeeravaani) January 24, 2023 ఆనందంగా ఉంది: ప్రేమ్ రక్షిత్ మాస్టర్ నాటు నాటు పాట ఆస్కార అర్హత సాధించడం ఆనందంగా ఉందని ప్రేమ్ రక్షిత్ మాస్టర్ అన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా వల్లే నా పాట ఆస్కార్ వరకు చేరిందని సంతోషం వ్యక్తం చేశారు. దర్శకులు రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, రాహుల్, కాలబైరవకు కృతజ్ఞతలు తెలిపారు. నాటు నాటును ఆదరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.. ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటునాటు పాటకు డ్యాన్స్ చేయాలని ఆకాంక్షించారు. ఇదొక అద్భుతం: వెంకటేశ్ నాటునాటు ఆస్కార్‌కు నామినేట్ కావడం అద్భుతమని హీరో వెంకటేశ్ సంతోషం వ్యక్తం చేశారు. సినిమా సిగలో మరో కలికితురాయి చేరిందన్నారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి నా అభినందనలు తెలిపారు. చిత్రబృందానికి అభినందనలు: బాలకృష్ణ నాటు నాటు ఆస్కార్‌కు నామినేట్ కావడం గొప్ప ఆనందాన్ని ఇచ్చిందని బాలకృష్ణ ఆనందం వ్యక్తం చేశారు. ఆస్కార్‌కు ఎంపిక కావడం పట్ల ఆర్ఆర్ఆర్, ఆల్ దట్ బ్రీత్స్, ది ఎలిఫెంట్ విష్పరర్స్ చిత్ర బృందాలకు కూడా అభినందనలు తెలిపారు. భారతీయ సినిమా ప్రకాశిస్తోంది: రక్షిత్ శెట్టి భారతీయ సినిమా గర్వించదగిన క్షణామని బాలీవుడ్ నటుడు రక్షిత్ శెట్టి అన్నారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా ప్రకాశిస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆర్ఆర్ఆర్ బృందానికి అభినందనలు తెలిపారు. నాటు దెబ్బ డైరెక్ట్‌గా ఆస్కార్కేః రవితేజ కీరవాణి గారు స్క్రీన్ మీద తారక్, చరణ్‌తోపాటు ప్రపంచం మొత్తాన్ని నాటునాటు డ్యాన్స్ వేసేలా చేశారని రవితేజ వేపించారు. నాటునాటు పాటలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు. -
ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్.. ఎంపికైన నాటు నాటు సాంగ్
సినీరంగంలో అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ విడుదలయ్యాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన టాలీవుడ్ సంచలన మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి 'నాటు నాటు సాంగ్' ఎంపికైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్వీట్ చేసింది. 'సరికొత్త చరిత్ర సృష్టించాం' అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే. ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ నామినేట్ అయింది. తాజాగా ఈ జాబితాను ఆస్కార్ నామినేషన్స్ కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది 95వ ఆస్కార్ నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 13న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు స్థానం దక్కించుకున్నాయి. షార్ట్ ఫిల్మ్ విభాగంలో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విష్పరర్స్, ఆల్ దట్ బ్రీత్స్ ఎంపికయ్యాయి. మొత్తానికి నామినేషన్స్‌లో ఇండియా మూడు చిత్రాలు ఎంపికయ్యాయి. ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ జాబితా నాటు నాటు (ఆర్ఆర్ఆర్) అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్) హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్) లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్) ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్) WE CREATED HISTORY!! 🇮🇳 Proud and privileged to share that #NaatuNaatu has been nominated for Best Original Song at the 95th Academy Awards. #Oscars #RRRMovie pic.twitter.com/qzWBiotjSe — RRR Movie (@RRRMovie) January 24, 2023 -
ఆస్కార్ రావడానికి ఆస్కారమెట్లా..?
