ఆస్కార్ బరిలో 'కామసూత్ర 3డీ' | Sherlyn Chopra's Kamasutra 3D is in contention for Oscars | Sakshi
Sakshi News home page

ఆస్కార్ బరిలో 'కామసూత్ర 3డీ'

Published Wed, Dec 18 2013 1:46 PM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM

కామసూత్ర 3డీలో షెర్లిన్ చోప్రా

కామసూత్ర 3డీలో షెర్లిన్ చోప్రా

 కామసూత్ర అనగానే చాలామంది అదేదో వినకూడని పదం విన్నట్లుగా మొహం పెట్టేస్తారు. అలాగే, ఈ నేపథ్యంలో వచ్చే సినిమా అంటే కొంతమందికి చులకన భావం కూడా ఉంటుంది. కానీ, అలాంటి ఫీలింగులేం పెట్టుకోమాకండి అంటున్నారు షెర్లిన్ చోప్రా. ‘‘మాది నీలి చిత్రం అన్నవాళ్లకి సరైన సమాధానం లభించింది. అందుకు చాలా ఆనందంగా ఉంది. మరోవైపు ఉద్వేగంగా కూడా ఉంది’’ అని ధీమాగా చెబుతున్నారు షెర్లిన్. ఈవిడగారి ధీమాకి కారణం ఉంది. ఆమె కథానాయికగా రూపొందిన తాజా చిత్రం ‘కామసూత్ర’ త్రీడి ఆస్కార్ అవార్డ్స్ నామినేషన్ ఎంట్రీ పోటీలో నిలిచింది.

ఒకటి కాదు.. ఏకంగా మూడు విభాగాల్లో ఈ చిత్రం పోటీకి నిలవడం విశేషం. ‘బెస్ట్ మోషన్ పిక్చర్’, ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’’ విభాగాలకు ఈ చిత్రం ఎంపికైంది. మన భారతదేశం నుంచి  దాదాపు ఐదేళ్ల క్రితం ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ చిత్రం ‘బెస్ట్ ఒరిజినల్ స్కోర్’, ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’విభాగాల్లో రెండు ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఈసారి ఈ విభాగాల్లో ‘కామసూత్ర’ నిలిచింది. ఒరిజినల్ సాంగ్ విభాగంలో మొత్తం 75 పాటలు పోటీపడబోతున్నాయి. వీటిలో ‘కామసూత్ర’ లోని ఐదు పాటలూ ఉండటం విశేషం. చెన్నయ్‌కి చెందిన సచిన్, శ్రీజిత్ ఈ పాటలకు స్వరాలందించారు. రూపేష్ పౌల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. కాగా, వచ్చే నెల 16న అవార్డులకు నామినేట్ అయిన చిత్రాలను ప్రకటిస్తారు. మార్చి 3న అస్కార్ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement