ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ మూవీ నాటు నాటు సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌కు ఎంపికైన సంగతి తెలిసిందే. టాలీవుడ్ చిత్రానికి అరుదైన ఘనత దక్కడంతో దేశవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఐదు చిత్రాలు ఎంపికయ్యాయి. 95వ ఆస్కార్ -2023 నామినేషన్లను జనవరి 24న తేదీన ప్రకటించారు. మార్చి 13న ఈ అవార్డులను ఎంపికైన వారికి ప్రదానం చేయనున్నారు.
అయితే ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ 'నాటు నాటు'తో పాటు మరో ఐదు చిత్రాలు పోటీలో నిలిచాయి. అందులో బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నటించిన 'టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్' చిత్రంలోని అప్లాజ్ అనే సాంగ్ ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకుంది. దీంతో ఈ విభాగంలో ఆర్ఆర్ఆర్‌కు పోటీగా నిలిచింది.
జాక్వెలిన్ మాట్లాడుతూ, "టెల్ ఇట్ లైక్ ఏ ఉమెన్ టీమ్‌ని చూసి నేను చాలా గర్వపడుతున్నా. ముఖ్యంగా చప్పట్లతో అద్భుతమైన సంగీతాన్ని సృష్టించిన డయాన్, సోఫియా గురించి నేను చాలా గర్వపడుతున్నా. ఈ సినిమా చేసిన అనుభవం నాకు చాలా అద్భుతంగా అనిపించింది. ఈ ఆస్కార్ నామినేషన్స్‌తో అనుబంధం కలిగి ఉండటం చాలా ప్రత్యేకమైనది.' అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆర్ఆర్ఆర్ సాంగ్ ఆస్కార్ నామినేట్ కావడం పట్ల జాక్వెలిన్ ఆర్ఆర్ఆర్ బృందానికి సోషల్ మీడియాలో అభినందనలు తెలిపింది.
ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ జాబితా ఇదే
- నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్)
- అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్)
- హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్)
- లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్)
- ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
Comments
Please login to add a commentAdd a comment