-
ఆస్కార్ అవార్డుకు క్వాలిఫై అయిన 'కాంతార'.. ఆర్ఆర్ఆర్కు పోటీగా
ఆస్కార్ నామినేషన్స్‌లోకి మన సినిమా వెళ్తే ఆ కిక్కే వేరు. ఇప్పటికే రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ ఆస్కార్ బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా కన్నడ సెన్సేషన్ కాంతార సినిమా కూడా ఆస్కార్ పోటీలోకి వచ్చింది. రెండు విభాగాల్లో ఈ చిత్రం ఆస్కార్ అవార్డుల కోసం పోటీపడుతుంది. కేవలం రూ. 16కోట్లతో రూపొందిన ఈ సినిమా రూ. 400కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఆస్కార్ అవార్డులకు కాంతార క్వాలిఫై అయ్యింది.ఇదే విషయాన్ని నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. కాంతార చిత్రం రెండు విభాగాల్లో ఆస్కార్‌కి అర్హత లభించింనందుకు సంతోషంగా ఉంది. మాకు మద్దతుగా నిలిచిన వారందరికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేసింది. ఇక ప్రస్తుతం కాంతార, ఆర్ఆర్ఆర్లతో పాటు ది కశ్మీర్ ఫైల్స్, గంగూబాయ్ కతియావాడి చిత్రాలు కూడా ఆస్కార్ రిమైండర్ రేసులో ఉన్నాయి. మార్చ్12న ఆస్కార్ అవార్డుల కార్యక్రమం జరగనుంది. మరి క్వాలిఫైకి అర్హత సాధించిన మన ఇండియన్ సినిమాల ఆస్కార్ కల తీరుతుందా అన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఉత్కంఠగా మారింది. BIG ANNOUNCEMENT: #TheKashmirFiles has been shortlisted for #Oscars2023 in the first list of @TheAcademy. It’s one of the 5 films from India. I wish all of them very best. A great year for Indian cinema. 🙏🙏🙏 — Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) January 10, 2023 We are overjoyed to share that 'Kantara' has received 2 Oscar qualifications! A heartfelt thank you to all who have supported us. We look forward to share this journey ahead with all of your support. Can’t wait to see it shine at the @shetty_rishab #Oscars #Kantara #HombaleFilms — Hombale Films (@hombalefilms) January 10, 2023 -
ఓటీటీకి వచ్చేసిన ఆస్కార్ సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఆర్ఆర్ఆర్, ది కశ్మీర్ ఫైల్స్ సినిమాలను వెనక్కినెట్టి ఆస్కార్ బరిలో నిలిచిన గుజరాతీ చిత్రం 'ఛెల్లో షో'. ఆంగ్ల చిత్రం 'ది లాస్ట్ షో' రీమేక్‌గా వచ్చింది ఈ సినిమా. తొమ్మిదేళ్ల వయసులో సినిమాతో ప్రేమలో పడిన కుర్రాడి కథగా తెరకెక్కిన చిత్రం ‘ఛెల్లో షో’. దర్శకుడు పాన్ నలిన్ తెరకెక్కించిన ఈ సినిమా ఆస్కార్- 2023 పోటీలో నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చేసింది. నెట్‌ఫ్లిక్స్ వేదికగా నవంబర్ 25 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సినీ ప్రియుల హృదయాల్ని హత్తుకున్న ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. (చదవండి: ఆస్కార్ నామినేషన్ చిత్రం ‘ఛెల్లో షో’ ట్రైలర్ విడుదల) అసలు కథేంటంటే.. దర్శకుడు నలిన్ బాల్య జ్ఞాపకాల ఆధారంగా తెరకెక్కించారు. తొమ్మిదేళ్ల వయసులో సినిమాలకు ఎలా ఆకర్షితులయ్యారు? అనే కథాంశంతో రూపొందించారు. సినిమాల పట్ల ఎంతో ప్రేమ ఉన్న తొమ్మిదేళ్ల అబ్బాయి సామీ (భవిన్ రాబరి) ఎలా ఫిల్మ్‌మేకర్ అయ్యాడు? అన్నదే చిత్ర కథ. గుజరాత్లో గ్రామీణ వాతావరణం అప్పట్లో ఎలా ఉండేదో ఈ సినిమా ద్వారా నలిన్ కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో భవిన్ రాబరి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్, పరేష్ మెహతా ప్రధాన పాత్రల్లో నటించారు. WE HAVE AN ANNOUNCEMENT! 📣 An extraordinary cinematic experience, Last Film Show, India's Official Selection for Best International Feature Film at the 95th Oscars is streaming from Nov 25 in Hindi & Gujarati on Netflix! 🤩 pic.twitter.com/NgzeHYV1YU — Netflix India (@NetflixIndia) November 21, 2022 -
ఆర్ఆర్ఆర్ను ఆస్కార్‌కి నామినేట్ చేయకపోవడం అన్యాయం : నటుడు
'ఆర్ఆర్ఆర్' సినిమాను ఆస్కార్‌కి నామినేట్ చేయకపోవడం అన్యాయమని నటుడు, తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడు వై.కాశీ విశ్వనాథ్ అన్నారు. దేశ భక్తిని చాలాచెప్పే చిత్రాలు ఎన్నో వచ్చాయి. కానీ ఫిక్షన్ యాంగిల్లో, కల్పిత కథతో ఎంతో కష్టపడి అద్భుతంగా తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. కంటెంట్ పరంగా కానీ, సందేశం పరంగా కానీ దేశ ఖ్యాతిని ఇనుమడింపజేసే సినిమా ఇది. సీన్స్‌ను రక్తికట్టించడంలో కానీ, నటీనటల నుంచి పర్ఫార్మెన్స్ రాబట్టుకోవడంలో కానీ రాజమౌళి ప్రాణం పెట్టి పనిచేశారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు అయితే తమ పాత్రల్లో జీవించారు. టెక్నీషియన్స్ ప్రతిభ అమోఘం. ఇన్ని ఉన్నా ఆర్ఆర్ఆర్ని ఆస్కార్‌కి నామినేట్ చేయకుండా చెల్లో షో అనే గుజరాతీ చిత్రాన్ని నామినేట్ చేయడం, తెలుగు సినిమాను పట్టించకోకుపోవడం శోచనీయం. దీన్ని ఖండిస్తూ తెలుగు దర్శకుల సంఘం అధ్యక్షుడిగా నా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాను అని ఆయన పేర్కొన్నారు. -
