ఆస్కార్ రేస్‌లో 6 తమిళ చిత్రాలు
తమిళసినిమా: ఈసారి ఆస్కార్ అవార్డుల రేస్‌లో 6 తమిళ చిత్రాలు చోటు చేసుకోవడం విశేషం. ఆస్కార్ అవార్డు అనేది తమిళ చిత్రాలను ఊరిస్తూనే ఉంది. సంగీత దర్శకుడు ఏఆర్.రెహ్మాన్ రెండు ఆస్కార్ అవార్డులను గెలుచుకున్నా, అవి ఆంగ్ల చిత్రానికి కావడం గమనార్హం. కాగా 2024వ ఏడాదికి గానూ మన భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 29 చిత్రాలు ఆస్కార్ అవార్డులకు నామినేట్ అయినట్లు ఇండియన్ ఫిలిం ఫెడరేషన్ కార్యవర్గం అధికారికంగా ప్రకటించారు. అందులో 6 తమిళ చిత్రాలు చోటు చేసుకున్నట్లు పేర్కొన్నారు.
వాటిలో నటుడు విజయ్ సేతుపతి కథానాయకుడిగా నటించిన మహారాజా, విక్రమ్ హీరోగా నటించిన తంగలాన్, సూరి ప్రధాన పాత్రను పోషించిన కొట్టుక్కాళి, రాఘవలారెన్స్, ఎస్‌జే.సూర్య కలిసి నటించిన జిగర్తండా డబుల్‌ఎక్స్, మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన వాళై, పారి ఎలవళగన్ కథానాయకుడిగా నటించి,దర్శకత్వం వహించిన జమ చిత్రాలు చోటు చేసుకున్నాయి. ఇవన్నీ మంచి కథా బలం ఉన్న చిత్రాలే. ఈ సారి అయినా వీటిలో ఏదైనా అస్కార్ అవార్డును గెలుచుకుంటుందేమో చూడాలి.
Comments
Please login to add a commentAdd a comment