సినీరంగంలో అందించే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్ నామినేషన్స్ విడుదలయ్యాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన టాలీవుడ్ సంచలన మూవీ ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి 'నాటు నాటు సాంగ్' ఎంపికైంది. దాదాపు 22 ఏళ్ల తర్వాత భారతీయ చిత్రానికి నామినేషన్ దక్కింది. ఈ విషయాన్ని ఆర్ఆర్ఆర్ చిత్రబృందం ట్వీట్ చేసింది. 'సరికొత్త చరిత్ర సృష్టించాం' అంటూ పోస్ట్ చేసింది. ఇప్పటికే ఈ పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సంగతి తెలిసిందే.
ఒరిజనల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సాంగ్ నామినేట్ అయింది. తాజాగా ఈ జాబితాను ఆస్కార్ నామినేషన్స్ కమిటీ వెల్లడించింది. ఈ ఏడాది 95వ ఆస్కార్ నామినేషన్స్‌ను ప్రకటించారు. ఈ ఏడాది మార్చి 13న అవార్డుల ప్రదానం జరగనుంది. ఇండియా నుంచి మరో రెండు డాక్యుమెంటరీలు స్థానం దక్కించుకున్నాయి. షార్ట్ ఫిల్మ్ విభాగంలో డాక్యుమెంటరీ ది ఎలిఫెంట్ విష్పరర్స్, ఆల్ దట్ బ్రీత్స్ ఎంపికయ్యాయి. మొత్తానికి నామినేషన్స్‌లో ఇండియా మూడు చిత్రాలు ఎంపికయ్యాయి.
ఒరిజినల్ సాంగ్ ఆస్కార్ నామినేషన్స్ జాబితా
- నాటు నాటు (ఆర్‌ఆర్‌ఆర్)
- అప్లాజ్ (టెల్ ఇట్ లైక్ ఎ ఉమెన్)
- హోల్డ్ మై హ్యాండ్ ( టాప్‌గన్: మార్వెరిక్)
- లిఫ్ట్ మీ అప్ (బ్లాక్ పాంథర్)
- ది ఈజ్ ఏ లైఫ్ (ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్)
WE CREATED HISTORY!! 🇮🇳
— RRR Movie (@RRRMovie) January 24, 2023
Proud and privileged to share that #NaatuNaatu has been nominated for Best Original Song at the 95th Academy Awards. #Oscars #RRRMovie pic.twitter.com/qzWBiotjSe
Comments
Please login to add a commentAdd a comment