ఆస్కార్ బరిలో గుజరాతీ ఫిల్మ్ 'ఛెల్లో షో'
ఆస్కార్ అవార్డుల సందడి మొదలైంది. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న 95వ ఆస్కార్ అవార్డ్స్ వేడుకలకు ‘బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్’ (అంతర్జాతీయ ఉత్తమ చిత్రం) విభాగంలో నామినేషన్ ఎంట్రీ పోటీ కోసం మన దేశం తరఫున గుజరాతీ మూవీ ‘ఛెల్లో షో’ (ఇంగ్లీష్‌లో ‘లాస్ట్ ఫిల్మ్ షో’) ఎంపికైంది. ఈ విషయాన్ని ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మంగళవారం ప్రకటించింది. పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భవిన్ రాబరి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్ ప్రధాన పాత్రధారులు. ఈ చిత్రకథ విషయానికి వస్తే... గుజరాత్‌లోని సౌరాష్ట్రలో గల చలాలా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల సమయ్ (భవిన్ రాబరి) సినిమా ప్రొజెక్టర్ టెక్నీషియన్ ఫజల్ (భవేష్ శ్రీమాలి)ని మచ్చిక చేసుకుని, సినిమా హాల్ ప్రొజెక్షన్ బూత్‌లోకి ప్రవేశిస్తాడు. అలా వేసవిలో చాలా సినిమాలు చూస్తాడు. ఆ తర్వాత అతనే సొంతంగా ఓ ప్రొజెక్షన్ని తయారు చేయాలనుకుంటాడు. సినిమా అతని జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేసిందనే కథతో ఈ చిత్రం సాగుతుంది. చిత్రదర్శకుడు నలిన్ నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా పలు అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శితమైంది. ‘‘ఛెల్లో షో’పై నమ్మకం ఉంచి, మా చిత్రాన్ని ఆస్కార్‌కు ఎంపిక చేసినందుకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ధన్యవాదాలు. ఇప్పుడు నేను మళ్లీ ఊపిరి తీసుకోగలుగుతున్నాను. అలాగే సినిమా అనేది వినోదాన్ని, స్పూర్తిని, విజ్ఞానాన్ని అందిస్తుందని నమ్ముతున్నాను’’ అని ట్వీట్ చేశారు దర్శకుడు పాన్ నలిన్ . ఈ సంగతలా ఉంచితే.. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ‘ఆర్ఆర్ఆర్’ని ఎంపిక చేయకపోవడంపట్ల సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు విమర్శిస్తూ, ట్వీట్లు చేశారు. అయితే ‘ఆర్ఆర్ఆర్’ని చిత్రబృందం ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి పంపించిందా? లేదా అనే విషయంపై స్పష్టత లేదు. -
ఆస్కార్ నామినేషన్ రేసులో ‘ఆర్ఆర్ఆర్’కు నో ఎంట్రీ
తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటిన ‘ఆర్ఆర్ఆర్’కు బిగ్ షాక్ తగిలింది. అనేక రికార్డులు బద్దలు కొట్టి, బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’కు 2023 ఆస్కార్ నామినేషన్ రేసులో ఎంట్రీ లభించలేదు. కశ్మీర్ ఫైల్స్‌కు సైతం ఆస్కార్ రేసులో చోటు దక్కలేదు. ఆర్ఆర్ఆర్, కశ్మీర్ ఫైల్స్‌ను దాటుకొని ఓ చిన్న సినిమా ఆస్కార్ బరిలో నిలిచింది. రేసులోకి గుజరాతీ సినిమా గుజరాతీ సినిమా ‘ఛెల్లో షా’ మూవీ ఆస్కార్ నామినేషన్ రేసులోకి అధికారిక ఎంట్రీ ఇచ్చింది. బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరిలో ఈ మూవీ చోటుదక్కించుకుంది. ఈ మేరకు ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. పాన్ నలిన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భవిన్ రాబరి, భవేష్ శ్రీమాలి, రిచా మీనా, డిపెన్ రావల్ ప్రధాన పాత్రధారులు. దర్శకుడు నలిన్ నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. కాగా ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా తెరకెక్కిన సినిమా ఆర్ఆర్ఆర్. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించారు. ఈ ఏడాది మార్చి 25న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. దాదాపు రూ. 1000కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. అయితే గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా ఆస్కార్ రేసులో ఉందని జోరుగా ప్రచారం సాగింది. దీంతో ఈ సినిమా ఆస్కార్ రేసులో నిలుస్తుందని అంతా భావించారు. కానీ ఆస్కార్ బరిలో ఆర్ఆర్ఆర్ ఎంపిక కాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. చదవండి: కార్తికేయ 2, బింబిసార ఓటీటీ రిలీజ్.. క్లారిటీ ఇచ్చిన జీ5..! -
Jr NTR: ఆస్కార్ బరిలో ఎన్టీఆర్.. లిస్ట్ బయటికొచ్చేసింది!
Jr Ntr In Oscar Nominations: రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్లుగా తెరకెక్కిన చిత్రం 'ఆర్ఆర్ఆర్'. ఈ ఏడాది మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ఫిదా కాని ప్రేక్షకుడు ఉండడు. కొమురం భీమ్ పాత్రలో ఆయన నటనకు పాన్ ఇండియా స్థాయిలో ప్రశంసలు దక్కాయి. తాజాగా ఎన్టీఆర్‌కు సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం తారక్ పేరు ఆస్కార్ నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రముఖ హాలీవుడ్ పబ్లికేషన్ 'వెరైటీ' ఈ మేరకు ప్రిడిక్షన్ లిస్ట్‌ను వెల్లడించింది. ఉత్తమ నటుడి క్యాటగిరిలో తారక్ ఎన్టీఆర్ ఉండే అవకాశాలు ఉన్నట్లు పేర్కొంది. ఈ వార్త తెలిసిన ఎన్టీఆర్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందన్నది త్వరలోనే తెలియనుంది. Proud Moment To Us ❤️🔥 #NTRGoesGlobal PRIDE OF INDIAN CINEMA NTR@tarak9999 @ssrajamouli @RRRMovie #RRRMovie pic.twitter.com/P3O3KFLywo — Chittoor District NTRFans (@ChittoorNTRFans) August 13, 2022 2023 OSCARS - Lead Actor - " Unranked Possible Contenders " Only actor from Asia💥 👉Nandamuri Taraka Ramarao Jr for #RRRMovie Young Tiger @tarak9999 made it to popular Variety magazine's prediction list "PRIDE OF INDIAN CINEMA##RRR @RRRMovie #NTR𓃵 pic.twitter.com/3JmFkIuKsm — Ayrao💛 (@Ayrao9) August 13, 2022 -
Oscar Nomination 2022: ఆస్కార్ బరిలో దళిత మహిళా జర్నలిస్టులు
‘రైటింగ్ విత్ ఫైర్’.... ఆస్కార్ 2022 బరిలోమన దేశం నుంచి షార్ట్ లిస్ట్ అయిన బెస్ట్ డాక్యుమెంటరీ మూవీ. అందరూ దళిత మహిళా జర్నలిస్టులు నడుపుతున్న ‘ఖబర్ లెహరియా’ న్యూస్‌పేపర్ (వీక్లీ) గురించి, దాని డిజిటల్ వార్తల గురించి తయారు చేసిన డాక్యుమెంటరీ ఇది. 25 మంది దళిత మహిళా జర్నలిస్టులు ఉత్తర ప్రదేశ్, బుందేల్‌ఖండ్, మధ్యప్రదేశ్‌లలో గ్రామీణ వార్తలను స్త్రీ దృక్కోణంలో అందించడమే ఇక్కడున్న విశేషం. ఆస్కార్ సాధించే సత్తా ఈ డాక్యుమెంటరీకి ఉంది అని భావిస్తున్నారు. ‘మా ప్రాంతంలో దళిత మహిళలు జర్నలిజం గురించి ఆలోచించడం చాలా పెద్ద విషయం. అసలు ఆ పని తాము కూడా చేయొచ్చని వాళ్లు అనుకోరు. కాని ఈ ఇరవై ఏళ్లలో వారిలోని ఆ న్యూనతను చాలా వరకు తీసేశాం’ అంటారు ‘ఖబర్ లహరియా’ మహిళా జర్నలిస్టులు. 2002లో ‘ఖబర్ లహరియా’ వారపత్రిక చిత్రకూట్ (బుందేల్ ఖండ్)లో మొదలైంది. అప్పుడు 6 మంది దళిత మహిళా జర్నలిస్టులు పని చేయడం మొదలెట్టారు. ఇవాళ 25 మంది పని చేస్తున్నారు. ఆ ఆరు మంది ఈ 25 మందిగా ఎలా మారారో... హిందీ, భోజ్‌పురి, బుందేలి, అవధి భాషల్లో వారపత్రికను ఎలా నడిపారో, ఆ తర్వాత సెల్ఫోన్లను కెమెరాలుగా వాడుతూ డిజిటల్ మీడియాలోకి తమ వార్తలను ఎలా అందించసాగారో ఇదంతా అద్భుతంగా చెప్పిన డాక్యుమెంటరీ ‘రైటింగ్ విత్ ఫైర్’. దర్శకురాలు రింతు థామస్ మరో దర్శకుడు సుస్మిత్ ఘోష్‌తో కలిసి ఈ డాక్యుమెంటరీకి దర్శకత్వం వహించింది. వచ్చే మార్చి 27న లాస్ ఏంజలిస్‌లో జరిగే ఆస్కార్ వేడుకలో పోటీకి నిలవడానికి ఈ డాక్యుమెంటరీ అడుగు దూరంలో ఉంది. 2022 సంవత్సరానికి ఆస్కార్ కమిటీ అధికారికంగా ప్రకటించిన డాక్యుమెంటరీల షార్ట్‌లిస్ట్‌లోని 15 చిత్రాలలో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఒకటిగా ఎంపికైంది. ఈ షార్ట్‌లిస్ట్ కోసం ప్రపంచ దేశాల నుంచి 138 డాక్యుమెంటరీలు పోటీ పడ్డాయి. వాటి నుంచి 15 షార్ట్‌లిస్ట్‌లోకి వచ్చాయి. ఈ 15 నుంచి మూడో నాలుగో అంతిమ నామినేషన్స్‌గా నిలవడానికి జనవరి 27 నుంచి ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8న అంతిమ నామినేషన్స్ ప్రకటిస్తారు. ఆ నామినేషన్స్‌లో ‘రైటింగ్ విత్ ఫైర్’ ఉంటే ఆస్కార్ వేడుకలో అదృష్టం పరీక్షించుకోవాల్సి ఉంటుంది. ‘లగాన్’, ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రాల తర్వాత ఆస్కార్ వేడుకలో భారతీయుల పేర్లు వినిపించలేదు. ఈసారి ఫైనల్ నామినేషన్స్‌కు వెళుతుందని భావించిన తమిళ చిత్రం, భారతదేశ అఫీషియల్ ఎంట్రీ ‘కూడంగళ్’ షార్ట్‌లిస్ట్‌లో నిలువలేదు. కాని ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ విభాగంలో నిలిచి ఆశలు రేపుతోంది. ఈ డాక్యుమెంటరీ దేని గురించి? ఢిల్లీలో ఉన్న ‘నిరంతర్‘ అనే ఎన్జిఓ ఉత్తర ప్రదేశ్‌లోని చిత్రకూట్ నుంచి ప్రయోగాత్మకంగా మొదలెట్టిన వారపత్రిక ‘ఖబర్ లహరియా’. పెద్దగా చదువు రాకపోయినా, జర్నలిజం తెలియకపోయినా దళిత మహిళలు తమ ప్రాంత వార్తలను ఎలా చూస్తారో, వాళ్లు చూసిన పద్ధతిలో అచ్చు వేసి పాఠకుల వద్దకు తీసుకువెళ్లడం ఈ పత్రిక ఉద్దేశం. అంతే కాదు... జర్నలిజంకు దూరంగా ఉన్న దళిత మహిళలు కూడా సమర్థంగా వార్తా పత్రికలను నడపగలరని చూపడమూ ఉద్దేశమే. ‘మాలో చాలామంది ఎలిమెంటరీ స్థాయి చదువు కూడా చదువుకోలేదు. ఇంగ్లిష్ అసలు రాదు. అయినా సరే పత్రికలో పని చేయడానికి రంగంలో దిగాం’ అంటుంది మీరా. ఈమె చీఫ్ రిపోర్టర్. ఈమె దృష్టికోణం నుంచే ‘రైటింగ్ విత్ ఫైర్’ డాక్యుమెంటరీ ఉంటుంది. బుందేలి, అవధి వంటి స్థానిక భాషలలో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బిహార్... ఈ మూడు రాష్ట్రాలలో ఈ పత్రికను అందేలా ఈ దళిత మహిళలు కార్యాచరణ చేశారు. ఈ పత్రిక అచ్చు పని, డిస్ట్రిబ్యూషన్, సర్క్యులేషన్ అంతా మహిళల బాధ్యతే. సవాళ్లు ఎన్నో... దళిత మహిళలు రిపోర్టర్లుగా మారడం ఒక విశేషం అయితే అంటరానితనం ఉన్న ప్రాంతాలలో కూడా వీరు దూసుకుపోవాల్సి రావడం మరో విశేషం. ‘చాలాచోట్ల మొదటగా కులం అడుగుతారు. నేను ఆ ప్రశ్న వేసిన వారి కులం అడుగుతాను. వారు ఏ కులం చెప్తే నేను కూడా ఆ కులమే అంటాను. పని జరగాలి కదా’ అని నవ్వుతుంది ఒక రిపోర్టర్. ‘ఖబర్ లహరియా’ ఎంత జనంలోకి వెళ్లిందంటే చీఫ్ రిపోర్టర్ మీరా భర్త ఒకరోజు ఇంటికి వచ్చి ఆమె మీద ఇంతెత్తున ఎగిరాడు. ‘నువ్వు బతకనిచ్చేలా లేవు’ అన్నాడు. దానికి కారణం ఆమె ఊళ్లోని గూండాల గురించి పత్రికలో రాయడమే. ‘ఇంకో సందర్భంలో అయితే స్త్రీలు పని మానేస్తారు. కాని నా వెనుక పత్రిక ఉందన్న ధైర్యం ఉంది. అందుకే నా భర్తతో నేనేం తప్పు చేయలేదు అని గట్టిగా వాదించాను’ అంటుంది మీరా. ఈ పత్రికకు పని చేస్తున్న దళిత మహిళా రిపోర్టర్లు ముఖ్యంగా పోలీసుల జులుం పైనా, దళితులపైన జరిగే దాష్టికాల పైనా, స్త్రీలపై పురుషుల పీడన పైన వార్తలు రాస్తుంటారు. ‘భయం వేయదా’ అని అడిగితే ‘భయంగానే ఉంటుంది. కాని అంతలోనే ధైర్యం చేస్తాం’ అంటారు వాళ్లు. సెల్ఫోన్లే కెమెరాలుగా పదిహేనేళ్ల పాటు ప్రింట్ ఎడిషన్‌ని నడిపిన ఈ మహిళలు మారిన కాలానికి తగినట్టుగా తాము మారాలని నిశ్చయించుకున్నారు. వార్తలను విజువల్ మీడియాగా జనానికి చూపాలనుకున్నారు. ‘మా అందరికీ ఫోన్లు ఎలా వాడాలో తెలియదు. కాని మారిన పరిస్థితులకు తగినట్టుగా మనం మారకపోతే ఆగిపోతాం’ అంటారు వాళ్లు. అందుకే సెల్‌ఫోన్‌ను కెమెరాగా ఎలా వాడాలో తెలుసుకున్నారు. వార్తలను ఫోన్లో బంధించి యూ ట్యూబ్‌లో బులెటిన్గా విడుదల చేయసాగారు. వారి యూ ట్యూబ్ చానల్‌కు ఐదున్నర లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ‘రైటింగ్ విత్ ఫైర్’కు ఆస్కార్ వస్తే ఈ దళిత మహిళలు ప్రపంచం అంతా చుట్టడం గ్యారంటీ. డాక్యుమెంటరీలోని ఓ దృశ్యం -
‘జోకర్’కు 11 ఆస్కార్ నామినేషన్లు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆస్కార్ అవార్డుల బరిలో టాడ్ ఫిలిప్స్ నిర్మించిన ‘జోకర్’ సినిమా 11 నామినేషన్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మార్టిన్ స్కోర్సెస్ నిర్మించిన ‘ది ఐరిష్‌మేన్’, శ్యామ్ మెండిస్ నిర్మించిన ‘1917’, క్వెంటిన్ టరాంటినో నిర్మించిన ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలీవుడ్’ చిత్రాలు పదేసి నామినేషన్లతో రెండో స్థానంలో నిలిచాయి. ఆ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన ‘పారాసైట్’ చిత్రం ఆరు నామినేషన్లతో మూడవ స్థానంలో నిలిచింది. మొట్టమొదటి సారిగా ఆస్కార్ బరిలో దక్షిణ కొరియా చిత్రం పోటీ పడడం ఓ విశేషం కాగా, ఉత్తమ చిత్రంతోపాటు, ఉత్తమ అంతర్జాతీయ చలన చిత్రం కేటగిరీలకు పోటీ పడడం మరో విశేషం. ‘పారాసైట్’ చిత్రం భారత్‌లో ఈ నెల 31వ తేదీన విడుదలవుతోంది. ‘లిటిల్ విమెన్’ లాంటి ఉత్తమ చిత్రాలను తీసిన గ్రేటా గెర్విగ్ సహా మహిళా దర్శకులెవరూ ఈ సారి ‘ఉత్తమ దర్శకులు’ కేటగిరీకి ఎంపిక కాకపోవడం దురదృష్టకరం. విమర్శకుల ప్రశంసలందుకున్న ‘పోట్రేట్ ఆఫ్ లేడీ ఆన్ ఫైర్’ చిత్రానికి దర్శకత్వం వహించిన సెలైన్ సియమ్మా, ‘ది నైటింగేల్’ దర్శకులు జెన్నిఫర్ కెంట్, ‘ది ఫేర్వెల్’కు దర్శకులు లూలూ వాంగ్, ‘బుక్స్మార్ట్’ దర్శకులు ఓలివియా వైల్డ్, ‘హస్టలర్స్’ దర్శకులు లొరేన్ స్కఫారియా, ‘ఏ బ్యూటీఫుల్ డే ఇన్ ది నైబర్‌హుడ్’ దర్శకులు మేరెల్లీ హెల్లర్లలో ఎవరూ ఆస్కార్‌కు ఎంపిక కాకపోవడం శోచనీయం. అయితే డాక్యుమెంటరీ కేటగిరీలో ఎక్కువ మంది మహిళలు పోటీ పడడం విశేషమే. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్లను వసూలు చేసిన ‘జోకర్’ సినిమాలో నటించిన జాక్విన్ ఫోనిక్స్‌కు ఉత్తమ నటుడు అవార్డు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ‘వన్స్ అపాన్ ఏ టైమ్ ఇన్ హాలివుడ్’ చిత్రంలో నటించిన లియోనార్డో డికాప్రియో, బ్రాడ్ పిట్లు కూడా ప్రధానంగా ఉత్తమ నటుడి అవార్డుకు పోటీ పడుతున్నారు. అలాగే ఉత్తమ నటి అవార్డుకు ‘మ్యారేజ్ స్టోరీ’లో నటించిన స్కార్లెట్ జాన్సన్, ‘జూడీ’లో నటించిన రెన్నా జెల్వెగర్, ‘లిటిల్ విమెన్’లో నటించిన సోయిస్ రోనన్, ‘హరియెట్’లో నటించిన సింథియా ఎరివో, ‘బాంబ్‌షెల్’లో నటించిన చార్లిజ్ థెరాన్లు పోటీ పడుతున్నారు. -
ఆస్కార్
భారతదేశం నుండి వెళ్లిన ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’.. చిత్రం ‘లఘు కథాంశ చిత్రాల’ కేటగిరీ కింద ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది! అవార్డు చిత్రాల దర్శకుడు రేకా చటాబ్జి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రుతుస్రావాన్ని కథాంశంగా తీసుకుని గ్రామీణ నేపథ్యంలో సిఖ్యా ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ఈ చిత్రం ఇప్పటికే ఈ ఏడాది ‘క్లీవ్‌లాండ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో ‘బెస్ట్ డాక్యుమెంటరీ షార్’్ట అవార్డ్ పొందింది. లాస్ ఏంజెలిస్ లోని ఓక్‌ఉడ్ స్కూల్ విద్యార్థులు తమ క్లాస్ టీచర్ మెలిస్సా బెర్టన్ నేతృత్వంలో చేపట్టిన ‘ది ప్యాడ్ ప్రాజెక్ట్’లో భాగంగా ‘పీరియడ్. ఎండ్ ఆఫ్ సెంటెన్స్’ రూపుదాల్చింది. చిత్రంలో.. ఢిల్లీ సమీపంలోని హపూర్ గ్రామంలో కొంతమంది మహిళలు రుతుస్రావం చుట్టూ ఉన్న దురభిప్రాయాలు, దురాచారాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. ‘ఫ్లయ్’ అనే బ్రాండ్ నేమ్‌తో తామే సొంతంగా శానిటరీ ప్యాడ్లను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తారు. స్ఫూర్తిదాయకమైన ఈ చిత్రంతో పాటు.. ‘బ్లాక్ షీప్’, ‘ఎండ్ గేమ్’, ‘లైఫ్‌బోట్’, ‘లాస్ కమాండోస్’, ‘మై డెడ్ డాడ్స్ పోర్నో టేప్స్’, ‘ఎ నైట్ ఎట్ ది గార్డెన్’, ‘63 బాయ్‌కాట్’, ‘ఉమెన్ ఆఫ్ ది గులాగ్, ‘జియాన్’ చిత్రాలు కూడా ఈ కేటగిరీ కింద నామినేషన్‌కు నిలబడ్డాయి. -
సహాయం చేస్తారా?
అస్సామీ చిత్రం ‘విలేజ్ రాక్‌స్టార్స్’ విదేశీ విభాగంలో భారతదేశం తరఫున 91వ ఆస్కార్స్ అవార్డ్స్ నామినేషన్ పోటీకి ఎంపికైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను మరింత ప్రమోట్ చేయడానికి బాలీవుడ్ స్టార్స్‌తో పాటు సినీ ప్రముఖులు తమకు ఆర్థికంగా చేయూతనందించాలని కోరుతున్నారు చిత్రదర్శకురాలు రీమాదాస్. ‘‘విలేజ్ రాక్‌స్టార్స్ చిత్రాన్ని 30 లక్షల బడ్జెట్లో పూర్తి చేశాం. ఈ సినిమాను హాలీవుడ్ ప్లాట్‌ఫామ్‌పై ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. విమర్శకులకు స్పెషల్ షోలు వేయాలి. ఇలా చేయాలంటే కనీసం 5 కోట్లు ఖర్చవుతుందట. అంత ఖర్చుతో నేనెలా ప్రమోట్ చేయగలను? అస్సాం ప్రభుత్వం వారు కోటి రూపాయలు ప్రకటించారు. కానీ టాక్సులు పోగా 68 లక్షలు మాత్రమే వస్తాయి. నవంబర్‌లో ఆస్కార్స్‌కు సంబంధించి లాస్ ఏంజిల్స్‌లో మూవీ ప్రమోషన్ పనులు ఊపందుకుంటాయి. నా చిత్రబృందాన్ని లాస్ ఏంజిల్స్ తీసుకెళ్లి, అక్కడే కొన్నిరోజులు స్టే చేయాలంటే భారీగా ఖర్చు అవుతుంది. బాలీవుడ్ స్టార్స్‌ని ఆర్థిక సహాయం అడుగుతున్నాను... ప్రపంచ వేదికపై ‘విలేజ్ రాక్‌స్టార్స్’ నిలబడేందుకు సహాయం చేయండి’’ అని పేర్కొన్నారు రీమాదాస్. -
ఆస్కార్ బరిలో 'కామసూత్ర 3డీ'
కామసూత్ర అనగానే చాలామంది అదేదో వినకూడని పదం విన్నట్లుగా మొహం పెట్టేస్తారు. అలాగే, ఈ నేపథ్యంలో వచ్చే సినిమా అంటే కొంతమందికి చులకన భావం కూడా ఉంటుంది. కానీ, అలాంటి ఫీలింగులేం పెట్టుకోమాకండి అంటున్నారు షెర్లిన్ చోప్రా. ‘‘మాది నీలి చిత్రం అన్నవాళ్లకి సరైన సమాధానం లభించింది. అందుకు చాలా ఆనందంగా ఉంది. మరోవైపు ఉద్వేగంగా కూడా ఉంది’’ అని ధీమాగా చెబుతున్నారు షెర్లిన్. ఈవిడగారి ధీమాకి కారణం ఉంది. ఆమె కథానాయికగా రూపొందిన తాజా చిత్రం ‘కామసూత్ర’ త్రీడి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ఎంట్రీ పోటీలో నిలిచింది. ఒకటి కాదు.. ఏకంగా మూడు విభాగాల్లో ఈ చిత్రం పోటీకి నిలవడం విశేషం. ‘బెస్ట్ మోషన్ పిక్చర్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’’ విభాగాలకు ఈ చిత్రం ఎంపికైంది. మన భారతదేశం నుంచి దాదాపు ఐదేళ్ల క్రితం ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రం ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’విభాగాల్లో రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఈ విభాగాల్లో ‘కామసూత్ర’ నిలిచింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 75 పాటలు పోటీపడబోతున్నాయి. వీటిలో ‘కామసూత్ర’ లోని ఐదు పాటలూ ఉండటం విశేషం. చెన్నయ్‌కి చెందిన సచిన్, శ్రీజిత్ ఈ పాటలకు స్వరాలందించారు. రూపేష్ పౌల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా, వచ్చే నెల 16న అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలను ప్రకటిస్తారు. మార్చి 3న అస్కార్ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది. -
ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ పోటీలో చదువుకోవాలి
విద్యపై సమాజంలో చైతన్యం తెచ్చే కథాంశంతో స్వీయదర్శకత్వంలో మద్దాళి వెంకటే శ్వరరావు నిర్మించిన చిత్రం ‘చదువుకోవాలి’. ఈ చిత్రానికి ఇప్పటికే పలు అవార్డులు లభించాయి. ఇంకా పలు ప్రతిష్టాత్మక చిత్రోత్సవాలకు కూడా పంపించనున్నారు. ఇక, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల నామినేషన్ ఎంట్రీ పోటీలో ఈ చిత్రం నిలవడం విశేషం. దేశ వ్యాప్తంగా వచ్చిన సుమారు ఇరవై చిత్రాలను పరిశీలించి, అర్హత ఉన్నవాటిని ఆస్కార్ నామినేషన్ ఎంట్రీకి పంపిస్తారు. ఈ నెల 17న ఈ చిత్రాల ప్రదర్శన ప్రారంభమవుతుంది. దేశవ్యాప్తంగా ఉన్న పలువురు చిత్రరంగ ప్రముఖులు వివిధ భాషల నుంచి వచ్చిన చిత్రాలను వీక్షించి, నామినేషన్‌కి పంపిస్తారు. వీటిలో ‘చదువుకోవాలి’ ఉండటం తెలుగు ప్రజలకు గర్వకారణం అని దర్శక, నిర్మాత చెబుతూ -‘‘ఆస్కార్ నామినేషన్ ఎంట్రీ బరిలో మా చిత్రం నిలవడం ఆనందంగా ఉంది. ఎంట్రీ వరకూ వెళ్లడమే గొప్ప విషయం. ఇంకా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల పోటీ కోసం ఈ చిత్రం వెళ్లనుంది’’ అని చెప్పారు.